‘బాహుబలి’షూటింగ్‌లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు | four injured in bahubali cinema shooting | Sakshi
Sakshi News home page

‘బాహుబలి’షూటింగ్‌లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు

Oct 13 2014 8:00 AM | Updated on Mar 28 2018 11:05 AM

‘బాహుబలి’షూటింగ్‌లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు - Sakshi

‘బాహుబలి’షూటింగ్‌లో అపశ్రుతి.. నలుగురికి గాయాలు

రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది.

సాక్షి, హైదరాబాద్: రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న బాహుబలి సినిమా షూటింగ్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం సాయంత్రం ఫైటింగ్ సీన్ చేస్తుండగా పేలుడు సంభవించి నలుగురికి మంటలు అంటుకున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం... హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని రామోజీ ఫిలింసిటీలో బాహుబలి చిత్రం పోరాట దృశ్యాల చిత్రీకరణ సాగుతోంది.

పెద్దఎత్తున కుంకుమను వెదజల్లేందుకు పేలుడు పదార్థాలను ఉపయోగించారు. దీంతో మంటలు ఎగిసిపడ్డాయి. మంటల ఫైటింగ్ సీన్‌లో పాల్గొనేందుకు వచ్చి పక్కనే నిల్చున్న నలుగురు ఫైటర్లకు అతి సమీపంగా అవి ఎగిసిపడ్డాయి. దీంతో ఫైటర్లు సతీష్, పాండు, గణేశ్, సంతోశ్‌లకు స్వల్పంగా గాయాలయ్యాయి. వారు హయత్‌నగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించుకుని వెళ్లిపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement