బీజేపీకి సోమారపు రాజీనామా!  | Somarapu Satyanarayana Likely To Resign For BJP | Sakshi
Sakshi News home page

బీజేపీకి సోమారపు రాజీనామా! 

Published Sat, Sep 30 2023 8:44 AM | Last Updated on Sat, Sep 30 2023 10:09 AM

Somarapu Satyanarayana Likely To Resign For BJP - Sakshi

సాక్షి, పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ తగ్గుతున్న ఆదరణ, కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్‌ టికెట్‌ ఇస్తే.. ఆ పార్టీ తరపున పోటీకి సోమారపు ఆసక్తి చూపుతుండగా, కార్యకర్తలు, అనుచరులు ఆల్‌ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు.

మరోవైపు.. నామినేడ్‌ పోస్టు ఇస్తామని బీఆర్‌ఎస్‌ నుంచి ఆఫర్‌ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమా రపు ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై సోమా రపు సత్యనారాయణను ఫోన్‌లో సంప్రదించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేద న్నారు.

బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్‌చార్జిగా పార్థసారథి 
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్‌చార్జిగా ఏపీకి చెందిన డాక్టర్‌ పార్థసారథి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్య దర్శిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రత్యేక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. తనపై నమ్మకం ఉంచి నూతన బాధ్యతలు అప్పగించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సంఘటనా కార్యదర్శి మధుకర్‌కు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు.
చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement