
సాక్షి, హైదరాబాద్ : శంషాబాద్‌లో మంగళవారం భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ఓ ఇంటిపై దాడి చేసిన ఎక్సైజ్ అండ్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రూ. లక్షలు విలువైన నకిలీ మద్యాన్ని సీజ్ చేశారు. బ్రాండ్ల పేరుతో నకిలీ మద్యాన్ని తయారుచేస్తున్న నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. పండుగ సమయంలో నకిలీ మద్యం తయారు చేసి విక్రయిస్తున్నారనే సమాచారంతో అధికారులు ఈ దాడులు జరిపినట్టుగా తెలుస్తోంది.