8 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని ఎనిమిది కార్పొరేషన్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం చైర్మన్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డిని, ఉమెన్ కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్ పర్సన్ గా మాజీ ఎంపి గుండు సుధారాణి (వరంగల్ జిల్లా), హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా మడుపు భూంరెడ్డి (మెదక్ జిల్లా), గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గా గాంధీ నాయక్ (వరంగల్ జిల్లా), ఫిల్మ్, టివి అండ్ థియేటర్ డెవలప్మెంట్ చైర్మన్ గా పుష్కర్ రామ్మోహన్ రావు(ఆదిలాబాద్ – మందమర్రి), వికలాంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కె.వాసుదేవ రెడ్డి (కేయూ విద్యార్థి నాయకుడు), మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మాజీ ఎమ్మెల్యే ప్రేమ్ సింగ్ రాథోడ్ (గోషామహల్), టెక్నికల్ సర్వీసెస్ కార్పొరేషన్ చైర్మన్ గా డాక్టర్ చిరుమిల్ల రాకేశ్ కుమార్ (ఓయూ విద్యార్థి నాయకుడు –పెద్దపల్లి)ను నియమించారు.
అలాగే, టీఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలిగా మాజీ ఎంపి గుండు సుధారాణి(వరంగల్ జిల్లా)ను, తెలంగాణ రాష్ట్ర విద్యార్థి సమితి అధ్యక్షుడిగా ఓయు విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ (కరీంనగర్ జిల్లా), మెదక్ డిసిసిబి మాజీ అధ్యక్షుడు ఎలక్షన్ రెడ్డి పేరును కూడా కార్పొరేషన్ చైర్మన్ పదవికి ఖరారు చేశారు. ప్రస్తుతం ఎలక్షన్ రెడ్డి అమెరికా పర్యటనలో ఉన్నందున, తిరిగి హైదరాబాద్ రాగానే చర్చించి ఏ కార్పొరేషన్ బాధ్యతలు అప్పగించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయిస్తారు.