
ఆరేళ్ల బాలికపై అత్యాచారం... నిందితుడు పరారీ
హయత్నగర్ మండలం బలిజగూడలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై శ్రీను అనే యువకుడు గత అర్థరాత్రి అత్యాచారం చేశాడు. ఆ బాలిక జరిగిన విషయాన్ని తన తల్లితండ్రులకు వెల్లడించింది. దాంతో వారు హయత్నగర్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు శ్రీను పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.