హయత్‌నగర్‌లో దారుణం చోటుచేసుకుంది. కేవలం నాలుగు రూపాయల చిల్లర విషయమై ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. హయత్ నగర్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి... వర్డ్ అండ్ డీడ్ స్కూలు సమీపంలోని పాన్‌షాపులో రాజేష్ అనే వ్యక్తి సిగరెట్ కొన్నాడు. సిగరెట్ కోసం కొంత డబ్బు ఇవ్వగా షాపతను వినియోగదారుడు రాజేష్‌కు నాలుగు రూపాయలు తిరిగి ఇవ్వాల్సి వచ్చింది. దీంతో షాపు ఓనర్‌తో రాజేష్‌కు వివాదం తలెత్తింది.