Car Accident At Old City's Mir Chowk - Sakshi
Sakshi News home page

HYD: కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకులు హల్‌చల్‌

Published Mon, Aug 14 2023 7:28 AM | Last Updated on Mon, Aug 14 2023 8:37 AM

Car Accident At Old City Mir Chowk - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పాతబస్తీ మీర్‌చౌక్‌లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. హైస్పీడ్‌లో దూసుకెళ్లారు. ఈ క్రమంలో కిలోమీటర్‌ మేర వాహనాలను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. 

వివరాల ప్రకారం.. మీర్‌చౌక్‌లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. హైస్పీడ్‌లో కారు నడుపుతూ వాహనాలకు ఢీకొడుతూ ముందుకు సాగారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం, స్థానికులు కారును వెంబడించి వాహనాన్ని ఆపి యువకులకు దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. 

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఫోన్‌ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement