Mir Chowk police station
-
HYD: కారు బీభత్సం.. మద్యం మత్తులో యువకులు హల్చల్
సాక్షి, హైదరాబాద్: పాతబస్తీ మీర్చౌక్లో కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో కారు నడిపిన యువకులు.. హైస్పీడ్‌లో దూసుకెళ్లారు. ఈ క్రమంలో కిలోమీటర్ మేర వాహనాలను ఢీకొడుతూ కారు దూసుకెళ్లింది. వివరాల ప్రకారం.. మీర్చౌక్లో మద్యం మత్తులో ఉన్న యువకులు కారు నడుపుతూ బీభత్సం సృష్టించారు. హైస్పీడ్‌లో కారు నడుపుతూ వాహనాలకు ఢీకొడుతూ ముందుకు సాగారు. ఈ ప్రమాదంలో ఆరుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం, స్థానికులు కారును వెంబడించి వాహనాన్ని ఆపి యువకులకు దేహశుద్ధి చేశారు. ఈ సందర్భంగా కారులో మద్యం బాటిళ్లను గుర్తించారు. ఇది కూడా చదవండి: ఫ్రీగా ఫోన్ అని ఆశ చూపి.. బాలికను గదిలోకి తీసుకెళ్లి -
విషాదం.. సెల్ ఫోన్లో మాట్లాడుతూ..
సాక్షి, డబీర్‌పురా: సెల్ఫోన్లో మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన హరీష్, లక్ష్మణ్ (22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జహేరానగర్ ప్రాంతంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారిద్దరూ నిర్మాణంలో ఉన్న మోయిన్ ఆలం ఖాన్ భవనంలోని 5వ అంతస్తుకు వెళ్లారు. ఫోన్ మాట్లాడుతున్న లక్ష్మణ్ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మీర్ పేటలో బాలిక అదృశ్యం
ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన ఓ బాలిక కనిపించకుండా పోయిన సంఘటన మీర్‌చౌక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన ఇషఫ్రిల్ కుటుంబం గత కొన్ని రోజులుగా మీర్‌చౌక్ మోడ్రన్ కాంప్లెక్స్‌లో నివాసం ఉంటోంది. కాగా, ఇషఫ్రిల్ కూతురు అస్మా (14) ఈ నెల 5వ తేదీన ఉదయం 7 గంటలకు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లింది. అనంతరం ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు చుట్టు పక్కల ప్రాంతాలతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లల్లో వాకబు చేశారు. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోవటంతో మీర్‌చౌక్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు అస్మా పంజాబీ డ్రెస్సు ధరించి ఉందని.. ఆచూకీ తెలిసిన వారు 040-27854797, 9490616749 ఫోన్ నంబర్లలో సంప్రదించాలని కోరారు.