సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 28 శాతం ప్రజలు ఆర్థికంగా ఎదిగినప్పుడే బంగారు తెలంగాణ వచ్చినట్లని టీఆర్‌ఎస్ సభ్యుడు సోమారపు సత్యనారాయణ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనుసరిస్తున్న తీరు చూస్తుంటే సమీప భవిష్యత్తులో అది సాధ్యపడే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. శుక్రవారం శాసనసభలో వివిధ పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక పట్టణాలకు పెద్ద సంఖ్యలో వలస వచ్చారని, కాని వారికి అక్కడా జీవనోపాధి సరిగ్గా దొరక్క మురికివాడలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. జాతీయ సగటు (37 శాతం) కంటే ప్రస్తుతం తెలంగాణ పట్టణా జనాభా (39 శాతం) ఎక్కువగా ఉందని, కొత్త నగర పంచాయితీలు, పురపాలక సంఘాలు ఆవిర్భవిస్తే అది 45 శాతానికి చేరుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment