హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు.