వాహనం ఆపకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోగా అతడు కత్తితో దాడికి యత్నించాడు.
గోపాలపట్నం (విశాఖ) : వాహనం ఆపకుండా వెళ్లిపోతున్న ఓ వ్యక్తిని పోలీసులు అడ్డుకోగా అతడు కత్తితో దాడికి యత్నించాడు. ఈ ఘటన విశాఖ నగరంలోని గోపాలపట్నంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నాగం శ్రీనివాసరావు అనే వ్యక్తి గోపాలపట్నం జంక్షన్‌లో రెడ్ లైట్ పడినా ఆగకుండా బైక్‌పై వేగంగా వెళ్లిపోయాడు.
దీనిపై అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కొంతదూరం తర్వాత అతడిని అడ్డుకున్నారు. ఆగ్రహించిన శ్రీనివాసరావు తన వద్ద ఉన్న కత్తితో వారిపైకి దాడికి దిగాడు. వారు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడి వద్ద ఉన్న నాలుగు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకుని, అతడిని విచారిస్తున్నారు.