హైదరాబాద్‌సిటీ: హయత్‌నగర్ పరిధిలోని శ్రీనివాస్ నగర్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పనిచేస్తున్న శివశంకర బ్రహ్మచారి(28) అనే వ్యక్తి బుధవారం మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకున్నాడు.
ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని.. భవనం నాలుగో అంతస్తు మీద నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలయాలతో బ్రహ్మచారి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే కారణమని భావిస్తున్నారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య
Published Wed, Jan 4 2017 6:35 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement