సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి నకిల మద్యం బయటపడింది. శివారు ప్రాంతాల్లో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌శాఖ అధికారులు.. హయత్ నగర్‌లోని ఓ బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌లపై దాడులు నిర్వహించారు.
ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారానికి చెందిన మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్‌కు చెందిన గోదాంలో నకిలీ మద్యం పట్టుకున్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలరాజు గౌడ్, కొండల్‌రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు నిర్ధారించారు. గతంలో కూడా బింగి బాలరాజు గౌడ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇదే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్
Comments
Please login to add a commentAdd a comment