
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు టీఆర్‌ఎస్ అభ్యర్థులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్‌ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడమర్తి రవి, ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రోటోకాల్ సమస్య ఎదురుకాకుండా వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు.
ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి ఉండగా.. మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ కొనసాగిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరు పదవుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment