విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఓ వ్యక్తి ఆత్మహత్యకు యత్నించటం కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా పార్వతీపురం పట్టణానికి చెందిన గౌరీశంకర్ గురువారం విజయవాడ వెళ్లాడు. మద్యం తాగి మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో కనకదుర్గ ఆలయం ఉన్న ఇంద్రకీలాద్రి పైకి చేరుకున్నాడు. గుట్ట శిఖరానికి చేరుకుని అక్కడి నుంచి దూకి చనిపోతానంటూ కేకలు పెట్టాడు. ఇది గమనించిన ఆలయ సిబ్బంది సమాచారం అందించడంతో అప్రమత్తమైన ఫైర్ సిబ్బంది అతని వద్దకు చేరుకుని నిచ్చెన సాయంతో కిందికి దించారు. అనంతరం పోలీసులకు అప్పగించారు.