
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగి ఓ కానిస్టేబుల్ నడిరోడ్డుపై వీరంగం సృష్టించాడు. ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న ఈశ్వరయ్య సోమవారం అర్ధరాత్రి ఫుల్‌గా మద్యం తాగి నడిరోడ్డుపై హల్‌చల్ చేశాడు. మద్యం మత్తులో చిందులు తొక్కిన ఈశ్వరయ్య నడిరోడ్డుపైనే పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. పోలీసు యూనిఫాంలో ఉండి మద్యం తాగిన కానిస్టేబుల్ చేష్టలను చూసిన ప్రజలు షాకయ్యారు. ఓ వాహనదారుడు కానిస్టేబుల్ వీరంగం మొత్తాన్ని తన మొబైల్‌లో రికార్డ్ చేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో విషయం పోలీస్‌శాఖ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఫలక్ నుమా సీఐకు మెమో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment