
సాక్షి, డబీర్‌పురా: సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ ఓ యువకుడు ప్రమాదవశాత్తు భవనం 5వ అంతస్తు పైనుంచి కిందపడి మృతి చెందిన సంఘటన బుధవారం మీర్‌చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన హరీష్, లక్ష్మణ్ (22) బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి జహేరానగర్ ప్రాంతంలో ఉంటున్నారు. మంగళవారం రాత్రి వారిద్దరూ నిర్మాణంలో ఉన్న మోయిన్ ఆలం ఖాన్ భవనంలోని 5వ అంతస్తుకు వెళ్లారు. ఫోన్ మాట్లాడుతున్న లక్ష్మణ్ ప్రమాదవశాత్తు 5వ అంతస్తు నుంచి కింద పడ్డాడు. స్థానికులు అతడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment