హయాత్‌నగర్ : రంగారెడ్డి జిల్లా హయాత్‌నగర్ మండలం ఇనాంగూడ గ్రామ సమీపంలో మంగళవారం ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొన్నాయి. ఈ సంఘటనలో బస్సులోని పది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. విజయవాడకు చెందిన ఆర్టీసీ బస్సును వేగంగా వెళుత్ను లారీ ఢీకొట్టింది.
లారీ డ్రైవర్ నిద్రమత్తులో ఉండడంతో అదుపు తప్పి బస్సును ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ప్రమాదం జరిగిన స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.