మద్యం తాగి భర్త వీరంగం! | Husband nuisance in drunken state | Sakshi
Sakshi News home page

మద్యం తాగి భర్త వీరంగం!

Published Sat, Aug 13 2016 8:03 PM | Last Updated on Mon, Sep 4 2017 9:08 AM

మద్యం తాగి భర్త వీరంగం!

మద్యం తాగి భర్త వీరంగం!

భార్య, కుమారుడిపై దాడి
గణపవరం (నాదెండ్ల): మద్యం తాగి ఒక వ్యక్తి వీరంగం వేసిన సంఘటన మండలంలోని మేజర్‌ పంచాయతీ గణపవరంలోని శాంతి నగర్‌లో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మేరీకి 22 సంవత్సరాల క్రితం సత్తెనపల్లికి చెందిన లారీడ్రై వర్‌ కాకుమాను కుమార్‌తో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కొన్నేళ్లుగా భర్త మద్యానికి బానిసై ఇంటికి రాకుండా, కుమారుల ఆలనాపాలన చూడకపోవడంతో విసుగుచెందిన భార్య మేరీ పుట్టింటింకి చేరింది.

చాలాసార్లు పెద్దలు రాజీ కుదిర్చి చక్కదిద్దినా  కుమార్‌ ప్రవర్తనలో ఏ మార్పు రాకపోగా, మద్యం తాగి భార్యాబిడ్డలపై తరచు దాడికి పాల్పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో మేరీ పిల్లలతో కలిసి మళ్లీ పుట్టింటికి వచ్చింది. అన్నదమ్ముల నివాసాల మధ్యలో గహాన్ని అద్దెకు తీసుకుని ఉంటూ కూలి పనులకు వెళుతోంది. రెండేళ్ల క్రితం జరిగిన ప్రమాదంలో పెద్దకుమారుడు మృతి చెందాడు. రెండో కుమారుడిని తనతో పాటు కూలి పనులకు తీసుకువెళుతూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో భర్త కుమార్‌ శుక్రవారం రాత్రి మద్యం పూటుగా తాగి గణపవరంలో నివసిస్తున్న భార్య ఇంటికి చేరి భార్య, కుమారుడిపై దాడికి పాల్పడ్డాడు. ఇంట్లోని వస్తువులను చిందరవందర చేశాడు. కుమారుడు రాజేష్‌ గొంతు పట్టుకుని నొక్కడంతో అతడు కేకలు వేయడంతో స్ధానికులు వచ్చి కుమార్‌ను తాళ్లతో బంధించారు. తండ్రిని ప్రతిఘటించే క్రమంలో రాజేష్‌కు చేతికి తీవ్రగాయాలయ్యాయి. రాజేష్‌ను స్థానిక వైద్యశాలకు తరలించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement