
ఎస్‌ఐ సత్యనారాయణతో నాగరాజు వాగ్వాదం
అజిత్‌సింగ్‌నగర్(విజయవాడ సెంట్రల్): నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడిన ఘటన డాబాకొట్ల సెంటర్ ప్రధాన కూడలిలో గురువారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్ శేఖర్‌బాబు గురువారం సాయంత్రం డాబా కొట్ల సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తుండగా సింగ్‌నగర్ లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కొప్పుల నాగరాజు, మరో ఇద్దరు బైక్‌పై వస్తున్నారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్‌ఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శేఖర్ వారిని ఆపారు. దీంతో నాగరాజు ఒక్కసారిగా కానిస్టేబుల్‌పై పిడిగుద్దులు కురిపించాడు. ఫలితంగా శేఖర్ గాయపడ్డాడు.
దాడిలో గాయపడిన కానిస్టేబుల్ శేఖర్‌బాబు
అనంతరం ముగ్గురూ బైక్‌పై పరారయ్యేందుకు యత్నిస్తుండగా పోలీసులు నాగరాజును పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నాగరాజు ఎస్‌ఐతోనూ వాగ్వాదానికి దిగాడు. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. కానిస్టేబుల్ శేఖర్ ఫిర్యాదు మేరకూ అజిత్‌సింగ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment