నగరంలోని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలోని మారుతి షో రూంలో భారీ అగ్నిప్రమాదం శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది.
హైదరాబాద్ : నగరంలోని ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ సమీపంలోని మారుతి షో రూంలో శుక్రవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మారుతి షోరూమ్‌లోని 2, 3 అంతస్తుల్లో ఉన్నకార్లకు మంటలు అంటుకోవడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. పెద్దఎత్తునా మంటలు చెలరేగడంతో అక్కడి షోరూంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో మంటలను ఆర్పేందుకు రెండు ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలికి చేరుకున్నాయి.