సాక్షి, హైదరాబాద్: భారీ వర్షాలతో వరద ముంపు ఎక్కువగా ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, సాహసాలు చేయొద్దని పోలీసులు చేస్తున్న హెచ్చరికలను కొందరు పట్టించుకోవడం లేదు. వాగులు, వంకల్ని దాటేస్తామని మూర్ఖంగా అడుగేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే వరద కాలువలను దాటుతూ తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో జనం గల్లంతయ్యారు. తాజాగా హయత్ నగర్ ప్రాంతంలో ముగ్గురు యువకులు వేర్వేరు ఘటనల్లో వాగులో చిక్కుకుని స్థానికుల సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. వివరాలు.. భారీ వరదలతో హయత్ నగర్-మునగనూరుకు మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి.
పెద్ద ఎత్తున వరద నీరు చెరువుల నుంచి అలుగుపారడంతో రోడ్డు పూర్తిగా మునిగిపోయింది. అయితే, బైక్‌పై వచ్చిన ఓ వ్యక్తి వరదను దాటుకుని అవతలి ఒట్డుకు చేరేందుకు యత్నించగా.. వరద ఉధృతికి బైక్‌తో సహా కొట్టుకుపోయింది. ఓ నలుగురు యువకులు సత్వరం స్పందించి అతనికి చేయందించి వరదలో కొట్టుకుపోతుండగా రక్షించారు. మరో ఇద్దరు యువకులు కూడా ఇదే తరహాలో వరద మధ్యలో చిక్కుకున్నారు. బైక్‌పై వారు అవతలి వైపునకు వెళ్లే క్రమంలో వరద తాకిడికి బైక్ కొట్టుకుపోయింది. ఇద్దరు యువకులను స్థానిక యువకులు తాళ్ల సాయంతో ఒడ్డుకు చేర్చారు.
Comments
Please login to add a commentAdd a comment