breaking news
fake liquor
-
నకిలీ మద్యంతో కల్లు గీత వృత్తి బలి
సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): ‘‘నకిలీ మద్యానికి కల్లు గీత వృత్తి బలి అవుతోంది. ప్రభుత్వ పెద్దల అండతో అధునాతన యంత్రాలతో నకిలీ మద్యం తయారీని పరిశ్రమ తరహాలో నిర్వహించడం అంటే ఇందులో వైఫల్యం ఎవరిది? రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చేసి డబ్బు సంపాదనే లక్ష్యంగా నకిలీ మద్యం అమ్మి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు’’ అని ఏపీ కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జుత్తిగ నరసింహమూర్తి అన్నారు. గంజాయి కంటే ప్రమాదకరమైన స్పిరిట్‌తో మద్యాన్ని తయారు చేస్తున్నవారిపైన, బెల్ట్ షాప్‌లలో అమ్మేవారిపైన తక్షణం పీడీ యాక్ట్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. శనివారం విజయవాడ బాలోత్సవ భవన్లో అధ్యక్షుడు వాక రామచంద్రరావు అధ్యక్షతన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. ఇందులో నరసింహమూర్తి మాట్లాడుతూ... విదేశాల్లో ఉన్న కొందరు రాష్ట్రంలోని తమవారి ద్వారా, ఫినాయిల్ పేరుతో స్పిరిట్‌ను బస్సుల్లో తరలించి నకిలీ మద్యం తయారు చేయించారని, ఈ దారుణ దందాపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తాటి కల్లు అమ్మకాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తోందని మండిపడ్డారు. కల్లు గీత వృత్తిపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఎక్స్‌గ్రేషియా రద్దుతో ప్రభుత్వం అన్యాయం చేసింది రాష్ట్ర ప్రభుత్వం కిస్తీలు రద్దు చేసి గీత వృత్తిని దెబ్బతీసిందని, ఎక్స్‌గ్రేషియా ఎత్తివేసి గీత కార్మికులకు అన్యాయం చేసిందని వాక రామచంద్రరావు మండిపడ్డారు. ఎన్నికల వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసినందుకు కూటమి ప్రభుత్వం గీత కార్మికులను దగా చేసిందని విమర్శించారు. ఈ ప్రభుత్వం వచి్చన 16 నెలల కాలంలో కల్లు అమ్మకాలు లేక గీత కార్మికులు వృత్తిని కొనసాగించలేక ఉన్న ఊరు, కన్నతల్లి, భార్యా పిల్లలను వదిలేసి వలసలు పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి రక్షణకు మరో పోరాటం గీత వృత్తిని పరిశ్రమగా అభివృద్ధి చేయాలని, కల్లుకు మార్కెటింగ్ కల్పించాలని, వృత్తి ఆధునికీకరణకు నిపుణుల కమిటీ వేయాలనే తదితర డిమాండ్లపై రాష్ట్రవ్యాప్త పోరాటానికి శ్రీకారం చుట్టాలని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం తీర్మానించింది. ఈ నెల 23 నుంచి నవంబరు 18 వరకు 27 రోజుల ఆందోళనలకు కార్యాచరణ ప్రకటించింది. సమావేశంలో సంఘం రాష్ట్ర నాయకులు ఎర్ర దేవుడు, కామన మునుస్వామి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ బీరు అమ్ముతున్నారని మందు బాబు ఆగ్రహం
-
అంత నకిలీ మద్యమే! ల్యాబ్ టెస్ట్ లో సంచలన నిజాలు
-
నకిలీ మద్యం రిపోర్ట్ లో బట్టబయలైన టీడీపీ దందా
-
నకిలీ మద్యమే.. రిపోర్ట్ లో బయటపడ్డ బాబు బండారం
-
అది నకిలీ మద్యమే!
సాక్షి ప్రతినిధి, విజయవాడ : నకిలీ మద్యం తయారీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు నిర్వహిస్తున్న డంప్ వద్ద స్వాధీనం చేసుకున్నది ముమ్మూటికీ నకిలీ మద్యమేనని స్పష్టమైంది. నీళ్లు, స్పిరిట్, రంగు, రుచి రసాయనాలతో ఈ నకిలీ మద్యం తయారైందని వెల్లడైంది. ఈ మేరకు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాల నిర్ధారించిందని విశ్వసనీయంగా తెలిసింది. ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా హానికర రసాయనాలతో నకిలీ మద్యం తయారు చేశారని నివేదిక స్పష్టం చేసినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ గోదాము నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం సరుకు నమూనాలను ఎక్సైజ్ అధికారులు గుంటూరులోని ప్రాంతీయ ప్రయోగశాలకు పంపారు. నకిలీ మద్యం తయారీకి ఉపయోగించిన ముడి సరుకు, రసాయనాలు, స్పిరిట్‌తో పాటు తయారైన మద్యంను అధికారులు సీజ్ చేసి, ఈ మొత్తం సరుకుకు సంబంధించి 45 నమూనాలను ల్యాబ్‌కు పంపినట్లు తెలిసింది.ఈ నమూనాలను పరీక్షించిన అనంతరం అదంతా నకిలీ మద్యమేనని తేల్చినట్లు సమాచారం. ఈ మేరకు నివేదిక ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులకు ఇప్పటికే చేరింది. ఈ నివేదికలో పేర్కొన అంశాల తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వ పెద్దలు, అధికారులతో కలిసి మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. అండర్ ప్రూఫ్, ఓవర్ ప్రూఫ్‌లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు తేలినప్పటికీ.. అదేమంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ఇప్పటికే ఎల్లో మీడియా ఆ ప్రచారాన్ని భుజానికెత్తుకుంది. కొంచెం నాణ్యత లేని మద్యమట!నకిలీ మద్యం పలు వైన్ షాపులతోపాటు, బెల్ట్ షాపులకు సరఫరా కావడం, కొన్ని బార్లలో కూడా విక్రయించారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మద్యం ప్రియులు బెంబేలెత్తిపోతున్నారు. ఏడాదిన్నరగా ఈ నకిలీ మద్యం తయారు చేస్తున్నామని నిందితులు చెప్పడంతో ఇన్నాళ్లూ తాము ఎలాంటి మద్యం తాగామనే ఆందోళన మొదలైంది. ఇది తప్పకుండా తమ అరోగ్యాలపై ప్రభావం చూపుతుందని అందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దాని తీవ్రతను తగ్గించి చూపేందుకు నానా తంటాలు పడుతోంది. ఇది నకిలీ మద్యం కాదని, కొంచెం నాణ్యత లేని మద్యం మాత్రమే అని చెప్పుకొస్తోంది. దీని వల్ల ప్రమాదం ఏమిలేదని చెప్పేందుకు ఆపసోపాలు పడుతోంది. అయితే నిబంధనల ప్రకారం ఉండాల్సిన నాణ్యత ప్రమాణాలు లేకుండా, కెమిస్ట్‌ల పర్యవేక్షణ లేకుండా తయారు చేసిన సరుకు వాడితే ప్రమాదం లేకుండా ఎలా ఉంటుందని వైద్య రంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. మందులో స్ట్రెంత్ లేకుండా నీళ్లు కలిపి.. అధిక ధరలకు అమ్మటం ప్రజలను మోసం చేయటం కాదా.. అని పలువురు మద్యం ప్రియులు నిలదీస్తున్నారు. ఒక సరుకు పేరు చెప్పి, ఇంకొక సరుకు అమ్మితే అది నేరం కాకుండా పోతోందా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నకిలీ మద్యం తయారు చేయటం అనేదే నేరం అనే విషయాన్ని పక్కన పెట్టి, అది అంత ప్రమాదకరం కాదని ప్రచారం చేయాలని చెప్పడంపై ఎక్సైజ్ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ ఉత్పన్నం కాలేదని వాపోతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటంమద్యంలో యూపీ (అండర్ ప్రూఫ్) 25గా ఉండాలి. ఓపీ (ఓవర్ ఫ్రూఫ్) 75గా ఉండాలి. అయితే ఇబ్రహీంపట్నంలో సీజ్ చేసిన మద్యంలో యూపీ సగానికి సగం ఎక్కువగా ఉందని, ఓపీ ఉండాల్సిన దానికంటే బాగా తక్కువగా ఉందని ల్యాబ్ రిపోర్టు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తుంటే రంగు నీళ్లలో స్పిరిట్ కలిపి నకిలీ మద్యం తయారు చేశారని తెలుస్తోంది. ప్రభుత్వ అనుమతి పొందిన డిస్టిలరీల్లో నిబంధనల మేరకు మద్యం తయారైన తర్వాత ఆ నమూనాలను ఎక్సైజ్ శాఖ ప్రయోగశాలకు పంపి, ఓకే చేసిన తర్వాతే సీసాల్లో నింపుతారు. అయితే ఇటీవల పట్టుబడిన మద్యం.. నాణ్యత, గాఢత ప్రమాణాలు పాటించకుండా తయారైనట్లు స్పష్టం అవుతోంది. ప్రభుత్వ పెద్దల భరోసాతో నిర్దేశించిన ప్రమాణాలు ఏమాత్రం పాటించకుండా నకిలీ మద్యం తయారు చేసి వైన్ షాపులకు, బెల్ట్ షాపులకు సరఫరా చేయడం ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడారు. -
Tirupati: విద్యార్థి ప్రాణం తీసిన నకిలీ మద్యం
-
Kannababu: కల్తీ మద్యం 99రూ.. ఎకరం భూమి 99పైసలు.. బాబుపై సెటైర్లు
-
నకిలీ మద్యం దోపిడీకి క్యూ ఆర్ కోడ్ అడ్డమే కాదు
సాక్షి, అమరావతి : నకిలీ లిక్కర్ దందాకు సంబంధించి కూటమి ప్రభుత్వంపై మద్యం ప్రియుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో కంటి తుడుపు చర్యగా బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తిరిగి పెడుతోందని, తద్వారా ఇన్నాళ్లూ నకిలీ లిక్కర్ అమ్మకాలు జరిపామని ప్రభుత్వం అంగీకరించినట్లే అని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.నకిలీ లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా జరిగేది బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలోనే కాబట్టి, నకిలీ మద్యం దోపిడీకి ‘క్యూ ఆర్ కోడ్ స్కాన్’ అడ్డమే కాదన్నారు. లూజ్ లిక్కర్ అమ్మకాలు జరిగే చోట క్యూ ఆర్ కోడ్ స్కాన్‌తో పనేంటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ములకలచెరువు, ఇబ్రహీంపట్నం, అనకాపల్లి, తదితర ప్రాంతాల్లో నకిలీ లిక్కర్ దందా బయట పడినప్పుడే చుట్టుపక్కల మద్యం షాపులు, బెల్ట్ షాపులు, పర్మిట్ రూమ్‌లలో తనిఖీలు చేయడంతో పాటు లక్షల్లో శాంపిల్స్ తీసుకుని నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేవారని చెప్పారు. కానీ అలాంటి కార్యక్రమాలేవీ జరగక పోవడం చూస్తుంటే ఈ దందా వెనుక కూటమి పెద్దల ప్రమేయం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల దోపిడీ లక్ష్యం ‘కూటమి ప్రభుత్వం వచ్చాక నకిలీ మద్యం కారణంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయి. ఐదేళ్లలో రూ.40 వేల కోట్ల భారీ దోపిడీకి ప్రభుత్వ పెద్దలు స్కెచ్ వేశారు. ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం తయారీ యూనిట్ గుట్టురట్టయినా, దాని వెనుక టీడీపీ నాయకుల పాత్ర ఉందని తెలిసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. మద్యం అమ్మకాల్లో 70 శాతం చీప్ లిక్కరే. అందువల్ల చీప్ లిక్కర్ ప్లేసులో అక్రమంగా తయారు చేసిన నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి కూటమి పెద్దలు భారీ ఆదాయ వనరుగా మార్చుకున్నారు.నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ ఉద్యమం చేయడంతో మద్యం బాటిళ్లపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ పేరుతో హడావుడి చేస్తోంది. అయితే మద్యం తాగే వారిలో చాలా మంది రోజువారీ కూలీలు. నిరక్షరాస్యులు. వారి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉండవు. అలాంటప్పుడు ఏది నకిలీ.. ఏది ఒరిజినల్ సరుకు అనేది ఎలా తెలుస్తుంది? షాపులన్నీ టీడీపీ నేతలవే అయినప్పుడు వారెందుకు క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసి నకిలీ మద్యం బాటిళ్లను పట్టిస్తారు? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి’ అని పోతిన మహేష్ నిలదీశారు.గత ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేశాకే మద్యం విక్రయం జరిగేదని, నాడు ప్రభుత్వ ఆ«దీనంలో పారదర్శకంగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని చెప్పారు. చంద్రబాబుకు దమ్ముంటే నకిలీ లిక్కర్ దొంగలను శిక్షించాలన్నారు. లూజ్ లిక్కర్‌కు క్యూ ఆర్ కోడ్ స్కాన్ ఎలా? ‘పర్మిట్ రూమ్‌లతో నకిలీ మద్యం అమ్మకాలు పెరుగుతాయా, తగ్గుతాయా? అక్కడ లూజ్ లిక్కర్‌కు క్యూర్ కోడ్ స్కాన్ అవకాశం ఉంటుందా? గత ప్రభుత్వంలో గొంతు చించుకున్న పవన్ కళ్యాణ్ ఇçప్పుడు నోరెత్తరేం’ అని పోతిన ప్రశ్నించారు. -
నకిలీ మద్యం దందా వత్తాసుకే.. ‘సాక్షి’కి వేధింపులు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’ మీడియాపై చంద్రబాబు ప్రభుత్వం మరింతగా కక్ష సాధింపు చర్యలకు బరితెగిస్తోంది. రాజ్యాంగ హక్కులు, పత్రికా స్వేచ్ఛను కాలరాస్తూ కుట్రలకు పదును పెడుతోంది. వరుసగా ఐదో రోజు ‘సాక్షి’ కార్యాలయాల్లో పోలీసులు వేధింపులకు దిగడం విభ్రాంతి కలిగిస్తోంది. వరుసగా మూడో రోజు ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసుల పేరుతో వేధింపులు కొనసాగిస్తున్నారు. నోటీసులు తీసుకుంటున్నా.. పోలీసులకు ఎప్పటికప్పుడు సహకరిస్తున్నా వేధింపులు మాత్రం ఆగడం లేదు. తద్వారా కూటమి సర్కారు ప్రజావ్యతిరేక విధానాలను వెలుగులోకి తేకుండా, నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించకుండా ‘సాక్షి’ పత్రికను నిరోధించాలన్నదే ప్రభుత్వ పెద్దల పన్నాగమన్నది స్పష్టమవుతోంది. అందుకోసం ఏకంగా సుప్రీంకోర్టు తీర్పులను కాలరాస్తూ పోలీసు జులుంతో విరుచుకుపడుతుండటం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. నకిలీ మద్యం దందా వత్తాసుకే... ఏపీలో వెలుగు చూసిన నకిలీ మద్యం మాఫియా దందా యావత్ దేశాన్ని కుదిపివేసింది. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, అన్నమయ్య జిల్లాల్లో బయటపడిన నకిలీ మద్యం రాకెట్ సంచలనం రేకెత్తించింది. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మద్యం తాగిన కొందరు సందేహాస్పద రీతిలో మరణించడం కలకలం రేపింది. బాధ్యతాయుతమైన మీడియా సంస్థగా ప్రజలను చైతన్యం చేస్తూ సాక్షి దినపత్రిక ఈ నకిలీ మద్యం వ్యవహారంలో వాస్తవాలను ప్రచురించింది. నకిలీ మద్యం బారిన పడకుండా అమాయకులను కాపాడాలన్న సదుద్దేశంతో వ్యవహరించింది. మరోవైపు నకిలీ మద్యం దందాపై కఠిన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగానికి ప్రేరణ కల్పించాలని భావించింది. కానీ ‘సాక్షి’ ప్రచురించిన వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు కంటగింపుగా మారాయి. తమ దోపిడీ వ్యవహారం బట్టబయలు కావడంతో వారు బెంబేలెత్తారు. దాంతో నకిలీ మద్యం దందాపై కథనాలు ప్రచురించకుండా ‘సాక్షి’ మీడియాను నిరోధించాలని ఎత్తుగడ వేశారు. అందుకే ‘సాక్షి’పై అక్రమ కేసులు నమోదు చేశారు. అనంతరం పోలీసులు నోటీసులు, విచారణ పేరుతో వేధింపులు తీవ్రతరం చేశారు. బుధవారం వెళ్లిపోయి.. గురువారం మళ్లీ వచ్చి సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, ఎస్సీఎస్ఆర్ నెల్లూరు బ్యూరో ఇన్చార్జ్ మస్తాన్‌రెడ్డిలకు పోలీసులు నోటీసుల మీద నోటీసులు ఇచ్చి వేధిస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 11 నుంచి వరుసగా విజయవాడ ఆటోనగర్, నెల్లూరులలోని సాక్షి కార్యాలయాలతోపాటు హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయాలకు పోలీసులు చేరుకుని రాద్ధాంతం చేస్తూనే ఉన్నారు. నోటీసులు, విచారణ పేరుతో పదే పదే వేధిస్తున్నారు. వార్తకు సంబంధించిన సోర్స్, బాధితుల వివరాలు వెల్లడించాలని అడగటం, పత్రికలో ఉద్యోగుల వివరాలు వెల్లడించాలనడం సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. కానీ ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు పలకడమే ఏకైక కర్తవ్యంగా వ్యవహరిస్తున్న పోలీసులు దీన్ని లెక్క చేయడం లేదు. ఈ క్రమంలో బుధవారం హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డికి నోటీసులంటూ నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు దాదాపు 10 గంటలకుపైగా వేధించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. పత్రికలో ప్రచురించిన కథనాలకు సంబంధించి ఆధారాలు (సోర్స్) చూపించాలంటూ ఒత్తిడి చేశారు. ఓపికగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ పూర్తి సహకారం అందించినప్పటికీ మరుసటి రోజే పోలీసు స్టేషన్లో ఆయన తమ ఎదుట విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పారు. దీంతో ఎడిటర్ తనకు ఈ నెల 29 వరకు గడువు కావాలని కోరారు. అందుకు సమ్మతించిన పోలీసులు సాక్షి ప్రధాన కార్యాలయం నుంచి బుధవారం రాత్రి 7 గంటలకు వెళ్లిపోయారు. ఒక్క రోజులోనే మాట మార్చి.. కానీ పోలీసులు ఒక్క రోజులోనే మాట మార్చారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు ఈ నెల 29 వరకు గడువు ఇచ్చిన పోలీసులు.. గురువారం మళ్లీ హైదరాబాద్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో ప్రత్యక్ష మయ్యారు. అన్ని రోజులు గడువు ఇవ్వలేమన్నారు. తమ ప్రశ్నావళికి శుక్రవారమే సమాధానాలు చెప్పాలని నోటీసులు ఇచ్చారు. అంటే అమరావతి నుంచి ప్రభుత్వ పెద్దలు, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడితోనే పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారన్నది స్పష్టమవుతోంది. హైదరాబాద్ కార్యాలయంలో మూడు రోజులుగా పోలీసుల హల్చల్ ఏపీలో నకిలీ మద్యం ఘటనపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సీబీఐ విచారణకు పెద్ద ఎత్తున డిమాండ్లు వచ్చాయి. అయితే అధికార పారీ్టకి చెందిన వ్యక్తులు, సన్నిహితులు కీలక నిందితులుగా ఉండటంతో కూటమి ప్రభుత్వం కేసును నీరుగార్చేందుకు ‘సిట్’ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో నకిలీ మద్యం కుంభకోణంలో వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తుండటంతో ‘సాక్షి’ని అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నింది. శనివారం నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసు స్టేషన్లో అక్రమ కేసులు నమోదు చేయించింది. ఆ మరుక్షణం పోలీసు యంత్రాంగాన్ని సాక్షిపై దాడులకు ఉసిగొల్పింది. శనివారం ఇంటికి వెళ్లి మరీ నెల్లూరు జిల్లా బ్యూరో ఇన్‌చార్జీకి నోటీసులు జారీ చేసిన పోలీసులు ఆ మరుసటి రోజు ఆదివారం తెల్లవారు జామున సోదాల పేరుతో వీరంగం వేశారు. విచారణకు రావాలని ఒత్తిడి చేశారు. మళ్లీ ఆదివారం అర్ధరాత్రి మరోసారి నెల్లూరు రూరల్, కలిగిరి పోలీసులు నోటీసుల పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ఇదే రీతిన ఆదివారం తెల్లవారక ముందే కనీసం కార్యాలయం తాళాలు తెరవక ముందే విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి కార్యాలయంపైకి దండెత్తారు. ఎడిటర్‌కు నోటీసులు ఇవ్వాలంటూ సిబ్బందిని, జర్నలిస్టులను వేధించారు. ఎడిటర్ హైదరాబాద్‌లోని కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారని చెప్పినప్పటికీ వరుసగా సోమవారం, మంగళవారం కూడా విజయవాడ సాక్షి కార్యాలయంపై పోలీసుల దండయాత్రలు ఆగలేదు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం పలు కార్యక్రమాలకు హాజరు కావాల్సి ఉన్నందున వారం తరువాత విచారణకు వస్తానని ఎడిటర్ సోమవారం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే మంగళవారం సాయంత్రం వాట్సాప్ ద్వారా ఎడిటర్‌కు నోటీసులు పంపించిన పోలీసులు.. బుధవారం హైదరాబాద్‌లోని కార్యాలయంలో అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. వాస్తవానికి ఇది సుప్రీం కోర్టు తీర్పులకు విరుద్ధమైనప్పటికీ, పోలీసులు టీడీపీ పెద్దలకు జీహుజూర్ అంటూ చట్టాలను తుంగలో తొక్కేశారు. అయితే ప్రజాస్వామ్య విలువలు, చట్టాలను గౌరవిస్తూ పోలీసులు సూచించినట్లుగా సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి కార్యాలయంలో బుధవారం అందుబాటులో ఉండగా ఏకంగా 10 గంటల పాటు విచారించారు. ఇక గురువారం కూడా అదే రీతిన పోలీసులు అసంబద్ధ ప్రశ్నలు అడుగుతూ వేధింపులకు దిగారు. ఈ స్థాయిలో మీడియాపై చంద్రబాబు సర్కారు అణచివేత చర్యలను ప్రజా సంఘాలతో పాటు జర్నలిస్టు యూనియన్లు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.‘సాక్షి’ ఒక్కటే కూటమి టార్గెట్..రాజ్యాంగం ప్రసాదించిన ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం పౌరులకు దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించడమే కాకుండా పత్రికా స్వేచ్ఛపై కూటమి ప్రభుత్వం యథేచ్ఛగా దాడి చేస్తోంది. అక్రమ కేసులపై పోలీసులను న్యాయస్థానాలు పదేపదే హెచ్చరిస్తూ తప్పుబడుతున్నా వారి వైఖరిలో మార్పు రావడం లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో భావ ప్రకటన స్వేచ్ఛ విషయంలో అందే ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజిస్ట్రేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయితే రాజ్యాంగానికి కట్టుబడి పని చేయాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తూ వ్యవస్థల ప్రతిష్టను దిగజారుస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడమే పాపమన్నట్లు చంద్రబాబు సర్కారు అక్రమ కేసులతో విరుచుకుపడుతోంది.‘సాక్షి’పై తప్పుడు కేసులు పరిపాటయ్యాయి ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం విషయంలో సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిన కొద్ది గంటల్లోనే సాక్షి దినపత్రిక సంపాదకులు ధనంజయరెడ్డికి ‘సిట్’ పోలీసులు ఎనభై ప్రశ్నలతో ప్రశ్నావళిని అందజేసి అప్పటికప్పుడు సమాధానం కావాలని ఒత్తిడి చేయడం ఎక్కడా జరిగి ఉండదు. 2024లో కూటమి అధికారంలో వచ్చిన దగ్గర నుండి సాక్షి మీడియా గ్రూప్‌ను కట్టడి చేసేందుకు తప్పుడు కేసులు బనాయించడం పరిపాటిగా మారింది. తాజాగా.. నకిలీ మద్యం కథనాలపై సంపాదకుడిని, రిపోర్టర్లను వేధించడం పత్రికా స్వేచ్ఛకు కచ్చితంగా భంగం కలిగించినట్లే. ఈ ప్రయత్నాల్ని విరమించుకోవాలని పోలీసులను, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే, పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి. – దేవులపల్లి అమర్, ఐజేయూ స్టీరింగ్ కమిటీ సభ్యుడు అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకుంటారు.. చంద్రబాబుది ప్రజాస్వామ్య వ్యతిరేక స్వభావం. ఇప్పటికే పలు సందర్భాల్లో ఆ విషయం బయటపడింది. ఇప్పుడు ఏపీలో ఆయన పాలన తీరు, ప్రతిపక్ష పారీ్టపట్ల ఆయన వైఖరి, మీడియాపట్ల వ్యవహరిస్తున్న తీరును చూస్తే మళ్లీ ఆయన స్వభావం స్పష్టమవుతోంది. ఈ బలం శాశ్వతమని చంద్రబాబు విర్రవీగుతున్నారు. నేను చాలామంది ఏపీ ప్రజలతో మాట్లాడితే కూటమి ప్రభుత్వంపట్ల వ్యతిరేకత స్పష్టంగా చెబుతున్నారు. ఇప్పుడు ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్న మీడియాను అణిచివేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సాక్షిపట్ల వరుసగా చేస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి అరాచక పాలనకు బాబు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. – టంకశాల అశోక్, సీనియర్ సంపాదకులు పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు హైదరాబాద్‌లోని సాక్షి కార్యాలయంలో నెల్లూరు పోలీసులు సోదాలు నిర్వహించడం తగదు. నోటీసు ఇచ్చేందుకని వచ్చి అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని భయపెట్టేలా వ్యవహరించడం మంచి పద్ధతి కాదు. ఇది పత్రికా స్వేచ్ఛను హరించడమే. పోలీసులు ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాలి కానీ భయపెట్టేలా ప్రవర్తించడం దారుణం. – గోరంట్లప్ప, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పత్రికా స్వేచ్ఛపై దాడి హేయం ప్రభుత్వాలు ప్రతికా స్వేచ్ఛపై దాడి చేయడం దారుణం. సాక్షి పత్రిక ఎడిటర్‌పై కక్ష సాధింపు చర్యలు విడనాడాలి. విచారణ పేరుతో హైదరాబాద్‌లోని కార్యాలయంలో గంటల తరబడి విచారించి పోలీసలు హల్చల్ చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. – కల్లుపల్లి సురేందర్‌రెడ్డి, ఏపీ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శినోటీసుల్లో అసమంజస డిమాండ్లు⇒ వార్తకు సంబంధించి ఎడిటోరియల్ ఫైల్.. ఒరిజనల్ డ్రాఫ్ట్ కాపీ (ప్రింట్ అండ్ డిజిటల్) అందించాలి ⇒ వార్త కథనానికి సంబంధించి ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌లతో సంబంధమున్న రిపోర్టర్లు, కరస్పాండెంట్లు, ఎడిటోరియల్ సిబ్బంది పేర్లు, హోదాలు, ఫోన్ నంబర్లు ఇవ్వాలి⇒ వార్త కథనానికి ఆధారాలకు సంబంధించిన మెటీరియల్, నోట్స్, ఫొటోలు, వీడియో ఫుటేజ్, స్టేట్మెంట్లు, ఈమెయిల్, మెసేజ్‌లు వంటి ఇతర ఆధారాలు ఏమున్నా సమర్పించాలి ⇒ పబ్లికేషన్ ఆథరైజేషన్ ఆమోదాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా అందించాలి ⇒ వీటికి సమాధానం ఇవ్వాలని నిర్దేశిస్తూ కేవలం 12 గంటల సమయం ఇచ్చారు. అడుగడుగునా ఉల్లంఘనలే⇒ బీఎన్ఎస్ఎస్ 179(1), 94 సెక్షన్ల కింద జారీ చేసిన నోటీసులు భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) ప్రకారం కల్పించిన పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకం కాదా? ⇒ జర్నలిస్టు లేదా ఎడిటర్‌ను వార్త సోర్స్ (సమాచార మూలం) వెల్లడించాలని బలవంతం చేయడం, భావప్రకటన స్వేచ్ఛా హక్కును ఉల్లంఘించడం కాదా? ⇒ ప్రజా ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా వార్త సోర్స్ గోప్యతను కాపాడే సుప్రీం కోర్టు తీర్పులు... ఆర్నాబ్ రంజన్ గోస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2020).. రోమేశ్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ (1950).. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ న్యూస్‌పేపర్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1985)..లను పట్టించుకోకుండా పోలీసులు జరిపిన చర్యలు చట్టపరంగా తప్పు, రాజ్యాంగ విరుద్ధం కాదా? ⇒ వార్త ప్రిపరేషన్, ఎడిటింగ్, పబ్లికేషన్‌కు సంబంధించిన ఫైళ్లను, రిపోర్టర్ల పేర్లు, ఫోన్ నంబర్లు, ఈమెయిల్‌లు ఇవ్వమని డిమాండ్ చేయడం వంటి పోలీసుల చర్యలు మీడియా స్వతంత్రతను దెబ్బతీసే ప్రయత్నం కాదా? ⇒ ఈ విధమైన డిమాండ్లు రాజ్యాంగపరంగా, చట్టపరంగా సమంజసమేనా? ⇒ నోటీసులకు స్పందించేందుకు కేవలం 12 గంటల గడువు మాత్రమే ఇవ్వడం సహజ న్యాయ సూత్రాలను ఉల్లంఘించడం కాదా? ⇒ ఎడిటర్ సమయం కావాలని లిఖితపూర్వకంగా అభ్యర్థించినా పోలీసులు స్పందించకుండా వెళ్లిపోవడం దురుద్దేశపూరిత చర్య కాదా? ⇒ ఒకే అంశంపై వరుసగా నోటీసులు ఇవ్వడం, పోలీసులు మళ్లీ మళ్లీ పత్రికా కార్యాలయానికి రావడం ద్వారా ఎడిటర్‌ను భయపెట్టి లొంగదీసుకోవాలనుకోవడం ప్రభుత్వ వ్యూహం కాదా? ⇒ ఈ చర్యలు అధికార దుర్వినియోగం పరిధిలోకి రావా? ⇒ ప్రభుత్వ లేదా పోలీసు యంత్రాంగం మీడియా స్వేచ్ఛను అణచివేసేందుకు ప్రయత్నించడం ప్రజాస్వామ్య విధానానికి వ్యతిరేకం కాదా? ⇒ ‘‘సాక్షి’’ వంటి పత్రికలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ‘నాణానికి మరొకవైపు ఉన్న అంశాలు’ ప్రజలకు తెలియనీయకుండా, వారికి నిజమైన సమాచారం అందనీయకుండా నిలువరించడం కాదా? ⇒ వార్తా కథనానికి సంబంధించి రెండు వేర్వేరు పోలీస్ స్టేషన్లు (నెల్లూరు రూరల్, కలిగిరి) ఒకే రోజున వేర్వేరు నోటీసులు జారీ చేయడం ద్వంద్వ విచారణ లేదా అధికార దుర్వినియోగం కిందకు రాదా? ⇒ సాక్షి పత్రికలో ప్రచురితమైన వార్త ప్రజా ప్రయోజనాలతో ముడిపడి, ప్రజా అవగాహన కోసం ప్రచురితమైనది కాబట్టి, దానిని ఆధారంగా తీసుకుని కేసులు నమోదు చేయడం ప్రజా ప్రయోజన జర్నలిజాన్ని అణిచివేయడం కదా? ⇒ ఈ చర్య మొత్తం జర్నలిస్టుల స్వేచ్ఛను భయపెట్టి, లొంగదీసుకునే చర్యగా ఎందుకు పరిగణించకూడదు? -
రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తున్నారు
రాజమహేంద్రవరం రూరల్: ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్‌తో అధికార పార్టీ రాష్ట్రాన్ని అధోగతిపాలు చేస్తోందని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్‌రామ్ మండిపడ్డారు. ఆయన గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ... రాజమహేంద్రవరం అర్బన్, రూరల్ పరిధిలోని 39 మద్యం షాపుల సిండికేట్‌కు సంబంధించిన ఆడియో సాక్షిగా అధికార పార్టీ నేతల అక్రమాలను భరత్ బయటపెట్టారు.రేట్ల పెంపు, బెల్టు షాపుల ఏర్పాటుతో పాటు ఎక్సైజ్ అధికారుల మామూళ్ల గురించి నిస్సిగ్గుగా చర్చిస్తున్న టీడీపీ రాజమహేంద్రవరం నగర పట్టణ అధ్యక్షుడు మజ్జి రాంబాబుతో పాటు ఆయన వెనకున్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా పార్టీ నుంచి బహిష్కరించాలని భరత్‌రామ్ డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. అక్రమాలకు వేదికగా రాజమహేంద్రవరం టీడీపీ ప్రభుత్వంలో రాజమహేంద్రవరం అక్రమాలకు వేదికగా మారింది. రాజమండ్రి సిటీ ఈవీఎం ఎమ్మెల్యే కనుసన్నల్లో రాజమహేంద్రవరం నగరం, మరో ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి నియోజకవర్గం రాజమండ్రి రూరల్‌లోని 39 మద్యం దుకాణాల సిండికేట్ మీటింగ్ పెట్టారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ప్రధాన అనుచరుడైన టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు ఫోన్ సంభాషణ ద్వారా అధికార పార్టీ నేతల సిగ్గులేని తనం బయటపడింది.రూ.100 బాండ్ పేపరు మీద సంతకాలు చేద్దామంటూ నిస్సిగ్గుగా ప్రతిపాదించారు. ఈ వ్యవహారంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలి. ఏపీ ఎక్సైజ్ యాక్ట్ 37ఏ, 39/1, 2 సెక్షన్ల ప్రకారం వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి, అరెస్టు చేయాలి. మజ్జి రాంబాబు వెనుక ఉన్న రాజమండ్రి సిటీ ఎమ్మెల్యేను కూడా అరెస్టు చేయాలి. ఆయన్ని చంద్రబాబు బర్తరఫ్ చేయాలి. దీంతో పాటు ప్రభుత్వ అధికారులకు లంచాలిద్దామంటూ నేరుగా చెబుతున్నారు. దీనిపై బీఎన్ఎస్ 274, 276 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలి. ఈ మొత్తం వ్యవహారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఎమ్మెల్యే అండతోనే సిండికేట్ మంతనాలు ఎక్సైజ్ అధికారులు ఎవరి మీద కేసు పెట్టాలో కూడా డ్రా తీసి వీళ్లే నిర్ణయిస్తామని చెబుతున్నారు. కేసు పెట్టిన షాపు కట్టాల్సిన ఫైన్ సిండికేట్ మొత్తం భరించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. రెండుసార్లు కేసులు వస్తే.. ఆ షాపు క్లోజ్ అవుతుంది కాబట్టి వంతుల వారీగా ఏ షాపు మీద కేసు పెట్టాలో కూడా సిండికేటే నిర్ణయిస్తుంది. ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి అండ లేకుండా ఇలా అధికారులను సైతం ప్రభావితం చేయడం సాధ్యమా? లేని లిక్కర్ కేసులో మా పార్టీ ఎంపీ మిథున్‌రెడ్డిని, ఇతర నేతలను అరెస్టు చేశారు. ఇవాళ మీ పార్టీ నేతలు బహిరంగంగా దొరికిపోయారు.రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీలో చంద్రబాబుకు సైతం భాగస్వామ్యం ఉంది. కూటమి నేతలు ఇంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నా కనీస చర్యలు కూడా తీసుకోవడం లేదు. ఇంత పెద్ద ఎత్తున స్కామ్‌కు పాల్పడుతున్న వీళ్లందరినీ అండమాన్ లేదా తీహార్ జైలుకు పంపించాలి. కూటమి నేతలు రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఆ బురదను ప్రతిపక్షంపై చల్లుతున్నారు. మద్యం షాపుల్లో అమ్మే మందు అసలా, నకిలీయా తేల్చాల్సింది ప్రభుత్వం. ఒకవైపు నకిలీ మద్యాన్ని ఏరులై పారిస్తూ.. కొనే ముందు ఫోనులో స్కాన్ చేసి అది అసలా.. నకిలీయా టెస్ట్ చేయమంటున్నారు. రూ.100కు చీప్ లిక్కర్ కొనే వారి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుందా?వైఎస్ జగన్ హయాంలోనే డేటా సెంటర్విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్ అదానీ ఎయిర్ టెల్ డేటా సెంటర్. దీనితో పాటు ఐటీ పార్కు, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి ఎంఓయూ చేసుకున్నారు. 2021లో రూ.23 వేల కోట్ల పెట్టుబడులతో 25 వేల ఉద్యోగాలతో విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఎక్స్‌పోలో అదానీ డేటా సెంటర్‌తో ఎంఓయూ చేసుకుని, 2023 మే నెలలో శంకుస్థాపన కూడా చేశారు. వైఎస్ జగన్ హయాంలో చేసిన అభివృద్ధినే చంద్రబాబు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. -
సాక్షి ఆఫీస్ లో హై డ్రామా!
-
అందుకే పవన్ కల్యాణ్ నోరు మెదపడం లేదు: పోతిన మహేష్
సాక్షి, తాడేపల్లి: నకిలీ మద్యం వెనుక ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందని.. వారి కనుసన్నల్లోనే పెద్ద ఎత్తున వ్యాపారం జరుగుతోందని వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ నకిలీ మద్యంలో పవన్ కళ్యాణ్‌కీ భాగస్వామ్యం ఉందని.. అందుకే ఆయన దీనిపై నోరు మెదపటం లేదన్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా పవన్‌కు కనపడటం లేదా? అంటూ పోతిన మహేష్ నిలదీశారు.‘‘కొత్తగా తెచ్చిన క్యూ ఆర్ కోడ్ కంటితుడుపు చర్య మాత్రమే. రాష్ట్రంలో వైన్ షాపులన్నీ టీడీపీ నేతలవే. వారందరికీ నకిలీ మద్యంలో ప్రమేయం ఉంది. అలాంటప్పుడు క్యూ ఆర్ కోడ్ వలన ఏం ప్రయోజనం ఉంటుంది?. అసలు క్యూ ఆర్ కోడ్ పెట్టటం అంటే రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయిస్తున్నట్టు చంద్రబాబు అంగీకరించినట్టే.. అందుకే ఇప్పుడు వైన్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ అమలు చేస్తున్నారు. నకిలీ మద్యంతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల ప్రాణాలను తీస్తోంది, వేల కోట్ల రూపాయలు దోపిడీకి టీడీపీ పెద్దలు ప్లాన్ చేశారు. నకిలీ మద్యాన్ని నియంత్రిస్తామని ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పటం లేదు?’’ అంటూ పోతిన మహేష్ ప్రశ్నించారు.‘‘ప్రజలను మభ్య పెట్టటానికే క్యూ ఆర్ కోడ్ ప్రకటన చేశారు. స్మార్ట్ ఫోన్లు పేద ప్రజలందరి దగ్గర ఎలా ఉంటాయి?. వారు నకిలీ మద్యాన్ని ఎలా గుర్తిస్తారు?. బెల్టు షాపులు, పర్మిట్ రూములు పెట్టి గత 16 నెలలుగా దోపిడీ చేశారు. ఈ పర్మిట్ రూములలో పెగ్గుతో పాటు, ఫుడ్, బెడ్‌కి కూడా అవకాశం కల్పించారు. నకిలీ మద్యాన్ని ప్రోత్సాహించటానికే పర్మిట్ రూములకు అవకాశం ఇచ్చారా?. లూజుగా మద్యం విక్రయిస్తే అది నకిలీదో మంచిదే ఎలా తెలుస్తుంది?. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం షాపులన్నీ ప్రభుత్వ ఆదీనంలో నడిచాయి. ప్రతి బాటిల్ మీద క్యూఆర్ కోడ్ ఉంది. డిస్టలరీస్ నుండి షాపుల వరకు అన్ని పాయింట్లలోనూ చెకింగ్ జరిగేది. అందువలన ఎక్కడా నకిలీ మద్యానికి ఆస్కారం లేదు..ఇప్పుడు టీడీపీ పెద్దల ఆధ్వర్యంలో నకిలీ మద్యం ఏరులై పారుతోంది. ములకలచెరువు, అనకాపల్లి, ఏలూరులో భారీగా నకిలీ డంపులు బయట పడ్డాయి. ఇంత జరిగినా వైన్ షాపులలో ఎందుకు తనిఖీలు చేయట్లేదు?. రాష్ట్ర ప్రజలందరికీ ఏపీలో నకిలీ మద్యం విక్రయిస్తున్నారని అర్థం అయింది. పవన్ కళ్యాణ్ ఈ నకిలీ మద్యంపై ఎందుకు మాట్లాడటం లేదు?. అనేక మంది చనిపోతున్నా ఎందుకు పట్టించుకోవటం లేదు?. పవన్‌కు కూడా నకిలీ మద్యంలో భాగస్వామ్యం ఉంది. అందుకే ఆయన మాట్లాడటం లేదు’’ అంటూ పోతిన మహేష్ దుయ్యబట్టారు. -
మద్యం అక్రమ కేసు బెయిల్ పిటిషన్లపై ACB కోర్టు విచారణ
-
Pothina: నకిలీ మద్యం అమ్మకాలను కూటమి నేతలే ప్రోత్సహిస్తున్నారు
-
Tirupathi: నకిలీ మద్యానికి యువకుడు బలి
-
కల్తీ మద్యం పై గోరంట్ల సంచలన వ్యాఖ్యలు
-
16 నెలలుగా అమ్మిందంతా నకిలీ మద్యమే..! నిజం ఒప్పుకున్న బాబు సర్కార్
-
ఎమౌంట్ తగ్గితే ఎమ్మెల్యే బావ ఊరుకోడు
సాక్షి నెట్వర్క్: ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారంలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ పెద్దలు వెనుక ఉండి.. అద్దేపల్లి జనార్దనరావును ముందు పెట్టి ఈ స్కామ్ నడిపారని ఆధారాలు బయటపడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ బావమరిది పోసాని కోటేశ్వరరావుకు, అద్దేపల్లి జనార్దనరావుకు మధ్య ఫోన్లో జరిగిన వాట్సాప్ చాటింగ్ ఆధారాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇందులో జనార్దనరావు ‘సార్.. ఈ వీక్ ఎమౌంట్ పంపించాను’ అని టెక్ట్స్ చేయగా.. ‘రూ.18 లక్షలకు గాను రూ.15 లక్షలే పంపించావు’ అని కోటేశ్వరరావు రిప్లై ఇచ్చారు. ‘వచ్చి కలుస్తాను’ అని జనార్దన్ చెప్పగా.. ‘కలవడం కాదు.. బావ ఊరుకోడు.. రిమైనింగ్ అమౌంట్ పంపించు. నెక్ట్స్ వీక్ ఇలా చేయకు’ అని కోటేశ్వరరావు చాట్æ చేసిన వాట్సాప్ మెసేజ్ కలకలం సృష్టిస్తోంది. అద్దేపల్లి జనార్దన్‌రావు ఆధ్వర్యంలో నకిలీ మద్యం ప్లాంట్లను కూటమి నాయకులే పెట్టించారనేందుకు ఇదో ఉదాహరణ అని ఎక్సైజ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బాగోతం మొత్తం బట్టబయలు కావడంతో విదేశాల్లో ఉన్న జనార్దన్‌రావును హుటాహుటిన రప్పించి రిమాండ్‌కు పంపడం.. ఆయన ద్వారా వీడియో రిలీజ్ చేయించడం.. ఈ స్కామ్‌ను వైఎస్సార్సీపీ నేత జోగి రమేష్ పైకి నెట్టాలని చూడటం తెలిసిందే. అటు అన్నమయ్య జిల్లా ములకలచెరువులో, ఇటు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం ప్లాంట్ వ్యవహారం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఈ వ్యవహారంలో టీడీపీ పూర్తిగా ఇరుకున పడిపోవడంతో ‘ముఖ్య’ నేత పలు విధాలా డైవర్షన్ రాజకీయం చేస్తున్నా ఫలితం ఇవ్వడం లేదు. నకిలీ మద్యం వ్యవహారం పూర్తిగా అధికార టీడీపీ నేతలే చేస్తున్నారని అన్ని ఆధారాలూ ప్రజల్లోకి వెళ్లడంతో ‘ముఖ్య’ నేత అంతర్మథనంలో పడ్డారు. దీన్నుంచి బయట పడేందుకే ‘సిట్’ను ఏర్పాటు చేసి, తాత్కాలికంగా ఈ విషయం మరుగున పడేయాలని యత్నిస్తున్నారు. కొనసాగుతున్న దర్యాప్తు ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఏఎన్నార్ బార్లో ఈ నెల 6న పట్టుబడిన నకిలీ మద్యం తయారీ రాకెట్లో ఎక్సైజ్ శాఖ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ఇంట్లో మంగళవారం రాత్రి 8 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 2 గంటల వరకు సోదాలు జరిగాయి. నిరంతర పర్యవేక్షణ కోసం అధికారులు జనార్దనరావు ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. స్థానిక ఫెర్రీ రోడ్డులో కూడా కెమెరాలు బిగించారు. వాటిని కమాండ్ కంట్రోల్ రూమ్‌తో అనుసంధానం చేశారు. మరో వైపు ఏఎన్నార్ బార్ సమీపంలో పట్టుబడిన నకిలీ మద్యం డంప్‌కు అనుకుని ఉన్న స్వర్ణ సినీ కాంప్లెక్స్‌లోని సీసీ టీవీ పుటేజీని ఎక్సైజ్ శాఖ ఎన్పోర్స్మెంట్ సీఐ వర్మ పరిశీలించారు. -
అధికారంలోకి రాగానే 'క్యూఆర్ కోడ్ స్కాన్ ఉష్'
సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వ నకిలీ మద్యం బండారం అధికారికంగా బట్టబయలైంది. 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో అమ్ముతున్న మద్యం నాణ్యతపై ఎటువంటి భరోసా లేదని తేటతెల్లమైంది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయకుండానే ఇన్నాళ్లూ విక్రయాలు సాగించినట్టు ప్రభుత్వం అధికారికంగా అంగీకరించింది. ఏడాదిన్నరలో వేల కోట్ల రూపాయల మద్యం విక్రయించడం ద్వారా నకిలీ మద్యం అమ్మకాలకు రాచబాట పరిచిందనీ స్పష్టమైంది. తీరా నకిలీ బాగోతం బట్టబయలు కావడం.. ప్రభుత్వ ముఖ్య నేతలు ఉక్కిరి బిక్కిరి అవుతుండటం.. అన్ని వేళ్లూ టీడీపీ వైపే చూపుతుండటంతో గత్యంతరం లేక.. గత ప్రభుత్వంలో అమలైన తరహాలో బాటిల్‌పై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేసి విక్రయించే విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. తద్వారా నకిలీ మద్యం దందాను కప్పిపుచ్చేందుకు పన్నాగం పన్నింది. అయితే క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేయకపోతే ఏం చేస్తారనే విషయమై స్పష్టత లేదు. అలాగే వీధి వీధిన ఏర్పాటైన బెల్ట్ షాపుల్లో ఈ విధానాన్ని ఏ విధంగా అమలు చేస్తుందనే విషయాన్ని వెల్లడించ లేదు. తద్వారా బెల్ట్ షాపుల ద్వారా ఈ రాకెట్ నడుపుకోవచ్చనే సంకేతాలు ఇస్తున్నట్లు భావించాల్సి ఉంటుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏడాదిన్నరగా విక్రయించిన మద్యంలో ఎంత మేర నకిలీ ఉందోనని ఇన్నాళ్లూ తాగిన వారు ఆందోళన చెందుతున్నారు.గత ప్రభుత్వ హయాంలోనే క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం దశల వారీ మద్య నియంత్రణ, నాణ్యమైన మద్యం అమ్మకాల కోసం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశ పెట్టింది. అంటే ప్రభుత్వ మద్యం దుకాణాల్లో విక్రయించే ప్రతి మద్యం సీసాపై ఉన్న క్యూ ఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే చాలు.. మద్యానికి సంబంధించిన పూర్తి సమాచారం వెల్లడవుతుంది. అది ప్రభుత్వం అధికారికంగా ఆమోదించి సరఫరా చేస్తున్న నాణ్యమైన మద్యమేనా.. మద్యం ఏ డిస్టిలరీలో తయారైంది.. ఎప్పుడు తయారైంది..బ్యాచ్ నంబరు..ఇలాంటి వివరాలు తెలుసుకునే వెసులుబాటు కల్పించింది. తద్వారా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా మద్యం ఉండేలా పటిష్ట విధానాన్ని అమలులోకి తెచ్చింది. మద్యం నకిలీ/కల్తీ చేసేందుకు అవకాశం లేకుండా కట్టడి చేసింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2019–24 వరకు ఈ విధానాన్ని పటిష్టంగా నిర్వహించింది. అప్పట్లో ప్రతి ప్రభుత్వ మద్యం దుకాణంలో వినియోగదారులకు వారి ముందే బాటిల్‌ను క్యూర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాతే విక్రయించే వారు. 2024లో రాష్టంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం సీసాలపై క్యూఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని తొలగించింది. ఎటువంటి ఉత్తర్వులు లేకుండానే ఆ విధానం అమలును నిలిపి వేసింది. అపై టీడీపీ సిండికేట్ మద్యం దుకాణాల విధానాన్ని ప్రవేశ పెట్టింది. క్యూఆర్ కోడ్ స్కాన్ అమలు చేయాలని ఇప్పుడు ఉత్తర్వులు రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా దోపిడీ బయట పడటంతో కూటమి ప్రభుత్వ బాగోతం బట్టబయలైంది. దాంతో తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు హడావుడిగా బుధవారం ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం సీసాలపై క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. 45 రోజుల్లో ఈ విధానం అమలు చేసేలా రాష్ట్రంలోని 3,336 వైన్ షాపుల్లో, 540 బార్లలో, (త్వరలో రానున్న మరో 300 బార్లలో కూడా) ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది. అంటే ఏడాదిన్నరపాటు క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే సాగిన మద్యం అమ్మకాల్లో అక్రమాలకు పాల్పడినట్టు సమ్మతించినట్టేనని పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. సర్కారు రెండు నాల్కల విధానంపై విస్తుపోతున్నారు.నకిలీ మద్యానికి రాచబాటేటీడీపీ కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరగా రాష్ట్రంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే మద్యం విక్రయాలు సాగించింది. ఏడాదిన్నరగా వేల కోట్ల రూపాయల విలువైన మద్యం విక్రయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవల కలెక్టర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలోనే ప్రభుత్వం వెల్లడించింది. తద్వారా క్యూ ఆర్ కోడ్ స్కాన్ లేకుండానే ఇంత భారీగా మద్యాన్ని విక్రయించినట్టు ప్రభుత్వం ఒప్పుకుంది. ఈ నేపథ్యంలో కేవలం టీడీపీ సిండికేట్ దుకాణాల ద్వారా నకిలీ మద్యం విక్రయాలను అడ్డూ అదుపు లేకుండా చేసేందుకే క్యూ ఆర్ కోడ్ స్కాన్‌ను తొలగించారని ఎక్సైజ్ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే రాష్ట్రంలో భారీ స్థాయిలో నకిలీ మద్యం రాకెట్ బయట పడటం గమనార్హం. ఏడాదిన్నరలో విక్రయించిన మద్యంలో నకిలీ ఎంత ఉంటుందన్నది అంచనాలకు అందడం లేదు.ఇదీ సంగతి! ⇒ క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానం అమలు చేయాలని ఇప్పుడు చెప్పడం ద్వారా ఏడాదిన్నరగా రాష్ట్రంలో నకిలీ మద్యం విక్రయాలు జరిగాయన్నది ప్రభుత్వమే ఒప్పుకుంది. ⇒ రాష్ట్రంలోని మద్యం షాపుల్లో ఏడాదిన్నరగా క్యూ ఆర్ కోడ్ స్కాన్ అన్నదే లేదని తేల్చింది. ⇒ ప్రస్తుతం మద్యం షాపులన్నీ ప్రైవేట్ సిండికేట్ పరిధిలో ఉన్నాయి. వాటిలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ విధానాన్ని అమలు చేయకపోతే ప్రభుత్వం ఏం చేస్తుంది? ⇒ ఊరూరా.. వీధి వీధిన ఉన్న బెల్ట్ షాపుల్లో క్యూ ఆర్ కోడ్ స్కాన్‌ను ఎలా అమలు చేయిస్తుంది? ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పారదర్శకంగా నాణ్యమైన మద్యం విక్రయాలు జరిగాయని ఒప్పుకున్నట్టే. -
సీబీఐ విచారణకు ఎందుకు భయపడుతున్నారు?: కాకాణి
సాక్షి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో సీఎం చంద్రబాబు కుట్రలు వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో నిందితుడు జనార్థన్‌రావుతో ఒక వీడియోను కుట్రపూరితంగా తయారు చేయించి, జోగి రమేష్ పేరు చెప్పించడం ద్వారా వైఎస్సార్సీపీకి ఆ బురదను అంటించాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో కీలకమైన నిందితుడు, టీడీపీ నేత జయచంద్రారెడ్డిని ఏపీకి తీసుకురావడంలో ఎందుకు ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. సీబీఐ విచారణకు ఎందుకు చంద్రబాబు భయపడుతున్నారని నిలదీశారు. ఇంకా ఆయనేమన్నారంటే..డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్రలకు పాల్పడుతున్నారు. నకిలీ మద్యం విషయంలో చంద్రబాబు నీచమైన డ్రామాలకు పాల్పడుతున్నారనే దానిని ప్రజలు గమనిస్తున్నారు. నకిలీ మద్యం తయారీ ద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. దీనికి కారకులైన తన పార్టీ వారిని కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందే తప్ప, దీని మూలాలను దర్యాప్తు చేసి, దానిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా లేదు.ప్రజల దృష్టిని మళ్ళించేందుకు నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ పేరును తెరమీదికి తీసుకువచ్చారు. చంద్రబాబు ఇంటిపైన దాడి చేశారంటూ గతంలోనే జోగి రమేష్‌పై ఆయనకు అక్కసు ఉంది. ఎవరైతే గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేశారో, నేడు కూటమి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై గళం ఎత్తుతున్నారో వారిపైన దాడులు చేయించాలి, పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు పెట్టాలనే లక్ష్యంతోనే చంద్రబాబు పనిచేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రాగానే రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం ప్రారంభించింది.కూటమి ప్రభుత్వంలోనే ఈ దందా అని నిర్థారించిన ఎక్సైజ్ అధికారులునకిలీ మద్యం తయారీలో తెలుగుదేశం పార్టీకి చెందిన వారు, చంద్రబాబు, లోకేష్‌లతో సన్నిహత సంబంధాలు ఉన్నవారే సూత్రదారులు అని బయటపడింది. సాక్షాత్తు తంబళ్ళపల్లి నియోజకవర్గం నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి ప్రమేయం వెలుగుచూసింది. అయినా కూడా సిగ్గులేకుండా విషయాన్ని డైవర్ట్ చేయడానికి నకిలీ మద్యం మరకను వైఎస్సార్సీపీపై రుద్దడానికి చంద్రబాబు అండ్ కో ప్రయత్నిస్తోంది. నకిలీ మద్యం వల్ల ప్రజల ప్రాణాలు పోతున్నాయి. ఈ నెల 3వ తేదీన ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ పరిశ్రమ బయటపడింది.నకిలీ మద్యం, సీసాలు, లేబుళ్ళు వెలుగుచూశాయి. ఇబ్రహీంపట్నంలో వేల లీటర్ల మద్యంను నిల్వ చేసిన గోడవున్ను గుర్తించారు. ఈ దందా రెండుమూడు నెలలుగా జరుగుతున్నట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషన్ చంద్రశేఖర్‌రెడ్డి వెల్లడించారు. డిప్యూటీ కమిషన్ మూడు నెలలుగా జరుగుతున్నట్లు చెప్పారు.రెండుమూడు నెలలుగా ఈ నకిలీ మద్యం దందా రెండుమూడు నెలల నుంచే జరుగుతోందని ఒకవైపు ప్రభుత్వ అధికారులు చెబుతుండటంతో ఇది కూటమి ప్రభుత్వం హయాంలోనే అనే విషయం ప్రజలకు తెలిసిపోతుందనే భయంతో ఈ నకిలీ మద్యం దందా రెండు మూడేళ్ల నుంచి జరుగుతోందంటూ వైఎస్సార్సీపీకి కూడా ఆ బురదను అంటించే కుట్రకు ఈ ప్రభుత్వం పాల్పడుతోంది. అందులో భాగంగా ఒక విషప్రచారాన్ని ప్రారంభించింది. ఇది మా ప్రభుత్వంలో జరిగిందే కాదు, గత ప్రభుత్వంలోనూ జరిగిందంటూ చెప్పేందుకు తంటాలు పడుతోంది.జనార్థన్ వీడియో ద్వారా డైవర్షన్అక్టోబర్ ఆరో తేదీన జనార్థన్‌రావు విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ 'నకిలీ మద్యం తయారీలో నన్ను ముద్దాయిగా చూపుతున్నారు. దీనితో తెలుగుదేశం పార్టీ వారికి సంబంధం లేదు. నాకు ఆరోగ్యం బాగోలేదు, ఆఫ్రికాలో వున్నాను, నేను ఇండియాకు వచ్చిన తరువాత జరిగిన వాస్తవాలను వెల్లడిస్తాను' అని చెప్పాడు. ఆయన వీడియోలో ఎక్కడా జోగి రమేష్ గురించి ప్రస్తావన తీసుకురాలేదు. ఇక ఆయన రెండో వీడియో ఈ నెల 13న విడుదల చేశాడు. దీనిలో జోగి రమేష్ పేరును ప్రస్తావిస్తూ, కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడానికి జోగి రమేష్ కుట్రపన్ని, తనకు డబ్బులు ఇచ్చి ఈ నకిలీ మద్యం తయారీని చేయించారంటూ' ఆరోపణలు చేశాడు.'నకిలీ మద్యం తయారీ బయటపడటంతో జయచంద్రారెడ్డి తదితరులను టీడీపీ సస్పెండ్ చేయడంతో జోగి రమేష్ తన ప్లాన్ మార్చుకున్నాడని, ఇబ్రహీంపట్నంలో ముందుగా సరుకును తెచ్చిపెట్టమని చెప్పడని, దానిని సాక్షి మీడియా ద్వారా ఎక్సైజ్ వారికి పట్టించాడని, ఇదంతా ఒక పథకం ప్రకారం చేశాడంటూ' కూడా ఆ వీడియోలో పేర్కొన్నాడు. మొత్తం వ్యవహారం అంతా కూడా జోగి రమేష్ చెబితేనే తాను చేశానని, టీడీపీ వారికి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా పేర్కొన్నారు. తొలి వీడియోకు, రెండో వీడియోకు సంబంధం లేకుండా జనార్థన్‌రావు మాట్లాడాడు. రెండో వీడియోతో నకిలీ మద్యం కేసును డైవర్ట్ చేసేందుకు కుట్ర ప్రారంభమైంది.టీడీపీ నేతలు తప్పు చేయకపోతే ఎందుకు సస్పెండ్ చేశారు?టీడీపీ నేత జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడు తదితరులపై టీడీపీ ఎందుకు సస్పెన్షన్ వేటు వేసింది? జయచంద్రారెడ్డికి చెందిన వాహనంలోనే తాను నకిలీ మద్యంను రవాణా చేశానంటూ డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. దానికి ఆధారాలు కూడా ఉండటంతోనే విధిలేని స్థితిలో టీడీపీ నుంచి వారిని సస్పెండ్ చేశారు. అలాగే కూటమి ప్రభుత్వం నకిలీ మద్యం వ్యవహారంపై సీరియస్‌గా ఉందని, మేమే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని, గోడౌన్లను వెతికి పట్టుకున్నామని, దాడి చేయించామని కూడా ప్రభుత్వం చెప్పుకుంది.అలాంటప్పుడు జనార్థన్‌రావు విడుదల చేసిన రెండో వీడియోలో జోగి రమేష్ నకిలీ మద్యంను తెప్పించి, ఇబ్రహీంపట్నంలో పెట్టించి, సాక్షి మీడియా ద్వారా దానిని బయటపెట్టించి, ఎక్సైజ్ వారితో సీజ్ చేయించారని ఎలా చెబుతారు? చంద్రబాబుకు వంతపాడే ఎల్లోమీడియా ఈనాడులో నకిలీ మద్యం తయారీ కేంద్రం బయటపడినా కూడా రెండుమూడు రోజుల పాటు దానిపై ప్రస్తావన కూడా చేయలేదు. తరువాత తప్పు చేశారు కాబట్టే మా పార్టీకి చెందిన నాయకులను సస్పెండ్ చేస్తున్నామని నారా లోకేష్, వర్ల రామయ్య ప్రకటించారు. టీడీపీ అధికారిక ట్వీట్లో జయచంద్రారెడ్డి 'ఏ1' అంటూ పేర్కొని, తరువాత రెండు రోజుల్లో 'ఏ1' అనే దానిని తొలగించారు. అంటే తమ కుట్రను ప్రారంభించడానికి సిద్దమయ్యే, దానికి అనుగుణంగా తమ వైఖరిని మార్చుకున్నారనేందుకు ఇదే నిదర్శనం.సీబీఐ విచారణ జరిపిస్తేనే వాస్తవాలు వెలుగుచూస్తాయినకిలీ మద్యంపై ప్రజల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌ల్లో ఎందుకు తనిఖీలు చేయడం లేదు? దానికి బదులుగా వైఎస్సార్సీపీపై బురదచల్లే కార్యక్రమాన్ని ప్రారంభించారు. చంద్రబాబు కపట నాటకాన్ని మొదలుపెట్టారు. హడావుడిగా పన్నెండో తేదీన చంద్రబాబు ప్రెస్‌మీట్ పెట్టడానికి కారణం, వైయస్ఆర్సీపీ ఎంపీ మిధున్‌రెడ్డి నకిలీ మద్యం వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని కేంద్ర హోమంత్రికి లేఖ రాయడమే. ఎక్కడ ఇది సీబీఐ దర్యాప్తునకు దారి తీస్తుందోనని భయంతోనే చంద్రబాబు మీడియాతో రకరకాలుగా మాట్లాడారు. వైఎస్ జగన్‌కి, ఆయన బంధువులుకు కూడా ఆపాదించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. నకిలీ మద్యం బయటపడిన తరువాత మౌనంగా ఉన్న ఈనాడు పత్రిక, ఈ నెల తొమ్మిదో తేదీన ఆఫ్రికాలో రెడ్డి సామాజికవర్గానికి చెందిన వారు లిక్కర్ వ్యాపారంలో ఉన్నారంటూ వైఎస్ జగన్ బంధువులకు అంటగట్టేలా ఒక కథనాన్ని రాసింది.ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలిజనార్థన్రావును అరెస్ట్ చేసి విచారించిన తరువాత ఆయనను న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఈ సందర్బంగా కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్ట్‌లో జోగి రమేష్ పేరు ఉందా? రెండో వీడియోలో మొత్తం జోగి రమేష్ చెబితేనే చేశాను అన్న జనార్థన్‌రావు, పోలీసుల విచారణలో ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించలేదు? దానికి సమాధానం చెప్పాలి. జనార్థన్‌రావు నెల్లూరు జైలుకు రిమాండ్‌కు వెళ్ళిన 24 గంటల తరువాత ఏ విధంగా ఆయన మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది?ఒకవేళ పోలీసులు విచారణలో జనార్థన్‌రావు ఈ వీడియోలో మాట్లాడి వుంటే, రిమాండ్ రిపోర్ట్‌లో ఆ విషయం ఎందుకు రాయలేదు? జనార్థన్‌రావు మాట్లాడిన వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ జరిపారా? పక్కన ఎవరో ఉండి ప్రామ్టింగ్ ఇస్తుంటే జనార్థన్‌రావు మాట్లాడినట్లు కనిపిస్తోంది, అలా ప్రామ్టింగ్ ఇచ్చింది ఎవరు? ప్రభుత్వానికి ఉన్న సమాచారంతోనే ములకలచెరువు, ఇబ్రహీంపట్నంలో పోలీసులు దాడులు చేశారని సీఎం చంద్రబాబు చెప్పుకున్న విషయం వాస్తవం కాదా? రెండో వీడియోలో జనార్థన్‌రావు 'జోగి రమేష్ ఒక పథకం ప్రకారమే ఇబ్రహీంపట్నం గోడవున్లో నకిలీ మద్యంను పెట్టించి, ఎక్సైజ్ వారికి పట్లించారని' మాట్లాడిన విషయం వాస్తవం కాదా? అంటే ప్రభుత్వమే నకిలీ మద్యం గురించి తెలుసుకుని దాడులు చేసి, పట్టుకుందన్న సీఎం చంద్రబాబు మాటలు అబద్దమా? లేక జనార్థన్‌రావు తన వీడియోలో చెప్పిన మాటలు అబద్దమా?నకిలీ మద్యం వ్యవహారంలో ప్రజలు ఈ ప్రభుత్వాన్ని, టీడీపీని అసహ్యించుకుంటున్నారని తెలియగానే, వైఎస్సార్సీపీపై బుదరచల్లేందుకు గానూ జనార్థన్‌రావుతో ఒక పథకం ప్రకారం ఈ రెండో వీడియోను కుట్రపూరితంగా తయారుచేసి, బయటకు వదిలిపెట్టారనేది వాస్తవం కాదా? తాను విదేశాలకు వెళ్ళిపోతే రూ.3 కోట్లు ఇస్తానని జోగి రమేష్ ఆఫర్ చేశారని, అందుకే ఆఫ్రికాకు వెళ్ళినట్లు చెప్పిన జనార్థన్‌రావు, ఎవరు చెబితే తిరిగి ఏపీకి వచ్చారు? ఆయన చెబుతున్నట్లుగా మూడు కోట్లు తీసుకోకుండానే ఎలా ఏపీకి వచ్చాడు? మొలకలచెరువు ఘటనలో కొందరు దోషులను అదుపులోకి తీసుకున్నారు. వెంటనే వారిని విచారణకు ఇవ్వాలంటూ కష్టడీ పిటీషన్ వేశారు. కానీ జనార్థన్‌రావు విషయంలో ఎందుకు కస్టడీ పిటీషన్ వేయలేదు? జనార్థన్‌రావును లోతుగా విచారించకుండా, దొంగ వీడియోను విడుదల చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారు? టీడీపీ నేతగా ఉన్న జనార్థన్‌రావును ఆఫ్రికా నుంచి పిలిపించిన ప్రభుత్వం, కీలకమైన జయచంద్రారెడ్డిని ఎందుకు పిలిపించడం లేదు? ఆయనపై లుక్అవుట్ నోటీస్ ఎందుకు జారీ చేయలేదు? ఎందుకు ఆయనపై చర్యలు తీసుకోవడానికి వెనుకాడుతున్నారు? పోలీసుల విచారణలో టీడీపీకి చెందిన నాయకులు పాల వ్యాన్ల ద్వారా నకిలీ మద్యాన్ని సరఫరా చేశారని అధికారులు వెల్లడించారు. ఆ వ్యాన్లను, వాటి యాజమానులను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు?వారంతా టీడీపికి చెందిన వారు కావడం వల్లే వారిని ఉపేక్షిస్తున్నారా? రాష్ట్రంలో ఉన్న డెబ్బై అయిదు వేల బెల్ట్‌షాప్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? రాష్ట్ర వ్యాప్తంగా మద్యం శాంపిళ్లను సేకరించి, నకిలీ అవునా కాదా అని తెలుసుకునేందుకు ఎందుకు ల్యాబ్‌లకు పంపించడం లేదు? జనార్థన్‌రావుతో గుర్తుతెలియని ప్రాంతంలో ఒక వీడియోను తీయించి, రాజకీయం చేయాలని ఎందుకు చూస్తున్నారు. ఈ వ్యవహారం ముదురుతుంటే ఎంపీ మిధున్‌రెడ్డి నివాసాలపై దాడులు చేయించడం, ప్రజల దృష్టి మళ్లించేందుకు కాదా? నకిలీ మద్యంపై మీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు సీబీఐ దర్యాప్తును కోరడం లేదు? -
నీ పతనం మొదలైంది బాబు!
-
ఒంగోలులో నకిలీ బీరు.. వీడియో తీసి బయటపెట్టిన కస్టమర్
-
తూచ్.. మాకు సంబంధం లేదు.. ప్లేట్ మార్చిన చంద్రబాబు
-
ఒంగోలులో నకిలీ బీరు కలకలం
ఒంగోలు టౌన్: నగరంలో నకిలీ బీరు బాటిల్ కలకలం సృష్టించింది. నగర శివారులోని కొప్పోలులో జాతీయ రహదారికి సమీపంలో ఉన్న ఒక వైన్ షాపులో మంగళవారం ఒక కస్టమర్ మద్యం కొనుగోలు చేసేందుకు వెళ్లాడు. అనుమానం వచ్చిన అతడు ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ డౌన్లోడ్ చేసుకొని పరీక్షించాడు. తొలుత మాన్షన్ హౌస్ లిక్కర్ తీసుకొని క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయగా మద్యం బాటిల్ వివరాలు వచ్చాయి. ఆ తరువాత బీర్ బాటిల్ మీద ఉన్న క్యూ ఆర్ కోడ్‌కు స్కాన్ చేశాడు. ఎర్రర్ అని వచ్చింది. ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో తీసిన సదరు కస్టమర్ ఒంగోలులోని వైన్ షాపుల్లో నకిలీ బీర్ విక్రయిస్తున్నారని, మందుబాబులు జాగ్రత్తగా ఉండాలని సోషల్ మీడియాలో పెట్టాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అయింది. నకిలీ బీరు తాగుతున్నామంటూ మందుబాబులు ఆందోళనకు గురయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌లో కేవలం నకిలీ లిక్కర్‌ను మాత్రమే గుర్తించే సౌకర్యం ఉందని, బీరు బాటిళ్లను గుర్తించే సౌకర్యం లేదని ఎక్సైజ్ ఈఎస్ షేక్ ఆయేషా బేగం తెలిపారు. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌ను కేవలం లిక్కర్ బాటిళ్ల స్కానింగ్‌కు మాత్రమే ఉపయోగించాలని సూచించారు. బీరు బాటిళ్ల మీద కంపెనీకి చెందిన క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటుందని, ప్రభుత్వ యాప్‌కు దీనికి సంబంధం లేదని స్పష్టం చేశారు. 🚨 Public Alert! Be Cautious! 🚨A shocking incident has come to light at Koppole Road, Ongole.At Sai Wines, when people scanned the Mansion House QR code, it worked successfully but when they scanned a beer bottle, the code showed an error on the official AP consumer website.… pic.twitter.com/uTOsi9ilqc— VoiceOfAndhra (@VoicesOfAndhra) October 14, 2025 -
జోగి రమేషే ఎందుకు? అనలిస్ట్ పాషా సంచలన నిజాలు
-
బెడిసికొట్టిన ప్లాన్.. అడ్డంగా దొరికిన తర్వాత రూట్ మార్చిన టీడీపీ పెద్దలు
-
Big Question: బెడిసి కొట్టిన పిట్టకథ..
-
అడ్డంగా దొరికిపోయి.. అడ్డగోలుగా దుష్ప్రచారం
సాక్షి, న్యూఢిల్లీ : నకిలీ మద్యం రాకెట్ సూత్రధారులు, పాత్రధారులు టీడీపీ పెద్దలేనన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఎప్పటిలాగే డైవర్షన్ రాజకీయంతో ఈ సమస్యను అధిగమిద్దామని చూసినా, అది బెడిసి కొట్టడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఎటూ పాలుపోక వైఎస్సార్సీపీపై నిందలు వేసి గట్టెక్కుదామనే కుట్రలు చేసినా అవీ ఫలితాన్నివ్వలేదు. ప్రజల్లో పూర్తిగా పలుచనయ్యామని, ఇలాగే చూస్తూ మిన్నకుంటే చాలా నష్టం జరుగుతుందని ఢిల్లీ వేదికగా మరో కుతంత్రానికి తెర తీశారు.ఈ వ్యవహారాన్ని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపైకి నెడుతూ పెద్ద ఎత్తున దుష్ప్రచారానికి తెర లేపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రెండు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ వచి్చన చంద్రబాబు అందుబాటులో ఉన్న కూటమి ఎంపీలతో మంగళవారం సమావేశమయ్యారు. కొన్ని రోజులుగా రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతుంటే.. ఎంపీలుగా మీరంతా ఏం చేస్తున్నారంటూ వారిపై మండిపడినట్లు సమాచారం. వైఎస్సార్సీపీని టార్గెట్ చేయాలనే ఆలోచన మీకు కలగడం లేదా.. అని అసహనం వ్యక్తం చేసినట్టు తెలిసింది.ఎప్పుడు ఎలా వ్యవహరించాలో తెలియకపోతే ఎలా అంటూ సీరియస్ అయినట్లు సమాచారం. ఈ వ్యవహారం అంతా మాజీ సీఎం జగన్‌కే చుట్టాలని, ఇందుకోసం పదే పదే మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి టార్గెట్ చేయాలని ఎంపీలపై ఒత్తిడి తెచి్చనట్టు విశ్వసనీయ సమాచారం. ఓ వైపు వైఎస్సార్సీపీ.. టీడీపీపై ఉధృతంగా పోరాటం చేస్తుంటే ఇక్కడ మీరు ఉండి ఏం చేస్తున్నారని.. ఇకనైనా మరింత దూకుడుగా మొత్తం వ్యవహారాన్ని ఆ పార్టీపైకి నెట్టాలని దిశా నిర్దేశం చేసినట్లు తెలిసింది. డైవర్షన్ల మీద డైవర్షన్లు సీఎం చంద్రబాబు ఢిల్లీ వచ్చిన ప్రతిసారీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని లక్ష్యం చేసుకుని ఎంపీలను ఎగదోయడం పరిపాటిగా మారింది. తాజాగా నకిలీ మద్యం వ్యవహారంలో నిండా మునిగిన చంద్రబాబు ప్రభుత్వం.. ఆ నకిలీ మద్యం మకిలిని వైఎస్ జగన్‌పై రుద్దేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఎంపీలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ‘రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యవహారం జరుగుతోంది.చేసిందంతా వైఎస్ జగనే అని చెప్పాలి కదా? వారి కంటే ముందుగానే సోషల్ మీడియాలో మన యాంగిల్లో ప్రచారం చేయాలి కదా.. అలా ఎందుకు చేయడం లేదు? ’అంటూ ఎంపీలపై మండిపడ్డట్టు తెలిసింది. నకిలీ మద్యం వ్యవహారం వెనుక ఉన్నది తమ (టీడీపీ) పార్టీ పెద్దలే అనే విషయం తేటతెల్లమయ్యాక, దాన్ని కప్పిపుచ్చి వైఎస్సార్‌సీపీపైకి నెడితే ప్రజల్లో మనం మరింత చులకన అవుతామని కూటమి ఎంపీలు అంటున్నారు. అయినా సూత్రధారి జగనే అంటూ ప్రచారం చేయాలని ఒత్తిడి తేవడంతో.. ఇదెక్కడ గొడవ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగైతే ఇది సెల్ఫ్ గోల్ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. -
Kethireddy: నకిలీ మద్యం తయారీ కేసుపై కూటమి ప్రభుత్వం చందమామ కథలు అల్లుతోంది
-
Fake Liquor Case: జోగిరమేష్ ఉగ్రరూపం.. బాబు, లోకేష్ కు ఓపెన్ ఛాలెంజ్
-
ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్సైజ్ కార్యాలయాల వద్ద ధర్నాలు, నిరసనలు.
-
నకిలీ బీరు కలకలం
-
నకిలీ మద్యం తయారీని కుటీర పరిశ్రమలా మార్చిన చంద్రబాబు సర్కార్
-
చంద్రబాబుతో జయచంద్రారెడ్డి డీల్ ఎంతంటే.. కల్తీ మద్యంపై విడదల రజిని షాకింగ్ నిజాలు
-
కాకినాడ రూరల్‌లో కన్నబాబు ఆధ్వర్యంలో ఆందోళన
-
కల్తీ మద్యంకు వ్యతిరేకంగా వినూత్న నిరసన
-
YSRCP Leader: టీడీపీ వాళ్లకు కళ్ళు కనిపించకపోతే YSRCP తరపున ఫ్రీగా చికిత్స చేపిస్తాం
-
నకిలీ మద్యంపై YSRCP రణభేరి
-
నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ పోరుబాట
-
సిట్ అనేది చంద్రబాబు జోబులోని సంస్థ
-
గన్నవరం వైన్స్ లో కల్తీ బీర్.. షాప్ సిబ్బంది సమాధానం వింటే షాక్ అవుతారు
-
KSR Live Show: నకిలీ మద్యంపై బాబు కొత్త డ్రామా.. ఆఫ్రికా To ఆంధ్రా
-
నారా నకిలీ మద్యంపై YSRCP ఉద్యమం
-
CBI విచారణకు తండ్రీకొడుకులు భయపడుతున్నారా?
-
YSRCP రణభేరి కూటమిలో భయం.. భయం
-
గాడిదలు కాస్తున్నావా..? కొల్లు రవీంద్రను ఏకిపారేసిన రోజా
-
ఆంధ్రప్రదేశ్‌లో బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు. అన్ని గ్రామాల్లోనూ టీడీపీ కార్యకర్తల చేతుల్లోనే షాపులు
-
బెల్ట్ షాపుల్లో నకిలీ కిక్కు!
కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతో పాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో.. ఎలా వస్తాయో సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో బెల్ట్‌షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్‌షాపు రూ.9 లక్షలు పలికింది. అదే జిల్లా చల్లపల్లి మండలం మాజేరులో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. కృష్ణాజిల్లాలో 1,589 బెల్ట్ షాపులు, ఎన్టీఆర్ జిల్లాలో 1,135 ఉన్నాయి. అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇదే తరహాలో అన్ని జిల్లాల్లోనూ బెల్ట్ షాపులు పెట్టి నకిలీ మద్యం భారీగా అమ్మినట్టు ప్రచారం జరుగుతోంది.సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలో బయటపడ్డ నకిలీ మద్యం స్కామ్ దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. పచ్చముఠాల అండదండలతో రాష్ట్రంలో ఒక పరిశ్రమ తరహాలో నకిలీ మద్యం తయారీ రాకెట్ విస్తరించింది. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో బయటపడ్డ నకిలీ మద్యం దందా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీం పట్నం దాకా పాకింది. ఈ ముఠా తయారు చేసిన నకిలీ మద్యం బెల్ట్ షాపుల ద్వారా విక్రయించారని సమాచారం. వాస్తవానికి ప్రభుత్వమే విచ్చలవిడిగా ఊరూరా బెల్ట్ షాపులు ఏర్పాటుకు గేట్లు బార్లా తెరిచింది. మద్యం షాపులన్నింటిని టీడీపీకి చెందిన నియోజకవర్గ ప్రజాప్రతినిధులే దక్కించుకొన్నారు. అరకొరగా డ్రాలో ఇతరులకు దక్కినా నయానో భయానో బెదిరించి తమ ఖాతాలో వేసుకున్నారు. దీంతో మద్యం షాపులు నియోజకవర్గ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో సాగుతుండగా... రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో 75వేలకు పైగా బెల్ట్‌షాపులను టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నడుపుతున్నారు. ఓ గ్రామంలో 10 నుంచి 12 పైగా బెల్ట్ షాపులు ఉన్నాయంటే మద్యం ఎలా ఏరులై పారుతోందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకు కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం మాజేరు పంచాయతీలో 3,998 జనాభా ఉండగా, ప్రతి 333 మందికి ఒకటి చొప్పున ఇక్కడ 12 బెల్టు షాపులున్నాయి. అదే జిల్లా నాగాయలంక మండలంలో సొర్లగొంది గ్రామంలో బెల్ట్ షాపు రూ.9 లక్షలు పలికింది. కనీసం నాలుగైదు వేల జనాభా కూడా లేని ఊళ్లలో ఒక్కో బెల్ట్ షాపు పెట్టుకోవడానికి 9 లక్షల రూపాయల వరకు వేలంపాట పాడారంటే ఏమనుకోవాలి? అంత చిన్న ఊళ్లలో ఎంత మద్యం అమ్మితే అంత డబ్బు తిరిగి రావడంతోపాటు అదనంగా లాభాలు వస్తాయి? ఏ మేరకు లాభాలు వస్తాయో... ఎలా వస్తాయో.. సదరు టీడీపీ నేతలు వేలం పాట పాడిన వారికి ముందే చెప్పారా? ఈ లెక్కన ‘నకిలీ’ మద్యం అమ్మకాలు ఉంటాయని, తద్వారానే భారీ లాభాలు మూట కట్టుకోవచ్చని ఉప్పందించారని తెలియడం లేదా? అందుకేగా ఇదివరకెన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో బెల్ట్‌షాపుల కోసం వేలం పాటలు పెట్టడం చూసి విస్తుపోయాం. ఇప్పుడు ఆచరణలో అమలవుతున్నది ఆ నకిలీ దందానే. టీడీపీ నాయకుల్లో అలజడి ఏడాదిన్నరగా గుట్టుగా సాగిన నకిలీ మద్యం వ్యవహారం బట్టబయలు కావడంతో టీడీపీ నాయకులు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా బెల్ట్ షాపులు ఊరూరా పుట్టగొడుగుల్లా వెలిశాయి. తక్కువ ధరకు దొరికే నకిలీ బ్రాండ్ల మద్యం అమ్మకాలే ఈ బెల్ట్ షాపుల్లో ఎక్కువగా జరిగినట్లు సమాచారం. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. ఈ మద్యం తాగిన పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీంతో నకిలీ మద్యం గుట్టు రట్టు కావడంతో, ఈ మద్యం తాగినవారు బెంబేలెత్తుతున్నారు. ప్రముఖ బ్రాండ్ల పేరుతో ఎక్కువగా నకీలీ మద్యం తయారు చేసి విక్రయించినట్లు తనిఖీల్లో వెలుగు చూసిన ఆధారాలను బట్టి తెలుస్తోంది. పేదలు ఎక్కువగా తాగే రూ.99, రూ.130 లాంటి రకాల నకిలీ మద్యం తయారీపైనే సిండికేట్ దృష్టి సారించినట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో తేలింది. మరోవైపు విజయవాడ కేంద్రంగా కూడా ఈ నకిలీ మద్యం వ్యాపారం జోరుగా సాగిందని పోలీసు, ఎక్సైజ్ శాఖల అధికారులు చెబుతున్నారు. ఉదాహరణకు ఎన్టీఆర్ జిల్లాలో 1,135, కృష్ణా జిల్లాలో 1,589 బెల్ట్ షాపులు ఉన్నాయి. అంటే గ్రామాల్లో మద్యం ఏ విధంగా ఏరులై పారుతోందో ఇట్టే తెలిసిపోతోంది. ప్రభుత్వ నియంత్రణ ఉంటే ఇన్ని బెల్ట్ షాపులు ఎలా పుట్టుకొచ్చాయని సామాజికవేత్తలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. బెల్ట్ షాపులకు ప్రభుత్వమే తలుపులు బార్లా తెరిచిందని చెబుతున్నారు. సాక్షాత్తూ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే, మిగతా జిల్లాల్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. బెల్ట్ షాపులను అధికారులు తనిఖీ చేసిన పాపాన పోవటం లేదు. కరకట్ట బంగ్లా మొదలు టీడీపీ పార్లమెంటు, నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలకు వారి స్థాయిని బట్టి ముడుపులు ముట్టడమే ఇందుకు కారణమని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఎన్నికల సమయంలో బురిడీ కొట్టించి, నకిలీ మద్యం అంటగట్టారని మందు తాగే వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో నకిలీ మద్యం తయారీ వెనుక పార్లమెంట్, మైలవరం నియోజకవర్గ ప్రజాప్రతిధుల పాత్ర ఉన్నట్లు జోరుగా చర్చ సాగుతోంది.కింది నుంచి పైదాకా అందరికీ వాటాలు⇒ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారం అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లోనే సాగినట్లు జోరుగా చర్చ సాగుతోంది. విజయవాడకు కూతవేటు దూరంలో ఇంత పెద్ద నకిలీ మద్యం డంపు నడిచిందంటే, టీడీపీ ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఈ వ్యవహారం జరగదనే భావనను ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ⇒ మైలవరం నియోజకవర్గంలో నియోజకవర్గ ప్రజాప్రతినిధికి, అతని బావమరిదికి తెలియకుండా చీమ కూడా చిటుక్కు మనదని చెబుతున్నారు. ఇసుక, మట్టి, బూడిద, మద్యం వ్యాపారం అంతా వారి కనుసన్నల్లోనే జరుగుతుందని.. అలాంటప్పుడు ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం వీరి అండ లేకుండా జనార్దన్‌రావు ఒక్కడే చేయటం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నారు. పార్లమెంటు ప్రజాప్రతినిధికి కూడా వాటాలు లేకుండా వ్యాపారం చేయలేరని స్ధానికులు చెబుతున్నారు. ⇒ వీరితో పాటు ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్‌లో ప్రధాన భూమిక పోషిస్తున్న పలువురు టీడీపీ నేతల హస్తం కూడా ఉందని ఎక్సైజ్ శాఖ అధికారి ఒకరు తెలిపారు. పలు మద్యం షాపుల వద్ద మాన్యువల్‌గా పేపరు మీద రాసుకున్న స్టాకు వివరాల లెక్కలు ఒకసారి పరిశీలిస్తే రోజుకు ఎంత నకిలీ మద్యం అమ్మింది తేలనుంది. మద్యం డిపో నుంచి తెచి్చన సరుకును బార్లకు తరలించి, పలుచోట్ల నకిలీ మద్యమే షాపుల్లో విక్రయించారని పలువురు స్పష్టం చేస్తున్నారు. ⇒ కాగా, పట్టుబడిన నకిలీ మద్యంకు సంబంధించిన కేసు విచారణ ముఖ్యనేత డైరెక్షన్లో సాగుతుండటం గమనార్హం. ఈ వ్యవహారంలో ముఖ్య నేతలకు వాటాలు ఉండటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్ట మసక బారడంతో కేసు తీవ్రతను తగ్గించి చూపేందుకు ప్రభుత్వం నానా తంటాలు పడుతోంది. ఇందుకు ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతుండటం దుర్మార్గం.గుట్టు రట్టుతో గుభేల్.. నకిలీ మద్యం గుట్టు రట్టు కావడం.. ఇప్పటికే ప్రభుత్వ ప్రతిష్ట పూర్తిగా దిగజారడంతో దీని నుంచి దృష్టి మళ్లించేందుకు టీడీపీ పెద్దలు నానా పాట్లు పడుతున్నారు. అద్దేపల్లె జనార్దనరావుతో పాటు ఆయన సోదరుడు, మరి కొందరు మాత్రమే నకిలీ మద్యం తయారీదారులుగా చూపించి సూత్రధారులు సురక్షితంగా బయట పడేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. కరకట్ట బంగ్లా పాత్రను కప్పిపుచ్చే యత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అద్దేపల్లె జనార్దనరావు లొంగుబాటు ఓ పథకం ప్రకారమే జరిగినట్లు ఎక్సైజ్ వర్గాల్లోనే చర్చ సాగుతోంది. -
‘సాక్షి’పై సర్కారు కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజాకంటక పాలనను నిగ్గదీస్తూ.. మోసాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్న ‘సాక్షి’ మీడియాపై ఏపీలోని కూటమి సర్కారు అణచివేత చర్యలకు పాల్పడుతూ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. రాష్ట్రాన్ని కల్తీ మద్యం పట్టి పీడిస్తున్నా, అమాయకుల ప్రాణాలను హరిస్తున్నా, చోద్యం చూస్తున్న సర్కారు.. క్షేత్రస్థాయి వాస్తవాలను వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’పై అక్రమ కేసులు బనాయించి పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి పిట్టల్లా రాలిపోతున్న ప్రజల ప్రాణాలకు రక్షణ ఏదని ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేపోతోంది. నకిలీ మద్యంపై వార్తలు ప్రచురించినందుకు.. ఎడిటర్‌కు నోటీసుల పేరుతో విజయవాడలోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో ఆదివారం తెల్లవారుజామున పోలీసుల దాషీ్టకానికి దిగారు. నకిలీ మద్యం దారుణాలను కప్పిపుచ్చేందుకే సాక్షి ఎడిటర్, విలేకరులపై కూటమి సర్కారు అక్రమ కేసులు బనాయిస్తోంది. ఎన్నికల హామీలను ఎగ్గొట్టడమే కాకుండా ఘోర పాలనా వైఫల్యాలపై ప్రజల పక్షాన, ప్రజా గొంతుకగా నిలదీస్తున్న సాక్షిపై అక్రమ కేసులతో దాడికి తెగబడుతోంది. అధికార పీఠం ఎక్కింది మొదలు పోలీసులను ఉసిగొల్పుతూ.. యథేచ్ఛగా అక్రమ కేసులు బనాయిస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. ప్రతికా స్వేచ్ఛ.. భావ ప్రకటన స్వేచ్ఛకు అర్థాన్ని విస్మరించి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అనుసరిస్తూ కక్షసాధింపులకు బరితెగిస్తోంది. ప్రాథమిక హక్కులకు సైతం సంకెళ్లు వేసిన ఎమర్జెన్సీ నాటి దురాగతాలను తలదన్నేలా వ్యవహరిస్తోంది. దేశాన్ని కుదిపివేసిన నకిలీ మద్యం.. – సాక్షి ప్రధాన కార్యాలయంలో పోలీసుల అరాచకం ఆంధ్రప్రదేశ్‌లో నకిలీ మద్యం బాగోతం బయటపడటం.. అధికార టీడీపీకి చెందిన, అందులోనూ ముఖ్యనేతతో అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులే సూత్రధారులని బహిర్గతం కావడం యావత్తు దేశాన్ని కుదిపి వేసింది. ఈ ఘటనపై నిరంతరం ప్రజలను అప్రమత్తం చేస్తూ కథనాలు ప్రచురిస్తున్న సాక్షిని ఎలాగైనా అడ్డుకోవాలనే దుర్బుద్ధితో టీడీపీ కూటమి సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది. ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, నెల్లూరు జిల్లా విలేకరులపై నెల్లూరు రూరల్ పోలీసు స్టేషన్లో బనాయించిన అక్రమ కేసులే ప్రభుత్వ కుట్రకు నిదర్శనం. అక్రమ కేసును అడ్డుపెట్టుకుని ఆదివారం తెల్లవారకముందే విజయవాడ ఆటోనగర్‌లోని ‘సాక్షి’ ప్రధాన కార్యాలయంలో పోలీసులు హల్చల్ చేశారు. గేట్లు తెరవకముందే తెల్లవారుజాము 5 గంటల నుంచి 9 గంటల వరకు అరాచకం సృష్టించారు. విజయవాడలోని సాక్షి ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు సోదాల పేరిట ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి.. ప్రభుత్వ పెద్దల డైరెక్షన్లో అక్రమ కేసు నమోదు చేసిన వెంటనే నోటీసుల పేరుతో సాక్షి కార్యాలయాల్లో పోలీసులు దాడికి తెగబడ్డారు. విజయవాడ ఆటోనగర్‌లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో వీరంగం వేశారు. కార్యాలయం తాళాలు కూడా తెరవక ముందే నోటీసులు తీసుకోవాలంటూ భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఇక కలిగిరిలో మరో అక్రమ కేసు పెట్టడమే కాకుండా సోదాల పేరిట ఏకంగా విలేకరుల ఇళ్లలోకి దౌర్జన్యంగా చొరబడి భయభ్రాంతులకు గురి చేశారు. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన పోలీసులు.. దీనిపై కథనాలు రాసిన విలేకరులకు నోటీసులు ఇవ్వడం కూటమి సర్కారు కక్షసాధింపులకు పరాకాష్టగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పులను సైతం లెక్క చేయకుండా నోటీసులు ఇస్తూ.. పత్రికా స్వేచ్ఛను కాలరాస్తోంది. ఆది నుంచి ‘సాక్షి’ ఒక్కటే టార్గెట్.. ప్రజల పక్షాన గొంతుకగా నిలుస్తున్న సాక్షిపై చంద్రబాబు ప్రభుత్వం ఆది నుంచి అక్రమ కేసులు బనాయించి వేధిస్తోంది. రెడ్‌బుక్ రాజ్యాంగం పేరుతో పోలీసులను అడ్డుపెట్టుకుని యథేచ్ఛగా ప్రజాస్వామ్య హక్కులు, విలువలను కాలరాస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టిన ప్రతిసారి ఎక్కడో చోట.. సంబంధం లేని వ్యక్తులతోనూ ఫిర్యాదు చేయించి సాక్షిపైకి పోలీసులను ఉసిగొల్పుతోంది. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కుల్లో– అత్యంత ప్రధానమైన ఆరి్టకల్ 19 (1) (ఏ) ప్రకారం దక్కిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరిస్తూ.. పత్రికా స్వేచ్ఛపై దాడికి తెగబడుతూ దుస్సాహసానికి పాల్పడుతోంది. ఈ అక్రమ కేసులను న్యాయస్థానాలు తప్పుబడుతున్నా చంద్రబాబు సర్కారు తీరు మాత్రం మారట్లేదు. పత్రికలు, మీడియా, సోషల్ మీడియాలో భావ ప్రకటన విషయంలో అందే ఫిర్యాదులకు సంబంధించి కేసుల నమోదు విషయంలో పాటించాల్సిన ప్రమాణాలపై పోలీసు శాఖతోపాటు జిల్లా మేజి్రస్టేట్లకు హైకోర్టు ఇటీవల స్పష్టమైన మార్గదర్శకాలు నిర్దేశించింది. అయినప్పటికీ రాష్ట్ర పోలీసు శాఖ మాత్రం టీడీపీ పెద్దలకు జీహుజూర్ అనడానికి మాత్రమే పరిమితమైనట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలు, అవినీతిని ఎండగడుతున్న ‘‘సాక్షి’’ని అక్రమ కేసులతో వేధించడమే విధానంగా మార్చుకున్నారు. మస్తాన్‌రెడ్డికి నోటీసులు అందజేస్తున్న పోలీసులు నెల్లూరు బ్యూరో ఇన్‌చార్జీకి అర్థరాత్రి పోలీసుల నోటీసుఎక్సైజ్ అధికారులతో వరుసగా వివిధ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు ఇప్పిస్తూ.. పాత్రికేయులను టెర్రరిస్టుల మాదిరిగా చిత్రీకరిస్తూ, చంద్రబాబు సర్కారు అత్యంత జుగుప్సాకరంగా వ్యవహరిస్తోంది. తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ నెల్లూరు సాక్షి బ్యూరో ఇన్చార్జీ చిలకా మస్తాన్‌రెడ్డికి తాజాగా పోలీసులు అర్థరాత్రి సమయంలో ఆయన ఇంటికి చేరుకుని నోటీసులు ఇచ్చారు. అయ్యప్పమాల ధారణలో ఉన్న ఆయన్ను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ పొద్దున్నే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. జర్నలిస్టుల పట్ల కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పాత్రికేయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ అర్థరాత్రి సమయంలో ఓ జర్నలిస్టు ఇంటికి వెళ్లి మరీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నాయి. ఇదేం ప్రజాస్వామ్యం? ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయాలు చెప్పడం కూడా తప్పేనా? ఇదేం ప్రజాస్వామ్యం? సాక్షి పత్రికపై ఎందుకు అంత క్షకపూరితంగా దాడులు చేస్తున్నారు? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. – విశ్వసరాయి కళావతి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే సుపరిపాలన అందిస్తే భయమెందుకు? సాక్షి మీడియా, ఎడిటర్, రిపోర్టర్లపై అక్రమ కేసులు పెడుతున్నారంటేనే మీరు ఎన్ని అక్రమాలకు పాల్పడుతున్నారో అర్థమవుతోంది. మీరు సుపరిపాలన అందిస్తే మీడియాను చూసి భయపడాల్సిన అవసరం ఏముంది చంద్రబాబూ? – బుర్రా మధుసూదన రావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జీ -
నకిలీ మద్యంపై వైఎస్సార్సీపీ రణభేరి
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, దానిని రాష్ట్రవ్యాప్తంగా సరఫరా చేస్తూ, ప్రజల ప్రాణాలు హరిస్తున్న టీడీపీ నాయకుల వైఖరి, కూటమి ప్రభుత్వ మద్యం విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ రణభేరి మోగించింది. పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఉద్యమ కార్యాచరణ చేపట్టింది. అందులో భాగంగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ఎత్తున నిరసన ర్యాలీలు నిర్వహించనుంది. ఎక్సైజ్ శాఖ కార్యాలయాల ఎదుట నిరసన కార్యక్రమాలు, ధర్నాల అనంతరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులకు వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ పత్రాలు సమర్పిస్తారు.నకిలీ మద్యం గుట్టు పూర్తిగా తేల్చేందుకు వెంటనే రాష్ట్రవ్యాప్తంగా వైన్‌షాప్‌లు, పర్మిట్‌రూమ్‌లు, బార్లు, బెల్టుషాపుల్లో ఎక్సైజ్ శాఖ విస్తృతంగా తనిఖీలు చేసి, దీని వెనక ఎంత పెద్దవారున్నా అరెస్టుచేయాలని.. నకిలీ మద్యంపై తక్షణమే సీబీఐ దర్యాప్తు జరిగేలా చూడాలని డిమాండ్ చేయనున్నారు. నకిలీ, కల్తీ మద్యంవల్ల చనిపోయిన వారిని గుర్తించి, వారి కుటుంబాలను ఆదుకునేలా కూడా చర్యలు చేపట్టాలని పార్టీ నేతలు కోరనున్నారు.ఇక వైన్‌షాప్‌ల కేటాయింపులో జరిగిన అక్రమాలు గుర్తించి, అనర్హులను తొలగించాలని.. మద్యం షాపులను మళ్లీ ప్రభుత్వమే నిర్వహించేలా చొరవ చూపాలని, మద్యం విక్రయ వేళలు కూడా తగ్గించాలని డిమాండ్ చేయనున్నారు. బడులు, గుడులు, బహిరంగ ప్రదేశాల్లో ఏర్పాటుచేసిన వైన్‌షాప్‌లు, బార్ల లైసెన్సులు రద్దుచేసేలా ప్రభుత్వానికి ఎక్సైజ్ శాఖ సిఫార్సు చేయాలని నాయకులు డిమాండ్ చేస్తారు. -
నకిలీ మద్యంపై సిట్ దర్యాప్తు హాస్యాస్పదం
సాక్షి, అమరావతి: నకిలీ మద్యం తయారు చేసి రాష్ట్రమంతటా యథేచ్ఛగా సరఫరా చేస్తున్న టీడీపీ నేతలు పూర్తి ఆధారాలతో పట్టుబడినా... ఇప్పటివరకు నోరు మెదపని సీఎం చంద్రబాబు హఠాత్తుగా ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్సీపీ నేతలు, మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి ఆక్షేపించారు.ఆదివారం మాజీ మంత్రులిద్దరూ సంయుక్త ప్రకటన చేస్తూ.. కేవలం నిజాలను సమాధి చేయడానికి, కేసును నీరుగార్చడం కోసమే సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారని వారు స్పష్టం చేశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి చంద్రబాబు వేసిన ‘సిట్’లన్నీ కేవలం కక్షసాధింపు కోసం లేదా వాస్తవాలు బయటకు రాకుండా చేయడం కోసమేనని వారు గుర్తు చేశారు. ఆ ప్రకటనలో నారాయణస్వామి, కాకాణి ఏమని పేర్కొన్నారంటే.. పరిశ్రమల మాదిరిగా.. ‘రాష్ట్రంలో ఇంత విచ్చలవిడిగా.. పరిశ్రమల్లా యంత్రాలు పెట్టి నకిలీ మద్యం తయారు చేస్తున్న టీడీపీ నేతలు దాన్ని రాష్ట్రమంతా సరఫరా చేస్తూ పక్కా ఆధారాలతో పట్టుబడ్డారు. నకిలీ మద్యానికి ఇప్పటికే పలువురు బలయ్యారు. అందుకే నకిలీ మద్యంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నాం. మరి దానికి సీఎం చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు? నిజానికి ‘సిట్’ అనేది చంద్రబాబు జేబులోని సంస్థ. మేం డిమాండ్ చేస్తున్నట్టుగా సీబీఐ దర్యాప్తు కోరకుండా, సిట్ ఏర్పాటు చేయడమంటే.. తాము తప్పు చేశామని చంద్రబాబు అంగీకరించినట్లే కదా?రాష్ట్రంలో ఇప్పుడు నకిలీ మద్యం అనేది ఏదో ఒకచోట మాత్రమే బయటపడటం లేదు.దాన్ని పక్కాగా వ్యవస్థీకృతంగా లిక్కర్ మాఫియా నడుపుతోంది. ఆ మాఫియాలో ఉన్న వారంతా టీడీపీ నాయకులే. నిజానికి పెదబాబు, చినబాబు కనుసన్నల్లోనే నకిలీ మద్యం దందా కొనసాగుతోంది. తన హయాంలో అంత యథేచ్ఛగా నడుస్తున్న ఆ రాకెట్‌పై తానే సిట్ వేయడం హాస్యాస్పదం. నిజానికి ములకలచెరువు ఘటన తర్వాత రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క వైన్‌షాపుపై కూడా ఎక్సైజ్ అధికారులు దాడి చేయలేదు. పరి్మట్ రూమ్‌లు, బెల్టు షాప్‌లను కనీసం తనిఖీ చేయలేదు. అంటే ఏ స్థాయిలో ఈ నకిలీ మద్యం మాఫియా నడుపుతున్నారో స్పష్టమైంది. ఇంత జరిగినా ఇప్పుడు కూడా గత మా ప్రభుత్వంపైనే చంద్రబాబు బురద చల్లుతున్నారు. చంద్రబాబు ఇప్పుడు చెబుతున్న క్యూఆర్ కోడ్, స్కానింగ్ వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు అమలు చేశారు. అప్పుడు ప్రభుత్వమే వైన్‌షాపులు నడపడం వల్ల ఎక్కడా అక్రమాలకు తావు లేకుండా పోయింది. కానీ, చంద్రబాబు సీఎం అయ్యాక గత ప్రభుత్వ మద్యం విధానాలన్నింటినీ రద్దు చేసి మద్యం షాపులన్నిటినీ ప్రైవేటుపరం చేశారు. వాటన్నింటినీ తన మాఫియా ముఠా చేతుల్లో పెట్టారు. తమ పార్టీ వారికే మద్యం షాపులు కట్టబెట్టి, వాటికి పర్మిట్ రూమ్‌ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. చివరకు బెల్టు షాపులను కూడా మద్యం మాఫియా చేతుల్లో పెట్టారు. అంటే నకిలీ మద్యం వాళ్లే తయారు చేస్తారు. వాళ్ల మద్యం షాపులు, బెల్టుషాపులకు తరలించి అమ్మేస్తారు. ఇదే స్పష్టంగా జరుగుతోంది. ఇప్పుడు ఈ నకిలీ మద్యం దందా ఆధారాలతో సహా బట్టబయలు కావడంతో ప్రజల ముందు దోషిగా నిలబడిన సీఎం చంద్రబాబు కేసు డైవర్షన్ కోసం ఈ సిట్ డ్రామాకు తెరలేపారు.ఈ దందాలో ఆయనకు ఏ మాత్రం ప్రమేయం లేకపోతే.. కేసుపై కొంతైనా చిత్తశుద్ధి ఉంటే మా పార్టీ డిమాండ్ చేస్తున్నట్టు నకిలీ మద్యంపై సిట్‌తో కాకుండా సీబీఐతో దర్యాప్తు చేయించాలి. అలా తన నిర్దోషిత్వాన్ని, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా అన్ని వైన్‌షాపుల్లో వెంటనే తనిఖీలు చేయాలి. ఏది అసలు మద్యమో.. ఏది నకిలీదో, కల్తీదో తేల్చాలి. ఈ వ్యవహారం వెనుక ఉన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయాలి. ఎక్సైజ్ శాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. జయచంద్రారెడ్డితో ఒప్పందం కుదుర్చుకుని నకిలీ మద్యం దందా నడిపించిన కిలారు రాజేష్ ద్వారా ముడుపులు అందుకున్న లోకేశ్‌పైనా సీబీఐ విచారణకు ఆదేశించాలి. అప్పుడే ప్రజలకు చంద్రబాబుపై నమ్మకం ఏర్పడుతుంది’ అని మాజీ మంత్రులు కె.నారాయణస్వామి, కాకాణి గోవర్థన్‌రెడ్డి తేల్చి చెప్పారు. -
నకిలీ మద్యం కుంభకోణం.. ఏపీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపు
తాడేపల్లి : నకిలీ మద్యం కుంభకోణంతో కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న క్రమంలో రేపు(సోమవారం, అక్టోబర్ 13వ తేదీ) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు వైఎస్సార్సీపీ పిలుపునిచ్చింది. నకిలీ మద్యం తయారీని చంద్రబాబు సర్కార్ కుటీర పరిశ్రమలా మార్చిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ నిరసనలకు పిలుపునిచ్చింది. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని ఎక్సైజ్ కార్యాలయాల ఎదుట నిరసనలు చేపట్టనుంది. నకిలీ మద్యం రాకెట్లో ఉన్న వారందర్నీ అరెస్ట్ చేయాలనే డిమాండ్‌తో ఆందోళనలకు పిలుపునిచ్చింది వైఎస్సార్సీపీ. నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలను బలపీఠంపై పెట్టడంపై నెట్టింట ఆగ్రహం వ్యక్తమవుతుంది. ఇదీ చదవండి: నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..? -
అయ్యా మోదీ.. చేతులెత్తి మొక్కుతున్న.. రోజా ఎమోషనల్
-
కల్తీ లిక్కర్ దొంగలు.. ఇదిగో సాక్ష్యం..
-
బాబు ఫేక్ లిక్కర్ 2.0.. ప్రజల కిడ్నీలతో నయా దందా
-
టీడీపీ నకిలీ మద్యంపై మందుబాబులకు రాచమల్లు సవాల్
-
ప్రజారోగ్యానికి పాడె.. విద్య వైద్యను కుళ్లబొడిచేలా
-
జగన్ వార్నింగ్.. బాబు నకిలీ లిక్కర్ 2.0.. ఆఫ్రికా టు ఆంధ్రా
-
పరేషాన్ లో బాబు.. బయటపడ్డ అసలు నకిలీ లిక్కర్ దొంగ
-
నకిలీ మద్యంలో ఈ ప్రశ్నలకు బదులేది..?
సాక్షి, అమరావతి: యావజ్జీవ ఖైదీకి క్షమాభిక్ష నుంచి... తంబళ్లపల్లె టీడీపీ టికెట్ జయచంద్రారెడ్డికి ఇవ్వడం వరకు... ఏ1 జనార్దనరావు అత్యంత ధీమాగా రాష్ట్రానికి తిరిగిరావడం దాక.. నకిలీ మద్యం కేసులో అనేక ప్రశ్నలు...! వీటికి సమాధానాలు వెదుక్కుంటూ పోతే... కీలక నిందితుడు, టీడీపీ నేత సురేంద్రనాయుడుకు ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలు బయటపడుతున్నాయి... జంట హత్యల కేసులో 2014 తర్వాత ఆయనకు జీవిత ఖైదు నుంచి క్షమాభిక్ష దక్కిన విషయం విస్తుగొలుపుతోంది... 2024 ఎన్నికల్లో సీనియర్లను కాదని మరీ తంబళ్లపల్లె టీడీపీ టికెట్‌ను జయచంద్రారెడ్డికి ఇప్పించింది కూడా సురేంద్రనాయుడే అనే స్పష్టం అవుతోంది. ఇంత లోతైన సంబంధాలు ఉన్నందునే... నకిలీ మద్యం వ్యవహారం కుదిపేస్తున్నా... జయచంద్రారెడ్డిపై టీడీపీ నుంచి తూతూమంత్రం సస్పెన్షన్ తప్ప ఇప్పటివరకు అరెస్టు చేయలేదని స్పష్టమవుతోంది. వెరసి ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ డొంక కదులుతోంది. ...రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న నకిలీ మద్యం మాఫియా దందాలో అన్ని వేళ్లూ ముఖ్యనేతవైపే చూపిస్తున్నాయి. భారీ దోపిడీకి తెగించిన ఈ ముఠాలో పాత్రధారులు జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడులు ముఖ్యనేతకు అత్యంత సన్నిహితులన్నది బహిరంగ రహస్యం. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం రాకెట్లో జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో ముఖ్యనేతకు ఉన్న ‘క్షమాభిక్ష’ బంధం వారి బాగోతం బయటపెడుతోంది. మొత్తం నకిలీ లిక్కర్ మాఫియాకే అది పునాదిగా నిలిచింది. ఐదేళ్లలో ఏకంగా రూ.45 వేల కోట్లు దోపిడీకి పక్కాగా పన్నిన పన్నాగం అమలులో శ్రీకాకుళం జిల్లా నుంచి అనంతపురం వరకు నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేసేంతగా ఎదిగింది. ఆఫ్రికాలో డిస్టిలరీల... అవే పునాదిగా తనకు ఆఫ్రికాలో డిస్టిలరీలు ఉన్నట్లు జయచంద్రారెడ్డి గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. దీన్నిబట్టి ఎన్నికల నాటికే నకిలీ మద్యం దందాకు బీజం పడినట్లు స్పష్టమవుతోంది. ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం దోపిడీ డీల్‌తోనే ముఖ్య నేత నుంచి సురేంద్రనాయుడి ద్వారా టీడీపీ టికెట్ పొందినట్లు అర్థమవుతోంది. ఇక వీరు కూటమి అధికారంలోకి రాగానే ముఖ్య నేత పూర్తి అండతో మాఫియాను వ్యవస్థీకృతం చేశారు. జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డి, సురేంద్రనాయుడు, అద్దేపల్లి జనార్దన్‌రావు తదితరులు ముఠా కట్టి తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువు నుంచి మొదలు రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం నెట్వర్క్ ఏర్పాటు చేశారు. అసలు మద్యం ఏదో నకిలీది ఏదో తెలియని స్థాయిలో నకిలీ మద్యం తయారు చేసి పేదలు, మధ్య తరగతి వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. 2024: ఆఫ్రికా నకిలీ మద్యం డీల్... జయచంద్రారెడ్డికి టీడీపీ టికెట్ ముఖ్య నేత ఇచ్చిన క్షమాభిక్షతో దర్జాగా బయటకు వచ్చిన సురేంద్రనాయుడు ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాల్లో టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. పారీ్టలో ఆయన చెప్పిందే చెల్లింది. ఈ ప్రభావం ఏస్థాయికి చేరిందంటే 2024 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, శంకర్‌యాదవ్‌ను పక్కనపెట్టి మరీ జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టీడీపీ టికెట్ ఇప్పించేవరకు వెళ్లింది. తర్వాత జయచంద్రారెడ్డి, గిరిధర్‌రెడ్డి, తమ అత్యంత సన్నిహితుడు అద్దేపల్లి జనార్దన్‌తో జట్టు కట్టి ముఖ్యనేతతో ఆఫ్రికా మోడల్నకిలీ మద్యం డీల్‌ను కుదిర్చారు. ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వం వస్తే రాష్ట్రవ్యాప్తంగా ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం మాఫియాను వ్యవస్థీకృతం చేయడం ఐదేళ్లపాటు భారీ దోపిడీకి తెగబడటం... ఇదీ డీల్. నాడు సిండికేట్ దోపిడీ.. నేడు నకిలీ దందా 2014–19లో టీడీపీ ప్రభుత్వం ఉండగా మద్యం సిండికేట్ ద్వారా యథేచ్ఛగా దోపిడీకి పాల్పడ్డారు. 2024–29లో ఏకంగా నకిలీ మద్యాన్ని అధికారికంగా విక్రయించి అంతకుమించి భారీ దోపిడీకి ముఖ్యనేతలు పన్నాగం పన్నారు. అందుకే సురేంద్రనాయుడు చెప్పినట్టు జయచంద్రారెడ్డికి తొలి జాబితాలోనే తంబళ్లపల్లె టికెట్ కేటాయించారు. గమనించాల్సిన విషయం ఏమంటే.. రాయలసీమలో సీనియర్ టీడీపీ నేతలకూ మొదటి జాబితాలో టికెట్ రాలేదు. జయచంద్రారెడ్డికి టికెట్ ఇవ్వొద్దని పలువురు నేతలు, కార్యకర్తలు ఉండవల్లిలో ధర్నాలు చేసినా పట్టించుకోలేదు. అదీ ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం డీల్ పవర్..!సురేంద్రనాయుడు ద్వారా కుదిరిన ఆఫ్రికా మోడల్ నకిలీ మాఫియా డీల్‌ను 2024 ఎన్నికలకు ముందే రుచి చూపించారు. అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రభుత్వపరం చేసింది. మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలపై నియంత్రణ విధించింది. దీంతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు, విచ్చలవిడిగా పంపిణీకి మద్యం అందుబాటులో లేదు. కానీ, టీడీపీ కూటమి మాత్రం తమ అభ్యర్థులకు భారీగా మద్యం సరఫరా చేయడం గమనార్హం. దీనివెనుక జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడుతో కూడిన తంబళ్లపల్లె టీడీపీ బ్యాచ్ ఉంది. వీరు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో మద్యం పంపిణీని పర్యవేక్షించారు. అప్పటికే సరిహద్దులకు అవతల కర్ణాటకలో గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం యూనిట్లు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి భారీగా నకిలీ మద్యాన్ని టీడీపీ అభ్యర్థులకు అందజేయగా వారు ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు పంపిణీ చేశారు. ఆఫ్రికాలో మద్యం వ్యాపారంలో పెట్టుబడులు ఉన్నాయని టీడీపీ తంబళ్లపల్లె అభ్యర్థి జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల అఫిడవిట్లో స్వయంగా పేర్కొన్న భాగం మనం నకిలీ మద్యం పంచామా? రాయలసీమ, ఉత్తరాంధ్ర టీడీపీ కూటమి ఎన్నికల బాధ్యతలు చూసిన పలువురు సీనియర్ నేతలు ప్రస్తుతం నకిలీ మద్యం బాగోతాన్ని గుర్తుచేసుకుంటున్నారు.జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు బ్యాచ్ మా ద్వారా పంపిణీ చేయించింది నకిలీ మద్యమా? అని అవాక్కవుతున్నారు. ‘‘తంబళ్లపల్లె నియోజకవర్గంలో రాజకీయంగా కనీసం పట్టు లేని జయచంద్రారెడ్డికి ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఎందుకిచ్చారో... సురేంద్రనాయుడు కింగ్ మేకర్‌గా చక్రంతిప్పడం వెనుక ఉన్నది నకిలీ మద్యం డీల్ అని మాకు ఇప్పుడు తెలుస్తోంది’’ అని పేర్కొంటున్నారు.2014: ముఖ్యనేత... సురేంద్రనాయుడు.. ఇది ‘క్షమాభిక్ష’ బంధంకట్టా సురేంద్రనాయుడు... ముఖ్య నేతతో లోతైన బంధం ఉన్న నాయకుడు. 2002 నాటి దారుణ జంట హత్యల కేసులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఈయనకు 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక క్షమాభిక్ష దక్కింది. జంట హత్యల కేసులో సురేంద్రనాయుడుకు జిల్లా న్యాయస్థానం 2006లో యావజ్జీవం విధించింది. ఈ తీర్పును సురేంద్ర హైకోర్టులో సవాల్ చేసినా, జిల్లా కోర్టు తీర్పునే సమరి్థంచింది. అయితే, ముఖ్య నేతకు అత్యంత సన్నిహితుడు కావడంతో టీడీపీ సర్కారు క్షమాభిక్ష ప్రసాదించింది. ప్రభుత్వ మద్యం దుకాణాలను ఎత్తేసి... టీడీపీ సిండికేట్‌కు మొత్తం కట్టబెట్టిన కూటమి2024లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక టీడీపీ సిండికేట్ ద్వారా సాగిస్తున్న మద్యం దోపిడీ బహిరంగ రహస్యమే. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ప్రభుత్వ మద్యం దుకాణాల విధానాన్ని తొలగించి మొత్తం 3,396 మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతులిచ్చింది. 75 వేల బెల్ట్ దుకాణాలు ఏర్పాటు చేసినా ఉదాసీనంగా ఉంటోంది. 540 బార్లను (త్వరలో మరో 300 బార్లు కూడా) టీడీపీ సిండికేట్‌కు కట్టబెట్టింది. ఇలా రాష్ట్రంలో మద్యం నెట్‌వర్క్‌ను టీడీపీ సిండికేట్ గుప్పిటపట్టింది. అనంతరం జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో ఆఫ్రికా మోడల్ నకిలీ మద్యం యూనిట్లను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసింది. టీడీపీ సీనియర్ నేతలకు ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు అప్పగించింది. నకిలీ మద్యాన్ని ప్రభుత్వ లైసెన్స్ పొందిన ప్రైవేటు మద్యం దుకాణాలు, పర్మిట్ రూమ్‌లు, బార్లు, బెల్ట్ షాపుల్లో దర్జాగా విక్రయిస్తూ భారీ దోపిడీకి తెగబడుతోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. తొలి ఏడాదిలోనే రూ.5,280కోట్లు కొల్లగొట్టిన ఈ మద్యం మాఫియా వచ్చే నాలుగేళ్లలో మరో రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు సిద్ధపడింది. అందులో 30 శాతం వాటా కరకట్ట బంగ్లాకే ముడుపులుగా చెల్లించాలన్నది డీల్. నకిలీ మద్యం కేసు నిందితుడు కట్టా సురేంద్రనాయుడు నేర చరిత్రకు సంబంధించిన పత్రాలు అంటే నకిలీ మద్యం మాఫియా ద్వారా సూత్రధారిగా ఉన్న ముఖ్య నేత కరకట్ట బంగ్లాకు దక్కేదే దాదాపు రూ.13,500 కోట్లు... ఇక ప్రాంతాలవారీగా పంపిణీ బాధ్యతలు చూస్తున్న టీడీపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మద్యం సిండికేట్‌కు 50 శాతం, నకిలీ మద్యం రాకెట్ పాత్రధారులుగా జయచంద్రారెడ్డి, సురేంద్రనాయుడు, జనార్దన్రావులకు 20 శాతం పంచుకోవాలన్నది డీల్. అందుకే ముఖ్యనేత అండతో రాష్ట్రంలో నకిలీ మద్యం మాఫియా బరితెగించి దోపిడీకి పాల్పడుతోందన్నది స్పష్టమవుతోంది.ఎల్లో మీడియాలో అడ్డగోలు రాతలు దందా బయటపడడంతో డైవర్షన్ ప్లాన్ అడ్డంగా దొరికినా ఎదురుదాడి జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చింది టీడీపీనే సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేత బండారం బయటపడడంతో ఉక్కిరిబిక్కిరి నకిలీ మద్యం వ్యవహారంలో ముఖ్య నేత, టీడీపీ నాయకుల ప్రమేయం స్పష్టంగా బయటపడడంతో ఎల్లో మీడియా అడ్డగోలు రాతలు రాస్తోంది. తిరుగులేని ఆధారాలతో అడ్డంగా పట్టుబడినా.. తూచ్ అదేమీ లేదంటూ ఎదురుదాడి చేస్తోంది. ఉక్కిరిబిక్కిరి అయి గుక్కతిప్పుకోలేక సంబంధంలేని విషయాలను తెరపైకి తెస్తోంది. తంబళ్లపల్లెలో టీడీపీ అభ్యరి్థగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. సురేంద్రనాయుడుకు క్షమాభిక్ష ఇచ్చింది ముఖ్యనేతనే అయినా... కొత్త కథలు అల్లుతోంది. అసలు విషయం తొక్కిపెట్టి బురదజల్లాలని చూస్తోంది. మొత్తం దందా బయటపడడంతో.. డైవర్షన్ ప్రణాళిక వేస్తోంది. -
అసలు మద్యంలో కలిసిపోయిన నకిలీ
ప్రొద్దుటూరు: ‘‘మూతలు, లేబుళ్లు ఒకే రకంగా ఉంటుండడంతో రాష్ట్రంలో అసలు మద్యం, నకిలీకి తేడా కనుక్కోలేని పరిస్థితి నెలకొంది. పేద, మధ్య తరగతి ప్రజలు తాగే క్వార్టర్ ధర రూ.99–రూ.130 మధ్య ఉన్న మద్యాన్ని నకిలీ చేస్తున్నారు. దీంతో వారి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్లే. పేదలను టార్గెట్‌గా చేసుకుని వంద శాతం స్పిరిట్ ఉండే ఎన్ బ్రాండ్ మద్యాన్ని అన్ని షాపుల్లో అమ్ముతున్నారు. మద్యం నకిలీదా? కాదా? అని నిర్ధారిస్తే రూ.10 లక్షలు బహుమతిస్తా’’ అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు.వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్వగృహంలో శనివారం ఆయన మాట్లాడారు. ‘‘రోజంతా కష్టం చేసేవారు సాయంత్రం బడలిక తీర్చుకునేందుకు తాగే మద్యం కూడా కూటమి నేతలు నకిలీది అమ్ముతున్నారు. ఇది విషంతో సమానం. ఏడాదిన్నరగా రోజూ పదుల సంఖ్యలో పేదలు చనిపోతున్నారు. ఇవేమీ ప్రభుత్వ రికార్డుల్లోకి చేరడం లేదు. కొందరి మానసిక పరిస్థితి దెబ్బతింటోంది. కిడ్నీ, లివర్ చెడిపోతున్నాయి.రాత్రి నకిలీ మద్యం తాగినవారు పొద్దున కూలీ పనులకు వెళ్లలేకపోతున్నారు’’ అని పేర్కొన్నారు. పూర్ టు రిచ్ అన్న చంద్రబాబు నినాదం పూర్ టు శ్మశానం అయిందా? అని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. పంటలకు యూరియా అధికంగా వాడితే క్యాన్సర్ వస్తుందని చంద్రబాబు చెబుతున్నారని ములకలచెరువు నకిలీ మద్యం తాగితే ఆరోగ్యం వస్తుందా? అని నిలదీశారు. గ్రామాల్లో లక్ష బెల్టు షాపులు టీడీపీ నాయకులు గ్రామాల్లో దాదాపు లక్ష బెల్టుషాపులు ఏర్పాటు చేశారని రాచమల్లు తెలిపారు. నకిలీ మద్యం కేసులో స్పిరిట్ సరఫరా చేసిన బెంగళూరుకు చెందిన బాలాజీని ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. జయచంద్రారెడ్డి వెనుక కరకట్ట పెద్దలున్నారని, నకిలీ మద్యాన్ని చెక్‌పోస్టుల్లో పట్టుకోకపోవడానికి ఇదే కారణమని, కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నకిలీ మద్యంపై రాష్ట్రవ్యాప్తంగా సోమవారం ర్యాలీలు నిర్వహించి ఎక్సైజ్ అధికారులకు వినతిపత్రాలు సమర్పించాలని పార్టీ ఆదేశించినట్లు రాచమల్లు తెలిపారు. మహిళలతో కలిసి సోమవారం నిరసన ర్యాలీ నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
నకిలీ మద్యం వ్యవహారంలో డైవర్షన్ పాలిటిక్స్
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నకిలీ మద్యం వ్యవహారంలో పీకల వరకు కూరుకుపోయిన టీడీపీ పెద్దలు దానినుంచి బయటపడేందుకు అరెస్టయిన వారు కోవర్ట్‌లు అంటూ డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. నకిలీ మద్యం కేసులో అరెస్టయిన టీడీపీ నేత జయచంద్రారెడ్డికి వైఎస్సార్సీపీతో లింకులున్నాయని, కోవర్ట్‌గా తమ పారీ్టలో చేరాడంటూ సీఎం చంద్రబాబు అనడం ఆయన దివాళాకోరు తనానికి నిదర్శనమన్నారు.దొరికిన దొంగలకు వైఎస్సార్సీపీ కోవర్ట్ అనే ముద్ర వేసి, తప్పించుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే నకిలీ మద్యంపై సీబీఐ విచారణ జరిపించాలని సవాల్ విసిరారు. నకిలీ మద్యం మరణాలపై వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న ‘సాక్షి’ యాజమాన్యం, విలేకరులపై కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులతో దాడి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజాలు ప్రజలకు తెలియకూడదని మీడియా గొంతు నొక్కేందుకు కూడా ఈ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. రాష్ట్రంలో ఎన్నడూలేని విధంగా నకిలీ మద్యం మాఫియా బయటపడిందని, ఇందులో టీడీపీ నాయకుల పాత్ర ఆధారాలతో సహా రుజువైందని చెప్పారు.సీఎం సొంత జిల్లా ములకలచెరువులోనే నకిలీ మద్యం తయారు చేసి అసలు మద్యం మాదిరిగా మార్కెట్లోకి తీసుకువచ్చారన్నారు. ఇంత పెద్ద వ్యవహారంలో ప్రభుత్వ పెద్దల పాత్ర చాలా స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో కీలకపాత్రధారి దాసరిపల్లె జయచంద్రారెడ్డి 2024 ఎన్నికల్లో టీడీపీ తరఫున చంద్రబాబు నుంచి బీఫాం తీసుకుని తంబళ్లపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేశారన్నారు. ఈ నిందితుల్లో జయచంద్రారెడ్డి బావమరిది గిరిధర్‌రెడ్డి, కట్టా సురేంద్రనాయుడు, జనార్దన్ తదితరులు చంద్రబాబు, లోకేశ్‌కు అత్యంత సన్నిహితులే అన్నారు.ఈనాడు రామోజీరావు కొడుకు కిరణ్, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈ నకిలీ మద్యం వ్యవహారం నుంచి టీడీపీని ఎలా కాపాడాలా అని మధనపడుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి నియోజకవర్గంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు ఏర్పాటయ్యాయన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి, నెల్లూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌లో ‘సాక్షి’ పత్రిక విలేకరులపై, యాజమాన్యంపై రెండు కేసులు పెట్టారన్నారు. ‘సాక్షి’ విలేకరి ఇంట్లోకి వెళ్లిన ఎక్సైజ్ పోలీసులు హంగామా సృష్టించారని, నకిలీ మద్యం తాగి చనిపోయారు అని వార్త రాసినందుకు విలేకరిపై జులుం ప్రదర్శించారని పేర్కొన్నారు. -
జనార్ధన్ ను 10 గంటలపాటు విచారించిన ఎక్సైజ్ అధికారులు
-
Rachamallu Siva: నకిలీ మద్యం తాగి ఎంతో మంది చనిపోతున్నారు
-
నకిలీ మద్యం పై నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు
-
Kalyani : మంత్రి కొల్లు రవీంద్రకు సవాల్ మీకు ధైర్యం ఉంటే
-
ఏపీలో ప్రజల ప్రాణాలు తీస్తున్న నకిలీ మద్యం
-
Fake Liquor: చంద్రబాబు తుక్కు రేగ్గొట్టిన మహిళలు..
-
నకిలీ మద్యం తయారీ, సరఫరా నిజమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకిలీ లిక్కర్ తయారీ, సరఫరా, అమ్మకాలు నిజమేనని ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్, పోలీస్ శాఖల ఉన్నతాధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదించారు. అన్నమయ్య జిల్లా ములకలచెరువు, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో భారీగా బయటపడ్డ నకిలీ రాకెట్ ఇందుకు నిదర్శనమని చెప్పారు. ఆయా ప్రాంతాల్లో తయారైన నకిలీ మద్యం పెద్ద సంఖ్యలో బెల్ట్ షాపులకు సరఫరా జరిగిందని వివరించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, మంత్రులతో బుధవారం సీఎం నిర్వహించిన సమావేశంలో నకిలీ మద్యంకు సంబంధించిన అంశాలను వారు ఆయన దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ వ్యవహారంలో తీసుకున్న చర్యలను, దర్యాప్తు వివరాలను ముఖ్యమంత్రికి వివరించారు. ములకలచెరువు ఘటనలో 21 మందిని నిందితులుగా గుర్తించామని, ఇందులో ఇప్పటివరకు 12 మందిని అరెస్టు చేశామని చెప్పారు. మిగతా నిందితులను త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఎ1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్‌రావు లావాదేవీలు, వ్యాపారాలపై విచారణ జరపుతున్నామని తెలిపారు. ములకలచెరువు కేసు ఆధారంగా ఎనీ్టఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో జనార్దన్‌రావుకు చెందిన బార్, వ్యాపారాలపై తనిఖీలు జరిపామని, కల్తీ మద్యం నిల్వలను గుర్తించామని చెప్పారు. ఆయన సోదరుడు జగన్మోహన్రావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి సరఫరా చేస్తున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించి 12 మందిని నిందితులుగా గుర్తించామని వివరించారు. ఫేక్ ప్రచారంపై చర్యలు తీసుకోండి అన్నమయ్య జిల్లాలో నకిలీ లిక్కర్ వ్యవహారంపై రాష్ట్రంలో రాజకీయ పక్షాలు తప్పుడు ప్రచారంతో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రం అంతటా కల్తీ లిక్కర్ అని తప్పుడు ప్రచారంతో ప్రజలను భయపెడుతున్నారని, ప్రతి నాలుగు బాటిల్స్‌లో ఒకటి నకిలీ ఉందని ఫేక్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. నకిలీ లిక్కర్‌తో ప్రాణాలు పోతున్నాయని ఫేక్ ప్రచారాలు మొదలు పెట్టిన విషయాన్ని మంత్రులు అర్థం చేసుకోవాలని.. వైఎస్సార్సీపీ నేతల రాజకీయ కుట్రలను ఎప్పటికప్పుడు భగ్నం చేయాలని సూచించారు. ఈ మరణాలపై విచారణ జరిపించాలని అధికారులను ఆదేశించారు. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా తప్పుడు ప్రచారం చేస్తే ఉపేక్షించవద్దని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి మంత్రులు కొల్లు రవీంద్ర, లోకేశ్ నేరుగా హాజరవ్వగా.. హోం మంత్రి సహా పలువురు మంత్రులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. -
నకిలీ మద్యం రాకెట్‌పై బాబు డైవర్షన్ గేమ్
సాక్షి, అమరావతి: కళ్లు చెదిరే రీతిలో టీడీపీ నేతల నేతృత్వంలో నకిలీ మద్యం రాకెట్ బట్టబయలవ్వడంతో దాన్ని తప్పుదోవ పట్టించేందుకు సీఎం చంద్రబాబు ఎప్పటి మాదిరిగానే డైవర్షన్ గేమ్ మొదలు పెట్టారు. ప్రస్తుతం మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా వర్థిల్లుతున్న నకిలీ మద్యం బాగోతంపై సోషల్ మీడియా ద్వారా తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు. టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నకిలీ మద్యం యూనిట్ నడుస్తున్నట్లు ఎక్సైజ్ అధికారులే బట్టబయలు చేసినా, దాంతో తమకు సంబంధం లేదని కొందరు టీడీపీ నేతలతో మాట్లాడిస్తుండటం నివ్వెరపోయేలా చేస్తోంది. అంతటితో ఆగకుండా జయచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ కోవర్ట్ అని, అందుకే టీడీపీలో చేరి నకిలీ మద్యం పరిశ్రమ నడిపి దాన్ని బయట పెట్టారనే అబద్ధపు వాదనను మొదలుపెట్టారు. రెండు రోజులుగా టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఎల్లో మీడియా ఇదే వాదనను జనంలోకి తీసుకెళ్లేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన టీడీపీ నేత కాదా? జయచంద్రారెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ తరఫున తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యరి్థగా పోటీ చేశారు. ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. తంబళ్లపల్లెలో అధికార పార్టీ వ్యవహారాలన్నీ ఆయనే నడిపిస్తున్నారు. బదిలీలు, కాంట్రాక్టులు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. లోకేశ్‌కు జయచంద్రారెడ్డి అత్యంత సన్నిహితుడు కావడంతో ఆయన హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో శంకర్ యాదవ్ వంటి సీనియర్‌ను పక్కనపెట్టి మరీ ఆయనకు టికెట్ ఇవ్వడానికి లోకేశ్‌తో ఉన్న వ్యాపార ఒప్పందాలు, సాన్నిహిత్యమే కారణం. ఆ సంబంధాల నేపథ్యంలోనే ములకలచెరువు సమీపంలో భారీగా నకిలీ మద్యం తయారు చేసి.. వైన్ షాపులు, బెల్టు షాపులకు సరఫరా చేసే పరిశ్రమను ప్రారంభించినట్లు టీడీపీ నేతలే చెబుతున్నారు. కట్టా సురేంద్రనాయుడు, ఆద్దేపల్లి జనార్దనరావు వంటి వారి ద్వారా నకిలీ మద్యం తయారీ, సరఫరా వ్యవహారాలను నడిపిస్తున్న విషయం బయటపడింది. అన్ని ప్రాంతాల్లోనూ ఈ తరహా నకిలీ మద్యం తయారీ పరిశ్రమలను ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నట్లు ఆయా ప్రాంతాల్లో దొరుకుతున్న నకిలీ మద్యం డంపులే నిదర్శనం. టీడీపీ పెద్దల ప్రమేయం లేకుండా ఇంత వ్యవస్థీకృత దందా నిర్వహించడం అసాధ్యమని ఎన్నో ఏళ్లుగా లిక్కర్ వ్యాపారం చేస్తున్న వారు చెబుతున్నారు. వారి అండదండలు ఉండబట్టే ఏకంగా నకిలీ మద్యం కోసం పరిశ్రమను స్థాపించి, నకిలీ సరుకును అన్ని ప్రాంతాలకు.. కోరిన బ్రాండ్ల పేరుతో సరఫరా చేస్తున్నారు. బాబు మార్కు డైవర్షన్ ఇదంతా టీడీపీయే చేస్తుందనే విషయం బయట పడడంతో చంద్రబాబు తన మార్కు యాక్షన్ ప్రారంభించారు. నకిలీ మద్యంపై తాను సీరియస్‌గా ఉన్నట్లు, ఎంతటి వారిపై అయినా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు మీడియాకు లీకులిస్తున్నారు. అయినా నకిలీ మద్యం వ్యవహారం రాష్ట్రాన్ని షేక్ చేస్తుండడంతో తంబళ్లపల్లె పార్టీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, స్థానిక నేత సురేంద్ర నాయుడిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు సోషల్ మీడియాలో జయచంద్రారెడ్డి వైఎస్సార్సీపీ కోవర్టు అనే ప్రచారాన్ని పెద్దఎత్తున చేయిస్తున్నారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు సతీష్ రెడ్డి.. చంద్రబాబు ప్రభుత్వంలో జరుగుతున్న నకిలీ మద్యం వ్యవహారంపై మాట్లాడుతూ ములకలచెరువు యూనిట్ ద్వారా ఐదేళ్లలో రూ.500 కోట్లను అక్రమంగా దండుకునేందుకు స్కెచ్ వేశారని చెబితే దాన్ని వక్రీకరించారు. ఈ దుష్ప్రచారాన్ని ఏకంగా టీడీప్టీ అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా చేయడాన్ని బట్టి వారు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు.గుట్టు రట్టవడంతో గప్‌చుప్ గల్లీ నుంచి ఢిల్లీ వరకు, ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా రెప్పపాటు వ్యవధిలో స్పందించే చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేశ్.. నకిలీ మద్యం వ్యవహారంపై మాత్రం ఇంత వరకు నోరు విప్పక పోవడం గమనార్హం. ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర మాత్రం నకిలీ మద్యంతో తమకు సంబంధం లేదని ప్రకటించారు. అలాంటప్పుడు తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసినట్లు? పట్టుబడుతున్న నకిలీ మద్యం బాటిళ్లు అన్నింటిలోనూ టీడీపీ ఆనవాళ్లే కనిపిస్తున్నాయి. అనేక చోట్ల నకిలీ మద్యం బయట పడుతుండటంతో ఏం మాట్లాడాలో తెలియక టీడీపీ నేతలు మొత్తం సైలెంట్ అయిపోయారు. రెడ్‌హ్యాండెడ్‌గా టీడీపీయే ఈ దందా చేస్తున్నట్లు అందరికీ తెలిసి పోవడంతో దీనిపై మాట్లాడేందుకు ఆ పార్టీ నాయకులు ముందుకు రావడంలేదు. ఇప్పుడు అన్నిచోట్లా తాము తాగుతున్న మద్యం కూడా నకిలీయేనా అనే అనుమానం టీడీపీ నేతలు, కార్యకర్తలతోపాటు ప్రజల్లోనూ వ్యక్తమవుతోంది. -
అంతా వారే చేశారట!
నకిలీ మద్యం తయారీ రాకెట్ వ్యవహారాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం పక్కా పథకం రచించింది. వేల కోట్ల రూపాయల దందాకు తెరలేపడం వెనుక ప్రభుత్వ పెద్దల హస్తం ఏమాత్రం లేదనేలా వ్యవహారాన్ని రక్తి కట్టిస్తోంది. నకిలీ మద్యం తయారీ యంత్రాలు, స్పిరిట్, రసాయనాలు, వివిధ బ్రాండ్లను పోలిన లేబుల్స్, వేలాది లీటర్ల నకిలీ మద్యం.. వేల సంఖ్యలో సీసాలు, మూతలు పట్టుబడితే ఇదేదో చిన్న వ్యవహారం అనేలా చిన్న చిన్న వారిపై కేసులు పెట్టి చేతులు దులుపుకోజూస్తోంది. లేబుళ్లు సరఫరా చేశారని, సీసాల మూతలు సరఫరా చేశారని.. ఈ కేసులో ఇదే పెద్ద నేరం అన్నట్లు కలరింగ్ ఇస్తోంది. తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడం ద్వారా సూత్రధారులు, పాత్రధారులను తప్పించేలా పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తోంది. ప్రభుత్వం ఇలా చేస్తోందని చెప్పడానికి నిందితుల రిమాండ్ రిపోర్టే నిదర్శనం.సాక్షి ప్రతినిధి, విజయవాడ: నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల కేసులో కీలక సూత్రధారులు, పాత్రధారులను తప్పించి కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో నకిలీ మద్యం తయారీని మొదలుపెట్టిన టీడీపీ నేతలు భారీగా లాభాలు వస్తుండటంతో ప్రభుత్వ పెద్దల అండతో విజయవాడలోని ఇబ్రహీంపట్నాన్ని మరో అడ్డాగా మార్చారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల ద్వారా సులభంగా పెద్ద మొత్తంలో డబ్బు వస్తుండటంతో దానిపై కన్నేసిన కూటమి ప్రభుత్వంలోని కీలక వ్యక్తులు.. ప్రజల ప్రాణాలను ఫణంగా పెట్టి మరీ మద్యం దందా సాగించారు. ఈ దందా ద్వారా కమీషన్ల రూపంలో కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. ఇందులో అత్యధిక భాగం డబ్బు కరకట్ట బంగ్లాకే చేరిందన్నది బహిరంగ రహస్యం. ఇప్పుడు ఈ నకిలీ మద్యం వ్యవహారాన్ని తక్కువ చేసి చూపేందుకు ప్రభుత్వ పెద్దలు ఎక్సైజ్ అధికారులకు దశా, దిశా నిర్దేశం చేశారు. పెద్ద తలకాయల ప్రస్తావన ఏదీ లేకుండా ఈ మొత్తం వ్యవహారాన్ని కిందిస్థాయి నేతలపై నెట్టేసి చేతులు దులుపుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. తాజాగా విజయవాడ కోర్టులో దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నకిలీ మద్యం తయారీ వెనుక అధికార తెలుగుదేశం పార్టీ పెద్దలకు సన్నిహితులైన అద్దేపల్లి జనార్దనరావు, ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావులను ప్రధాన నిందితులుగా చేర్చిన ఎక్సైజ్ అధికారులు.. మొత్తం కథను వీరి చుట్టూనే తిప్పారు. ఇందులో ఎక్కడా ఈ మొత్తం నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్న సూత్రధారులు, ప్రధాన పాత్రధారుల గురించి కనీస స్థాయిలో కూడా ప్రస్తావించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఎక్సైజ్ అధికారులు తమ రిమాండ్ రిపోర్ట్‌లో మొత్తం 12 మందిని నిందితులుగా చేర్చారు. ఈ 12 మందిలో అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2), బాదల్ దాస్ (ఏ7) ప్రదీప్ దాస్ (ఏ8)లను మంగళవారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరు పరచగా రిమాండ్‌కు పంపారు. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో పలు విషయాలను పొందు పరిచారు. నకిలీ మద్యం తయారీ, సరఫరా, అమ్మకాల వ్యవహారంలో అద్దేపల్లి జనార్దనరావు (ఏ1), ఆయన సోదరుడు అద్దేపల్లి జగన్మోహనరావు (ఏ2)లు ప్రధాన పాత్ర పోషించినట్లు తెలిపారు. టీడీపీ పెద్దలకు సన్నిహితుడైన తన సోదరుడు జనార్దనరావుతో కలిసి నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నట్లు జగన్మోహనరావు అంగీకరించినట్లు పేర్కొన్నారు. నకిలీ మద్యం అమ్మకాల ద్వారా భారీగా లాభాలు వస్తుండటంతో ఆ దందాను విస్తరించినట్లు జగన్మోహనరావు చెప్పినట్లు రిపోర్ట్‌లో వివరించారు.అక్కడి నుంచి ఇక్కడికి..తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజల ప్రాణాలను పట్టించుకోకుండా మద్యం విక్రయాలకు తెర లేపింది. దీన్నే అదునుగా భావించిన అద్దేపల్లి జనార్దనరావు, జగన్మోహనరావు ప్రభుత్వ పెద్దల అండ, సలహాలు, సూచనలతో నకిలీ మద్యం తయారీని మొదలు పెట్టారు. మొదట మొలకలచెరువు ప్రాంతంలో నకిలీ మద్యం తయారీ మొదలు పెట్టి అమ్ముతూ వచ్చారు. దీని ద్వారా వారు భారీగా డబ్బు ఆర్జించారు. ఇందులో పెద్ద మొత్తాన్ని ప్రభుత్వ పెద్దలకు కమీషన్ల రూపంలో ఇచ్చారు. వారి ప్రోత్సాహంతో ఈ నకిలీ మద్యం తయారీని భారీగా విస్తరించారు. మొలకలచెరువు తరహాలో ఇబ్రహీంపట్నంలో డెన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే విజయవాడతో పాటు వివిధ వైన్ షాపులు, బార్లు, బెల్ట్‌షాపులకు సరఫరా చేసి, అమ్మకాలు జరిపారు. బెంగళూరుకు చెందిన బాలాజీ (ఏ3) ఫేక్ సీల్లు, స్పిరిట్, కారమిల్, ఇతర పదార్థాలు కలిపి మద్యం తయారీ చేయడంలో ప్రధాన భూమిక పోషించారు. హైదరాబాద్‌కు చెందిన రవి (ఏ4) ఫేక్ లేబుల్స్ సరఫరా చేశారు. ఆరుగురు కూలీలు సయ్యద్ మాజి, కట్టారాజు, బాదల్ దాస్, ప్రదీప్ దాస్‌లు, మిధిన్ దాస్, అనంత దాస్ ఈ నకిలీ మద్యం తయారీలో ఉన్నారు. వీరికి అధిక జీతాలు ఇస్తామని ఆశ చూపి, నకిలీ మద్యం తయారీలో వారిని వాడుకున్నారు. ఖాళీ పెట్ బాటిల్స్‌ను గన్నవరం మండలం సూరంపల్లెలో తయారు చేయించారు. దాని యజమాని శ్రీనివాసులరెడ్డిని ఏ11 నిందితునిగా, విజయవాడలోని శ్రీనివాస వైన్స్‌లో పనిచేసే అంగలూరి కళ్యాణ్‌ను ఏ12 నిందితునిగా చేర్చారు. కళ్యాణ్ ద్వారా నకిలీ మద్యాన్ని పెద్ద మొత్తంలో అమ్మినట్లు అధికారులు గుర్తించారు. అచ్చం ఒరిజనల్ బాటిల్స్ మాదిరి తయారు చేసి, అలాగే స్టిక్కర్లు అతికించి ఎలాంటి అనుమానం రాకుండా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారు. ప్రధానంగా ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ, క్లాసిక్ బ్లూ విస్కీ, కేరళ మాల్ట్ విస్కీ, మంజీరా విస్కీ.. బ్రాండ్లకు నకిలీ తయారు చేశారు. ఏకంగా విజయవాడలోనే పెద్ద డెన్‌ను ఏర్పాటు చేసి ధైర్యంగా నకిలీ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మారంటే ఇందుకు ప్రభుత్వ పెద్దల అండదండలు ఉన్నాయన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది.ఎన్నికల తర్వాత నుంచి నకిలీ మద్యం జోరు2024 సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత గోవా మద్యం పేరుతో పలువురు అధికార పార్టీ నేతలు ఈ నకిలీ మద్యం దందాకు తెర లేపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే అద్దేపల్లి జనార్దనరావు పలు చోట్ల మద్యం సిండికేట్‌లో భాగస్వామిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లోని బ్రాందీ షాపులు, బార్లు, బెల్ట్ షాపులకు నకిలీ మద్యం సరఫరా జరిగినట్లు తేలడంతో మద్యం ప్రియుల్లో ఆందోళన మొదలైంది. అయితే నకిలీ మద్యం తయారీ విషయం ప్రజల్లోకి వెళ్లటంతో, ప్రభుత్వం దాని తీవ్రతను తక్కువ చేసి చూపించేందుకు నానా తంటాలు పడుతోంది. నామ మాత్రపు కేసులు పెట్టి ఈ నకిలీ మద్యం కేసు నుంచి టీడీపీ నాయకులను రక్షించేందుకు పడరాని పాట్లు పడుతోంది. ఇప్పటికే నకిలీ మద్యం తాగి పలుచోట్ల అనారోగ్యం పాలైన మందుబాబులు అందోళన చెందుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన మద్యం సరఫరా చేస్తామని ఊదరగొట్టి, నకిలీ మద్యంతో ఆరోగ్యాలతో చెలగాటం అడుకోవటం సరికాదని సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు: కాకాణి పూజిత
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం ముందు వైఎస్సార్సీపీ నిరసనకు దిగింది. మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత ఆధ్వర్వంలో నిరసన చేపట్టారు. రాష్ట్రంలో ఎన్ బ్రాండ్ నకిలీ మద్యం తయారీ, అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం సీసాలతో మహిళలు నిరసన తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని కాకాణి పూజిత దుయ్యబట్టారు. యూరియా కోసం క్యూలైన్లో నిల్చొవాలి.. కానీ మద్యం మాత్రం ఎక్కడైనా దొరుకుతుందంటూ మండిపడ్డారు.కర్నూలు: ఎక్సైజ్ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కల్తీ మద్యంతో ప్రాణాలు తీస్తున్న కూటమి ప్రభుత్వంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యాని విక్రయాలను నిరసిస్తూ మద్యం బాటిళ్లను ధ్వంసం చేసి వైఎస్సార్సీపీ మహిళా విభాగం నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే కల్తీ లిక్కర్‌ను అరికట్టాలని.. బెల్టు షాపులు తొలగించాలని మహిళలు డిమాండ్ చేశారు.అనంతపురం: కల్తీ మద్యంపై మహిళలు, యువకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం ఎక్సైజ్ డీసీ కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ మహిళా, యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్యం బాటిళ్లు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కల్తీ మద్యం తయారు చేసే టీడీపీ నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యం అరికట్టండి. పేదల ప్రాణాలు కాపాడాలంటూ నినాదాలు చేశారు. -
నకిలీ మద్యం తయారీలో బెంగళూరుకు చెందిన బాలాజీ అనే వ్యక్తి కీలక పాత్ర
-
Fake Liquor: సస్పెన్షన్ పై టీడీపీ జయచంద్రారెడ్డి రియాక్షన్
-
నకిలీ మద్యం కేసులో అరెస్టుల పర్వం
-
Big Question: మీ స్పిరిట్ తాగి.. ప్రజల పేగులు కాలిపోతున్నాయి! ఇవి కనపడవా పవన్ నీకు?
-
ఉసురు తీస్తున్న కూటమి నేతల నకిలీ మద్యం.. నలుగురు మృతి
-
ప్రాణాలు తీస్తున్న మందులోడు.. మాయలోడు..
-
నకిలీ మద్యానికి నలుగురు బలి
నరసరావుపేట టౌన్/తనకల్లు/సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కూటమి నేతల నకిలీ మద్యం జనం ఉసురు తీస్తోంది. పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఒకరు, శ్రీ సత్యసాయిజిల్లాలో మరొకరు, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇద్దరు... మొత్తంగా నలుగురు మృతి చెందారు. నరసరావుపేటలోని బరంపేట చాకిరాలమిట్ట ప్రాంతానికి చెందిన పాలెపు కోటేశ్వరరావు (50) లారీ క్లీనర్. ఇతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. సోమవారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లిన కోటేశ్వరరావు గుంటూరు రోడ్డులో ఓ దుకాణం ఎదుట అకస్మారక స్థితిలో మృతి చెందాడు. సమాచారం అందుకున్న టూటౌన్ ఎస్ఐ అశోక్ సిబ్బందితో ఘటనా స్థలానికి వెళ్లారు. మద్యానికి అలవాటు పడ్డ కోటేశ్వరరావు కొన్ని రోజులుగా ఇంటికి సరిగ్గా రావడం లేదని భార్య వివరించింది. అతిగా మద్యం సేవించడం వల్లే మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.ములకలచెరువులో వ్యక్తి మృతిశ్రీసత్యసాయి జిల్లాలో పూటుగా మద్యం తాగిన ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన శ్రీరాములు (58) బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రోజూ పని నుంచి ఇంటికి రాగానే అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు వెళ్లి మద్యం తాగేవాడు. అక్కడికే ఎందుకు వెళ్తున్నావని కుటుంబసభ్యులు ప్రశ్నిస్తే... అక్కడే మద్యం ‘ఫుల్ కిక్’ ఇస్తుందని చెప్పేవాడు. ఈక్రమంలోనే రెండు రోజుల క్రితం మొలకలచెరువుకు వెళ్లిన శ్రీరాములు రాత్రి ఇంటికి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మొలకలచెరువులోని ప్రభుత్వాస్పత్రి పక్కన అనుమానాస్పద స్థితిలో శ్రీరాములు మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. వారు శ్రీరాములు మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చారు. తన కుమారుడు నకిలీ మద్యం తాగడం వల్లే ప్రాణాలు కోల్పోయాడని తల్లి గంగులమ్మ బోరు విలపించారు. మృతునికి భార్య శాంతమ్మ, కుమార్తె రేణుక ఉన్నారు.నెల్లూరు జిల్లాలో ఇద్దరు శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలిగిరి మండలం వెలగపాడు గ్రామ సచివాలయం సమీపంలో బెల్టు షాపు ఉంది. 45 ఏళ్ల వ్యక్తి నాలుగు రోజులుగా అక్కడే తిరుగుతూ డబ్బులు అడుక్కుని బెల్టుషాపులోనే నకిలీ మద్యం తాగేవాడు. పక్కనే ఉన్న బస్‌షెల్టర్ పడుకునేవాడు. అయితే సోమవారం ఉదయం అతను అపస్మారక స్థితిలో ఉండగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతుడి చొక్కా కాలర్‌పై పామూరుకు చెందిన పవన్ మెన్స్‌వేర్ లేబుల్‌ను గుర్తించారు. శరీరంపై గాయాల్లేవు. దీంతో నకిలీ మద్యం తాగడం వల్లే తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని ఓ మద్యం దుకాణం సమీపంలో గుర్తుతెలియని 45 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. తరచూ అక్కడే మద్యం తాగేవాడు. అతడి మృతదేహాన్ని మద్యం షాపునకు సమీపంలోని చెట్ల మధ్య స్థానికులు గుర్తించారు. నకిలీ మద్యం అతిగా తాగడం వల్లే అపస్మారక స్థితిలో మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
Perni Nani: ఏమయ్యా ఎక్సైజ్ మినిస్టర్ బతికే ఉన్నావా? డబ్బు కోసం ఏ గడ్డేనా..!!
-
ఏపీలో నకిలీ మద్యం రింగ్ లీడర్లను బుజ్జగిస్తున్న కూటమి ప్రభుత్వ పెద్దలు
-
ష్.. గుట్టు విప్పొద్దు!
సాక్షి, అమరావతి: బహుళ జాతి కూల్ డ్రింక్ కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల కోసం ప్రాంచైజీలు ఇస్తాయి! ఆ కంపెనీలు కూల్ డ్రింక్ తయారీకి అవసరమైన మిశ్రమాన్ని సరఫరా చేస్తే... ఫ్రాంచైజీలు ఆ మిశ్రమంతో కూల్డ్రింకులు తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తాయి. ఇలా తయారయ్యే ప్రతి బాటిల్‌పై ఫ్రాంచైజీలు కూల్ డ్రింక్ కంపెనీకి కమీషన్ చెల్లించాలి. ఇదీ వ్యాపారం..!సరిగ్గా అదే వ్యాపార సూత్రంతో ప్రభుత్వ పెద్దలు రాష్ట్రంలో నకిలీ మద్యం దందా సాగిస్తుండటం విభ్రాంతి కలిగిస్తోంది. కరకట్ట బంగ్లాకు 30 శాతం కమీషన్.. అంటే ఏడాదికి రూ.3వేల కోట్లు చెల్లించాలనే ఒప్పందం కుదరడంతో నకిలీ మద్యం ఫ్రాంచైజీ రాకెట్ రాష్ట్రవ్యాప్తంగా వేళ్లూనుకుంది. చినబాబు అండదండలతో అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన ప్రధాన అనుచరుడు అద్దేపల్లె జనార్ధన్‌రావు నకిలీ మద్యం తయారీ ఫార్ములాను ఆఫ్రికా దేశాల నుంచి దిగుమతి చేయగా... టీడీపీ నేతల కుటుంబాలు ప్రాంతాలవారీగా ఆ ఫ్రాంచైజీలు తీసుకున్నాయి. ఏడాదిగా సాగుతున్న ఈ దందా ములకలచెరువులో వెలుగు చూసిన రాకెట్‌తో అనూహ్యంగా బయటపడింది. తమను ఈ కేసు నుంచి తప్పించకుంటే మొత్తం బండారం బయటపెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు బెదిరిస్తుండటంతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఆ కేసు తప్పిస్తాం..! కంగారు పడొద్దు...! తమ గుట్టు విప్పొద్దని రాయబేరాలు సాగిస్తున్నారు. మమ్మల్ని కెలికితే... బండారం బయటపెడతాఅన్నమయ్య జిల్లా ములకలచెరువులో బయటపడిన నకిలీ మద్యం రాకెట్ టీడీపీ కూటమి సర్కారు పెద్దలకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ నకిలీ మద్యం రాకెట్లో అడ్డంగా దొరికిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి, ఆయన వ్యాపార భాగస్వామి అద్దేపల్లి జనార్ధన్‌రావు ఎదురు తిరగడంతో ప్రభుత్వ పెద్దలు హడలిపోతున్నారు. ఈ కేసును కప్పిపుచ్చేందుకు అమరావతి నుంచి ప్రభుత్వ ముఖ్యనేత వేసిన ఎత్తుగడ బెడిసికొట్టింది. టీడీపీ నేతలే నకిలీ మద్యం దందా సూత్రధారులని ఆధారాలతో బట్టబయలు కావడంతో విధిలేని పరిస్థితుల్లో జయచంద్రారెడ్డిని టీడీపీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు. జనార్ధన్రావుతోపాటు కొందరు టీడీపీ నేతలపై కేసు నమోదు చేశారు. దాంతో ఈ వ్యవహారం సద్దుమణుగుతుందని భావించారు. కానీ అనూహ్యంగా జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు ఎదురుతిరిగి ప్రభుత్వ ముఖ్యనేతకు షాక్ ఇచ్చారు. ఈ కేసు నుంచి తమను బయటపడేయాలని, లేకపోతే రాష్ట్ర స్థాయిలో సాగుతున్న నకిలీ మద్యం దందా గుట్టును బహిర్గతం చేస్తామని వారు తేల్చి చెప్పినట్లు సమాచారం. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో టీడీపీ నేత పెట్టిన నకిలీ మద్యం ప్లాంటులోని యంత్రాలు, క్యాన్లు, (ఇన్సెట్లో) నకిలీ మద్యం బాటిళ్లు తామేమీ ప్రభుత్వ పెద్దలకు తెలియకుండా నకిలీ మద్యం తయారు చేయడం లేదు కదా? అని వారిద్దరూ నిలదీయడంతో పెదబాబు, చినబాబులకు నోట మాట రాలేదు! ‘ ఎన్నికల ముందు కుదిరిన ఒప్పందం ప్రకారం టీడీపీ అధికారంలోకి రాగానే రాష్ట్రస్థాయిలో నకిలీ మద్యం దందాను వ్యవస్థీకృతం చేశాం. అందుకు ఎంతో ఖర్చు పెట్టాం. ఈ రాకెట్‌ను మేం పర్యవేక్షిస్తున్నాం... కానీ అందులో చాలా మంది టీడీపీ పెద్దలు ఉన్నారు కదా..! అంతకంటే పెద్దలకు కమీషన్లు వెళ్తున్నాయి కదా..?’ అని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి ద్వారా కబురు పంపినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విషయాన్ని ఈ కేసును అమరావతి నుంచి పర్యవేక్షిస్తున్న ఐపీఎస్ అధికారికి కూడా చెప్పినట్లు తెలుస్తోంది. ఇలా ఓ టీడీపీ సీనియర్ ప్రజాప్రతినిధి, ఐపీఎస్ అధికారి ద్వారా తమ మనసులో మాటను ముఖ్యనేతకు తేల్చి చెప్పారు. అదే సమయంలో తమ డిమాండ్లను బలంగా వినిపించినట్లు తెలుస్తోంది. ఈ కేసు నుంచి తమను బయటపడేసే బాధ్యత ప్రభుత్వ పెద్దలదేనని... లేదంటే మొత్తం నకిలీ మద్యం గుట్టు విప్పుతామని తేల్చి చెప్పారు. మిమ్మల్ని మేం చూసుకుంటాం... నోరెత్తొద్దునకిలీ మద్యం దందా బండారం మొత్తం బయట పెడతామని జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు బెదిరించడంతో పెదబాబు, చినబాబు షాక్ తిన్నారు. దాంతో తమకు సమాచారం ఇచ్చిన మధ్యవర్తుల ద్వారానే జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావులతో రాయబేరాలు సాగించారు. తప్పనిసరి పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందని.. పార్టీ పరువు బజారున పడటంతో సస్పెండ్ చేయాల్సి వచ్చిందని వారిద్దరినీ బుజ్జగించేందుకు యత్నించారు. ‘మీరు ఇప్పుడు మొత్తం గుట్టు విప్పితే మీకూ నష్టం... మాకూ నష్టం... పార్టీకి పూర్తిగా నష్టం.. ఎవరికి ప్రయోజనం ఉండదు..’ అని సర్ది చెబుతున్నట్లు తెలుస్తోంది. ‘అయినా అధికారంలో ఉన్నది మన ప్రభుత్వమే. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకలచెరువులో పట్టుబడిన నకిలీ మద్యం బాటిళ్లు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తాం. మీవరకు రానివ్వకుండా పక్కదారి పట్టిస్తాం.. మీరేమీ ఆందోళన చెందవద్దు..’ అని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులు తెరవెనుక ఉండండి... తరువాత మళ్లీ పార్టీలో క్రియాశీలం కావచ్చని సూచించినట్లు సమాచారం. దాంతో జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు మెత్తబడినట్లు తెలుస్తోంది. అంతే కాదు.. ఈ నకిలీ మద్యం వ్యవహారంలో టీడీపీ నేతల ప్రమేయం లేదని వీడియో ద్వారా ప్రకటించాలని జనార్దన్‌రావును చినబాబు ఆదేశించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో కేసు నుంచి బయటపడేస్తామని ప్రభుత్వ పెద్దల నుంచి హామీ లభించడంతో జనార్ధన్‌రావు సోమవారం సాయంత్రం వీడియో విడుదల చేసినట్లు టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి.పెదబాబులో గుబులు.. చినబాబు బెంబేలు!టీడీపీ నేతలు జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు హెచ్చరికలతో పెదబాబు, చినబాబు బెంబేలెత్తుతున్నారు. ఏడాదిగా రాష్ట్రవ్యాప్తంగా తాము వ్యవస్థీకృతం చేసిన నకిలీ మద్యం రాకెట్ వెనుక గూడుపుఠాణి బట్టబయలవుతుందని ఆందోళన చెందుతున్నారు. అసలు ఈ మొత్తం దందా చినబాబు అండదండలతోనే సాగుతోంది. ఆయనకు సన్నిహితుడైన అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేత ఈ నకిలీ మద్యం రాకెట్‌కు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉమ్మడి చిత్తూరు, వైఎస్సార్ కడప జిల్లాల్లో సీనియర్ ప్రజాప్రతినిధులను కాదని మరీ ఆయనకు ప్రభుత్వంలో కీలక పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ కీలక నేతకు సన్నిహితులైన జయచంద్రారెడ్డి, జనార్ధన్‌రావు, కట్టా సురేంద్రబాబు ఆఫ్రికా దేశాల్లో అనుసరించే నకిలీ మద్యం తయారీ విధానాన్ని రాష్ట్రంలోకి తీసుకొచ్చారు. చినబాబు ఆదేశాలతో ఆయనకు సన్నిహితులైన టీడీపీ నేతలను వ్యాపార భాగస్వాములుగా చేసుకున్నారు. రాష్ట్రాన్ని ప్రాంతాలవారీగా పంచుకుని నకిలీ మద్యం దందా సాగిస్తున్నారు. జయచంద్రారెడ్డి, జనార్దన్‌రావు ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ యూనిట్లను నెలకొల్పారు. అన్నమయ్య జిల్లాకు చెందిన కీలక నేత రాయలసీమలో... నర్సీపట్నానికి చెందిన సీనియర్ నేత కుటుంబం ఉత్తరాంధ్రలో... రెవెన్యూ, పోలీసు అధికారులపై దాడులకు దిగిన చరిత్ర కలిగిన ఏలూరు జిల్లాకు చెందిన వివాదాస్పద ఎమ్మెల్యే ఉమ్మడి గోదావరి జిల్లాల్లో... బాపట్ల జిల్లా కీలక నేత ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలో.. జయచంద్రారెడ్డి స్వయంగా రాయలసీమలో నకిలీ మద్యం రాకెట్‌ను నిర్వహిస్తున్నారు. టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బెల్ట్ దుకాణాలు, బార్లలో యథేచ్ఛగా నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్నారు.కరకట్ట బంగ్లా వాటా 30 శాతం...ఏడాదిగా రాష్ట్రంలో జరుగుతున్న మద్యం విక్రయాల్లో మూడో వంతు నకిలీనేనని ఎక్సైజ్ శాఖ అనధికారికంగా వెల్లడిస్తుండటం గమనార్హం. ఆ విధంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి ఏడాదిలోనే రూ.5,280 కోట్ల మేర నకిలీ మద్యం అమ్మకాలు సాగాయి. మొత్తం అమ్మకాల్లో నకిలీ మద్యం వాటాను 50 శాతం దాటించాలన్నది ఈ సిండికేట్ లక్ష్యంగా పెట్టుకుంది. అంటే రానున్న నాలుగేళ్లలో ఏడాదికి రూ.10 వేల కోట్లు చొప్పున రూ.40 వేల కోట్లు కొల్లగొట్టేందుకు పన్నాగం వేసింది. అందులో 30 శాతం అంటే రూ.12 వేల కోట్లు కరకట్ట నివాసానికి కమీషన్‌గా చెల్లించాలన్నది ఒప్పందం. ప్రాంతాలవారీగా పర్యవేక్షిస్తున్న టీడీపీ సీనియర్ నేతలకు 50 శాతం, మద్యం దుకాణాలు, బార్లు నిర్వహిస్తున్న టీడీపీ సిండికేట్‌కు 20 శాతం వాటా దక్కనుంది. -
నకిలీ మద్యం భారీ డంప
సాక్షి ప్రతినిధి, విజయవాడ/సాక్షి నెట్వర్క్: రంగు, వాసన, ఏమాత్రం తేడా లేకుండా కార్మెల్, రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యం తయారీ... ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌కు నకిలీ సరుకు సిద్ధం... అక్కడ ఎటుచూసినా.. కార్టన్ బాక్స్‌ల్లో స్పిరిట్ నింపిన క్యాన్లు.. ప్రముఖ బ్రాండ్ల లేబుళ్లు అతికించిన నకిలీ మద్యం బాటిళ్లే.. ఎవరికీ అనుమానం రాకుండా బాక్సుల్లో అమర్చి పాల వ్యాన్లలో సరఫరా! ఏకంగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల నడుమ నకిలీ మద్యం తయారీ!విజయవాడకు కూతవేటు దూరంలోని ఇబ్రహీంపట్నం కేంద్రంగా పచ్చముఠాలు, కల్తీ కేటుగాళ్లు సాగించిన నకిలీ మద్యం దందా ఇదీ!! తాజాగా అక్కడ తనిఖీల్లో భారీగా బయటపడ్డ స్పిరిట్ ఖాళీ క్యాన్లు, ఖాళీ సీసాలు, గోడౌన్లో పట్టుబడిన ప్యాకింగ్ యంత్రాలను చూసి ఎక్సైజ్ అధికారులే విస్తుపోయారంటే ఏ స్థాయిలో దందా సాగిందో ఊహించవచ్చు. పాత ఏఎన్నార్ బార్ భవనంలో నకిలీ తయారీ..టీడీపీ పెద్దల నకిలీ మద్యం సిండికేట్ అమాయకుల ప్రాణాలను హరిస్తూ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తోంది. ప్రాంతాలవారీగా నకిలీ మద్యం ప్లాంట్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తోంది. బరి తెగించి అన్ని చోట్లా మద్యం, బెల్ట్ షాపులకు సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాన్ని గుల్ల చేసి రూ.కోట్లు పిండుకుంటున్నారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మండలంలో నకిలీ మద్యం తయారీ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించగా తాజాగా మరో కీలక మలుపు తిరిగింది. నకిలీ మద్యం తయారీలో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దనరావుకు చెందిన ఇబ్రహీంపట్నంలోని ఏఎన్ఆర్ బార్ సమీపంలోని గోడౌన్, హైవే పక్కన ఉన్న పాత ఏఎన్నార్ బార్ (ఖాళీ భవనం)లో సోమవారం ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నివ్వెరపరిచే అంశాలు వెలుగులోకి వచ్చాయి.గోడౌన్లో సుమారు 162 కేసుల మద్యం సీసాలు, 35 లీటర్ల సామర్థ్యం కలిగిన 95 క్యాన్లు, మద్యం తయారీకి వినియోగించే యంత్రాలు, బ్లెండ్ (క్యారామిల్, రెక్టిఫైడ్ స్పిరిట్ ద్రావణం), పెద్ద సంఖ్యలో ఖాళీ సీసాలు, పలు కంపెనీల లేబుల్స్, సీసాలకు బిగించే మూతలు, మిషన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పాత ఏఎన్నార్ బార్ భవనంలోనే నకిలీ మద్యం తయారు చేస్తున్నట్లు గుర్తించారు. స్పిరిట్, క్యారామిల్ ద్రావణం కలిపేందుకు వినియోగిస్తున్న పీవీసీ ట్యాంక్, వివిధ రంగులు మిక్స్ చేసే యంత్రాలు లభ్యమయ్యాయి.రెండు గదుల నిండా ఉన్న స్పిరిట్ ఖాళీ క్యాన్లు, రెండు పెద్ద స్టీల్ డ్రమ్ములు, మద్యం తయారీ సామగ్రిని భవానీపురం ఎక్సైజ్ స్టేషన్‌కు తరలించారు. ఏడాదిన్నరగా జనావాసాలు, షాపింగ్ కాంప్లెక్స్‌ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా నకిలీ మద్యం తయారీ రాకెట్ నిర్వహిస్తుండటం కలకలం రేపుతోంది. నకిలీ మద్యాన్ని ఏఎన్ఆర్ బార్‌తో పాటు జనార్దన్‌రావుకు వాటాలున్న కంచికచర్ల, భవానీపురంలోని శ్రీనివాస వైన్స్‌లో విక్రయాలు చేస్తుంటారు. వీటితో పాటు కొండపల్లి, ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, కోస్తా జిల్లాలోని పలు వైన్ షాపులు, బెల్ట్ షాపులకు ఇక్కడి నుంచే నకిలీ మద్యం సరఫరా అవుతున్నట్లు గుర్తించారు. సీజ్ చేసిన అట్టపెట్టెలపై చింతలపూడి మండలం, పేదవేగి మండలం అని రాసి ఉండటం గమనార్హం.టీడీపీ ప్రజాప్రతినిధి అండతో..జనార్దనరావుకు స్థానిక టీడీపీ కీలక నేతలతో పాటు నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆయన బావమరిదితో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. వారి అండదండలు లేకుండా జనావాసాల మధ్య పెద్ద ఎత్తున నకిలీ మద్యం తయారీ సాధ్యం కాదని స్పష్టం అవుతోంది. జనార్దనరావు సోదరుడు అద్దెపల్లి జగన్మోహనరావు, మరో నిందితుడు కట్టా రాజును రెండు రోజులుగా విచారించడంతో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు వెలుగులోకి వచ్చాయి. జనార్దనరావుకు చెందిన ఏఎన్నార్ బార్‌ను ఆదివారం రాత్రి ఎక్సైజ్ అధికారులు సీజ్ చేశారు.కూటమి అధికారంలోకి రావడంతో.. ఇబ్రహీంపట్నానికి చెందిన అద్దేపల్లి జనార్దనరావు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో తంబళ్లపాలెం టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డితో స్నేహం ఏర్పడింది. నిషేధించిన ప్రాంతంలో సుమారు పదేళ్ల క్రితం 65వ నంబర్ జాతీయ రహదారి పక్కన నకిలీ సర్టిఫికెట్తో ఏఎన్నార్ బార్ ఏర్పాటు చేశాడు. 2024 ఎన్నికల ముందు తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి భాగస్వామ్యంతో అక్రమ మద్యం వ్యాపారం సాగించారు. కూటమి అ«ధికారంలోకి రావడంతో అధికారమే అండగా రెచ్చిపోయారు. తంబళ్లపల్లె, ఇబ్రహీంపట్నం స్థావరాలుగా నకిలీ మద్యం తయారీ కేంద్రాలను ఏర్పాటు చేసుకుని పలు ప్రాంతాలకు తరలించారు. అమాయకులు బలి..రూ.99కే నాణ్యమైన మద్యం వైన్ షాపుల ద్వారా విక్రయిస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు నమ్మబలికారు. కూటమి అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా సాగుతున్న నకిలీ మద్యం తాగి పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఇబ్రహీంపట్నం మండలం చిలుకూరు సమీపంలోని ఓ వైన్స్‌లో ఇటీవల దాములూరుకు చెందిన వ్యక్తి మద్యం తాగిన కొద్దిసేపటికి అక్కడే మృతి చెందాడు. జూపూడి వైన్స్‌లో కిలేశపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తి మద్యం తాగి ఇంటికి వెళుతూ దారిలో మృత్యువాత పడ్డాడు. ఈ రెండు ఘటనల్లో అక్రమ మద్యం వ్యాపారులు మృతుల కుటుంబాలతో రాజీ కుదుర్చుకున్నారు. ఇక వెలుగు చూడని కల్తీ మద్యం చావులు మరెన్నో ఉన్నాయి.నకిలీ మద్యంతో అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నాయి. ఇంతకాలం తాము తీసుకున్నది నకిలీ మద్యం అని తెలియడంతో మద్యం ప్రియులకు నోట మాట రావడం లేదు. ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ రాకెట్ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు ఎఫ్ఐఆర్లో తెనాలి ఐతానగర్‌కు చెందిన కొడాలి శ్రీనివాసరావును ఏ–12గా చేర్చారు. నకిలీ మద్యం తయారు చేస్తున్న భవనం లీజు అగ్రిమెంటు శ్రీనివాసరావు పేరుతో ఉండడంతో ఆయన్ను నిందితుడిగా చేర్చినట్లు పేర్కొన్నారు.కాగా తెనాలిలోని శ్రీనివాసరావు ఇంట్లో ఎక్సైజ్ అధికారులు జరిపిన తనిఖీల్లో నకిలీ మద్యం తయారీకి సంబంధించి ఎలాంటి సామగ్రి లభ్యం కాలేదని తెలుస్తోంది. కాగా నకిలీ మద్యంతో తంబళ్లపల్లె టీడీపీ నాయకులకు సంబంధం లేదని ఈ కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లె జనార్దనరావు తాజాగా విడుదల చేసిన ఓ వీడియోలో పేర్కొన్నాడు. ఆరోగ్య సమస్యలతో విదేశాల్లో ఉన్నానని, విచారణకు సహకరిస్తానని తెలిపాడు.భారీగా నకిలీ మద్యం సీజ్.. ములకలచెరువు నుంచి అందిన సమాచారం మేరకు ఇబ్రహీంపట్నంలోని గోడౌన్‌పై దాడులు చేశాం. దాడుల్లో నకిలీ మద్యం బాటిళ్లు, లేబుల్స్, సిద్ధం చేసిన వివిధ బ్రాండ్ల నకిలీ మద్యం, మిషన్ , పెద్ద సంఖ్యలో ఖాళీ బాటిల్స్, ఎటువంటి లేబుల్స్ లేని బాటిల్స్, స్పిరిట్‌ను సీజ్ చేశాం. గోడౌన్లో నిల్వ ఉంచిన 95 క్యాన్లలో (ఒక్కో క్యాన్ 35 లీటర్లు) 3,325 లీటర్ల స్పిరిట్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ 720 బాటిళ్లు, క్లాసిక్ బ్లూ 144 బాటిళ్లు, కేరళ మాల్ట్ 384 బాటిళ్లు, మంజీర బ్లూ 24 బాటిళ్లు మొత్తం 1,272 బాటిల్స్ సీజ్ చేశాం.లేబుల్స్ లేని మద్యం 136 కేసులు, 6578 బాటిల్స్ , ఓఏబీ లేబుల్స్ 6500, ఖాళీ బాటిల్స్ 22,000, ఖాళీ క్యాన్లు 6, పైపులు 2, మిషన్–1 సీజ్ చేశాం. ఏ–1 ముద్దాయి అద్దెపల్లి జనార్దనరావు సోదరుడు జగన్మోహన్రావును అదుపులోకి తీసుకుని విచారించాం. జనార్దన్ సన్నిహితుడు కట్టా రాజును అదుపులోకి తీసుకుని విచారించిన అనంతరం గోడౌన్‌ను తనిఖీ చేశాం. జనార్దనరావు స్వదేశానికి రాగానే అదుపులోకి తీసుకుని పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడతాం. – టి.శ్రీనివాసరావు, ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్, విజయవాడ -
కల్తీ మద్యం రాకెట్‌తో ప్రభుత్వ పెద్దలకు లింకులు: జూపూడి
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో బయటపడ్డ కల్తీ మద్యం రాకెట్ లింకులు కూటమి ప్రభుత్వంలోని పెద్దల వరకు ఉన్నాయని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్ రావు ఆరోపించారు. తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందే రాష్ట్రంలో కల్తీ మద్యం దందాను సాగించేందుకు తెలుగుదేశం నేతలు ప్లాన్ చేసుకున్నారని, దానికి అనుగుణంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయగానే మద్యం పాలసీలో మార్పులు చేశారని అన్నారు.కల్తీ మద్యాన్ని కూటమి నేతల చేతుల్లో ఉండే ప్రైవేటు మద్యం దుకాణాలు, వాటికి అనుబంధంగా ఏర్పాటు చేసే బెల్ట్‌షాప్‌ల ద్వారా పెద్ద ఎత్తున చెలామణి చేయాలనే కుట్ర దీని వెనుక దాగి ఉందని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మద్యం విక్రయాల్లో ప్రతి మూడు బాటిళ్ళలో ఒకటి కల్తీ మద్యంగా తేలిందంటే, ప్రభుత్వ పెద్దల అండ లేకుండానే ఇంత పెద్ద ఎత్తున ఈ దందా జరుగుతోందా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే...రాష్ట్రంలో కల్తీ మద్యం తయారీ ఫ్యాక్టరీలనే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన అనుయాయులతో కల్తీ మద్యం తమారు చేయిస్తున్నారనే ఆరోపణలకు ఆయన ప్రజలకు వివరణ ఇవ్వాలి. అన్నమయ్య జిల్లా మొలకలచెరువు సమీపంలో ఏకంగా నకిలీ మద్యం తయారీ పరిశ్రమే వెలుగుచూసింది. ఈ నకిలీ మద్యం మాఫియాను నడిపించేది సాక్షాత్తు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులేనని బయటపడింది.ఆఫ్రికా నుంచి ఆంధ్రాకు మద్యం మాఫియావిదేశాల నుంచి సంస్థలను ఆహ్వానిస్తున్నాం, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తాం, ఉపాధి కల్పిస్తామని ప్రతిసారీ ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేష్‌లు చెబుతుంటారు. వాళ్ళను ఆదర్శంగా తీసుకున్న టీడీపీ నాయకులు ఎన్నికలకు ముందే ఏపీలో కల్తీ మద్యం రాకెట్‌ను ఆఫ్రికా నుంచి తీసుకురావాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఆఫ్రికాలో మద్యం తయారీ, చెలామణిలో సంపాధించిన అనుభవాన్ని ఏపీలో వినియోగించి, కోట్లు సంపాదించేందుకు వ్యూహం పన్నారు. టీడీపీ పెద్దల ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు జనార్ధన్ నాయుడు ఇందుకు అంతా రంగం సిద్ధం చేశాడు. ఈ దందాకు అనుగుణంగానే ఏపీలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యం పాలసీ నిబంధలను మార్పు చేసింది.గతంలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న మద్యం విక్రయాలను ప్రైవేటు వారికి ఇచ్చేందుకు నిర్ణయించారు. లిక్కర్ షాప్‌లు అన్నీ లాటరీ అంటూ హంగామా చేసి, మొత్తం దుకాణాలను అధికార తెలుగుదేశం వారి చేతుల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే మద్యం సిండికేట్లను ఏర్పాటు చేశారు. అనధికారికంగా పర్మిట్ రూంలను నిర్వహించారు. మద్యం దుకాణాలకు అనుబంధంగా ఊరూరా బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేశారు. ఆ తరువాత తమ కల్తీ లిక్కర్ దందాను ప్రారంభించారు. ఎక్కడికక్కడ కల్తీ మద్యం డెన్లను, జిల్లాల్లో మద్యం గోడౌన్లను ఏర్పాటు చేసుకుని నిత్యం వేల సంఖ్యలో కల్తీ లిక్కర్ బాటిళ్ళను చెలామణి చేయడం ప్రారంభించారు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారం ద్వారా దండుకుంటున్న సొమ్మును వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రజల ప్రాణాలతో చెలగాటంగత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి పెద్ద ఎత్తున మరణాలు జరిగాయంటూ కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు విష ప్రచారం చేశాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో, నేరుగా డిస్టిలరీల నుంచి వచ్చే మద్యాన్ని విక్రయిస్తూ, జవాబుదారీతనంతో విక్రయాలు చేసినా కూడా ఈ తప్పుడు ప్రచారం కొనసాగించారు. వారు చెప్పిన మరణాలు నిజమా అని చూస్తే, ఎక్కడా ఇది వాస్తవం అనేందుకు ఆధారాలు లేవు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికలకు ముందు తాను తక్కువ రేటుకే క్వాలిటీ మద్యం అందిస్తాను అంటూ హామీలు ఇచ్చారు. ఈ రోజు రాష్ట్రంలో ఏకంగా ఫ్యాక్టరీలను పెట్టి తయారు చేస్తున్న కల్తీ మద్యంపై ఆయన ఏం సమాధానం చెబుతారు?ఇతర రాష్ట్రాల నుంచి స్పిరిట్ తీసుకువచ్చి, రంగు కలిపి, నకిలీ మద్యం లేబుళ్ళతో ఏకంగా మద్యం దుకాణాలు, బార్లు, బెల్ట్‌షాప్‌లకు పంపిణీ చేస్తున్నారు. రకరకాల కల్తీ మద్యం బ్రాండ్లను తయారు చేసి, అందమైన పేర్లతో చెలామణి చేస్తున్నారు. చంద్రబాబు పాలనలో ఎక్కడ చూసినా ఈ కల్తీ మద్యం బ్రాండ్లే కనిపిస్తున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. 'సుమో, షాట్, బెంగుళూరు బ్రాందీ, ఛాంపియన్, కేరళా మాల్ట్...' ఇలా అనేక రకాల పేర్లతో మార్కెట్లో ఈ కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి.ఈ కల్తీ మద్యం రాకెట్ ఎంత వేగంగా విస్తరించిందీ అంటే అన్నమయ్య జిల్లాలో తయారవుతున్న ఈ మద్యంను కోస్తా ప్రాంతంలో కూడా అమ్మేందుకు ఏకంగా ఎన్టీఆర్ జిల్లాలోని ఇబ్రహీంపట్నం గోడవున్లో నిల్వ చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులే ఈ రాకెట్‌ను పట్టుకున్నారు. పట్టుబడని కల్తీ మద్యం గోడవున్లు ఇంకా ఎన్ని ఉన్నాయో అనే అనుమానం కలుగుతోంది. ప్రమాదకరమైన ఈ కల్తీ మద్యాన్ని తాగేవారు అతి త్వరగా అనారోగ్యంతో మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ప్రజలు ఏమైపోయినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేదు. కేవలం తన ధనదాహంకు ప్రజల ప్రాణాలనే పణంగా పెడుతున్నారు. -
Fake Liquor: టీడీపీ నేత సురేంద్ర నాయుడు అరెస్ట్
-
నకిలీ మద్యం ప్లాంట్ వెనుక.. టీడీపీ బడా నేత!!
-
అక్రమంగా మద్యం తయారీ.. దానికి మళ్ళీ ఆయుధ పూజ.. ఏం వాడకం అయ్యా బాబు
-
ఆంధ్రప్రదేశ్‌లో రాత్రికి రాత్రే కల్తీ మద్యం సూత్రధారులను మార్చేశారు... సీఎం చంద్రబాబుపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
నకిలీ మద్యంపై సీఎం సరికొత్త డ్రామా
సాక్షి, అమరావతి : అన్నమయ్య జిల్లాలో బయట పడిన నకిలీ మద్యం రాకెట్లో టీడీపీ కీలక నేతల ప్రమేయం బట్టబయలు కావడంతో సీఎం చంద్రబాబు సరికొత్త డ్రామాకు తెర లేపారు. ఈ వ్యవహారాన్ని తప్పుదోవ పట్టించి, పార్టీకి సంబంధం లేని వారిని బాధ్యులను చేయాలని చూసినా.. అది బెడిసి కొట్టింది. దీంతో టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి, టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. తద్వారా ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని, కింది స్థాయిలో ఏదో జరిగిందని ప్రజల దృష్టి మళ్లించేలా కొత్త కుతంత్రం రచించారు.‘కల్తీ మద్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో చంద్రబాబు ఆదేశాల మేరకు వారిద్దరిని సస్పెండ్ చేస్తున్నాం’ అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. భారీ యంత్రాలతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యాన్ని ఈ యూనిట్లో తయారు చేస్తూ ‘కీలక’ నేత అండతో వారు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం తదితర జిల్లాలకు గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నారు. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఈ రాకెట్ బయట పడటంతో అమరావతి పెద్దలు తమకేమీ సంబంధం లేనట్లు.. స్థానిక నాయకులే కారణమంటూ డ్రామాలకు పూనుకోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
నకిలీ మద్యం సూత్రధారులు ప్రభుత్వ పెద్దలే
సాక్షి, అమరావతి: అన్నమయ్య జిల్లా ములకలచెరువు వద్ద భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం తయారీ వెనుక ఉన్నది ముమ్మాటికీ ప్రభుత్వ పెద్దలేనని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ ప్రాయోజిత దందానేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టంచేశారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్థానిక టీడీపీ నేత సురేంద్రనాయుడు పాత్రధారి మాత్రమేనని, దీని వెనుక ఉన్న అసలు సూత్రధారులను బయటపెట్టాలని.. సీఎం చంద్రబాబు ఈ దందాకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!?..ప్రభుత్వ పెద్దల అండదండలు లేకుండా హైవే పక్కనే ఓ పరిశ్రమను తలపించేలా నకలి మద్యాన్ని ఎలా తయారు చేయగలరు? ఈ ప్రభుత్వ పెద్దలు గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలేంటి? అధికారంలోకి వచ్చాక చేస్తున్న దుర్మార్గాలేంటి? నాణ్యమైన మద్యం అంటే ఇదేనా!? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్‌తో రోజుకు 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారుచేసి, మద్యం షాపులకు, బెల్టు షాపులకు పంపించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.పైగా.. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహిస్తే.. పెద్దఎత్తున లిక్కర్ స్కాం జరుగుతోందని కూటమి పార్టీలు, ఎల్లో మీడియా సంస్థలు దుష్ప్రచారం చేశాయి. మరి ఇవాళ ములకలచెరువులో భారీగా బయటపడ్డ నకిలీ మద్యం గురించి టీడీపీ కూటమి ప్రభుత్వం, ఈ ఎల్లో మీడియా ఏం సమాధానం చెబుతాయి? అప్పుడు మద్యం తాగినవాళ్లందరికీ లివర్లు, కిడ్నీలు పాడైపోయాయని అన్నారుగా.. ఇప్పుడు పాడవవా? ఇక నిన్న అరెస్టైన సురేంద్రనాయుడు ఏ నాయకుడికి ముడుపులిస్తే ఈ దందా జరుగుతుందో సమాధానం చెప్పాలి.ములకలచెరువులోనే ఐదేళ్లలో రూ.500 కోట్ల దందా..ఇదిలా ఉంటే.. ఈ నకిలీ మద్యంతో కూడిన క్వార్టర్ బాటిల్ తయారీకి రూ.8 లేదా రూ.9 ఖర్చవుతుంది. అదే బాటిల్‌ను బెల్టుషాపుల వారికి రూ.110కి అమ్మితే వాళ్లు రూ.130కి అమ్ముతున్నారు. అంటే ఒక్కో బాటిల్ మీద రూ.100 ఆదాయం వస్తోంది. ఒక్క ములకలచెరువులో ఒక రోజులో 30 వేల బాటిళ్ల నకిలీ మద్యం తయారవుతుండగా రూ.30 లక్షల అక్రమార్జన జరుగుతోంది. ఇలా ఏడాదికి రూ.100 కోట్లు, ఐదేళ్లలో రూ.500 కోట్లు దండుకుంటున్నారు. ఇలా రాష్ట్రంలో ఇంకెన్ని చోట్ల నకిలీ మద్యం తయారుచేస్తున్నారో ప్రజలకు తెలియాలి. -
‘నకిలీ’ దందా డైరీలో నిక్షిప్తం
సాక్షి, రాయచోటి/ ములకలచెరువు/పెద్దతిప్పసముద్రం/ఇబ్రహీంపట్నం (మైలవరం): అన్నమయ్య జిల్లా ములకలచెరువులో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ ప్లాంట్ వ్యవహారంలో మరి కొన్ని కీలక వివరాలు లభ్యమయ్యాయి. అక్కడ దొరికిన డైరీ (చిన్న పుస్తకం)లో నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి వివిధ ప్రాంతాల్లోని బెల్ట్ షాపులకు సరఫరా అయిన వివరాలు రాసి ఉండటం చర్చనీయాంశమైంది. అయితే ఆయా బెల్ట్ షాపులపై సజ్ అధికారులు తొందరపాటుతో చర్యలకు ఉపక్రమించొద్దని పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినట్లు సమాచారం. దీంతో తూతూ మంత్రంగా ఒకటి రెండు షాపులపై దాడులు చేసి మమ అనిపించేలా ‘షో’ చేస్తున్నారు. కాగా, పాల వ్యాన్ తరహాలో ఉన్న ఆటోలో నకిలీ మద్యం సరఫరా అయ్యేది.ఈ విషయమై రెండు రోజులుగా ప్రజల్లో భారీగా చర్చ జరగడంతో రాజేష్‌కు చెందిన ఈ వ్యాన్‌ను ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో పెద్దతిప్పసముద్రం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు ఇంటిలో, ఆయన నిర్వహిస్తున్న ఆంధ్రా వైన్స్‌లో నకిలీ మద్యం గుర్తించగా ఆయన్ను ఇప్పటికే అరెస్ట్ చేయడం తెలిసిందే.టీడీపీ తంబళ్లపల్లె నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పరారీలో ఉన్నట్టు చెబుతూ ఆయన దుకాణం జోలికి వెళ్లక పోవడంపై ప్రజల్లో పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఆదివారం సాయంత్రం రాజేష్ నిర్వహిస్తున్న ‘రాక్ స్టార్’ మద్యం దుకాణాన్ని సీజ్ చేశారు. ఈ మేరకు ఎక్సైజ్ సూపరింటెండెంట్ మధుసూధనరావు మీడియాకు వెల్లడించారు. ఈ షాపులో ఎంత నకిలీ మద్యం నిల్వ ఉందనే వివరాలను మాత్రం వెల్లడించ లేదు. జనార్దనరావు, రాజు ఇళ్లల్లో తనిఖీలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన నకిలీ మద్యం తయారీ కేసులో ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఇద్దరు వ్యక్తుల ఇళ్లు, పచారీ దుకాణం, బార్లో శనివారం సోదాలు చేపట్టిన విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా పచారీ దుకాణం, బార్ నిర్వహిస్తున్న జనార్దనరావు, అతని పచారీ దుకాణంలో పనిచేసే కట్టా రాజు ఇళ్లను తనిఖీ చేశారు. వ్యాపార వేత్తగా ఉన్న జనార్దనరావు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండనప్పటికీ పలువురు టీడీపీ నేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. జనార్దనరావు ప్రస్తుతం విదేశాల్లో ఉండగా, కట్టా రాజు పరారీలో ఉన్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. కాగా, జనార్దనరావు బార్లో ఇన్నాళ్లూ మద్యం తాగిన వారంతా బెంబేలెత్తిపోతున్నారు.దానిమ్మ తోటలో నకిలీ లిక్కర్ బాక్సులు పెద్దతిప్పసముద్రం మండలం మల్లెల పంచాయతీ పరిధిలోని ఉప్పరవాండ్లపల్లిలో వెంకటరెడ్డి అనే రైతుకు చెందిన దానిమ్మ తోటలో మూడు బాక్సుల్లో బీర్లు, నకిలీ మద్యం పట్టుబడింది. ములకలచెరువు ఎక్సైజ్ సీఐ హిమబిందుకు వచ్చిన సమాచారం మేరకు ఆదివారం సిబ్బందితో కలసి ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. పట్టుబడిన బీరు బాటిళ్ల హోలోగ్రామ్ లేబుల్ స్కాన్ కాకపోవడంతో బీర్లు కూడా నకిలీవని తేలింది. ఈ మేరకు సీఐ అనుమానం వ్యక్తం చేస్తూ విషయాన్ని ఫోన్ ద్వారా ఉన్నతాధికారులకు వివరించినట్లు సమాచారం.పట్టుబడిన మద్యం బాక్సులను కట్టా సురేంద్ర నాయుడు ఇటీవల బాబు అనే వ్యక్తి ద్వారా ఇక్కడకు పంపినట్లు రైతు వెంకటరెడ్డి పోలీసులకు తెలిపాడు. బాబు అనే వ్యక్తి మండలంలోని టి.సదుం పంచాయతీ పరిధిలోని చెన్నరాయునిపల్లికి చెందినవాడు. కట్టా సురేంద్ర నాయుడుకు నమ్మిన బంటు. కల్తీ మద్యం బాక్స్‌లను బెల్ట్ షాపులకు తరలించేవాడని తెలుస్తోంది. దానిమ్మ తోటలో పట్టుబడిన నకిలీ మద్యం వ్యవహారంలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. -
చంద్రబాబు పాలనలో ఎప్పుడూ మద్యం స్కామ్‌లే: సాకే శైలజానాథ్
సాక్షి, అనంతపురం: సీఎం చంద్రబాబు మాట్లాడిన 'దుష్టుల పాలన'కు కూటమి సర్కార్ అద్దం పడుతోందని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ నాణ్యమైన మద్యాన్ని, సరసమైన ధరకే ఇస్తానంటూ బ్రాండ్ అంబాసిడర్‌గా మాట్లాడిన సీఎం చంద్రబాబు ఇప్పుడు తంబళ్ళపల్లిలో బయటపడ్డ కల్తీ మద్యం తయారీ డెన్‌పై ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.ఈ మద్యం తయారీదారులు తన సొంతపార్టీ వారే కావడంతో వారిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారని, సూత్రదారులను తప్పించేందుకు సిద్దమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ప్రాణాలతో చెలగాటం ఆడుతూ, కల్తీ మద్యంతో జేబులు నింపుకునే వారికి కూటమి ప్రభుత్వ అండదండలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బయపడని కల్తీ మద్యం డెన్లు మరిన్ని ఉన్నాయని, మద్యం ముసుగులో దండుకోవడం చంద్రబాబుకు అలవాటేనని ధ్వజమెత్తారు. ఇంకా ఆయనేమన్నారంటే..చంద్రబాబు ఆటోడ్రైవర్ల సేవ కార్యక్రమంలో మాట్లాడుతూ దుష్టుల పాలనను అంతమొందించాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వానికే దుష్టుల పాలన అనే పదం సరిగ్గా సరిపోతుంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఆనాడే చెప్పారు ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టగ్రహం ఎవరో? ఏడాదిన్నర కూటమి పాలనలో సీఎంగా చంద్రబాబు ఎన్ని అబద్దాలు ఆడారో లెక్కలేదు. చెప్పిన అబద్దాన్ని చెప్పకుండా రాజకీయం చేయడంలో చంద్రబాబు దిట్ట. సూపర్ సిక్స్ అనేదే పెద్ద అబద్దం. దాని గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక మందం అంటూ మాట్లాడతారు.గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగిందంటూ ఒక బేతాళకథను సృష్టించి, రోజుకో మలుపుతిప్పుతూ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. అసలు స్కాం అంటే ఏమిటీ అంటే ప్రభుత్వపరంగా నడుస్తున్న లిక్కర్ దుకాణాలను ప్రైవేటు వారికి అప్పగించి, వేలం పేరుతో తమకు కావాల్సిన వారికి ఆ మద్యం దుకాణాలను కట్టబెట్టి, వాటికి అనుబంధంగా ఊరూరా బెల్ట్‌షాప్‌లను ఏర్పాటు చేసుకుని, ఎమ్మార్పీ రేట్లకు మించి ఇష్టం వచ్చిన ధరకు మద్యం అమ్ముకోవడాన్ని లిక్కర్ స్కాం అంటారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్నది అక్షరాలా ఈ స్కామే.రాష్ట్రంలో తొంబై తొమ్మిది శాతం మద్యం దుకాణాలు కూటమి నేతల చేతుల్లోనే ఉన్నాయి. ఎవరికైనా వేలంలో వస్తే వారిని బెదరించి మరీ తమ పరం చేసుకున్నారు. దీనిపై విచారణకు సిద్దమా? అధిక ధరలకు, తమకు నచ్చిన బ్రాండ్లను మాత్రమే అమ్ముతూ దాని నుంచి వచ్చిన డబ్బును కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు వాటాలు వేసుకుని పంచుకుంటున్నారు.ప్రభుత్వానికి తెలియకుండానే కల్తీ మద్యం తయారు చేస్తున్నారా?తాజాగా తంబళ్లలపల్లిలో బయటపడ్డ నకిలీ మద్యం డెన్‌తో సీఎం చంద్రబాబు బండారం బయటపడింది. రోజుకు ఇరవై వేల బాటిళ్ళ నకిలీ మద్యాన్ని తయారు చేసి, పెద్ద ఎత్తున విక్రయిస్తున్నారంటే, ఇది ఈ ప్రభుత్వానికి తెలియకుండా జరుగుతోందా? స్పిరిట్‌తో ఒక పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యంను తయారు చేసి చెలామణి చేస్తున్నా ఈ ప్రభుత్వానికి ఎటువంటి సమాచారం లేదా?తెలుగుదేశం నాయకులే ఈ నకిలీ మద్యం డెన్‌ను ఏర్పాటు చేసి, పెద్ద ఎత్తున మందుబాటు ప్రాణాలతో చెలగాటం ఆడుతుంటే ఈ ప్రభుత్వం నిద్రపోతోందా? లేక తన పార్టీ వారి నుంచి ఈ అక్రమ దందాలో వాటాలు అందుకుంటోందా? చంద్రబాబే దీనికి సమాధానం చెప్పాలి. తంబళ్ళపల్లిలో బయటపడింది గోరంత మాత్రమే. ఇంకా రాష్ట్రంలో కొండత నకిలీ మద్యం డెన్లు ఉన్నాయి. ఈ రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాల్లో ఉన్న మద్యం నాణ్యతను పరీక్షించాలి.కల్తీ మద్యం మాఫియాకు అండదండలుఏడాదిన్నరగా ఈ రాష్ట్రంలో ఎన్ని చోట్ల నకిలీ మద్యం కర్మాగారాలను ఏర్పాటు చేసి, మార్కెట్లో విక్రయించారో నిజాలు వెల్లడించాలి. ఈ నకిలీ మద్యం డెన్లలో పనిచేసేవారు ఒడిస్సా, తమిళనాడు నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినట్లుగా బయటపడింది. ఈ నకిలీ మద్యం తయారీ మాఫియాలో ఎవరెవరు భాగస్వాములూ ఉన్నారో బయటపెట్టాలి. ఈ వ్యవహారంలో చంద్రబాబుకు సంబంధించిన వారే సూత్రదారులు, పాత్రదారులు. డెన్‌లో పనిచేసే కొందరు కూలీలను పట్టుకుని, వారినే బాధ్యులుగా చూపి, అసలు మాఫియా ముఠాదారులను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఈ నకిలీ మద్యం తయారీ కొనసాగుతోంది. ఎన్ని కోట్ల రూపాయలు ఈ దందాతో సంపాధించారో వెల్లడించాలి. ఇప్పుడు కూటమి పాలనలో జరుగుతున్న దానిని లిక్కర్ స్కాం అని కూడా అనలేం, దీనిని స్కాంలకే స్కాం అని పిలవాల్సి ఉంటుంది. నాణ్యమైన మద్యం ఇస్తామంటే దాని అర్థం తమ పార్టీ వారితో కుటీర పరిశ్రమ మాదిరిగా నకిలీ మద్యాన్ని తయారు చేయించి, చెలామణి చేయించడమేనా?. గత ప్రభుత్వంలో బార్లకు ప్రివిలేజ్ చార్జీలను పెంచాలని అధికారులు సిఫారస్ చేస్తే, దానిని హటాత్తుగా రద్దు చేయడం ద్వారా పెద్ద ఎత్తున ముడుగపులు అందుకుని, సీఐడీ విచారణలో ఆధారాలతో సహా దొరికిపోయిన చంద్రబాబు లిక్కర్ స్కాం గురించి మాట్లాడుతున్నాడురాష్ట్రంలో దుర్మార్గమైన పాలన సాగుతోందిఅనంతపురం శిశుసంక్షేమ సంరక్షణ గృహంలో నవజాత శిశువుకు కనీసం పాలు ఇచి, ఆకలి తీర్చే వారు లేక శిశువు చనిపోయిందంటే దానికి ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణం కాదా? ఏడుగుర్రాలపల్లిలో రెండేళ్ళపాటు ఇక దళిత బాలికపై పద్నాలుగు మంది టీడీపీ కార్యకర్తలు దాష్టీకం చేసినా, ఈ ప్రభుత్వం మిన్నకుండిపోయింది. నారా లోకేష్ యువగళంలో ఈ రాష్ట్రంలో పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లు ఉన్నారు, వారికి వైయస్ జగన్ ప్రభుత్వం అన్యాయం చేస్తోందంటూ మాట్లాడిన మాటలు మరిచిపోయారా?ఆటోడ్రైవర్ల సేవ పేరుతో కేవలం 2.90 లక్షల మందికి మాత్రమే సాయంను అందించారు. ఎన్నికల ముందు ఒకలా, అధికారంలోకి రాగానే మరొకలా మాట్లాడటమేనా మీ గొప్పతనం? నారా లోకేష్ చెప్పినట్లుగా పదమూడు లక్షల మంది ఆటోడ్రైవర్లకు రూ.15వేల చొప్పున ఇవ్వాలంటే దానికి రూ.2250 కోట్లు అవసరం. కానీ మీరు ఇచ్చింది ఎంత అంటే కేవలం రూ.436 కోట్లు మాత్రమే. ప్రతి పథకంలోనూ ప్రచారం తప్ప, నిజంగా ఆ వర్గాలకు సాయం చేయాలనే చిత్తశుద్ది లేదు. కూటమి ఎన్నికల మేనిఫేస్టోలో లారీ, టిప్పర్ డ్రైవర్లకు కూడా సాయాన్ని ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? ఒక్క పథకాన్ని అయినా ఇచ్చిన హామీ మేరకు అమలు చేయలేని అసమర్థ పాలన చూస్తున్నాం. -
కుప్పలు కుప్పలుగా మద్యం బాటిళ్లు.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్
-
టీడీపీ నేతల దందా.. వెలుగులోకి మరో కల్తీ మద్యం డంప్
సాక్షి, అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లాలో మరో కల్తీ మద్యం డంప్ వెలుగులోకి వచ్చింది. ఉప్పరవాండ్ల పల్లిలో భారీ నకిలీ మద్యం డంప్‌ను స్వాధీనం చేసుకున్న ఎక్సైజ్ అధికారులు.. ఇద్దరిని అరెస్ట్ చేశారు. రెండు రోజుల క్రితం ములకల చెరువులో కోటి 75 లక్షల విలువ చేసే కల్తీ మద్యం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకుని 10 మందిని అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం దందా అంతా టీడీపీ నేతల కనుసన్నలోనే జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో శుక్రవారం (అక్టోబర్ 3) నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేగిన సంగతి తెలిసిందే. ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది.ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు.పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. -
‘భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా?’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలు అక్రమార్జన కోసం చేసే ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని.. కల్తీ మద్యం పరిశ్రమే బయటపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారంలోకి రావడానికి కూటమి నేతలు చెప్పిందేమిటీ? చేస్తున్నదేమిటీ? అంటూ నిలదీశారు.అక్టోబర్ 3న ములకల చెరువులో భారీ కల్తీ మద్యం డంప్ స్వాధీనం చేసుకున్నారు. భారీ కల్తీ మద్యం డంప్ దొరికితే ఎల్లో మీడియాకు కనిపించడం లేదా.?. గత ప్రభుత్వ హయాంలో రూ.3,500 కోట్ల కుంభకోణం జరిగిదంటూ అనేక మందిని అరెస్ట్ చేశారు. మిథున్ రెడ్డికి బెయిల్ ఇచ్చే సమయంలో కోర్టు వ్యాఖ్యలు గుర్తు చేసుకోండి. అధికార దుర్వినియోగపరుస్తూ తప్పుడు కేసులు పెడుతున్నారు. కూటమి ఆరోపణల్లో నిజముంటే కోర్టులో ఆధారాలు ఎందుకు చూపించలేదు?. మూలకల చెరువులో కల్తీ మద్యం డంప్ దొరికితే కూటమి నేతలు ఎందుకు మాట్లాడటం లేదు?. రోజుకి 30 వేల క్వార్టర్ బాటిళ్లు తయారు చేసే డంప్ దొరికితే ఏం చేస్తున్నారు?’’ అంటూ సతీష్‌రెడ్డి మండిపడ్డారు. -
టీడీపీ కల్తీ మద్యం మాఫియాపై YS జగన్ ఆగ్రహం
-
Big Question: ఇది ఒరిజినల్ కాదు బాస్.. మీ మందు బాటిల్ పై ఒట్టు
-
రోజుకు 30 వేల బాటిళ్లు.. ములకలచెరువులో చీకటి వ్యాపారం.. పెద్ద తలకాయలు వీళ్లే!
-
Big Question: నారా నకిలీ సారా! నరకానికి ఎంట్రీ పాస్
-
టీడీపీ నేత మద్యం దుకాణం సీజ్
పెద్దతిప్పసముద్రం: ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ కేంద్రంపై శుక్రవారం పోలీసులు జరిపిన దాడుల్లో మండలానికి చెందిన టీడీపీ కీలక నేత కట్టా సురేంద్రనాయుడు సహా మరికొందరు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, సీఐ మల్లయ్య బృందం శనివారం అన్నమయ్య జిల్లా టి.సదుం పంచాయతీ చెన్నరాయునిపల్లి సమీపంలో కట్టా సురేంద్రనాయుడు ‘ఆంధ్రవైన్స్’ పేరుతో నిర్వహిస్తున్న మద్యం దుకాణంలో ఉన్న బాటిళ్లకు పంచనామా నిర్వహించి వైన్‌షాపు లైసెన్స్‌ను సీజ్ చేసి సీలు వేశారు.ఎక్సైజ్ పోలీసులు బృందంగా ఏర్పడి మఫ్టీలో కల్తీ మద్యం రవాణా, నిల్వలపై మండలంలో నిఘా వేసినట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు పుట్టగొడుగుల్లా వెలసిన బెల్ట్‌షాపుల్లో దర్జాగా మద్యం విక్రయాలు చేపట్టేవారు. కల్తీ మద్యం రాకెట్ గుట్టు రట్టు కావడంతో బెల్ట్‌షాపులు నిర్వహిస్తున్న గ్రామస్థాయి కూటమి కార్యకర్తల్లో ఆందోళన మొదలైంది. పోలీసులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించి కల్తీ మద్యంతో పట్టుబడితే ఎక్కడ కేసుల్లో ఇరుక్కుపోతామోనని భావించి బెల్ట్‌షాపులను మూసేసి పరిచయస్తులకు మాత్రమే చాటుగా మద్యం విక్రయిస్తున్నట్టు సమాచారం. -
‘పెద్దల’ దన్నుతోనే నకిలీ మద్యం రాకెట్
సాక్షి ప్రతినిధి, కడప: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం మండల కేంద్రం ములకలచెరువుకు సమీపంలో నకిలీ మద్యం తయారీ కేంద్రం బట్టబయలు కావడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కనీ వినీ ఎరుగని రీతిలో ఇంత భారీగా యంత్రాల సాయంతో వివిధ బ్రాండ్లను పోలిన నకిలీ మద్యం ములకలచెరువు వద్ద తయారవుతోందని తెలిసి ఉమ్మడి చిత్తూరు, అనంతపురం వాసులు విస్తుపోయారు. ఇన్నాళ్లూ తాము తాగిన మద్యం నకిలీదేనని తెలుసుకుని స్థానికంగా ఉన్న వారు బెంబేలెత్తుతున్నారు. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లోని మద్యం దుకాణాలకు, బెల్ట్ షాపులకు ప్రధానంగా ఇక్కడి నుంచి నకిలీ మద్యం సరఫరా అయ్యేదని శుక్రవారం నాటి ఎక్సైజ్ దాడుల్లో స్పష్టమైంది.ఇంత భారీ రీతిలో నకిలీ మద్యం దందా సాగించడానికి ప్రభుత్వంలోని టీడీపీ ముఖ్య నేతల అండ ఉందని తెలుస్తోంది. ప్రతి నెలా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగేవని తేలింది. ఇందులో కొంత సొమ్ము ముఖ్య నేతలకు ప్రతి నెలా చేరేదని సమాచారం. ఏడాదికి పైగా విచ్చలవిడిగా, నిర్భీతిగా యథేచ్ఛగా నకిలీ మద్యం తయారు చేసి.. జనంతో తాగించి వారి ప్రాణాలతో చలగాటం ఆడిన టీడీపీ నేతలు.. వారికి అన్ని విధాలా అండగా నిలిచిన ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు తేలు కుట్టిన దొంగల్లా నోరెత్తడం లేదు. పైగా అసలు సూత్రధారులను తప్పిస్తూ.. పాత్రధారుల్లో అనామకులైన కొంత మందిపై మాత్రమే కేసులు నమోదు చేయించి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.అన్నమయ్య జిల్లా స్థాయిలో ముఖ్యనేత, తంబళ్లపల్లి ఇన్చార్జ్ కనుసన్నల్లో ఈ నకిలీ మద్యం ప్లాంట్ కార్యకలాపాలు కొనసాగాయని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. ఇక్కడి కూలీలను పనిలో పెట్టుకుంటే బండారం బయట పడుతుందని భావించి, ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చారు. ఈ విషయమై స్థానికులకు ఇదివరకే అనుమానాలు వచ్చినా, టీడీపీ నేతలకు జడిసి నోరు విప్పలేదు. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాల నేపథ్యంలో అందరూ ఇదే విషయమై చర్చించుకుంటున్నారు. వారి పేర్లు ఎక్కడా రాకూడదునకిలీ మద్యం రాకెట్‌ను నడిపిస్తున్న టీడీపీ ముఖ్య నేతల పేర్లు ఎక్కడా రాకూడదని, కేసులో వారి పేర్లు ఉండకూడదని ఉన్నతాధికారులకు అమరావతి నుంచి ఆదేశాలు అందినట్లు తెలిసింది. శుక్రవారం నాటి నాటకీయ పరిణామాలు, శనివారం సాయంత్రం ములకలచెరువులో ఎక్సైజ్ అధికారులు నిర్వహించిన ప్రెస్మీట్లో వెల్లడించిన అంశాలు పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టం అవుతోంది. అసలు వాస్తవాల జోలికి వెళ్లకుండా, సూత్రధారులెవరో చెప్పకుండా, కేవలం పాత్రధారుల వివరాలను మాత్రమే వెల్లడించి చేతులు దులుపుకున్నారు. నకిలీ మద్యం కేసులో అనుమానాలను నివృత్తి చేయాల్సిన ఎక్సైజ్ అధికారుల తీరుపైనా అనుమానాలు వ్యక్తం ఆవుతున్నాయి. ముఖ్యులను తప్పించేసినట్టేములకలచెరువు నకిలీ మద్యం వెలుగులోకి రాగానే ప్రభుత్వ నిఘా, ఎక్సైజ్ వర్గాలు తమ నివేదికలను సీఎంఓకు నివేదించాయని సమాచారం. మొదట టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడును అదుపులోకి తీసుకున్నాక.. అక్కడి పరిస్థితి ఉన్నత స్థాయి వ్యక్తుల దృష్టికి వెళ్లింది. మొదట దీనిపై కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయంతో సురేంద్ర నాయుడును అరెస్ట్ చేసినట్టు ఎక్సైజ్ అధికారులు ప్రకటించారు. శనివారం అసలు సూత్రధారుల వివరాలను వెల్లడిస్తారని భావించగా, పైస్థాయిలో జరిగిన పరిణామాలతో తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యల పేర్లు బయటకు రాకుండా తొక్కిపెట్టినట్టు తెలిసింది.దీంతో ఇప్పటికే కేసులో నమోదు చేసిన నిందితుల పేర్లను మరోమారు వెల్లడించి సరిపెట్టుకున్నారు. నిజానికి తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పాత్ర ఉందని ఈ ప్రాంతంలో అందరికీ తెలిసినా, ఆయనను తప్పిస్తూ ఆయనæ పీఏ రాజేష్‌పై మాత్రమే తూతూ మంత్రంగా కేసు నమోదు చేశారు. అయితే ఇతని అరెస్ట్‌పై కూడా అధికారులు ఆసక్తి చూపేలా కనిపించడం లేదు. పైగా రాజేష్‌కు చెందిన మద్యం దుకాణం వైపు శనివారం ఎక్సైజ్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడలేదు. ఈ దుకాణాన్ని సీజ్ చేస్తామని, లైసెన్స్ కూడా రద్దు చేస్తామని శుక్రవారం చెప్పిన అధికారులు పై నుంచి ఒత్తిడి రావడంతో ఆ దిశగా చర్యలు తీసుకోలేదని స్పష్టంగా తెలుస్తోంది.ఈ కేసులో నిందితులుగా ఉన్న జనార్దనరావు, కట్టా రాజులు దొరికితే కానీ వాస్తవాలు తెలియవని ఎక్సైజ్ అధికారులు తప్పించుకునే ధోరణితో ముందుకెళ్తున్నారు. విజయవాడకు చెందిన జనార్దన్‌రావు ప్రస్తుతం ఆఫ్రికాలో ఉన్నట్టు సమాచారం. ఇదే నిజమైతే అయన్ను ఇక్కడికి ఎప్పుడు రప్పిస్తారు.. ఎప్పుడు అరెస్ట్ చేస్తారు.. నిజాలు ఎప్పుడు వెలికితీస్తారనే దానికి సంబంధించి అధికారుల నుంచి స్పందనే లేదు. ఈ నకిలీ మద్యం ఏడాది క్రితం నుంచి నడుస్తుండగా.. గత నెలలోనే పెట్టారంటూ అధికారులు తేల్చేయడం గమనార్హం.ఈ ప్రశ్నలకు బదులేదీ?⇒ ఈ కేంద్రానికి పెట్టుబడి పెట్టింది ఎవరు? ⇒ నగదు లావాదేవీల మాటేంటి? ఏయే అకౌంట్ల ద్వారా లావాదేవీలు నడిచాయి?⇒ ఒక్క రోజే రూ.1.75 కోట్ల విలువైన నకిలీ మద్యం దొరికిందంటే ఇన్నాళ్లూ సరఫరా చేసిన మద్యం విలువ ఎంత?⇒ ఏయే ఊళ్లలోని ఏయే దుకాణాలకు నకిలీ మద్యం సరఫరా చేశారు?⇒ ప్రముఖ బ్రాండ్లకు సంబంధించి నకిలీ మద్యం ఆర్డర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయి?⇒ నకిలీ మద్యం తయారీకి సంబంధించి ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చారు?⇒ లేబుళ్లు, సీసాలు, మూతలు, స్పిరిట్, ఫ్లేవర్లు, భారీ యంత్రాలతో కూడిన ప్లాంట్‌ను నడపడం కేసులో చూపుతున్న నిందితులకు సాధ్యమా?⇒ చిన్న చిన్న బడ్డీ కొట్లను సైతం వదలకుండా మామూళ్లు దండుకునే ప్రజా ప్రతినిధులకు ఇంత భారీ ప్లాంట్ గురించి తెలియదంటే ఎవరు నమ్ముతారు?⇒ ఈ కేంద్రాన్ని విజయవాడకు చెందిన జనార్దనరావు అనే వ్యక్తి చూస్తుంటాడని.. అంతా అతనిపైకి నెట్టేయడం ఎంత వరకు సమంజసం?⇒ అధికార పార్టీ నేతల అండ దండలు లేకుండా స్థానికేతరుడు ఇంత భారీ నకిలీ మద్యం ప్లాంట్‌ను నడపగలడా?⇒ రోజుకు 20వేలకు పైగా 180 ఎంఎల్ బాటిళ్ల మద్యం తయారు చేసే సామర్థ్యం ఉన్న ఈ ప్లాంట్ నుంచి ఇప్పటి వరకు ఎంత సరుకు విక్రయించారు?⇒ ఒడిశా, తమిళనాడు నుంచి వచ్చిన తొమ్మిది మంది కూలీలపై కేసులు పెట్టి చేతులు దులుపుకోవడం సబబా? ⇒ పెద్దలంతా తప్పించుకుని ఒక్క కట్టా సురేంద్ర నాయుడిని మాత్రమే బలి పశువును చేస్తున్నారని నిలదీస్తున్న ఓ సామాజిక వర్గీయుల ప్రశ్నలకు ఎవరు సమాధానం చెబుతారు?నకిలీ మద్యం ప్లాంట్ కేసులో పది మంది అరెస్ట్ములకలచెరువు: అన్నమయ్య జిల్లా ములకలచెరువు పాత హైవే సమీపంలో బట్టబయలైన నకిలీ మద్యం తయారీ కేంద్రం కేసులో 14 మందిపై కేసు నమోదు చేసి, 10 మందిని అరెస్ట్ చేశామని ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజ్ తెలిపారు. స్థానిక ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. ఈ కేసులో జనార్దనరావు, కట్టా రాజు, పి.రాజేష్, కొడాలి శ్రీనివాసరావు, నాగరాజు, హాజీ, బాలరాజు, మణిమారన్, ఆనందన్, సూర్య, వెంకటేషన్ సురేష్, మిథున్, అనంతదాస్, కట్టా సురేంద్ర నాయుడుపై కేసు నమోదు చేశారు.వీరిలో జనార్దనరావు, పి.రాజేష్, కట్టా రాజు, కొడాలి శ్రీనివాసులు పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. మిగతా వారిని అరెస్ట్ చేశారు. నకిలీ మద్యం తయారీ కేంద్రం నుంచి ఎస్ఎస్ ట్యాంకు, డిస్టలరీ వాటర్ ట్యాంకు, బాటిళ్లకు మూతలు బిగించే 3 యంత్రాలు, మూడు వాహనాలు, ఎలక్ట్రికల్ మోటార్, 1,050 లీటర్ల స్పిరిట్, బాటిలింగ్‌కు సిద్ధంగా ఉన్న 1,470 లీటర్ల మద్యం, 20,208 బాటిళ్ల మద్యం, 12 వేల ఖాళీ బాటిళ్లు, వేలాది మూతలు, 70 క్యాన్లు, రాయల్ లాన్సర్ లేబుళ్లు 10,800, ఓల్డ్ అడ్మిరల్ లేబుళ్లు 1200, 4 వేల రోల్స్‌ను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వీటి విలువ రూ.1.75 కోట్లని చెప్పారు. -
టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ డాన్లు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టీడీపీ నాయకులు కల్తీ మద్యం డాన్లుగా మారి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ జనరల్ సెక్రటరీ గడికోట శ్రీకాంత్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులే పారుతోందని, టీడీపీ నేతలు కల్తీ మద్యం తయారీని పరిశ్రమ స్థాయికి తీసుకువెళ్ళారని ఆగ్రహం వ్యక్తం చేశారు.కొత్త మద్యం పాలసీ ముసుగులో విచ్చలవిడిగా ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలు కేటాయించి, గ్రామగ్రామాన బెల్ట్ షాప్‌లను ఏర్పాటు చేయించి, ఈ కల్తీ మద్యాన్ని వాటి ద్వారా విక్రయిస్తున్నారని ధ్వజమెత్తారు. నాణ్యమైన మద్యం పేరుతో సీఎం చంద్రబాబు చెబుతున్నది ఈ కల్తీ మద్యం గురించేనని, ప్రజల ప్రాణాలను బలిపెట్టి, టీడీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఇంకా ఆయనేమన్నారంటే..డిస్టిలరీల స్థాయిలో కల్తీ మద్యం తయారీ యూనిట్లునాణ్యమైన మద్యం సరఫరా చేస్తానని అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టి తెలుగుదేశం నాయకుల జేబులు నింపడమే ధ్యేయంగా కల్తీ మద్యం తయారీకి సహకారం అందిస్తున్నాడు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ అండదండలతో టీడీపీ నాయకులే కల్తీ లిక్కర్ తయారు చేసి మందు బాబుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో ప్రభుత్వమే లిక్కర్ అమ్మకాలు జరిపితే దానిపై విషప్రచారం చేసిన చంద్రబాబు, కూటమి ప్రభుత్వం వచ్చాక తిరిగి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టడంతో వారు రెచ్చిపోయి కల్తీ లిక్కర్ తయారు చేసి సొమ్ము చేసుకుంటున్నారు.తాజాగా మదనపల్లె సమీపంలోని తంబళ్లపల్లె నియోజకవర్గం ములకలచెరువులో శుక్రవారం కల్తీ మద్యం రాకెట్ వ్యవహారం బయటపడింది. ప్రభుత్వ అనుమతి లేకుండా ఏకంగా ఒక డిస్టిలరీ యూనిట్ స్థాయిలో రోజుకు 15వేల కేసుల కల్తీ లిక్కర్ తయారు చేసి బెల్ట్ షాపులకు సరఫరా చేస్తున్నారు. ఈ కేసులో మండల స్థాయి టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడుతోపాటు ఎనిమిది మంది కూలీలను ఎక్సైజ్ అధికారులు అరెస్టు చేశారు.కానీ ఈ కల్తీ మద్యం రాకెట్ వెనుక రింగ్ మాస్టర్, సూత్రధారుల పేర్లపై ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించడం లేదు. అన్నమయ్య జిల్లాకు చెందిన ప్రభుత్వ కీలక నేతను చంద్రబాబు, నారా లోకేష్‌లే కాపాడుతున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేలా ప్రతి రెండు జిల్లాలకు ఒక యూనిట్ నెలకొల్పి లిక్కర్ దందా సాగిస్తున్నారు. తాగడానికి మంచినీళ్లు లేని గ్రామాలున్నాయి కానీ, మద్యం సరఫరా జరగని గ్రామాలు ఏపీలో లేవు. వేళలతో సంబంధం లేకుండా 24 గంటలూ ఇంటికే మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చిల్లర అంగళ్లలో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందో చెప్పాల్సిన పనిలేదు.లిక్కర్ స్కాం పేరుతో వైఎస్సార్సీపీపై బురదచల్లారువైయస్సార హయాంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని ప్రజలను నమ్మించడానికి చంద్రబాబు చేయని కుటిల ప్రయత్నం లేదు. ఆధారాలు లేకపోయినా వైయస్సార్సీపీ నాయకులను, వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులను కక్షపూరితంగా అక్రమ కేసుల్లో ఇరికించి అరెస్టులు చేసి వేధించడమే ధ్యేయంగా లిక్కర్ కుంభకోణం సృష్టించారు. మాజీ ఐఏఎస్‌లు ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితోపాటు ఎంపీ మిధున్రెడ్డిలను అక్రమంగా అరెస్ట్ చేశారు. తప్పుడు వాంగ్మూలాలు సృష్టించి అరెస్టులు చేసినా ఆ కేసులు కోర్టుల్లో నిలబడలేదు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ వరుసగా చీవాట్లు తింటోంది. కూటమి ప్రభుత్వ మోసాలతో ప్రజలు విసిగిపోయారు. 16 నెలల పాలనలోనే తీవ్రమైన వ్యతిరేకత తెచ్చుకుంది.స్పిరిట్ తో కల్తీ మద్యం తయారీరాష్ట్రంలో కల్తీ మద్యం రాకెట్ దందాను టీడీపీ మద్యం సిండికేట్ వ్యవస్థీకృతం చేసింది. ప్రభుత్వ పెద్దల అండదండలతో జిల్లాలు, రీజియన్ల వారీగా పంచుకుని మరీ కల్తీ మద్యం దందాను సాగిస్తోంది. నాడు కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో స్పిరిట్‌ను కొనుగోలు చేయడానికి కేంద్రం ఇచ్చిన ఆదేశాలను టీడీపీ మద్యం సిండికేట్ తమ దందాకు అవకాశంగా మలుచుకుంది. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని స్పిరిట్ తయారీ పరిశ్రమల నుంచి డిస్టిలరీల పేరిట అవసరానికి మించి ‘ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (వాడుక భాషలో స్పిరిట్ అంటారు)ను అక్రమంగా కొనుగోలు చేస్తోంది. ఆ విధంగా భారీగా కొనుగోలు చేసిన స్పిరిట్‌తో కల్తీ మద్యం తయారు చేస్తున్నారు.అందుకోసం కల్తీ మద్యం యూనిట్లలో యంత్ర సామగ్రిని తెప్పించి పక్కాగా భారీ ప్లాంట్లనే నెలకొల్పారు. అక్రమంగా సేకరించిన స్పిరిట్‌ను డైల్యూట్ (పలుచన) చేసి అందులో కారమెల్, కలర్డ్ ఫ్లేవర్లు (రంగు నీళ్లు) కలిపి కల్తీ మద్యం తయారు చేస్తున్నారు. వివిధ ప్రముఖ బ్రాండ్ల పేరిట లేబుళ్లు, బిరడాలు ఇతర ప్రాంతాల్లో తయారు చేయించి తెప్పిస్తున్నారు. ఆ కల్తీ మద్యాన్ని బాట్లింగ్ చేసి బ్రాండెడ్ మద్యంగా మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు.ఆ కల్తీ మద్యాన్ని తాగించడానికి గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ విచ్చలవిడిగి బెల్ట్ షాపులు తెరుస్తున్నారు. లిక్కర్ షాపులకు అదనంగా పర్మిట్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలుంటే, వాటికి అనుబంధంగా దాదాపు 75 వేల బెల్ట్ దుకాణాలు నడుస్తున్నాయి. ఆ మద్యం దుకాణాలు, బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యాన్ని బ్రాండెడ్ మద్యంగా విక్రయిస్తున్నారు. మద్యం నెట్వర్క్ అంతా టీడీపీ సిండికేట్ గుప్పిట్లో ఉండటంతో ఈ దందా అడ్డూ అదుపు లేకుండా సాగుతోంది.ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీటీడీపీ సిండికేట్ సాగిస్తున్న కల్తీ మద్యం విక్రయాలు చూస్తే ఆశ్చర్యం కలిగిస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024-25లో 4.26 కోట్ల ఐఎంఎల్ మద్యం కేసులు, 3.25 కోట్ల బీరు కేసులు విక్రయించారు. 4.26 కోట్ల ఐంఎఎల్ మద్యం కేసుల్లో 70 శాతం క్వార్టర్ బాటిళ్ల కేసులే ఉన్నాయి. అంటే 2.98 కోట్ల కేసుల్లో క్వార్టర్ బాటిళ్లే విక్రయించారు. ఒక్కో కేసులో 48 క్వార్టర్ బాటిళ్లు ఉంటాయి.ఈ లెక్కన 143 కోట్ల క్వార్టర్ బాటిళ్లు విక్రయించారు. దీన్నిబట్టి మొత్తం క్వార్టర్ బాటిళ్లలో మూడో వంతు కల్తీ మద్యం విక్రయించినట్లు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో అమ్ముడవుతున్న ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి కల్తీ మద్యమే. ఆ ప్రకారం దాదాపు 48 కోట్ల క్వార్టర్ బాటిళ్ల మేర కల్తీ మద్యాన్ని విక్రయించారు. ఒక్కో క్వార్టర్ బాటిల్‌ను రూ.110 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఒక్క ఏడాదిలోనే రూ.5,280 కోట్ల విలువైన కల్తీ మద్యాన్ని తాగించి సొమ్ము చేసుకున్నారు.పవన్ కళ్యాణ్ స్పందించాలిప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో కూటమి పాలనలో యథేచ్ఛగా సాగుతున్న కల్తీ మద్యం విక్రయాలపై స్పందించాలి. టీడీపీ హయాంలో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైయస్సార్సీపీ హయాంలో జరిగినట్టు విష ప్రచారం చేసి రాజకీయంగా వాడుకున్నాడు. 34 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారంటూ ఆయన చేసిన ప్రచారం కూడా పచ్చి అబద్ధమని అసెంబ్లీలో కూటమి ప్రభుత్వమే స్పష్టం చేసింది. లేనివాటిని ప్రశ్నించిన పవన్ కళ్యాణ్.. కళ్ల ముందు కల్తీ మద్యం దందా సాగిస్తూ లక్షల మంది ప్రాణాలకు ప్రమాదం ఏర్పడుతుంటే ఎందుకు పట్టించుకోవడం లేదు?వైఎస్సార్సీపీ హయాంలో కల్తీ మద్యం విక్రయాలంటూ కూటమి నాయకులు విషం చిమ్మారు. కానీ కల్తీ లిక్కర్ తాగి ఒక్క మరణం కూడా సంభవించలేదని ఎన్సీఆర్బీ రిపోర్టులో స్పష్టం చేసింది. దీనిగురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద అక్రమ కేసులు నమోదు చేయడమే కాకుండా సోషల్ మీడియాకి అడ్డుకట్ట వేయాలన్న దుర్భుద్ధితో మంత్రుల కమిటీ వేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో బురదజల్లిన కూటమి నాయకులు, ఇప్పుడు వారు అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ నాయకులు నిజాలు మాట్లాడుతుంటే ఓర్వలేకపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణం స్పందించి కల్తీ మద్యం సరఫరా రాకెట్‌కి అడ్డుకట్ట వేయాలి. ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేయడం మాని ప్రజల ప్రాణాలను కాపాడాలి. విచ్చలవిడిగా ఏర్పాటు చేసిన బెల్ట్ షాపులను తక్షణం మూసేయాలి. -
నకిలీ మద్యం గుట్టురట్టు
పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం అవలింగిలో వైన్‌షాపు సమీపంలోని ఓ ఇంట్లో 205 లీటర్ల నకిలీ మద్యం, 172 ఖాళీ మద్యం బాటిళ్లు, ప్రింటింగ్ మెషిన్‌ను ఎక్సైజ్ పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు. ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డి.శ్రీకాంత్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. అవలింగిలోని వైన్‌షాపును జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ పి.మురళీధర్, సీఐ కె.కృష్ణారావు బుధవారం తనిఖీ చేశారు. ఆ సమయంలో పలాస మండలం కోసంగిపురం గ్రామానికి చెందిన తంగుడు మణికంఠ, కోటబొమ్మాళి గ్రామానికి చెందిన సదునుపల్లి సుందరరావు వాటర్ బాటిళ్లలో మద్యం అమ్ముతున్నట్టు గుర్తించారు. అనుమానం వచ్చి పరిశీలించగా 8 నకిలీ మద్యం బాటిళ్లు, అనుమానాస్పదంగా ఉన్న మరో 172 మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇవెక్కడివని ప్రశ్నింంచగా సకలాభక్తుల నీలకంఠం, పిట్టా పైడిరాజు, షాపు నౌకనామాదారుడు కలిసి విక్రయించమన్నారని తెలిపారు. అనంతరం షాపునకు 100 మీటర్ల దూరంలో ఓ ఇంట్లో తనిఖీ చేయగా నకిలీ మద్యం బాటిళ్లు, తేదీ, బ్యాచ్ నంబర్లు తయారు చేసే ప్రింటింగ్ మెషిన్, ఖాళీ మద్యం బాటిళ్లు, మూతలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తంగుడు మణికంఠ, సదునుపల్లి సుందరరావులను అరెస్ట్ చేశారు. నీలకంఠం, పైడిరాజు పరారీలో ఉన్నారు. వీరందరిపైనా కేసులు నమోదు చేశామని శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. -
తెలంగాణాలో 3 కోట్ల విలువైన నకిలీ మద్యం సీజ్
-
హైదరాబాద్‌లో మరోసారి బయటపడ్డ నకిలీ మద్యం.. రూ. 2 కోట్ల విలువైన..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో మరోసారి నకిల మద్యం బయటపడింది. శివారు ప్రాంతాల్లో జోరుగా నకిలీ మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్సైజ్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎక్సైజ్‌శాఖ అధికారులు.. హయత్ నగర్‌లోని ఓ బెల్ట్ షాపులో నకిలీ మద్యం అమ్ముతున్నట్లు గుర్తించారు. ఆ బెల్ట్ షాప్ ఇచ్చిన సమాచారం మేరకు ఎక్సైజ్ పోలీసులు.. పెద్ద అంబర్ పేట్, హయత్ నగర్, చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, దేవలమ్మ నాగారం ఏరియాలో నకిలీ మద్యం తయారు చేస్తున్న డంప్‌లపై దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో చౌటుప్పల్ మండలం దేవాలమ్మ నాగారానికి చెందిన మద్యం వ్యాపారి బింగి బాలరాజుగౌడ్కు చెందిన గోదాంలో నకిలీ మద్యం పట్టుకున్నారు. దాదాపు రూ. 2 కోట్ల విలువ చేసే నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బాలరాజు గౌడ్, కొండల్‌రెడ్డి కలిసి నకిలీ మద్యం సరఫరా చేస్తున్నట్లు తేలింది. వీరిద్దరూ 20 వైన్ షాపులకు నకిలీ మద్యం పంపిణీ చేస్తున్నట్లు నిర్ధారించారు. గతంలో కూడా బింగి బాలరాజు గౌడ్‌ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ఇదే మద్యం సరఫరా అయినట్లు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కర్రలతో కొట్టుకున్న ప్రైవేటు కాలేజ్ విద్యార్థులు.. వీడియో వైరల్ -
నకిలీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న అధికారులు
-
వెలగపూడి బార్లో కల్తీ మద్యం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖలో లిక్కర్ మాఫియా.. కల్తీ లిక్కర్ డాన్ ఎవరంటే.. అందరూ ఠక్కున చెప్పే పేరు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు. ఏడు నెలల కిందటి వరకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ దన్నుతో వెలగపూడి ‘లిక్కర్’ అక్రమాల జోలికి వెళ్ళేందుకు సాహసించలేని ఎక్సైజ్ పోలీసులకు ఇప్పుడు పగ్గాలొచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతైనా వెలగపూడి సిండికేట్‌లో మార్పు వస్తుందని అధికారులు ఆశించారు. అయితే సదరు మాఫియా గతంలో మాదిరిగానే అడ్డగోలుగా వ్యవహరిస్తుండటంతో మెరుపు దాడులు చేశారు. మద్యం కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని ద్వారకా బస్టాండ్ ఎదుట ఉన్న దుర్గా బార్ అండ్ రెస్టారెంట్ ఎవరిదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. జీవీఎస్ఎన్ సత్యనారాయణ పేరిట ఉన్న ఈ బార్‌ను సతీష్ అనే టీడీపీ కార్యకర్త నిర్వహిస్తుంటాడు. వీరిద్దరూ వెలగపూడి బినావీులనేది లిక్కర్ సిండికేట్‌కే కాదు.. ఎక్సైజ్ అధికార వర్గాలందరికీ తెలిసిన వాస్తవం. కల్తీ, నాసిరకం మద్యం విక్రయిస్తున్నారంటూ ఈ బార్ అండ్ రెస్టారెంట్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే అధికారం దన్నుతో గత ఐదేళ్ళుగా ఎవ్వరూ దాడులు చేసే సాహసం చేయలేదు. గురువారం పక్కాగా సమాచారం రావడంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ సీహెచ్ దాస్ ఆదేశాల మేరకు విశాఖపట్నం ఎక్సైజ్ ఈఎస్, టాస్క్‌ఫోర్స్ సీఐ సూర్యకుమారి ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేపట్టారు. ఓసీ బ్రాండ్ మద్యంలో క్రేజీ డాల్ అనే చీప్ లిక్కర్‌ను, ఎంసీ బ్రాందీలో ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీని కలిపి కల్తీ చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అప్పటికే కల్తీ చేసిన 17 ఫుల్ బాటిళ్ళను సీజ్ చేశారు. సిబ్బందిని అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కాగా, ఈ సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెలగపూడి.. విషయం బయటకు పొక్కకుండా కేసును నిర్వీర్యం చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు కల్తీ మద్యం కేసు మూలాల్లోకి వెళ్తారా.. లేదా కేవలం సిబ్బందికే పరిమితం చేస్తారా అనేది చూడాలి. -
శంషాబాద్‌లో భారీగా నకిలీ మద్యం పట్టివేత
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లో మంగళవారం భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ అండ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ. లక్షలు విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్న నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పండుగ సమయంలో నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు ఈ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది. -
కల్తీ మద్యం సేవించి ఐదుగురి మృతి
లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని షమ్లి జిల్లా కమలాపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. కల్తీ మద్యం సేవించి గడిచిన 48 గంటల్లో ఐదుగురు వ్యక్తులు మరణించారని అధికారులు వెల్లడించారు. షమ్లీ, కర్నాల్ (హర్యానా) జిల్లాల్లో దాదాపు 15 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బాధితులు దేశీ మద్యం తాగారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ విషాద ఘటనపై షమ్లీ జిల్లా మేజిస్ర్టేట్ ఇంద్ర విక్రం సింగ్ విచారణకు ఆదేశించారు. గ్రామంలో నాటు సారా తాగి స్ధానికులు మరణించారన్న సమాచారంతో తాము గ్రామానికి చేరుకోగా బాధితులు కల్తీ మద్యంపై ఫిర్యాదు చేయలేదన్నారు. పోస్ట్‌మార్టం నివేదికతో వాస్తవాలు వెలుగుచూశాయని షమ్లీ ఎస్పీ వెల్లడించారు. పొరుగున ఉన్న హర్యానాలో తక్కువ ధరకు దేశీ మద్యం లభ్యం కావడంతో అక్కడి నుంచి కల్తీ మద్యం అక్రమంగా సరఫరా అవుతోందని పోలీసులు భావిస్తున్నారు. కల్తీ మద్యంపై పోలీసులు, ఎక్సైజ్ అధికారులు కఠినంగా వ్యవహరించాలని భారతీయ కిసాన్ యూనియన్ నేత వినోద్ నిర్వాల్ డిమాండ్ చేశారు. -
నెల్లూరులో కాటేసిన కల్తీ మద్యం
-
నకిలీ మద్యం గుట్టురట్టు
సాక్షి, గుంటూరు: జిల్లాలో మరో నకిలీ భాగోతం బయటపడింది. ఇప్పటికే కారం, నకిలీ పురుగు మందులు, మెడిసిన్, నూనె, నెయ్యి ఇలా ప్రతి వస్తువునూ నకిలీ మయం చేసేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లా రేపల్లె మండలం తుమ్మల పంచాయతీ పరిధిలోని గాదెవారిపాలెంలో నకిలీ మద్యం తయారు చేస్తున్న కేంద్రంపై మంగలవారం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు చేశారు. పాడుపడిన ఇంట్లో 250 లీటర్ల స్పిరిట్, 21 కేసుల (1248 సీసాల) నకిలీ మద్యం, 20 బ్యాగుల ఖాళీ సీసాలు, క్యాప్ ఫిట్టింగ్ మిషన్, స్వాధీనం చేసుకున్నారు. బ్రాంది షాపు నిర్వాహకులు గుమ్మడి సాంబశివరావుతోపాటు, కొల్లూరు మండలం లంబాడి తండాకు చెందిన రమావత్ సాంబశివ నాయక్‌లను అరెస్టు చేశారు. స్పిరిట్‌లో రంగు నీళ్లు కలిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎప్పటి నుంచి ఈ వ్యవహారం సాగుతోంది, ఇక్కడ తయారు చేసిన నకిలీ మద్యం ఏయే ప్రాంతాలకు సరఫరా అవుతుందనే దానిపై ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా ఆఫీసర్స్ చాయిస్, ఓల్డ్ ట్రావెన్ అనే బ్రాండ్లకు చెందిన ఖాళీ మద్యం సీసాలను సేకరించి వాటిలో నకిలీ మద్యం నింపుతున్నట్లు ఎక్సైజ్ అధికారులు గుర్తించారు. ఇందులో 960 సీసాల ఆఫీసర్స్ చాయిస్ విస్కీ, 288 సీసాల ఓల్డ్ట్రావెన్ విస్కీ స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో మద్యం సిండికేట్లతో నకిలీ మద్యం తయారీ కేంద్రం దారులకు సంబంధాలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో కలకలం జిల్లాలో నకిలీ మద్యం కేంద్రం నడుస్తుందనే విషయం బయటపడడంతో తీవ్ర కలకలం రేపింది. నకిలీ మద్యం ఏయే దుకాణాలకు సరఫరా అవుతుందనే విషయం బయటపడకపోవడంతో మందుబాబులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ బీ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కల్తీ మద్యం తయారు చేసిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వెనుక ఎంతటివారినైనా వదిలేది లేదంటూ స్పష్టం చేశారు. దాడుల్లో ఎక్సైజ్ ఏఈఎస్ ఆవులయ్య, సీఐ సూర్యనారాయణ, ఏఈఎస్ అరుణకుమారి, ఎస్సై మోహన్‌రావు, రేపల్లె ఎక్సైజ్ సీఐ వెంకటరెడ్డి, ఎస్సై శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు. -
విజయవాడలో కల్తీ మద్యం కలకలం
-
మచిలీపట్నంలో కల్తీ మద్యం కలకలం
-
మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర
-
మద్యం మార్కెట్‌పై మాఫియా దండయాత్ర
* గోవా, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి నెలకు 100 కోట్ల లిక్కర్ * మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ * బ్యూటేన్ పేరుతో ఈఎన్ఏ, సర్జికల్ కిట్‌లో క్యారామిల్, సీసా మూతల రవాణా.. గోవా డిస్టిలరీల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ * కంటెయినర్ల ద్వారా పెయింట్లు, బిస్కెట్లు, నూడుల్స్ పేరుతో రవాణా * ఆఫీసర్స్ చాయిస్, డీఎస్పీ, బ్యాగ్‌పైపర్ వంటి బ్రాండ్లకు నకిలీలు * రూ. 3,200 ధర గల క్వార్టర్ బాటిళ్ల కేసు రూ. 1,800 ధరకే సరఫరా * మద్యం వ్యాపారి పేరుతో మాఫియాను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధి * షాద్‌నగర్ హైవేపై దాబా వద్ద గ్యాంగ్ లీడర్‌తో సమావేశం * తర్వాత ఉప్పల్‌లో మళ్లీ భేటీ.. నకిలీ సరుకు కోసం ఒప్పందం * శాంపిల్‌గా రెండు కేసుల ఎన్డీపీ లిక్కర్ పంపిన మాఫియా నేత * మద్యం ముడిసరుకులను తెప్పించే ముఠానూ కలిసిన ‘సాక్షి’ * ఆ దందా కేంద్రం అబిడ్స్ బ్యాంక్ స్ట్రీట్‌లోని ఓ సెల్‌ఫోన్ షాపు * ‘సాక్షి’ ప్రతినిధిని ట్రాన్స్పోర్ట్ గోడౌన్ వద్దకు తీసుకెళ్లిన నిర్వాహకులు * అక్కడికక్కడే డ్రమ్ముల్లో ఈఎన్ఏ, విస్కీ ఎసెన్స్, సీళ్లు ఇచ్చిన వైనం వర్ధెల్లి వెంకటేశ్వర్లు, సాక్షి: రాష్ట్రంలో నకిలీ మద్యం ఏరులుగా పారుతోంది. చాపకింద నీరులా విస్తరించిన మద్యం మాఫియా.. మందుబాబులకు బాటిళ్లలో నకిలీ కిక్కును సరఫరా చేస్తోంది. పొరుగు రాష్ట్రాల నుంచి లారీలకు లారీలను నకిలీ మద్యం దించేస్తోంది. ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి కొట్టటంతో పాటు.. మందుబాబుల ప్రాణాలతోనూ చెలగాటమాడుతోంది. నెలకు కనీసం రూ. 100 కోట్ల పైబడి సాగుతున్న ఈ నకిలీ మద్యం దందా.. ప్రధానంగా పేద, దిగువ మధ్య తరగతికి చెందిన వారు తాగే చీప్ లిక్కర్, మీడియం లిక్కర్ బ్రాండ్లను టార్గెట్ చేసుకుని సాగిపోతోంది. ఎక్సైజ్ కమిషనర్ సమీర్‌శర్మ బదిలీ, రాష్ట్ర విభజన వివాదాలు మద్యం మాఫియాకు కలసిరావటంతో.. ఈ నకిలీ వ్యాపారం మూడు డ్రమ్ముల న్యూట్రల్ ఆల్కహాల్, ఆరు లారీల సరుకుగా యథేచ్ఛగా నడుస్తోంది. గోవా నుంచి ఆంధ్రాజిల్లాలకు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు నకిలీ మద్యం దిగుమతి అవుతోంది. ఈ మద్యం మాఫియా దందా కారణం గా ప్రభుత్వ మద్యం అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. మద్యం మాఫియా నకిలీ దందాపై ‘సాక్షి’ స్టింగ్ ఆపరేషన్ చేపట్టింది. మద్యం వ్యాపారి పేరుతో.. మాఫియా గ్యాంగ్ లీడర్లతో మాట్లాడింది. ఒక్క రోజు లోనే రూ. 32 లక్షల విలువైన 1,000 పెట్టెల నకిలీ మద్యం తెచ్చి ఇచ్చేందుకు ఓ ముఠాతో ఒప్పందం కుదుర్చుకుంది. శాం పిల్‌గా గోవా నుంచి కొంత ఎన్డీపీ (నాన్-డ్యూటీ పెయిడ్) మద్యాన్ని, కర్ణాటక నుంచి 220 లీటర్ల ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను ‘సాక్షి’ ప్రతినిధి తీసుకున్నారు. ఈ నకిలీ మద్యం దందా సాగుతున్న తీరు తెన్నులు ఇవీ... మద్యం మాఫియా పొరుగు రాష్ట్రాల నుంచి రెండు రకాలుగా నకిలీ మద్యాన్ని మన రాష్ట్రంలోకి తెస్తోంది. ఒకటి.. గోవా డిస్టిలరీల నుంచి నేరుగా ఎన్డీపీ లిక్కర్. అంటే అక్కడ డిస్టిలరీల్లో దొంగతనంగా తయారు చేసిన మద్యాన్ని.. మన రాష్ట్ర ప్రభుత్వానికి సుంకం చెల్లించకుండా దొంగతనంగా తెప్పించి ఇక్కడ షాపులకు సరఫరా చేయటం. రెండోది.. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి మద్యం ముడిసరుకులను దొంగతనంగా తెప్పించి, రహస్యంగా నకిలీ మద్యం తయారు చేసి, పాత బాటిళ్లలో నింపి షాపులకు సరఫరా చేయటం. ఈ రెండు రకాల మద్యం రాష్ట్ర వ్యాప్తంగా నెలకు కనీసం 100 నుంచి 150 లారీల వరకు వస్తున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఇలా... * కర్ణాటకలోని హుబ్లి, కోలార్, గంగావతి; మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి వీఆర్ఎల్ ట్రాన్స్‌పోర్టులో బ్యూటేన్, ప్రొఫేన్ కెమికల్ పేరుతో ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్)ను డ్రమ్ముల్లో తెప్పిస్తారు. అదే పద్ధతిలో.. సీసాలపై వేసే లేబుళ్లు, మూతల సీళ్లు, క్యారామిల్, విస్కీ ఎసెన్స్‌ను కూడా సర్జికల్ కిట్ల పేరు మాటున తెప్పిస్తారు. * ఈ నకిలీ మద్యం దందా, నగదు లావాదేవీలు హవాలా పద్ధతిలో సాగుతాయి. ఎలాగంటే.. మాఫియా గ్యాంగ్‌లు రాష్ట్రంలో పలు చోట్ల కిళ్లీ కొట్లు, సెల్‌ఫోన్ దుకాణాల రూపంలో ఆఫీసులు తెరిచాయి. ఇలాంటి ఆఫీసులే కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ పెట్టారు. బ్రోకర్ల ద్వారా ఈ వ్యాపారం నడిపిస్తున్నారు. వ్యాపారులతో ఫోన్ కాంటాక్ట్ పెట్టుకోవటం లేదు. * నకిలీ మద్యం కావాలనే లిక్కర్ వ్యాపారుల నుంచి డబ్బు తీసుకుంటారు. పొరుగు రాష్ట్రం ఆఫీసుకు ఫోన్ చేసి డబ్బు ముట్టిందని చెప్తారు. ఎంత సరుకు పంపాలో వివరిస్తారు. అంతకంటే ఎక్కువ సంభాషణ ఉండదు. అక్కడివాళ్లు ఈఎన్ఏ, క్యారామిల్, తదితర ముడిసరుకులను సదరు కంపెనీలకు డబ్బు కట్టేసి తీసుకుంటారు. వాటిని వేరే ఏవో పేర్లతో ట్రాన్స్‌పోర్టులో పంపుతారు. * ఇక్కడి లిక్కర్ వ్యాపారులు ట్రాన్స్‌పోర్టు నుంచి ఈఎన్ఏ, ఇతర ముడిసరుకులను తీసుకుని ఒక రహస్య గోదాంకు తరలిస్తున్నారు. మూడున్నర లీటర్ల ఈఎన్ఏకు ఐదున్నర లీటర్ల నీళ్లు కలిపి.. దానికి క్యారామిల్, విస్కీ ఎసెన్స్ కలిపి మద్యం తయారు చేస్తున్నారు. అంతకంటే ముందే వైన్ షాపుల నుంచి ఖాళీ క్వార్టర్ సీసాలను, హాఫ్ బాటిళ్లు, ఖాళీ అట్టపెట్టెలను సేకరించి గోదాంకు చేర్చుతున్నారు. తయారు చేసిన నకిలీ మాద్యాన్ని సీసాల్లో నింపి మూతలు పెట్టి క్యాప్ సీల్ వేస్తున్నారు. ఈ మద్యం చూడటానికి ఏపీబీసీఎల్ డిపో నుంచి వచ్చినట్టే ఉంటుంది. వాటిని అంతకు ముందే తెచ్చిన ఏపీబీసీఎల్ అట్టపెట్టెల్లో పెట్టి ప్యాక్ చేసి షాపుల్లో విక్రయిస్తున్నారు. * తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఆఫీసర్స్ చాయిస్, రాయలసీమ జిల్లాల్లో డీఎస్పీ, బ్యాగ్‌పైపర్ లిక్కర్‌ను ఎక్కువగా తయారు చేసి పంపుతున్నారు. ఇలా తయారు చేసిన నకిలీ మద్యంలో హైగ్రో మీటర్ వేసి చూస్తే అసలు మద్యం కొలతలనే చూపిస్తోంది. యూపీ 25 శాతం, ప్రూఫ్ 75 శాతం ఉంటుంది. * ఇలా నకిలీ మద్యం తయారు చేసిన వ్యక్తి.. దానిని రెండో వ్యక్తికి ఒక్కో కేసు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ. 1,800 చొప్పున అమ్ముతున్నాడు. అతనేమో దుకాణం యజమానికి రూ. 2,000 నుంచి రూ. 2,100 వరకు విక్రయిస్తున్నాడు. దుకాణం యజమాని రూ. 2,900 చొప్పున బెల్టు దుకాణాలకు వేస్తున్నారు. బెల్టు దుకాణాల వారు రూ. 3,200 ధరకు వినియోగదారులకు అమ్ముతున్నారు. మద్యం దందాపై ‘స్టింగ్’ ఆపరేషన్ ఇలా... నకిలీ మద్యం దందాపై దృష్టిసారించిన ‘సాక్షి’ ప్రతినిధి ముందుగా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలో నిజాయితీపరులైన కొంత మంది అధికారులతో మాట్లాడి.. వారి వద్ద ఉన్న సమాచారం తీసుకున్నారు. అధికారులు ఇచ్చిన సమాచారం ప్రకారం.. మద్యం మాఫియా బ్రోకర్లను కలిసేందుకు ప్రయత్నించారు. పెద్దగా కష్టపడకుండానే ఓ మధ్యవర్తిని కలిశారు. ‘‘మాకు రంగారెడ్డి జిల్లాలో బార్ అండ్ రెస్టారెంట్, మద్యం షాపు ఉన్నాయి. లాభాలు లేవు. మీరు సెకండ్ మాల్ ఇప్పిస్తారని తెలిస్తే మీ కోసం నెల రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం’’ అని ఆ మధ్యవర్తితో చెప్పారు. నకిలీ లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్న కొంత మంది వ్యక్తుల పేర్లు, వారితో ఉన్న పరిచయాల గురించి చెప్పి ఆయనకు న మ్మకం కలిగించారు. గ్యాంగ్ లీడర్‌తో ముఖాముఖి... సదరు మధ్యవర్తి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్ హైవే పైన ఉన్న విజయ దాబా వద్ద.. ఓ మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌కు .. మద్యం వ్యాపారిగా ‘సాక్షి’ ప్రతినిధిని పరిచయం చేశాడు. ఆ గ్యాంగ్ లీడర్ ఈ ప్రతినిధిని, ఆయనతో వచ్చిన సహచరుడిని అనేక ప్రశ్నలు అడిగి వారు నిజమైన మద్యం వ్యాపారులేనని రూఢి చేసుకున్నాడు. చివరికి.. ‘‘సరే! రేపు పొద్దున మా మనుషులు వచ్చి మీ షాపులు చూస్తారు.. అక్కడే దగ్గర ఉండండి’’ అని వారికి చెప్పాడు. అతడి ఫోన్ నంబర్ ఇవ్వాలని ‘సాక్షి’ ప్రతినిధి అడిగితే.. నిర్మొహమాటంగా ఇవ్వనని చెప్పాడు. ‘‘ఈ వ్యాపారంలో ఎప్పుడు కూడా ఫోన్ వాడొద్దు’’ అని చెప్పి వెళ్లిపోయాడు. మద్యం దుకాణం యజమానిగా... మరుసటి రోజు ‘సాక్షి’ ప్రతినిధి ఇచ్చిన వైన్స్ షాపు దగ్గరకు అనుకున్నట్టుగానే ఓ వ్యక్తి వచ్చాడు. అప్పటికే.. ‘మా తమ్మునికి పిల్లను ఇవ్వడానికి ఓ వ్యక్తి వస్తున్నాడు.. మీ షాపులో మాకు వాటాలున్నాయని ఆయనకు చెప్పా.. దయచేసి సాయం చేయండ’ని చెప్పి ‘సాక్షి’ ప్రతినిధి తనకు పరిచయం ఉన్న సదరు వైన్స్ దుకాణం యజమానిని ఒప్పించారు. నకిలీ మద్యం గ్యాంగ్ లీడర్ పనుపున వచ్చిన వ్యక్తితో కలిసి దుకాణంలోకి వెళ్లాం. కౌంటర్లో కూర్చున్న వ్యక్తులు ‘సాక్షి’ ప్రతినిధికి షాపు యజమానికి ఇచ్చే గౌరవం ప్రకారం లేచి నమస్కారం పెట్టారు. బార్ దగ్గర కూడా ఇదే సీన్ రిపీట్ అయింది. ఈ రెండింటికి ‘సాక్షి’ ప్రతినిధే యజమాని అని.. గ్యాంగ్ లీడర్ ప్రతినిధి పూర్తిగా నమ్మాడు. అంతా చూసుకుని నిర్ధారించుకున్న తర్వాత ‘‘సరుకు ఎంత కావాలి?’’ అని మాఫియా లీడర్ ప్రతినిధి అడిగాడు. ‘‘పది రోజులకు లోడు చొప్పున కావాలన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘సరే! అన్నతో కలిసి ధర మాట్లాడుకుంటే రేపు ఉదయం సరుకు దింపుతాం’’ అని చెప్పి వెళ్లిపోయాడు. మళ్లీ గ్యాంగ్ లీడర్‌తో భేటీ... మద్యం మాఫియా గ్యాంగ్ లీడర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి మళ్లీ కలిశారు. ఈసారి భేటీ ఉప్పల్‌లో జరిగింది. ‘‘రంగారెడ్డి జిల్లాలో ఆఫీసర్స్ చాయిస్ బాగా తాగుతారు.. అదే తీసుకో’’ అని అతడు సలహా ఇచ్చాడు. ‘సాక్షి’ ప్రతినిధి సరే అన్నారు. ‘‘గోవా సరుకు.. అక్కడి ఫ్యాక్టరీల నుంచే వస్తుంది. నువ్వేం ఫిక ర్ చేయాల్సిన పని లేదు. ఎక్సైజోడే గుర్తుపట్టలేడు. పోలీసోనికి దీని గురించి తెల్వనే తెల్వదు. ఓ లోడు సరుకు తీసుకో’’ అని గ్యాంగ్ లీడర్ చెప్పాడు. ‘‘ధర ఎట్టా? చెప్పండన్నా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. ‘‘కేసుకు రూ. 2,500 పడుతుంది’’ అని అతడు చెప్పాడు. బేరమాడగా చివరకు కేసు రూ. 2,100 చొప్పున ఇచ్చేందుకు గ్యాంగ్ లీడర్ అంగీకరించాడు. అడ్వాన్స్‌గా రూ. 10 లక్షలు కట్టమన్నాడు. ‘‘మా పార్టనర్‌తో మాట్లాడి డబ్బు తీసుకుని రెండు రోజుల్లో వస్తా’’ అని ‘సాక్షి’ ప్రతినిధి బదులిచ్చారు. శాంపిల్‌గా ముందు రెండు పెట్టెలు పంపాలని కోరారు. ‘‘పిచ్చోనివారా? ఇంత చెప్పినా శాంపిల్ పంపమంటావు’’ అని గ్యాంగ్ లీడర్ కోపగించుకున్నాడు. ‘సాక్షి’ ఎలాగోలా అతడిని ఒప్పించింది. అదే రోజు ఓ ఆటోలో రెండు ఆఫీసర్స్ చాయిస్ పెట్టెలు తెచ్చి ఇచ్చారు. పరిశీలనగా చూస్తే అవి ఏపీబీసీఎల్ నుంచి వచ్చిన మద్యం బాటిల్స్లానే ఉన్నాయి. లేబులింగ్‌లో తేడా లేదు. లేబుల్స్ మీద అలైడ్ బ్లెండర్స్ నందిగామ అని ఒక పెట్టెలో.. అలైడ్ బ్లెండర్స్ గగన్‌పాడు అని మరో పెట్టెలో ఉంది. గోవా డిస్టిలరీల నుంచి ఏపీకి ఇలా.. గోవా నుంచి డిస్టిలరీ మద్యం నేరుగా రాష్ట్రానికి చేరుతోంది. మన రాష్ట్రంలో మద్యం తయారు చేయటానికి 31 డిస్టిలరీలు ఉన్నాయి. అదే గోవాలో 150 వరకు డిస్టిలరీలు ఉన్నాయి. అక్కడి రాష్ట్రంలో ఉత్పత్తికి తగ్గ డిమాండ్ లేదు. దీంతో గోవా డిస్టిలరీలు పక్కదారి పడుతున్నాయి. ఈ డిస్టిలరీల నుంచి ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు అక్రమంగా మద్యం సరఫరా అవుతున్నట్లు తేలింది. ఈ వ్యాపారం కూడా హవాలా పద్ధతిలో డబ్బు చేతులు మారుతూనే సాగుతుంది. * అక్రమార్కులు ఏ బ్రాండు మద్యం కోరితే ఆ బ్రాండు మద్యాన్ని గోవాలో తయారు చేసి ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎక్కువగా డిమాండ్ ఉన్న ఓసీ, బీపీ, రాయల్ స్టాగ్ మద్యాన్ని ఎక్కువగా తయారు చేస్తున్నారు. * అక్రమార్కులు తమకు కావలసిన బ్రాండు మద్యం బాటిళ్లు రెండు సేకరించి వాటిని ప్యాక్ చేసి గోవా డిస్టిలరీకి కొరియర్ చేస్తున్నారు. కొందరు బస్సు డ్రైవర్‌కు ఇచ్చి పంపుతున్నారు. ఎన్ని లారీల సరుకు కావాలో కోడ్ భాషలో లెటర్ రాసి కొరియర్లోనే పంపుతున్నారు. * బాటిళ్లు తీసుకున్న గోవాలోని డిస్టిలరీ యాజమాన్యం.. అచ్చంగా ఆ బాటిళ్ల మీద ఉన్నటువంటి లేబుల్‌నే అచ్చుగుద్దుతోంది. కోరిన మద్యం తయారు చేసి సీల్ చేసి ప్యాక్ చేసి పంపుతోంది. * ఇలా తయారు చేసిన మద్యాన్ని కంటెయినర్లో వేసి సీల్ చేస్తున్నారు. దీనికి ఏషియన్ పెయింట్ పేరు మీదనో, నూడుల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ పేరు మీదనో గోవా నుంచి కటక్ వరకు రూట్ పర్మిట్ తీసుకుంటున్నారు. * ఒకవేళ ఏదైనా కారణాల వల్ల పట్టుబడితే దొరకకుండా ఉండేందుకు ప్రతి 100 కి లోమీటర్లకు ఒక డ్రైవర్‌ను మార్చుతున్నారు. ఒక డ్రైవర్‌కు మరో డ్రైవర్ వివరాలు తెలియనివ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. * ఆఫీసర్స్ చాయిస్, అరిస్ట్రోక్రాట్, బ్యాగ్ పైపర్ లాంటి మీడియం రకం మద్యానికి.. గోవా ప్రభుత్వం కానీ, మన రాష్ట్ర ప్రభుత్వం కానీ డిస్టిలరీలకు ఒక్కో కేసుకు (క్వార్టర్ బాటిళ్లు అయితే 48, ఫుల్ బాటిళ్లు అయితే 12) రూ.450 చెల్లించి తీసుకుంటుంది. మన రాష్ట్రంలో ఈ కేసుపై నాలుగైదు రకాల పన్నులు విధించి.. ప్రివిలిజ్ ముగిసిన షాపులకు సుమారు రూ. 3వేలకు సరఫరా చేస్తుంది. వారు ఆ కేసుపై నిర్ణయించిన గరిష్ట విక్రయ ధర ప్రకారం రూ. 3,200 మొత్తానికి విక్రయిస్తారు. * అదే గోవాలో అక్రమంగా మద్యం తయారు చేసే డిస్టిలరీ యాజమాన్యం.. తమకు ఆ ఆర్డర్ ఇచ్చిన మద్యం మాఫియాకు ఒక్కో కేసును రూ. 950 ధరకు అందిస్తుంది. ట్రాన్స్‌పోర్టు ఖర్చులు కలుపుకొని ఆ మాఫియా ఒక్కో కేసును రూ. 1800 ధరకు మద్యం దుకాణానికి చేరవేస్తాడు. ఆ షాపుల వారు తమ షాపుల్లో విక్రయిస్తే ఎంఆర్పీ ధర రూ. 3,200కు అమ్ముతారు. బెల్టు దుకాణానికి ఇస్తే రూ. 2,900 కు విక్రయిస్తున్నారు. * ప్రభుత్వం నుంచి సరఫరా చేసే మద్యానికి ఒక్కో కేసుకు రూ. 3,000 వరకూ చెల్లించాల్సి వస్తుండగా.. అదే నకిలీ మద్యం కేసు కేవలం రూ. 1,800 ధరకే షాపుకు వచ్చి చేరుతోంది. దీనివల్ల షాపుయజమానికి ఒక్కో కేసుకు రూ. 1,000 కి పైగా ఆదాయం వస్తోంది. మద్యం మాఫియాకూ ఒక్కో కేసుకు మరో రూ. 1,000 మిగులుతోంది. గోవాలో అక్రమంగా తయారు చేసే డిస్టిలరీలకూ ఒక్కో కేసుకు రూ. 500 వరకూ అదనంగా గిడుతోంది. ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ దందా.. మరో స్టింగ్ ఆపరేషన్‌లో ఎక్సైజ్ అధికారులు సూచించిన బ్రోకర్‌ను ‘సాక్షి’ ప్రతినిధి పరిచయం చేసుకున్నారు. ‘‘మాది కరీంనగర్ జిల్లా బెజ్జంకి. గతంలో నకిలీ ఫారిన్ లిక్కర్ వ్యాపారం చేశాం. అందులో పెద్దగా లాభాలు రాలేదు’’ అని చెప్పి నమ్మబలికారు. ‘‘నకిలీ మద్యంలో మంచి లాభాలు ఉన్నాయని కనకం అన్న చెప్పాడు.. నిన్ను కలిస్తే దారి దొరుకుతుందని ఆయన చెప్తే నిన్ను వెతుక్కుంటూ వచ్చామన్నా’’ అని ఆయన్ను నమ్మించారు. ఐదు డ్రమ్ముల ఈఎన్ఏ (ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్) కావాలని కోరారు. లీటర్ మీద రూ. 4 కమీషన్ ఇస్తామని చెప్పారు. బ్రోకర్ ఒప్పుకున్నాడు. ఐదు డ్రమ్ములకు రూ. 1.65 లక్షలు అవుతాయని, దానికి సరిపోను క్యారామిల్, లేబుల్స్, సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్‌కు కలిపి మరో 1.25 లక్షలు.. మొత్తం 3.75 లక్షలు డబ్బు ఇవ్వాలని అడిగాడు. ఇప్పుడు డబ్బు ఇస్తే మూడు రోజుల తరువాత డ్రమ్ములు వస్తాయని చెప్పాడు. ‘‘అన్నా ఏ నమ్మకం లేకుండా ఇంత డబ్బు ఎలా ఇవ్వాగలం..? ఏదైనా నమ్మకం చూపించు’’ అని ‘సాక్షి’ ప్రతినిధి అడిగారు. బ్యాంక్ స్ట్రీట్‌లో సెల్‌ఫోన్ షాపు... సదరు బ్రోకర్ ఎట్టకేలకు ‘సాక్షి’ ప్రతినిధిని, ఆయన సహచరుడిని వెంటతీసుకెళ్లాడు. ఆబిడ్స్ చౌరస్తా నుంచి సితార రాయల్ హోటల్ దాటి.. బ్యాంకు స్ట్రీట్‌లో ఒక సెల్‌ఫోన్ షాపులోకి వారిని తీసుకువెళ్లాడు. షాపు సాదాసీదాగా ఉంది. పెద్దగా వ్యాపారం ఉన్నట్లు కనిపించలేదు. ఈ షాపు యజమాని పేరు సింగ్ (పూర్తి పేరు కాదు). ‘సాక్షి’ ప్రతినిధిని మద్యం వ్యాపారిగా ఆయనకు బ్రోకర్ పరిచయం చేశాడు. విషయం చెప్పాడు. ‘‘ఎప్పుడు తీసుకుంటారు?’’ అని సింగ్ అడిగాడు. ముందు ఒక డ్రమ్ము చాలు. తరువాత నాలుగు డ్రమ్ములు కావాలని ‘సాక్షి’ ప్రతినిధి చెప్పారు. ‘‘ఒక డ్రమ్మై వీఆర్ఎల్ పార్సిల్లో రెడీగా ఉంది. డబ్బు కట్టి వెళ్లి తీసుకోండి’’ అని సింగ్ చెప్పాడు. ఇంతలోనే గౌడ్ (పూర్తి పేరు కాదు) అనే వ్యక్తి రూ. 5 లక్షలు ఇచ్చి రెండు రోజుల్లో సరుకు కావాలన్నాడు. రెండు రోజుల్లో కష్టమని, మూడో రోజు వచ్చి తీసుకెళ్లాలని సింగ్ చెప్పాడు. ‘సాక్షి’ ప్రతినిధి సమక్షంలోనే సింగ్ ఎక్కడికో ఫోన్ చేసి.. రూ. 6 లక్షలు ముట్టినవి.. 9 కాటన్లు, సర్జికల్ కిట్లు పంపాలని హిందీలో చెప్పాడు. కర్ణాటక సెల్ నంబర్లకు ఫోన్లు... ‘సాక్షి’ ప్రతినిధి సదరు సింగ్‌ను మాటల్లో పెట్టి అదును చూసి ఆయన మాట్లాడిన ఫోన్ నంబర్‌ను సంపాదించారు. ఆ నంబర్ 09916044258. ఇది కాకుండా ఇంకో మూడు నంబర్లు ఉన్నాయి. అవి 08971609984, 09742570372, 09742570887. ఈ అన్ని నంబర్లు కూడా కర్ణాటక రాష్ట్రం నంబర్లే అని తేలింది. ఆ తర్వాత సింగ్‌తో పాటు ‘సాక్షి’ ప్రతినిధి వీఆర్ఎల్ పార్సిల్‌కు వెళ్లారు. అప్పటికే ఆయనకు కొరియర్ ద్వారా రశీదులు వచ్చినట్టున్నాయి. వెళ్లి కొరియర్ వాళ్లకు రశీదు ఇవ్వగానే ఆ రశీదును బట్టి డ్రమ్ము ఇచ్చారు. మరో రశీదు ఇస్తే సర్జికల్ కిట్ అని ఉన్న కవర్ ఇచ్చారు. డ్రమ్ము మీద ఉన్న లేబుల్‌పై ‘బ్యూటేన్, బాలాజీ ట్రేడర్స్, కాటేదాన్’ అని ఉంది. సర్జికల్ కిట్‌లో లిక్కర్ లేబుల్స్, క్యాప్ సీల్స్, మూతలు, విస్కీ ఎసెన్స్, క్యారామిల్ బాటిల్స్ ఉన్నాయి. వాటిని ‘సాక్షి’ ప్రతినిధి రహస్యంగా చిత్రీకరించారు. రేపు వచ్చి సరుకు తీసుకుంటామని చెప్పి అక్కడి నుంచి బయటపడ్డారు. ఇథైల్ స్థానంలో మిథైల్ కలిస్తే ప్రాణాంతకం..! ఈ అక్రమ, నకిలీ మద్యం దందాలో కీలకమైన విషయం ఏమిటంటే.. డిస్టిలరీల్లో మద్యం తయారీకి ఉపయోగించే ముడిపదార్థాలనే దొంగతనంగా తెప్పించి, రహస్యంగా తయారు చేసి, నకిలీ లేబిళ్లు వేసి విక్రయిస్తున్నారు. అందులో ముఖ్యమైనది ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్‌ను శుద్ధిచేస్తే ఈఎన్ఏ అవుతుంది. ఇక్కడే పెను ప్రమాదానికి ఆస్కారం ఉంటుంది. ఇథైల్ ఆల్కహాల్ స్థానంలో పొరపాటున మిథైల్ ఆల్కహాల్ వస్తే.. ఇక అంతే సంగతులు. దానితో చేసిన మద్యం తాగిన వారందరూ మృత్యువాతపడతారు. ఇదే కారణంతో గతంలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం గంగలకుర్తిలో నకిలీ మద్యం తాగి 18 మంది చనిపోయారు. గత ఏడాది కృష్ణా జిల్లా మైలవరంలో మరో 13 మంది గిరిజనులు కూడా ఇలాంటి నకిలీ మద్యం తాగి చనిపోయారు. డిస్టిలరీల్లో కాకుండా వెలుపల దొంగతనంగా తయారు చేసే నకిలీ మద్యంతో ఈ ప్రమాదం ఎల్లప్పుడూ పొంచే ఉంటుంది. మన డిస్టిలరీల్లో ప్రతి చుక్కకూ లెక్క..! రాష్ట్ర డిస్టిలరీల నుంచి మద్యం అక్రమంగా బయటికి వచ్చే అవకాశం చాలా తక్కువ. ఎక్సైజ్ నిబంధనలు చాలా కఠినంగా ఉన్నాయి. ప్రతి డిస్టిలరీ ఎక్సైజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్, కనీసం ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్ఐలు, ఆరు మంది కానిస్టేబుళ్ల పర్యవేక్షణలో ఉంటుంది. తరచుగా ఎన్ఫోర్స్మెంట్ తనిఖీలు ఉంటాయి. లిక్కర్ తయారీకి ముడి పదార్థం ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ (ఈఎన్ఏ). ఇది ఎక్సైజ్ అధికారుల అధీనంలో ఉంటుంది. డిస్టిలరీ యాజమాన్యం ఉపయోగించిన ప్రతి చుక్క ఈఎన్ఏను ఎప్పటికప్పుడు రికార్డు చేస్తారు. యాజమాన్యం ఈఎన్ఏ వినియోగానికి ఎక్సైజ్ కమిషనర్ నుంచి అనుమతి పొందిన దాని కంటే ఎక్కువగా వినియోగించటానికి అనుమతించరు. ఒకవేళ అనుమతించినా వెంటనే దొరికిపోతారు. స్టాకు వివరాలను ఉదయం ఓపెనింగ్ రీడింగ్, రాత్రి క్లోజింగ్ రీడింగ్‌ను రికార్డు చేస్తారు. ఆ రోజు వినియోగించిన మొత్తం ఈఎన్ఏ రీడింగ్ కూడా నమోదు చేస్తారు. వాటి ద్వారా వచ్చిన లిక్కర్ కేసుల వివరాలు రికార్డు చేస్తారు. ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా వెంటనే తెలిసిపోతుంది. అదే జరిగితే ముందు ఎక్సైజ్ అధికారుల మీద తక్షణ వేటు పడుతుంది. తరువాత డిస్టిలరీ మీద చర్యలు ఉంటాయి. కాబట్టి మన రాష్ట్రంలో డిస్టిలరీ యాజమాన్యాలు మద్యాన్ని కానీ, ఈఎన్ఏను కానీ అక్రమంగా బయటికి పంపడానికి సాహసించ వు.


