హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్నగర్ లక్ష్మానగర్పాలెంలో మంగళవారం రెండు బస్సులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇరు బస్సు డ్రైవర్లు గాయపడ్డారు. అయితే బస్సులోని విద్యార్థులకు మాత్రం ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి విద్యార్థులను బస్సులో నుంచి కిందకి దింపి... పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్లను ఆసుపత్రికి తరలించారు.
అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షలు పోలీసులకు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గురైన బస్సుల్లో ఒకటి హయత్నగర్లోని వరుణ్ మోడల్ హైస్కూల్ చెందినదని, మరోకటి మజీద్పూర్కు చెందిన నీలకాంత్ విద్యాపీఠ్కు చెందిన బస్సు అని పోలీసులు తెలిపారు.