Prashanthreddi
-
ప్రోటోకాల్ సమస్య లేకుండా రాజీనామాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేటెడ్ పదవుల్లో ఉన్న పలువురు టీఆర్ఎస్ అభ్యర్థులు మంగళవారం తమ పదవులకు రాజీనామా చేశారు. టీఆర్ఎస్ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్న పిడమర్తి రవి, ప్రశాంత్ రెడ్డి, సోమారపు సత్యనారాయణ తమ కార్పొరేషన్ పదవులకు రాజీనామా చేశారు. ఎన్నికల ప్రచారంలో ప్రోటోకాల్ సమస్య ఎదురుకాకుండా వీరు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. వీరి రాజీనామాలను ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదించారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌గా పిడమర్తి రవి ఉండగా.. మిషన్ భగీరథ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో బాల్కొండ తాజా మాజీ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్‌గా సోమారపు సత్యనారాయణ కొనసాగిన విషయం తెలిసిందే. నామినేటెడ్ పదవుల్లో ఉంటూ ఎన్నికల్లో పోటీ చేస్తుండటం వల్ల ప్రోటోకాల్ సమస్యలు తలెత్తుతాయన్న భావంతో సీఎం కేసీఆర్ సూచన మేరకు వీరు పదవుల నుంచి తప్పుకున్నట్టు తెలుస్తోంది. -
స్పీకర్ పరామర్శ
వేల్పూర్: టీఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దివంగత వేముల సురేందర్‌రెడ్డి మృతి తీరని లోటు అని స్పీకర్ మధుసుదనాచారి పేర్కొన్నారు. సురేందర్‌రెడ్డి గత నెల 27న మృతి చెందిన నేపథ్యంలో ఆయన తనయుడు, మిషన్ భగీరథ వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డిని స్పీకర్ మంగళవారం వేల్పూర్‌లో పరామర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి సురేందర్‌రెడ్డి పార్టీలో ఉన్నారని, నైతిక విలువలు పక్కన పెడుతున్న ఈ రోజుల్లోనూ ఆయన టీఆర్ఎస్ కోసం అంకిత భావంతో పని చేశారని కొనియాడారు. రైతు నాయకుడిగా నిరంతరం రైతుల సంక్షేమం కోసం పరితపించేవారన్నారు. సురేందర్‌రెడ్డికి రావాల్సిన గౌరవం ఆయన తన యుడు ప్రశాంత్‌రెడ్డికి దక్కిందన్నారు. మరోవైపు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ పురాణం సతీష్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవిప్రసాద్ తదితరులు కూడా ప్రశాంత్‌రెడ్డిని పరామర్శించారు. సురేందర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.