హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం అబ్దుల్లాపూర్మెట్లోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. లక్షా 25 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండు కార్లు, నాలుగు బైకులతోపాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.