అవిశ్వాసమే ! | Infidelity On Ramagundam Mayor | Sakshi
Sakshi News home page

అవిశ్వాసమే !

Published Fri, Jul 13 2018 10:52 AM | Last Updated on Fri, Jul 13 2018 10:52 AM

Infidelity On Ramagundam Mayor - Sakshi

మాట్లాడుతన్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ

సాక్షి, పెద్దపల్లి: రామగుండం మేయర్‌పై అవిశ్వాసం కొనసాగనుంది. మేయర్‌ను మార్చాలని ప్రజలు బలంగా కోరుతున్నారని పదేపదే చెబుతూ వస్తున్న ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, నాటకీయ పరిణామాల అనంతరం అవిశ్వాసాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ముందునుంచి మేయర్‌ను దించాలని లక్ష్యంగా పెట్టుకున్న ఎమ్మెల్యే తన అస్త్రశస్త్రాలు ఉపయోగించడంతో అధిష్టానం కూడా దిగివచ్చింది. కాగా సోమారపు రాజకీయ సన్యాసంతో కాస్త సద్దుమణిగినట్లు కనిపించిన అవిశ్వాస రాజకీయం, ఎమ్మెల్యే ప్రకటనతో మళ్లీ ఊపందుకుంది.
 
కలిసొచ్చిన రాజకీయ సన్యాసం
మేయర్‌ లక్ష్మీనారాయణపై పెట్టిన అవిశ్వాసానికి మళ్లీ కదలికవచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్‌లపై అవిశ్వాసం ప్రకటిస్తూ ఇటీవల 39 మంది కార్పొరేటర్లు కలెక్టర్‌ శ్రీదేవసేనకు నోటీసు ఇచ్చారు. దీంతో అవిశ్వాసాన్ని మొగ్గలోనే తుంచివేయడానికి రాష్ట్రంలోని ఆరుగురు మేయర్లు సీఎం కేసీఆర్‌ను కలిసి ఫిర్యాదు చేయడం, ఆ వెంటనే మంత్రి కేటీఆర్‌ ఎమ్మెల్యే సత్యనారాయణకు ఫోన్‌చేసి ఆపేయాలనడం తెలిసిందే. అవిశ్వాసంపై అధిష్టానం అనుసరించిన వైఖరితో మనస్థాపం చెందిన సోమారపు అనూహ్యంగా తన రాజకీయ సన్యాసం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిం చారు. ఆర్టీసీ చైర్మన్, రెండుసార్లు ఎమ్మెల్యే అయిన సోమారపు సత్యనారాయణ రాజకీయ సన్యాసం ప్రకటన ప్రకంపనాలు సృష్టిం చింది.

దీంతో రాష్ట్ర మంత్రులు కేటీఆర్, టి.హరీష్‌రావులు సోమారపుతో మంతనాలు జరపడంతో ఆయన తన రాజకీయ సన్యాస ప్రకటనను విరమించుకున్నారు. అదే సమయంలో రామగుం డం నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కొ న్ని ‘అధికారాలు’ పొందినట్లు సమాచారం. అం దులో ప్రధానమైనది మేయర్‌పై అవిశ్వాసం. అవిశ్వాసం వ్యవహారాన్ని ‘చూడాల్సిన’ బాధ్యతను పూర్తిగా ఎమ్మెల్యేపైనే పార్టీ భారం పెట్టింది. దీంతో అవిశ్వాసం వ్యవహారం మళ్లీ పట్టాలెక్కిం ది. మేయర్‌తో రాజీనామా చేయిస్తామని అధిషా ్టనం చెప్పినా, అవిశ్వాసం పెట్టనీయండని వారించినట్లు ఎమ్మెల్యే ప్రకటించడం ప్రస్తావనార్హం.
 
ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు
అవిశ్వాసం మళ్లీ తెరపైకి రావడంతో సందడి నెలకొంది. మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను 39 మంది కార్పొరేటర్లు అవిశ్వాసం నోటీసు ఇవ్వగా, మరో ఇద్దరు కూడా మద్దతు పలికారు. ఇటీవలి పరిణామంలో ఒక కార్పొరేటర్‌ ఎమ్మెల్యే గ్రూప్‌ను వీడి మేయర్‌ పక్షాన చేరినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే అవిశ్వాసానికి అనుకూలంగా ఎమ్మెల్యే వెంటే మెజార్టీ కార్పొరేటర్లు ఉన్నారు. దీనితో అవిశ్వాసం నెగ్గడం ఖాయంగా కనిపిస్తోందని టీఆర్‌ఎస్‌ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలాఉంటే టీఆర్‌ఎస్‌ అంతర్గత వ్యవహారాలను పరిశీలిస్తున్న కాంగ్రెస్‌పార్టీ అవిశ్వాసానికి అనుకూలంగా ఉంటుందా, వ్యతిరేకిస్తుందా అనేది చర్చనీయాంశంగా మారిం ది. ఇందులో కాంగ్రెస్‌ కార్పొరేటర్లు అవిశ్వాసానికి మద్దతుగా ఉంటే, పార్టీ మాత్రం వేరే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement