రూ. 3.25 కోట్లు స్వాధీనం: అనంత ఎస్పీ | Rs 3.25 crore cash seized, says Anantapur Superintendent of Police | Sakshi
Sakshi News home page

రూ. 3.25 కోట్లు స్వాధీనం: అనంత ఎస్పీ

Published Sun, Mar 9 2014 10:32 AM | Last Updated on Fri, Jun 1 2018 8:31 PM

Rs 3.25 crore cash seized, says Anantapur Superintendent of Police

అనంతపురం పరగి చెక్పోస్ట్ వద్ద ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా కారులో  తరలిస్తున్న రూ. 9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఎన్నికలు నేపథ్యంలో ఇప్పటి వరకు పోలీసుల తనిఖీలలో రూ. 3.25 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు అనంత జిల్లా ఎస్పీ సెంథిల్కుమార్ వెల్లడించారు.

 

అలాగే 1100 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. 4 బాంబులు, 5 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అక్రమ మద్యం సమస్యగా మారిందన్నారు.  కర్ణాటక రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం రవాణా అవుతోందని ఆ సమస్యను త్వరలో నిరోధించేందుకు చర్యలు చేపడతామన్నారు. జిల్లాకు మరో 5 వేల మంది అదనపు పోలీసు సిబ్బంది అవసరం ఉందని సెంథిల్కుమార్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement