somarapu Satyanarayana
-
కారెక్కనున్న సోమారపు?
గోదావరిఖని: రామగుండం నియోజకవర్గానికి చెందిన కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ కారెక్కనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుతో వేర్వేరుగా భేటీ అయినట్లు సమాచారం. తనకు పార్టీ టికెట్ ఇస్తే కచ్చితంగా గెలుస్తానని.. ప్రస్తుతం పోటీలో ఉంటున్న నాయకుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సోమారపు ప్రతిపాదించినట్లు తెలిసింది. కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ఢిల్లీ వెళ్లిన ఆయనకు.. పార్టీ అధిష్టానం నుంచి సానుకూల సాంకేతాలు రాలేదు. దీంతో నియోజకవర్గానికి చేరుకొని స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమయ్యారు. అందుకు అనుగుణంగా ప్రచారం కూడా చేపట్టారు. ఆయన మంగళవారం అకస్మాత్తుగా ప్లేట్ ఫిరాయించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే బీఆర్ఎస్ మాత్రం ఆ నాయకుడికి ఎమ్మెల్సీ ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ,బీఆర్ఎస్, బీజేపీ.. మళ్లీ బీఆర్ఎస్.. 1998లో జరిగిన రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన సోమారపు... ఆ తర్వాత 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడారు. అటునుంచి తిరిగి కాంగ్రెస్‌లో చేరి 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి గెలుపొందారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నేపథ్యంలో బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్)లో చేరి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి మళ్లీ గెలిచారు. కానీ 2018 ఎన్నికల్లో మాత్రం ఓటమిపాలయ్యారు. అనంతరం బీజేపీలో చేరారు. ఆ తర్వాత బీజేపీకి రాజీనామా చేసి ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటానని ప్రకటించారు. ఆ తర్వాత కొద్దిరోజులకే ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ నేతలను కలిశారు. ఎమ్మెల్యే టికెట్‌పై కాంగ్రెస్ నుంచి గ్రీన్‌సిగ్నల్ రాకపోవడంతో మళ్లీ ఇండిపెండెంట్‌గా బరిలో ఉంటూ ప్రచారం చేశారు. మంగళవారం అకస్మాత్తుగా హైదరాబాద్ వెళ్లి బీఆర్ఎస్ అధిష్టానంతో చర్చలు జరిపారు. -
బీజేపీకి సోమారపు రాజీనామా!
సాక్షి, పెద్దపల్లి: మాజీ ఎమ్మెల్యే, బీజేపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ ఆ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ తగ్గుతున్న ఆదరణ, కార్యకర్తల ఒత్తిడి మేరకు పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ టికెట్ ఇస్తే.. ఆ పార్టీ తరపున పోటీకి సోమారపు ఆసక్తి చూపుతుండగా, కార్యకర్తలు, అనుచరులు ఆల్ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ సింహం గుర్తుపై పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. మరోవైపు.. నామినేడ్ పోస్టు ఇస్తామని బీఆర్ఎస్ నుంచి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సోమా రపు ఏ పార్టీలో చేరతారనేది చర్చనీయాంశంగా మారింది. ఇదే విషయమై సోమా రపు సత్యనారాయణను ఫోన్లో సంప్రదించగా.. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేద న్నారు. బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జిగా పార్థసారథి సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ తెలంగాణ ఓబీసీ మోర్చా ఇన్చార్జిగా ఏపీకి చెందిన డాక్టర్ పార్థసారథి నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ కార్య దర్శిగా వ్యవహరిస్తున్నారు. త్వరలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఈ ప్రత్యేక బాధ్యతలను అధిష్టానం అప్పగించింది. తనపై నమ్మకం ఉంచి నూతన బాధ్యతలు అప్పగించిన బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, సంఘటనా కార్యదర్శి మధుకర్‌కు పార్థసారథి ధన్యవాదాలు తెలిపారు. చదవండి: HYD: ట్యూషన్‌కు వెళ్లమన్నందుకు బాలిక ఆత్మహత్య -
పెద్దపల్లి జిల్లా బీజేపీలో ముసలం
సాక్షి, పెద్దపల్లి: పార్టీలో క్రమశిక్షణ లోపించిందని అధిష్టానానికి పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లేఖ రాశారు. దీంతో ఆ పార్టీలో ముసలం రాజుకుంది. తనకు తెలియకుండానే పార్టీ మీటింగ్‌లు పెడుతున్నారని సోమారపు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అయితే జిల్లా అధ్యక్ష పదవిలో కొనసాగలేనని లేఖలో పేర్కొన్నారు. నాలుగు నెలల క్రితం జిల్లా అధ్యక్షుడిగా వేసిన కమిటీని అధిష్టానం ఆమోదించని పరిస్థితి నెలకొంది. పెద్దపల్లి జిల్లాకు కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. చదవండి: మాజీ కౌన్సిలర్ దారుణ హత్య -
పెద్దపల్లిలో కాషాయజెండా ఎగరేద్దాం
పెద్దపల్లిరూరల్: ప్రత్యేక రాష్ట్రమొస్తే అభివృద్ధి జరుగుతుందని ఆశించిన ప్రజలకు అవినీతి పాలనను అందిస్తూ.. ఫాంహౌస్‌కే పరిమితమైన టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడి, వచ్చే ఎన్నికల్లో కాషాయజెండా ఎగురవేసేందుకు కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌రావు అన్నారు. రాష్ట్ర ప్రధానకార్యదర్శిగా నియమితులైన తర్వాత తొలిసారిగా గురువారం పెద్దపల్లికి వచ్చిన ఆయనకు జిల్లా నేతలు ఘనస్వాగతం పలికారు. ప్రదర్శనగా పట్టణంలోని నందనగార్డెకు చేరారు. బీజేపి జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ, ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి, సనత్‌కుమార్ తదితరులు హాజరైన సమావేశంలో మాట్లాడారు. ఇంతకాలం పెద్దపల్లిపై కమ్ముకున్న మేఘాలు తొలగిపోయాయన్నారు. అటు కరీంనగర్, ఇటు నిజామాబాద్ ఎంపీ స్థానాలను కమలదళం దక్కించుకోవడంతో పెద్దపల్లి పరిసరాల దాకా కమలం వికసించిందని, ఈసారి పెద్దపల్లిలోనూ కమలవికాసం జరిగితీరాలన్నారు. ప్రధాని నరేంద్రమోదీ సారథ్యంలో ప్రపంచం గర్వించదగ్గ రీతిలో పాలన సాగుతోందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్షుడు సోమారపు సత్యనారాయణ మాట్లాడుతూ జిల్లాలో గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు సైనికుల్లా ముందుకుసాగాలన్నారు. కేంద్రం అమలు చేస్తున్న సంక్షేమపథకాల ఫలాలే గ్రామీణ ప్రజలకు అందుతున్నాయన్న విషయాన్ని అర్థమయ్యేలా వివరించి మద్దతు కూడగట్టాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించి పార్టీని బలోపేతం చేసేదిశగా అడుగేయాలన్నారు. ఎన్నికలెపుడొచ్చినా బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఇపుడు రాష్ట్రనాయకత్వం మార్పుతో పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహం వచ్చిందని, ఇదే ఊపుతో పార్టీని గ్రామగ్రామాన పటిష్టపర్చాలన్నారు. కార్యక్రమంలో నాయకులు మాతంగి రేణుక, ఠాకూర్ రాంసింగ్, రాజం మహంతకృష్ణ, బండి శరత్, చిలారపు పర్వతాలు, తంగెడ రాజేశ్వర్‌రావు, బెజ్జంకి దిలీప్, గూడెం జనార్దన్‌రెడ్డి, తొడుపునూరి కృష్ణమూర్తి, కందునూరి ప్రమోద్‌రావు, ఎంచర్ల కనుకయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఆ జిల్లాలకు అన్యాయం చేస్తే సహించం
కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి జిల్లాలకు నీటి కేటాయింపుల్లో అన్యాయం చేస్తే సహించేది లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ రెండు జిల్లాల్లో మూడు పంటలకు నీరు ఇచ్చిన తర్వాతే మిగతా జిల్లాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. గోదావరి జలాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని విమర్శించారు. కాళేశ్వరం నీటిని పెద్దపల్లి, కరీంనగర్ జిల్లాలకు కేటాయించడం లేదని.. గోదావరి నీటిని పరివాహక ప్రాంతాలకు ఇవ్వకుండా కొండపోచమ్మకు తరలిస్తున్నారని మండిపడ్డారు. కోవిడ్ నిర్మూలనకు కేంద్రం రూ. 230కోట్లు కేటాయించిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రం మూడు లక్షల కోట్ల అప్పుల్లో ఉందని అన్నారు. రెండోసారి లాక్‌డౌన్‌ను కఠినతరం చేయడం వల్ల వలస కార్మికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని కేంద్రంపై నిందలు వేయడం మానుకోవాలని హితవు పలికారు. నీటి వినియోగంపై నిపుణుల సలహాలు తీసుకోవాలని సోమారపు సత్యనారాయణ ప్రభుత్వానికి సూచించారు. -
కేసీఆర్‌కు సవాల్ విసిరిన సోమారపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించకుంటే ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తామన్న కేసీఆర్ వ్యాఖ్యలపై ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వచ్చే ఐదేళ్లలో ప్రయివేటు బస్సులతో ప్రయాణ చార్జీలు పెంచకుండా నడపగలరా అని ప్రశ్నించారు. అలా నడిపితే తాను గుండు గీసుకోవడానికి సిద్ధమని సవాల్ విసిరారు. నడపకపోతే కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా అని నిలదీశారు. చదవండి: ‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’ -
‘ఆర్టీసీని చంపొద్దు.. బతికించండి’
సాక్షి, పెద్దపల్లి జిల్లా: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు(కేసీఆర్) పాలన రజాకారుల రాజ్యాన్ని తలపిస్తోందని తెలంగాణ ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులు గతంలో తెలంగాణ సాధన కోసం సమ్మెలోకి వెళితే... ఇప్పుడు కూడు కోసం సమ్మెలోకి వెళ్లారని వ్యాఖ్యానించారు. ఆర్టీసీని తమ సొంత సంస్థలా భావించే కార్మికులను ప్రభుత్వం విస్మరించిందని విమర్శించారు. రాష్ట్రంలో పెద్ద సంస్థ అయిన ఆర్టీసీని చంపేయాలని చూడడం సరియైది కాదని, ఆర్టీసీని బ్రతికించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 3 వేల 3 వందల కోట్ల నష్టంలో ఉన్న ఆర్టీసీ రోజుకు 3కోట్ల రూపాయల నష్టంలో నడుస్తోందని.. దీనికి కారణం రాష్ట్ర ప్రభుత్వమని ధ్వజమెత్తారు. ప్రపంచ వ్యాప్తంగా క్రాస్ సబ్సిడీ ఉంటుంది, కానీ మన రాష్ట్రంలో క్రాస్ సబ్సిడీ లేదన్నారు. 10 వేల బస్సుల్లో 2 వేల బస్సులకు కాలం చెల్లిపోయినా ప్రభుత్వం కొత్త బస్సులను తెప్పించడంలో విఫలమైందన్నారు. ఆర్టీసీకి జీహెచ్ఎంసీ రూ.1470 కోట్లు ఇవ్వాలని లేదంటే ప్రభుత్వమైనా ఈ మొత్తం చెల్లించాలని సోమారపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. (చదవండి: కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె) -
కాంగ్రెస్ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్ఎస్
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : రాజకీయ అరంగేట్రంలో అరితేరిన సోమారపు సత్యనారాయణ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది రోజులకే కాషాయ కండువా కప్పుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపింది. రామగుండం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాంగ్రెస్, తెలుగుదేశం, టీఆర్ఎస్ పార్టీల్లో కీలక పాత్ర పోషించిన ఆయన ప్రస్తుతం బీజేపీలో చేరి అన్నివర్గాల్లో చర్చలేపుతున్నారు. ఏపార్టీలో ఉన్నప్పటికీ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ పదవికి డైరెక్ట్‌గా ఎన్నికలు నిర్వహిస్తే తాటు పోటీలో ఉండి విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్న ఆయన బీజేపీలో చేరడంతో ఈ ప్రాంతంలో బీజేపీకి పట్టు పెరిగే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో ఇంజినీర్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణ మొదట కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. నోటిఫైడ్ ఏరియాగా ఉన్న ఈప్రాంతంలో 1998 జూన్ 30న నిర్వహించిన మొట్టమొదటి రామగుండం మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి టికెట్ సాధించి టీడీపీ అభ్యర్థి గోపు అయిలయ్యయాదవ్‌పై గెలుపొందారు. 2004 జూలై 2 వరకు చైర్మన్‌గా కొనసాగినప్పటికీ పలు కారణాల వల్ల అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ రిజర్వ్ కావడంతో మంథనికి మారారు. 2004 అసెంబ్లీ ఎన్నికల్లో మంథని నియోజకవర్గం నుంచి టీడీపీ నుంచి టికెట్ తెచ్చుకుని పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు చేతిలో ఓడిపోయారు. పునర్విభజనలో మేడారం నియోజకవర్గం రద్దయి రామగుండం జనరల్ నియోజకవర్గంగా మారడంతో తిరిగి మళ్లీ ఇక్కడి రాజకీయాల్లో కీలకపాత్ర పోషించారు. రామగుండం ఎమ్మెల్యేగా.. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి కాంగ్రెస్ అభ్యర్థి బాబర్ సలీంపాషాపై విజయం సాధించాడు. ఆతర్వాత వైఎస్సార్ హయాంలో కాంగ్రెస్‌లో చేరిన ఆయన తెలంగాణ ఉద్యమం ఉధృతంగా సాగడంతో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు. 2014లో టీఆర్ఎస్ టికెట్‌పై పోటీ చేసి ప్రత్యర్థి ఆలిండియా పార్వర్డ్‌బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై విజయం సాధించాడు. 2016లో తెలంగాణా రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బరిలో దిగి ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థి కోరుకంటి చందర్‌పై ఓటమి పాలయ్యారు. తిరిగి కోరుకంటి చందర్ టీఆర్ఎస్ పార్టీలో చేరడంతో ఇరువురి మధ్య రాజకీయ వైరం ప్రారంభమైన క్రమంలో టీఆర్ఎస్ సభ్యత్వ సేకరణలో తమను గుర్తించలేదని, కనీసం సభ్యత్వం కూడా ఇవ్వలేదని పేర్కొంటూ ఈనెలలో రాజీనామా చేశారు. బీజేపీ తీర్థం.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన వారం రోజుల్లోగా బీజేపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. పార్టీ అధిష్టానం చర్చించడంతోపాటు ఇద్దరు ఎంపీలు తన ఇంటికి వచ్చి ఆహ్వానించడంతో ఆదివారం రాష్ట్ర నాయకత్వం ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు. -
కమలం గూటికి సోమారపు
సాక్షి, గోదావరిఖని : రామగుండం మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే సోమారపు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి ఆరవింద్‌లు ఆదివారం సోమారపు సత్యనారాయణను గోదావరిఖనిలోని ఆయన స్వగృహంలో కలిసి చర్చలు జరిపారు. ఈ సందర్భంగా వారు సోమారపును బీజేపీలోకి ఆహ్వానించారు. అనంతరం సోమారపుతో కలిసి బీజేపీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోమారపు మాట్లాడుతూ.. ‘తొలుత ఏ పార్టీలో చేరకూడదని అనుకున్నాను. కానీ టీఆర్ఎస్ను వీడిన తర్వాత కొందరు నన్ను ఇక్కడి నుంచి వెళ్లగొడతామని వ్యాఖ్యలు చేస్తున్నారు. నన్ను ఇక్కడ నుంచి ఎవ్వరు వెళ్లగొట్టలేరు. దేశం మొత్తం కొనియాడేలా ప్రధాన నరేంద్ర మోదీ పాలన సాగిస్తున్నారు. ఒక క్రమశిక్షణ కలిగిన బీజేపీలోకి చేరుతున్నాను. నేను ఎవరిని బలవంతం చేసి బీజేపీలోకి తీసుకెళ్లడం లేదు. బీజేపీలో చేరాక స్థానికంగా పార్టీ అభివృద్ధికి రాత్రి, పగలు తేడా లేకుండా కృషి చేస్తాన’ని తెలిపారు. ఇటీవల టీఆర్ఎస్కు రాజీనామా చేసిన సమయంలో తనకు పార్టీలో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని సోమారపు తెలిపారు. చెన్నూరు, రామగుండం ఎమ్మెల్యేలు బాల్క సుమన్, కోరుకంటి చందర్‌లపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో రామగుండంలో తమ వర్గం సత్తా చాటుతుందని వ్యాఖ్యానించారు. మరోవైపు తెలంగాణలో నాలుగు ఎంపీ స్థానాలు కైవసం చేసుకున్న బీజేపీ.. క్షేత్ర స్థాయిలో బలపడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులను బీజేపీలోకి ఆహ్వానిస్తోంది. -
రాలిన గులాబీ రేకు
సాక్షి, కరీంనగర్: ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు అనే నానుడి రామగుండం టీఆర్ఎస్లో రుజువైంది. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యం కోసం సాగిన పోరు పార్టీకి రాజీనామా చేయడంతో సంపూర్ణమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ మధ్య టీఆర్ఎస్లో దాదాపు పదేళ్లుగా నడుస్తున్న రాజకీయ వైరం చివరికి రాజీనామాలతో ముగిసినట్లయింది. తనకు పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదని, అందుకే రాజీనామా చేసి, రాజకీయాలకు దూరమవుతున్నట్లు ఆయన మంగళవారం ప్రకటించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్ పార్టీకి తాజా మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ స్థాయి నాయకుడు రాజీనామా చేయడం మొదటిది కావడం గమనార్హం. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనపై సమాజ్‌వాది ఫార్వర్డ్‌బ్లాక్ నుంచి పోటీ చేసి గెలిచిన కోరుకంటి చందర్‌ను టీఆర్ఎస్లోకి తీసుకోవడంతోనే తీవ్ర మనస్తాపానికి గురైన సత్యనారాయణ తరువాత జరిగిన పరిణామాలను జీర్ణించుకోలేక పోయారు. అదే అదనుగా కోరుకంటి చందర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీని తన ఆధీనంలోకి తెచ్చుకొని తొలి విజయం సాధించారు. తనకన్నా ముందు రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్‌గా పనిచేసిన సోమారపు సత్యనారాయణకు కనీసం పార్టీ సభ్యత్వం సైతం ఇవ్వకుండా రాజీనామా చేసే పరిస్థితి తీసుకొచ్చి తన పూర్తి ఆధిపత్యాన్ని చాటుకున్నారు. 2009 నుంచే కోరుకంటి వర్సెస్ సోమారపు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి నుంచి టీఆర్ఎస్ టికెట్టు కోరుకంటి చందర్‌కే దక్కింది. పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ చివరి నిమిషంలో సోమారపు సత్యనారాయణకు బీఫారం ఇచ్చింది. సమయానికి బీఫారం సమర్పించని కారణంగా సోమారపు సత్యనారాయణ ఇండిపెండెంట్‌గా చంద్రబాబు ఫొటోలు, పసుపు కండువాలతో ప్రచారం నిర్వహించి విజయం సాధించారు. అంతకుముందు రామగుండం మునిసిపాలిటీ చైర్మన్‌గా సోమారపు చేసిన అభివృద్ధి అప్పట్లో ఆయన విజయానికి దోహదపడింది. ఇండిపెండెంట్‌గా గెలిచిన సోమారపు సత్యనారాయణ వెంటనే కాంగ్రెస్‌కు మద్దతు పలికారు. వైఎస్ మరణానంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా సోమారపు సత్యనారాయణకే టికెట్టు రాగా, 2009లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కోరుకంటి చందర్ ‘సింహం’ గుర్తు మీద ఎస్ఎఫ్బీ పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. తరువాత చందర్ టీఆర్ఎస్ నేతలతో సంబంధాలు కొనసాగించినప్పటికీ, పార్టీలో అధికారికంగా చేర్చుకునేందుకు సోమారపు ఇష్టపడలేదు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ సభ్యత్వం కూడా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ భారీ తేడాతో ఓడిపోయారు. గెలిచిన కోరుకంటి చందర్ టీఆర్ఎస్లో చేరడంతో సీన్ రివర్స్ అయింది. మేయర్‌పై అవిశ్వాసం సమయంలోనే రాజకీయ సన్యాసం రామగుండం కార్పొరేషన్ మేయర్‌గా çతొలుత ఎన్నికైన కొంకటి లక్ష్మినారాయణను గద్దె దింపేందుకు మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ చేసిన రాజకీయం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మేయర్‌పై అప్పటి ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అవిశ్వాస తీర్మానం పెట్టించగా, అధిష్టానం జోక్యం చేసుకొని విరమించుకోమని సూచించింది. అధిష్టానం ఆదేశాలను సైతం ధిక్కరించిన ఆయన అవసరమైతే పార్టీకి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి దుమారం లేపారు. స్వయంగా కేటీఆర్ జోక్యం చేసుకొని హైదరాబాద్ పిలిపించుకుని బుజ్జగించారు. దీంతో తాను రాజకీయ సన్యాసం వాయిదా వేసుకున్నట్లు ప్రకటించారు. మేయర్‌పై అవిశ్వాసం పెట్టి పంతం నెగ్గించుకున్నారు. అప్పటి నుంచే సోమారపు తీరు పట్ల అధిష్టానం కొంత అసంతృప్తితో ఉన్నా, అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో గెలిచిన చందర్‌కు ప్రాధాన్యత ఇచ్చింది. ఓటమి తరువాత పార్టీ తీరుపై కినుక.. రామగుండంలో కోరుకంటి చందర్ గెలుపు తరువాత తనను పార్టీ పట్టించుకోకపోవడంతో మాజీ ఎమ్మెల్యే కినుక వహించారు.. ఈ క్రమంలో ఎంపీ ఎన్నికల్లో సరైన ప్రాతినిధ్యం లభించకపోవడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. ఆ తర్వాత జరిగిన జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేసినట్లు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కార్పొరేషన్ ఎన్నికల పక్రియ ప్రారంభం కావడంతో పార్టీకి రాజీనామా చేసి ప్రత్యామ్నాయ ఆలోచనలో పడ్డారు. అనుచరులు ఇప్పటికే బీజేపీలో.. తన వర్గంగా పనిచేసిన మాజీ డిప్యూటీ మేయర్ ముప్పిడి సత్యప్రసాద్ బీజేపీ తీర్థం తీసుకున్నారు. గతంలో డిప్యూటీ మేయర్‌గా కొనసాగిన సాగంటి శంకర్‌పై అవిశ్వాసం పెట్టి సత్యప్రసాద్‌ను డిప్యూటీ మేయర్‌గా గెలిపించారు. సత్యప్రసాద్ బీజేపీలో చేరడంతో మాజీ ఎమ్మెల్యే ఆలోచన కూడా అదేవిధంగా ఉంటుందని భావిస్తున్నారు. అలాగే రామగుండం కార్పొరేషన్లో బీజేపీ బలపడేందుకు పార్టీ జాతీయ నాయకత్వం దృష్టి సారించిన నేపథ్యంలో సోమారపు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుందనే చర్చ సాగుతోంది. -
రాజకీయాలకు దూరంగా ఉంటా
-
ఎవరిని ఓడించడానికి నేను పనిచేయలేదు
-
‘బాల్క సుమన్‌ను నిందించడం సరికాదు’
సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. కాగా సత్యనారాయణ ఆరోపణలపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవకాశవాద రాజకీయాలు చేస్తూ పార్టీని దిగజార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఆయన ఓటమికి కారణం బాల్కసుమన్ అనడం సరికాదని హితవు పలికారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులు, టీఆర్ఎస్ నాయకులను సత్యనారాయణ అణదొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వయసు పెరిగేకొద్దీ ఆయన బాలఖాళిలోకి వెళ్తున్నారని చురకలంటించారు. కొడుకుని రాజకీయాల్లోకి తెచ్చేందుకే సత్యనారాయణ పార్టీని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో కూడా ఆయన టీఆర్ఎస్కు వ్యతిరేకంగా పనిచేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీ ఆయనకు సముచిత న్యాయం చేసిందన్నారు. (చదవండి : టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై) -
టీఆర్ఎస్కు సీనియర్ నేత గుడ్ బై
సాక్షి, పెద్దపల్లి : రామగుండం మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. సోమారపుతోపాటు ఆయన అనుచరులు కూడా పార్టీని వీడారు. ఈ విషయాన్ని మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో సోమారపు వెల్లడించారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం వల్లనే ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటమి కోసం చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ పనిచేశారని ఆరోపించారు. తను ఏ పార్టీలో చేరనని.. ఇండిపెండెంట్‌గానే ఉంటానని స్పష్టం చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తన అనుచరులను స్వతంత్ర అభ్యర్థులుగా గెలిపించుకుంటానని అన్నారు. అయితే గత కొంత కాలంగా టీఆర్ఎస్లో స్థానికంగా నెలకొన్న వర్గపోరు కారణంగానే సోమారపు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కాగా, సోమారపు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో రామగుండం నుంచి ఇండిపెండెంట్‌గా గెలుపొందారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సోమారపుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను ఆర్టీసీ చైర్మన్‌గా నియమించింది. అయితే గతేడాది డిసెంబర్లో జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మాత్రం సోమారపు సత్యనారాయణ, టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థి కోరుకంటి చందర్ చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత చందర్ కేటీఆర్ సమక్షంలో తిరిగి టీఆర్ఎస్లో చేరారు. గతంలో రామగుండం మేయర్‌గా ఉన్న కొంకటి లక్ష్మీనారాయణపై అవిశ్వాసం పెట్టడంలో కీలక భూమిక పోషించిన సోమారపు తన పంతం నెగ్గించుకున్నారు. దీంతో కొంకటి లక్ష్మీనారాయణ మేయర్ పదవి కోల్పోవాల్సి వచ్చింది. అయితే సోమారపు ఓటమికి టీఆర్ఎస్లోని ఓ వర్గం ప్రధాన కారణమనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. -
‘చక్రం’ తిప్పి చతికిలపడ్డారు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం తొలి ప్రభుత్వంలో ‘చక్రం’తిప్పిన ఆ ముగ్గురు ఈ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. రోడ్డు, రవాణా, ఆర్టీసీ బాస్‌లుగా పనిచేసిన వారు ఈ ఎన్నికల్లో పరాజయం చవిచూశారు. ఓడిన ఈ ముగ్గురు శాఖల పరంగా పరస్పరం సంబంధం కలిగి ఉండటం అధికార, ప్రతిపక్ష పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి.. తెలంగాణలో తొలి రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పట్నం మహేందర్‌రెడ్డి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2014 ఎన్నికలకు ముందే టీఆర్ఎస్లో చేరిన ఆయన ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీపై పూర్తి ఆధిపత్యం సాధించి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. మహేందర్‌రెడ్డి 1994, 1999, 2009లలో టీడీపీ నుంచి, 2014లో టీఆర్ఎస్ నుంచి పోటీచేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో తాండూరు నుంచి పోటీ చేసిన మహేందర్‌రెడ్డి.. కాంగ్రెస్ అభ్యర్థి పైలెట్ రోహిత్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఎలాంటి అంచనాలు లేకుండా ఎన్నికల్లో మొదటిసారి పోటీ చేసిన రోహిత్‌రెడ్డి విజయం సాధించడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది. రోడ్లు, భవనాల మంత్రి తుమ్మల.. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కేసీఆర్‌కు తుమ్మల నాగేశ్వరరావు అత్యంత సన్నిహితుడు. ఆ సాన్నిహిత్యంతోనే 2014 డిసెంబర్లో కేబినెట్లో స్థానం కల్పించి రోడ్లు, భవనాల శాఖ మంత్రిని చేశారు. 2016 మార్చిలో పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యంతో మరణించడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో తుమ్మల ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు విజయం నల్లేరు మీద నడకే అనుకున్నారు. అయితే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్‌రెడ్డి చేతిలో ఓడిపోవడంతో పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆర్టీసీ బాస్ విజయానికి పంచర్.. సోమారపు సత్యనారాయణ 2010 నుంచి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. రామగుండం నియోజకవర్గం నుంచి 2009లో స్వతంత్రంగా, 2014లో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ రెండు సార్లు ఆయనకు రాజకీయ ప్రత్యర్థి కోరుకంటి చందర్ కావడం విశేషం. ఎన్నికలకు కేవలం కొద్ది రోజుల ముందు వరకు ఆయన టీఎస్ఆర్టీసీకి చైర్మన్‌గా సేవలందించారు. ఈ ఎన్నికల్లో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున కోరుకంటి చందర్, టీఆర్ఎస్ నుంచి సోమారపు సత్యనారాయణ రామగుండం బరిలో నిలిచారు. కానీ 27 వేల పైచిలుకు ఓట్ల తేడాతో సోమారపు అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. -
‘లగడపాటి ఓ జోకర్’
సాక్షి, రామగుండం(పెద్దపల్లి): తెలంగాణలో ఎన్నికల పోలింగ్ ముగిసినా.. నాయకుల మధ్య మాటల యుద్దం ఆగటం లేదు. విజయంపై ఎవరికివారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సర్వే మినహా అన్ని జాతీయ మీడియా సంస్థల ఎగ్జిట్‌ఫోల్ ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని తెలుస్తోంది. అయితే లగడపాడి రాజగోపాల్ మాత్రం మహాకూటమి అధికారంలోకి రాబోతోందని, పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు గెలుస్తారని తన సర్వేలో తేలినట్లు వివరించారు. రామగుండంలో టీఆర్ఎస్ రెబల్ కోరుకంటి చందర్ విజయం ఖాయమని అభిప్రాయపడ్డారు. లగడపాటికి సోమారపు సవాల్ దీంతో లగడపాటి సర్వేపై రామగుండం టీఆర్ఎస్ అభ్యర్థి సోమారపు సత్యనారాయణ నిప్పులు చెరిగారు. శనివారం స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన లగడపాటి ఒక జోకర్ అంటూ మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ వంద సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రామగుండంలో కూడా టీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. ‘నీవిచ్చిన సర్వే నిజమైతే హైదరాబాద్‌లో బట్టలు విప్పుకొని తిరుగుతా? నీ సర్వే అబద్దమైతే నువ్వు బట్టలిప్పుకొని తిరగాలి’అంటూ లగడపాటికి సోమారపు సత్యనారాయణ సవాల్ విసిరారు. -
గోదావరిఖని: కార్మికులంతా టీఆర్ఎస్ వైపే..
సాక్షి, గోదావరిఖని: సింగరేణి కార్మికులంతా టీఆర్ఎస్ వైపే ఉన్నారని రామగుండంలో వార్ వన్ సైడ్ అవుతుందని పోటీ చేస్తున్న మిగతా అభ్యర్థులకు డిపాజిట్లు దక్కవని తాజా మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆదివారం స్థానిక టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి కార్మికులు, నాయకుల కృషి ఫలితంగా రామగుండంలో ఎలక్షన్స్ వన్ సైడ్ అవుతుందని మిగతా పార్టీలకు డిపాజిట్లు రావన్నారు. జీతాలు పెంచమని పోయిన ఉద్యోగులను గుర్రాలతో తొక్కి, కరెంట్ ఇవ్వమని అడిగిన రైతులను కాల్చి చంపిన చంద్రబాబు, తెలంగాణ అభివృద్ధికి ఒక్క పైసా కూడా ఇవ్వనని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి చెందిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వారసులు ఇక్కడకి రాబోతున్నారని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కేసీఆర్ తిరిగి సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. 20 ఏళ్లుగా రాజకీయంలో ఉన్నానని, ఎవరిని ఇబ్బంది పెట్టలేదని, ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించానని తెలిపారు. టీబీజీకేఎస్ అధ్యక్ష, కార్యదర్శులు బి.వెంకట్రావు, మిర్యాల రాజిరెడ్డి, నూనె కొమురయ్య, పెద్దపల్లి సత్యనారాయణ, దేవ వెంకటేశం, కనంక శ్యాంసన్, ఎట్టం కృష్ణ, ఆరెల్లి పోషం, వడ్డేపల్లి శంకర్, నాయిని మల్లేష్, కృష్ణమూర్తి, పుట్ట రమేశ్ పాల్గొన్నారు. రామగుండం: ఎన్నికల ప్రచారంలో భాగంగా అంతర్గాం మండల పరిధిలోని లింగాపూర్ గ్రామంలో సోమారపు ఎడ్లబండితో రోడ్‌షో నిర్వహించారు. టీఆర్ఎస్కు ఓటేస్తేనే సంక్షేమ పథకాల కొనసాగుతాయన్నారు. -
ప్రోటోకాల్ సమస్య లేకుండా రాజీనామాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడమర్తి రవి, ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రోటోకాల్ సమస్య ఎదురుకాకుండా వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి ఉండగా.. మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ కొనసాగిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరు పదవుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. -
‘అధికారులపై వేధింపులకు పాల్పడితే చర్యలు’
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ ఉన్నతాధికారులపై, కార్మికులపై ఎవరు దూషణలకు పాల్పడినా అకారణంగా వేధించినా సహించేది లేదనీ, వారిపై చర్యలు తీసుకుంటామని సంస్థ చైర్మన్ సోమారపు సత్యనారాయణ వెల్లడించారు. బుధవారం ఆర్టీసీ భవన్లో మాట్లాడు తూ.. ఇటీవల సీసీఎస్ బకాయిలను చెల్లించాలంటూ జరిగిన నిరసన సందర్భంగా టీఎం యూ నేతలు అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డిలు అకారణంగా ఆర్థిక సలహాదారు స్వర్ణ శంకరన్‌పై నిందలు వేయడాన్ని తప్పుబట్టారు. మరోసారి ఇలాంటి చర్యలకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. కార్మికులకు చెందిన సీసీఎస్, పీఎఫ్, ఎస్ఆర్బీఎస్ నిధులను సంస్థ మళ్లించడం తప్పేనని, తప్పని పరిస్థితుల్లోనే అలా చేశామన్న సంగతిని గుర్తించాలని విన్నవించారు. ప్రగతి నివేదన సభకు తరలించే బస్సులకు ఎలాంటి రాయితీలు ఇవ్వడం లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. -
పెట్టుబడులు లేకపోవడం మా దౌర్భాగ్యం
హైదరాబాద్ : ఆర్టీసీ కార్మికుల జీతాలు పెరగాల్సిన అవసరముందని, తాము మిగతా వాళ్లలా రేట్లు పెంచుకోలేమని, ఆర్టీసీలో పెట్టుబడులు లేకపోవడం తమ దౌర్భాగ్యమని తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..వ్యవస్థలో ఏం జరుగుతుందో తనకు తెలుసునని, ఆర్టీసీ మంచి ప్రజా రవాణా సంస్థ అని, తన కాళ్ల పై తాను నిలబడేందుకు ఆర్టీసీ కృషి చేస్తుందని చెప్పారు. ఆటోలు కూడా తమకు కాంపిటీషనేనని, చిన్నచిన్న వాళ్లతో కూడా పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. టీ-వాలెట్ కేటీఆర్ మానస పుత్రిక అని, ఒకటి రెండు రోజుల్లో కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేయిస్తానని వెల్లడించారు. 13 వేల మంది ఆన్లైన్ ద్వారా, 6 వేల మంది ఈ-టికెట్ ద్వారా బుకింగ్ చేసుకుంటున్నారని తెలిపారు.ఆర్టీసీలో ఎవరు అక్రమాలకు పాల్పడినా ఉపేక్షించేది లేదని, బయటికి పంపించి వేస్తామని హెచ్చరించారు. ఆర్టీసీలో అక్రమాలపై విచారణ జరుపుతున్నామని, 5 లక్షల లీటర్ల డీజిల్‌ను ఆర్టీసీ ఒకరోజులో వాడుతోందని తెలిపారు. ఎలాంటి కండిషన్ లేకుండా టెండర్ రేట్ ప్రకారం బయోడీజిల్ తీసుకుంటామని, తమకు లక్ష లీటర్ల బయోడీజిల్ అవసరముందని వెల్లడించారు. ప్రభుత్వ నిధులు ఇవ్వని సందర్భంలో బ్యాంకు నుంచి లోన్ తీసుకుంటున్నామని వివరించారు. తాము 700 కోట్ల రూపాయలతో ఆర్టీసీని నడుపుతున్నామని..3 నెలలు జీతాలు ఆలస్యం అయితే చచ్చిపోతారా అని ప్రశ్నించారు. ఎవరూ కూడా ప్రెస్టీజ్‌గా ఫీల్ కావాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఆస్తుల విభజన అనగానే ఏపీ అధికారులు పారిపోతున్నారని, తెలంగాణ ఆస్తుల మీద ఏపీకి ఎలాంటి హక్కు లేదని పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీకి బస్‌భవన్ బిల్డింగ్‌పై 52 శాతం మాత్రమే హక్కు ఉందని వెల్లడించారు. -
అవిశ్వాసమే !
సాక్షి, పెద్దపల్లి: రామగుండం మేయర్‌పై అవిశ్వాసం కొనసాగనుంది. మేయర్‌ను మార్చాలని ప్రజలు బలంగా కోరుతున్నారని పదేపదే చెబుతూ వస్తున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నాటకీయ పరిణామాల అనంతరం అవిశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ముందునుంచి మేయర్‌ను దించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే తన అస్త్రశస్త్రాలు ఉపయోగించడంతో అధిష్టానం కూడా దిగివచ్చింది. కాగా సోమారపు రాజకీయ సన్యాసంతో కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన అవిశ్వాస రాజకీయం, ఎమ్మెల్యే ప్రకటనతో మళ్లీ ఊపందుకుంది. కలిసొచ్చిన రాజకీయ సన్యాసం మేయర్ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాసానికి మళ్లీ కదలికవచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్లపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల 39 మంది కార్పొరేటర్లు కలెక్టర్ శ్రీదేవసేనకు నోటీసు ఇచ్చారు. దీంతో అవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి రాష్ట్రంలోని ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి ఆపేయాలనడం తెలిసిందే. అవిశ్వాసంపై అధిష్టానం అనుసరించిన వైఖరితో మనస్థాపం చెందిన సోమారపు అనూహ్యంగా తన రాజకీయ సన్యాసం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చారు. ఆర్టీసీ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం ప్రకటన ప్రకంపనాలు సృష్టిం చింది. దీంతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, టి.హరీష్‌రావులు సోమారపుతో మంతనాలు జరపడంతో ఆయన తన రాజకీయ సన్యాస ప్రకటనను విరమించుకున్నారు. అదే సమయంలో రామగుం డం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొ న్ని ‘అధికారాలు’ పొందినట్లు సమాచారం. అం దులో ప్రధానమైనది మేయర్‌పై అవిశ్వాసం. అవిశ్వాసం వ్యవహారాన్ని ‘చూడాల్సిన’ బాధ్యతను పూర్తిగా ఎమ్మెల్యేపైనే పార్టీ భారం పెట్టింది. దీంతో అవిశ్వాసం వ్యవహారం మళ్లీ పట్టాలెక్కిం ది. మేయర్‌తో రాజీనామా చేయిస్తామని అధిషా ్టనం చెప్పినా, అవిశ్వాసం పెట్టనీయండని వారించినట్లు ఎమ్మెల్యే ప్రకటించడం ప్రస్తావనార్హం. ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు అవిశ్వాసం మళ్లీ తెరపైకి రావడంతో సందడి నెలకొంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, మరో ఇద్దరు కూడా మద్దతు పలికారు. ఇటీవలి పరిణామంలో ఒక కార్పొరేటర్ ఎమ్మెల్యే గ్రూప్‌ను వీడి మేయర్ పక్షాన చేరినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అవిశ్వాసానికి అనుకూలంగా ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. దీనితో అవిశ్వాసం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోందని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే టీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారిం ది. ఇందులో కాంగ్రెస్ కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉంటే, పార్టీ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా : ఎమ్మెల్యే
సాక్షి, పెద్దపల్లి : ‘పార్టీలో ఉంటూ ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తొక్కుతా’ అని అధిష్టానానికి చెప్పినట్లు టీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్టీ పటిష్టత కోసం అనేక కఠిన నిర్ణయాలు అమలు చేయనున్నట్లు తెలిపారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఉంటుందని స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో ఇష్టం లేనివారు ఏ పార్టీలోకైనా వెళ్లొచ్చని.. ఇక నుంచి ఎవరైనా జోక్యం చేసుకున్నా.. తప్పులు చేసినా ఊరుకోనన్నారు. అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల నుంచి వైదొగులుతానని తీసుకున్న నిర్ణయం చాలా మందికి ఇబ్బంది కల్గించిందని, ఇది రాజకీయాల్లో కూడా సంచలనం కలిగిందని సోమారపు పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో పార్టీలో క్రమశిక్షణ లేదని అధిష్టానానికి వివరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మంత్రులతో పాటు పక్కనున్న ఎమ్మెల్యేలు సైతం జోక్యం చేసుకుంటారని, ఇది తగదని చెప్పినట్లు వెల్లడించారు. -
‘వాళ్ల బాగోతాలు బయటపెడతా’
సాక్షి, పెద్దపల్లి : తనపై ఇష్టానుసారంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని, వాళ్ల బాగోతాలు బయటపెడతానని ఆర్టీసీ ఛైర్మన్, అధికార పార్టీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ అన్నారు. గురువారం గోదావరిఖనిలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గడిచిన నాలుగేళ్లలో ఆశించిన అభివృద్ధి చేయలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా రామగుండం ప్రాంతంలో పనులు పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. పని చేయని ప్రజాప్రతినిధులపై అవిశ్వాసం పెట్టే హక్కు ప్రజలకు ఉందని గుర్తుచేశారు. తెలంగాణ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని తెలిపారు. -
కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తా
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని రామగుండం ఎమ్మెల్యే, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. కేసీఆర్ ఆజ్ఞ ప్రకారమే నడుచుకుంటానని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితిలో తాను లేనని చెప్పారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం, తదనంతర పరిణామాల నేపథ్యంలో రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు సోమవారం ప్రకటించిన ఆయన మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్లో మంత్రి కె. తారక రామారావుతో భేటీ అయ్యారు. రాజకీయాల నుంచి తప్పుకోవాల్సిన అవసరం లేదని, సమస్యలను పరిష్కరించుకుందామని కేటీఆర్ సూచించడంతో సోమారపు అంగీకరించారు. ఈ సందర్భంగా మేయర్‌పై అవిశ్వాసం విషయంలో తలెత్తిన వివాదానికి తెరదించారు. నియోజకవర్గంలోని ఫాంహౌస్‌లో ఉన్న సీఎం కేసీఆర్‌తో సత్యనారాయణ చేత కేటీఆర్ ఫోన్లో మాట్లాడించినట్లు తెలిసింది. అలాగే అవిశ్వాసం విషయంలో సోమారపు నిర్ణయానికి కేటీఆర్ అంగీకరించినట్లు తెలియవచ్చింది. ఈ సమావేశంలో పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎంపీ జి. వివేక్ పాల్గొన్నారు. అనంతరం సోమారపు మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలో కేసీఆర్‌కు బాగా తెలుసునన్నారు. 20 ఏళ్లలో కట్టాల్సిన కాళేశ్వరం ప్రాజెక్టును రెండేళ్లలో కేసీఆర్ పూర్తి చేస్తున్నారన్నారు. ఇంత మంచి టీం నుంచి ఎంత పిచ్చోడైనా పోవాలని అనుకోడన్నారు. సీఎం కేసీఆర్ ఏ పని చేసినా పూర్తయ్యేదాకా తపస్సులా పనిచేస్తారన్నారు. తరచూ సీఎం కేసీఆర్‌ను కలసి ఇబ్బంది పెట్టొద్దని ఒకసారి ఆయన్ను కలిశాకే తెలుసుకున్నట్లు సోమారపు చెప్పారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో ఉన్నా ఖాళీగా కూర్చోరని, ఏదైనా విషయం ఫైనల్ అయ్యేదాకా ఆలోచిస్తూనే ఉంటారని వివరించారు. రాజకీయాల నుంచి తప్పుకుంటానంటే తన అభిమానులు కంటతడి పెట్టారంటూ సోమారపు భావోద్వేగానికి లోనయ్యారు. -
రాజకీయాల నుంచి తప్పుకుంటా!
సాక్షి, పెద్దపల్లి/జగిత్యాల: తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ఆర్టీసీ చైర్మన్, అధికార పార్టీకి చెందిన రామగుండం ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ప్రకటించారు. నియోజకవర్గంలో ఇమడలేక పోతున్నందున ఈ నిర్ణయం తీసుకుంటున్నానని అన్నారు. సోమవారం గోదావరిఖనిలోని ఐదో గని గేటు మీటింగ్‌లో కార్మికుల సమావేశంలో, జగిత్యాల లో విలేకరులతో మాట్లాడారు. రామగుండం మేయర్‌పై అవిశ్వాసం ఆపేయాలని అధిష్టానం నుంచి ఫోన్ వచ్చిన 24 గంటల్లోపు సోమారపు ఈ నిర్ణయం తీసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ‘‘15 ఏళ్లు రాజకీయంలో ఉన్నా.. అభివృద్ధికి ఎంతో కృషి చేశా.. కానీ నియోజకవర్గంలో మాత్రం ఇమడ లేకపోతున్నా’’అని సత్యనారాయణ అన్నారు. అధిష్టానం చెప్పిన విధంగా నడుచుకోవాలని, అదే ఫైనల్ కాబట్టి కొన్ని నిర్ణయాల్లో ఏం చేయలేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో చాలా అభివృద్ధి పనులు చేశానన్నారు. మున్సిపల్లో తాను అడుగుపెట్టలేని స్థితి ఉందన్నారు. ఆర్టీసీ అధ్వాన స్థితిలో ఉందని, ఏదో చేయాలనుకున్నా స్థానిక పరిణామాలు మనోవేదనకు గురిచేశాయన్నారు. మేయర్ మార్పును ప్రజలే కోరుతున్నారని చెప్పారు. అవిశ్వాసం అనే పిచ్చి నిర్ణయాలు తీసుకోవద్దని మంత్రి కేటీఆర్ ఫోన్ చేసి చెప్పారని, కానీ కార్పొరేటర్లకు నచ్చజెప్పినా వినడం లేదన్నారు. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటున్నా.. టీఆర్ఎస్కు, సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటానని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తన నియోజకవర్గంలో ఎవరు నిలబడినా గెలుస్తారని, వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను రాజ కీయ సన్యాసం తీసుకున్నందున ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధిష్టానాన్ని కోరుతానని సత్యనారాయణ అన్నారు. ‘సాక్షి’తో ఆయన మాట్లాడుతూ పదవులకు రాజీనామా చేస్తే అధిష్టానాన్ని ధిక్కరించినట్లవుతుందని, అందుకే రాజీనామా చేయనన్నారు. రాజకీయ సన్యాసమే తీసుకుంటే ఇక రాజీనామాలెందుకని ప్రశ్నించారు. కాగా, తాను ఏ పార్టీలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. అవిశ్వాసంపై తగ్గం: టీఆర్ఎస్ కార్పొరేటర్లు కాగా మేయర్‌పై పెట్టిన అవిశ్వాసంపై వెనక్కి తగ్గేది లేదని టీఆర్ఎస్ కార్పోరేటర్లు స్పష్టం చేశారు. 50 మందికి గాను మేయర్, డిప్యూటి మేయర్లు పోనూ, 48 మంది కార్పొరేటర్లలో 41 మంది అవిశ్వాసానికి మద్దతునిస్తున్నారని పార్టీ ఫ్లోర్ లీడర్ సత్యప్రసాద్ తదితరులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు.