Huge money
-
Cyber Crimes: రూ.1100 కోట్లు చేజారకుండా ఆపిన పోలీసులు
న్యూఢిల్లీ: గడిచిన ఏడాదిలో కేంద్ర ప్రభుత్వం సైబర్‌నేరగాళ్ల ఆట కట్టించింది. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని పెద్ద ఎత్తున సైబర్ నేరాలను అడ్డుకుంది. సైబర్ నేరగాళ్లు కొట్టేయడానికి ప్రయత్నించిన రూ.1100 కోట్లను వారి ఖాతాల్లోకి వెళ్లకుండా చివరి నిమిషంలో సైబర్ క్రైమ్ పోలీసులు ఆపగలిగారు. ఒక లక్ష జనాభాకుగాను గతేడాది అత్యధికంగా హర్యానాలో 381 సైబర్ క్రైమ్ నేరాలు రిపోర్ట్ అయ్యాయి. తెలంగాణలో 261, ఉత్తరాఖండ్ 243, గుజరాత్ 226, గోవాలో 166 కేసులు నమోదయ్యాయి. ఇక కేంద్ర పాలిత ప్రాంతాల్లో అత్యధికంగా ఢిల్లీలో లక్ష జనాభాకు 755 కేసులు, చండీగఢ్‌లో 432 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరగాళ్ల ఆట కట్టించడంలో భాగంగా సైబర్ నేరగాళ్లకు చెందిన 2,95,461 సిమ్ కార్డులను, 2810 వెబ్సైట్లు, 585 మొబైల్ యాప్‌లు,46,229 ఐఎంఈఐలను కేంద్ర హోం శాఖ బ్లాక్ చేసింది. ఇదీచదవండి.. అశోక్ గహ్లోత్ కుమారుని ఇంటిపై ఈడీ సోదాలు -
తెలంగాణలో ఎన్నికలు ప్రశాంతం
-
హైదరాబాద్ లో భారీగా నగదు, బంగారం సీజ్
-
వికారాబాద్ జిల్లాలో HDFC ఖాతాలోకి భారీగా డబ్బు జమ
-
ట్రావెల్ బస్సుల్లో కళ్లు బైర్లు కమ్మే షాకింగ్ సీన్..
నల్లజర్ల/ప్రత్తిపాడు/నరసన్నపేట:ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో పెద్దఎత్తున అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని రెండు వేర్వేరు టోల్‌ప్లాజాల వద్ద శుక్రవారం వేకువజామున ఈ తనిఖీలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద నిర్వహించిన సోదాల్లో రూ.4.76 కోట్ల నగదు, 352 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జరిపిన తనిఖీల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడింది. వివరాలివీ.. వీరవల్లి టోల్‌ప్లాజా వద్ద శుక్రవారం వేకువజామున పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన ఏపీ 37టీబీ7555 నంబరు గల బస్సులో ప్రయాణికుల సీట్ల కింద, లగేజీ డిక్కీలోనూ 11 పార్శిళ్లలో ఉన్న నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఈ మొత్తాన్ని రూ.4,76,89,050 లుగా లెక్కగట్టారు. అలాగే.. 352.892 గ్రాముల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. బస్సు డ్రైవరు, క్లీనరుతో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వీరుగాక మరో ఏడుగురు వ్యక్తులు మూడు కార్లలో బస్సు వెనకాలే వస్తున్నట్లు గుర్తించి, అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జీఎస్టీ తప్పించుకునేందుకే.. గతంలో బంగారం వ్యాపారం చేసే పిన్నిని కోటేశ్వరరావు, రమేష్ అన్నదమ్ములు. నరసన్నపేటలో ఉండే వీరు ప్రస్తుతం విజయవాడలో ఉంటున్నారు. శ్రీకాకుళంలోని వ్యాపారులకు జీఎస్టీ బిల్లులు లేకుండా (జీరో బిజినెస్) బంగారం ఇప్పిస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ఉగాదికి వరుసగా సెలవులు రావడంతో ముందుగానే వ్యాపారుల వద్ద డబ్బు తీసుకుని బంగారం కొనుగోలుకు బయలుదేరి పోలీసులకు చిక్కారు. మరోవైపు.. బంగారం కొనుగోలు నిమిత్తం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నుంచి విజయవాడకు ఈ డబ్బు తీసుకెళ్తున్నట్లు వారు వెల్లడించారు. తిరిగి ఇదే బస్సులో సాయంత్రం బంగారం తరలించనున్నట్లు తెలిపారు. ఇలా నెలకు నాలుగైదుసార్లు వెళ్తుంటామన్నారు. ఇక పట్టుబడ్డ నోట్ల లెక్కింపు కార్యక్రమంలో కొవ్వూరు డీఎస్పీ త్రినా«థ్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రవికుమార్, నల్లజర్ల తహసీల్దారు ఎ.శ్రీనివాస్, సీఐలు ఆకుల రఘు, వైవీ రమణ పాల్గొన్నారు. దీనిపై ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ.. స్వాధీనం చేసుకున్న నగదు, బంగారాన్ని ప్రభుత్వ కస్టడీకి పంపినట్లు వెల్లడించారు. ‘తూర్పు’లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం.. ఇక తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద గంజాయి కోసం మాటువేస్తే అక్రమంగా తరలిస్తున్న బంగారం, నగదు పట్టుబడ్డాయి. జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు ఆదేశాలతో జగ్గంపేట సీఐ బి సూర్య అప్పారావు, కిర్లంపూడి ఎస్సై తిరుపతిరావు తమ సిబ్బందితో టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపట్టారు. ఎదురెదురు మార్గాల్లో వస్తున్న పద్మావతి ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సులను సోదాచేశారు. దీంతో బ్యాగుల్లో రూ.5.06 కోట్ల నగదు, 10 కేజీల బంగారం పట్టుబడినట్లు పెద్దాపురం డీఎస్పీ అరిటాకుల శ్రీనివాసరావు తెలిపారు. రెండు బస్సుల డ్రైవర్లను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ సొత్తుకు సంబంధించి ఎలాంటి రశీదులూ లేవని తెలిపారు. నరసన్నపేటలో కలకలం పద్మావతి ట్రావెల్స్ బస్సుల్లో పెద్దఎత్తున డబ్బు, బంగారం పట్టుబడిందన్న సమాచారంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలోని వ్యాపారులు ఉలిక్కిపడ్డారు. అంతాకలిసి హడావుడిగా పశ్చిమగోదావరి జిల్లాకు బయల్దేరారు. వీరి కదలికలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పట్టుబడిన సొత్తు అంతా పలాస, నరసన్నపేటకు చెందిన హోల్‌సేల్ వ్యాపారులదేనని తెలుస్తోంది. వీటికి ఆధారాలు చూపించి వాటిని వెనక్కి తీసుకునేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఇక నిత్యం పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం ప్రాంతాల నుంచి విజయవాడ వెళ్లే ప్రైవేటు బస్సులు శుక్రవారం ఈ ఘటనలతో నిలిచిపోయాయి. -
వసూలు చేసింది రూ.14.5 లక్షలు చేతికి రూ.1.91 లక్షల బిల్లు
సికింద్రాబాద్ పాన్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తి(53) కోవిడ్‌తో బాధపడుతూ జూలై 24న బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. హెల్త్‌కార్డుపై చికిత్సకు ఆస్పత్రి నిరాకరించింది. వైద్యులు రెండురోజులపాటు సాధారణ ఐసీయూలో ఉంచారు. 26వ తేదీ నుంచి ఆగస్టు 4 వరకు వెంటిలేటర్‌పై చికిత్స అందించగా అదేరోజు ఆయన చనిపోయారు. 12 రోజులకు రూ.14.50 లక్షల బిల్లు వసూలు చేశారు. ఇన్సూరెన్స్ సంస్థ నుంచి క్లెయిమ్ చేసుకునేందుకుగాను బిల్లు తాలూకు రశీదు ఇవ్వాలని కుటుంబసభ్యులు కోరగా రూ.1,91,700 బిల్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నించగా, జీవో మేరకే బిల్లు ఇచ్చామని స్పష్టం చేసింది. ఎక్కువ మాట్లాడితే... మీ జువెలరీ షాప్‌పై ఐటీ దాడులు చేయిస్తామని ఆస్పత్రి యాజమాన్యం బాధితుడి కుటుంబ సభ్యులను బెదిరిస్తుండటం గమనార్హం. నారాయణగూడకు చెందిన ఓ వ్యక్తి(68) కూడా కోవిడ్‌తో ఇటీవల ఇదే ఆస్పత్రిలో చేరారు. 18 రోజుల చికిత్సకు రూ.18 లక్షలు చెల్లించారు. డిటైల్డ్ బిల్లు ఇవ్వాల్సిందిగా కుటుంబసభ్యులు కోరగా అలా ఇవ్వడం కుదరదని ఆస్పత్రి యాజమాన్యం స్పష్టం చేసింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం రశీదు ఇవ్వాలని కోరితే రూ.5 లక్షల బిల్లు ఇవ్వడంతో కుటుంబసభ్యులు విస్తుపోవాల్సి వచ్చింది. బోయినపల్లికి చెందిన ఓ ప్రముఖ బిల్డర్ కుటుంబసభ్యులు నలుగురు ఇటీవల కోవిడ్ బారిన పడి చికిత్స కోసం ఇదే ఆస్పత్రిలో చేరారు. ఇందులో బిల్డర్ తండ్రి కోవిడ్‌తో మృతి చెందగా... ముగ్గురు కోలుకున్నారు. కానీ వారికి అయిన బిల్లు చూస్తే షాక్ తప్పదు. రూ.50 లక్షలు చెల్లించగా వారికి ఆస్పత్రి వర్గాలు ఇచ్చిన బిల్లు రూ.2 లక్షలే. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 79,495 పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 45 వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 627 మంది కోవిడ్‌తో మృతి చెందగా, వీరిలో 500 మందికిపైగా సిటిజనులే. ప్రభుత్వం ప్యాకేజీ నిర్ణయించిన ధరలు తమకు గిట్టుబాటు కావని కార్పొరేట్ యాజమాన్యాలు స్పష్టం చేశాయి. ఈహెచ్ఎస్, జీహెచ్ఎస్, సీహెచ్ఎస్, ఈఎస్‌ఐసహా ఇతర ప్రైవేటు సంస్థల ఇన్సూరెన్సులను కలిగినవారికి ఈ ప్యాకేజీలు వర్తించవని ప్రభుత్వమే స్పష్టం చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న యాజమాన్యాలు ఐసీయూ, వెంటిలేటర్ పడకలకు కృత్రిమ కొరత సృష్టిస్తున్నాయి. రోగుల బలహీనత.. వారికి కాసులపంట అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న రోగుల బలహీనతను ఆస్పత్రులు క్యాష్ చేసుకుంటున్నాయి. షరతులు విధిస్తున్నాయి. నగదు చెల్లించేందుకు అంగీకరించేవారికే అడ్మిషన్లు ఇస్తున్నాయి. రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు డిపాజిట్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నాయి. ఒక్కో రోగి నుంచి రూ.10 లక్షల నుంచి 15 లక్షల వరకు వసూలు చేస్తున్నాయి. ‘ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకుంటాం’పూర్తి బిల్లులకు రశీదులివ్వాలని కోరితే పలు యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భారీగా డబ్బులు దండుకుంటున్న ఆస్పత్రులపై కఠినచర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. -
బుడ్డా వాహనంలో రూ.10 కోట్లు?
సాక్షి, అమరావతి: పోలింగ్ ముంగిట టీడీపీ నేతలు పెద్ద ఎత్తున డబ్బుల పంపిణీ, విపక్షంపై దుష్ప్రచారానికి తెరతీశారు. ఆ పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాలు రోజుకోవిధమైన తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయి. రెండురోజుల క్రితం ఎల్లో మీడియాకు చెందిన ఒక ఛానల్.. ఎంపీ విజయసాయిరెడ్డి, మరో నాయకుడితో మాట్లాడుతున్నట్లుగా ఒక ఆడియో టేపును ప్రసారం చేసి ఏదో జరిగిపోతోందనే హడావుడి చేసింది. నిజానికి ఆ ఆడియో టేపులో గొంతుకు, విజయసాయిరెడ్డి గొంతుకు సంబంధం లేనట్లు స్పష్టంగా తెలిసిపోతూనే ఉంది. అయినా దాన్ని ప్రసారం చేయడం ద్వారా ఆ ఛానల్ తన దిగజారుడుతనాన్ని ప్రదర్శించింది. మరోవైపు టీడీపీ నాయకులు ఐదేళ్లలో అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. డబ్బులు పంపిణీ చేస్తున్న తెలుగుదేశం నాయకులను పలుచోట్ల పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం. పెద్దయెత్తున తరలిస్తున్న నగదును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రతి నియోజకవర్గంలో రూ.30 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు డబ్బు వెదజల్లేందుకు టీడీపీ నేతలు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో ఓటుకు ఐదు వేల చొప్పున పంచుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరంలో ఓటుకు మూడు వేలు పంపిణీ చేయిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. గన్నవరం, పెనమలూరు, మచిలీపట్నం, విజయవాడ సెంట్రల్, తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో మొదటి విడతలో భాగంగా రూ.1,000, రూ.2,000 చొప్పున టీడీపీ నేతలు పంపిణీ చేస్తున్నారు. మంత్రులు గుంటూరులో పుల్లారావు, నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిలు కూడా అవినీతి సొమ్మును భారీగీ వెదజల్లుతున్నారు. విశాఖ నార్త్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు, మంత్రి అయ్యన్నపాత్రుడు విపరీతంగా డబ్బులు పంచుతున్నట్లు తెలుస్తోంది. మద్యం పట్టివేత.. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగిలో టీడీపీ నేత ఆళ్ల వీరారెడ్డి అలియాస్ మున్నంగి వీరారెడ్డికి చెందిన గోడౌన్లో ఆదివారం రాత్రి 562 మద్యం (క్వార్టర్లు) సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గోడౌన్ గతంలో వేరే వ్యక్తికి లీజుకు ఇచ్చారు. అయితే ఎన్నికల సందర్భంగా పంపిణీ చేసేందుకు టీడీపీ నాయకులే మద్యం నిల్వ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు తెనాలి నాజరుపేట శివారులో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి ముందు, రోడ్డు వెంబడి 90 క్వార్టర్ల చీప్ లిక్కర్ సీసాల బస్తాను వన్‌టౌన్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున గుర్తించి స్వాధీనపర్చుకున్నారు. బుడ్డా వాహనంలో రూ.10 కోట్లు? కర్నూలు/ఓర్వకల్లు/ సాక్షి నెట్వర్క్: ఆదివారం కర్నూలు జిల్లా నన్నూరు టోల్‌ప్లాజా వద్ద కర్నూలు వైపు నుంచి వేల్పనూరు వైపు వెళుతున్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న ఏపీ 21బీయూ 0009 నంబరు గల స్కార్పియో వాహనాన్ని పోలీసులు తనిఖీ చేసే ప్రయత్నం చేశారు. అయితే ఫ్రీ రోడ్డు గుండా వచ్చిన స్కార్పియో డోర్‌ను తెరిచినట్టే తెరిచి, తనిఖీకి ప్రయత్నిస్తున్న ఏపీఎస్పీ కానిస్టేబుల్ శ్రీనివాసులును నెట్టేసి వేగంగా వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ ప్రతిఘటించి కొద్దిదూరం వరకు వాహనాన్ని వదలకుండా వేలాడుతూ వెళ్లారు. ఆ తర్వాత వాహన వేగాన్ని తగ్గించిన వాహనంలోని వ్యక్తులు.. శ్రీనివాసులును గెంటేసి పరారయ్యారు. టోల్‌ప్లాజా వద్దనున్న సీసీ కెమెరాల ఫుటేజీ ద్వారా వాహనం నంబర్‌ను గుర్తించి ఆన్లైన్లో పరిశీలించగా.. సదరు వాహనం శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పేరుతో ఉన్నట్లు తేలింది. ఈ వాహనంలో రూ.10 కోట్ల నగదు తరలిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి బుడ్డా ఎన్నికల్లో పోటీకి నిరాకరించారు. అయితే చంద్రబాబు పర్యటన సందర్భంగా ఎన్నికల ఖర్చుకు హామీ లభించడంతో తిరిగి పోటీలో నిలిచారు. కేసు నమోదు కానుందన్న సమాచారం అందుకున్న బుడ్డా అనుచరులు వాహనాన్ని సోమవారం ఉదయం అప్పగిస్తామంటూ బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. పట్టుబడ్డ డబ్బులతో నిందితులను చూపిస్తున్న సంతమాగులూరు ఎస్సై నాగరాజు అద్దంకిలో.. రూ.4.3 లక్షలు స్వాధీనం ఓటరు లిస్టు పట్టుకొని నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ మద్దతుదారులను ఆదివారం ప్రకాశం జిల్లా అద్దంకి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పసుమర్తిపాలెం ప్రాంతంలో డబ్బు పంచుతున్న బల్లికురవ మండలం కొనిదెనకు చెందిన శాఖమూరి అశోక్ నుంచి రూ.51 వేలు, గుంటూరుకు చెందిన బి.రాజేష్ నుంచి రూ.1,27,500 నగదు, మద్యం బాటిళ్లు, మరి కొందరి నుంచి రూ.15 వేలు స్వాధీనం చేసుకున్నట్లు అద్దంకి ఎస్ఐ సుబ్బరాజు తెలిపారు. కొరిశపాడు మండలం మేదరమెట్ల పైలాన్ వద్ద బీఎస్సీ తరపున నగదు పంచుతున్న ఆకునూరి సీతారాంబాబు నుంచి రూ.80 వేలు స్వాధీనం చేసుకున్నట్టు స్థానిక ఎస్ఐ తెలిపారు. సంతమాగులూరు మండలం వెల్లలచెరువు, ఏల్చూరు గ్రామాల్లో రూ.60 వేలు పంచుతూ టీడీపీకి చెందిన ముగ్గురు వ్యక్తులు పట్టుబడ్డారు. ఏల్చూరు వడ్డెర కాలనీలో డబ్బులు పంచుతున్న వేముల కుమార్‌ను అదుపులోకి తీసుకొని రూ.1.77 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
ఏపీ సరిహద్దుల్లో నగదు స్వాధీనం
-
ఏపీ సరిహద్దుల్లో పెద్ద మొత్తంలో డబ్బు పట్టివేత
సాక్షి, చెన్నై: హైదరాబాద్ నుంచి చెన్నైకు అక్రమంగా తరలిస్తున్న రూ.1.53 కోట్ల డబ్బును మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు చెందిన ఆ విభాగం అధికారులు గుమ్మిడిపూండి చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఆంధ్రా నుంచి వచ్చిన ఓ ప్రైవేట్ బస్సులో రెండు సూట్ కేసుల్లో ఉన్న నోట్ల కట్టలు బయట పడ్డాయి. వాటిని లెక్కించగా రూ.1.53 కోట్లని తేలింది. ఇందుకు సంబంధించి హైదరాబాద్‌కు చెందిన నీరజ్ గుప్తాను అదుపులోకి తీసుకున్నారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇంత పెద్ద మొత్తం ఎవరైనా రాజకీయ ప్రముఖుల కోసం ఇక్కడికి తరలిస్తున్నారా అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. -
ప్రైవేట్ లాకర్లలో కోట్లాది రూపాయలు
న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని చాందినీ చౌక్‌లో ఓ ప్రైవేట్ సంస్థ నిర్వహిస్తున్న లాకర్లలో భారీగా సొత్తు బయటపడింది. ఖారి బౌలి, చాందినీ చౌక్, నయా బజార్ ప్రాంతాలకు చెందిన వ్యాపారులు ఈ సంస్థకు చెందిన 350 లాకర్లలో డబ్బు, నగలు దాస్తుంటారు. అయితే, వ్యాపారులు పన్నులు ఎగవేసేందుకు లెక్కల్లో చూపని ఆదాయాన్ని ఇక్కడున్న సుమారు 100 లాకర్లలో దాచి ఉంటారని ఆదాయ పన్ను శాఖ(ఐటీ) అధికారులు అనుమానిస్తున్నారు. 39 లాకర్లను తెరిచి చూడగా రూ. 30 కోట్ల నగదు బయటపడిందని, దీన్ని స్వాధీనం చేసుకున్నామని సోమవారం అధికారులు తెలిపారు. మిగతా లాకర్లను కూడా తనిఖీ చేస్తామన్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు, అనధికార లావాదేవీలకు పాల్పడలేదని, తమ సంస్థకు 1992లోనే ఆర్బీఐ అనుమతి లభించిందని ఆ సంస్థ నిర్వాహకుడు స్పష్టం చేశారు. -
కొవ్వుకోట్లు కరిగిస్తున్నారు
రాజశేఖర్.. ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్.. వయసు 29.. మంచి జీతం.. అంతా బాగానే ఉంది.. పెళ్లి చేసేందుకు తల్లిదండ్రులు ఓ సంబంధం చూశారు.. పెళ్లి చూపులకెళ్లారు.. అయితే అక్కడ అమ్మాయికి రాజశేఖర్ నచ్చలేదు! కాస్త లావుగా ఉండటమే అందుకు కారణం. ఎలాగైనా లావు తగ్గా లన్న ఉద్దేశంతో రాజశేఖర్ ఒబేసిటీ ట్రీట్మెంట్కు వెళ్లాడు. ఇలా ఆయన ఒక్కరే కాదు.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లో 14 శాతం మంది యువకులది ఇదే బాధ. ఒబేసిటీ కారణంగా వారంతా పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్టు తాజాగా ఆరోగ్య సంస్థలు చేసిన అధ్యయనంలో బయటపడింది. సాక్షి, హైదరాబాద్ : స్థూలకాయం నగరవాసులకు పెద్ద ఇబ్బందినే తెచ్చిపెట్టింది. పెళ్లి జరగాలంటే బరువు తగ్గించుకోవాల్సిందేనని కండిషన్లు పెట్టే స్థాయికి చేరింది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణాలతో టెకీలు బరువు పెరిగిపోతున్నట్టు డాక్టర్లు చెబుతున్నారు. రాష్ట్ర రాజధానిలో సుమారు 150 వరకు ఒబేసిటీ క్లినిక్‌లున్నాయి. ఒక్కో క్లినిక్‌కు నిత్యం 25 నుంచి 30 మంది వస్తున్నారు. ఈ లెక్కన 3,700 నుంచి 4,500 మంది వరకు ఒబేసిటీ చికిత్స కేంద్రాలను సంప్రదిస్తున్నారు. వీరిలో 65 శాతం మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లే ఉన్నారని, వారిలోనూ పెళ్లికి ముందు బరువు తగ్గించుకోవాలనుకునేవారే ఎక్కువగా ఉంటున్నారు. కొన్ని ప్రముఖ క్లినిక్‌లు వారం నుంచి పదిహేను రోజులు, నెల నుంచి రెండు నెలల పాటు ఉండే ట్రీట్మెంట్కు రూ.65 వేల నుంచి రూ.80 వేల వరకు వసూలు చేస్తున్నాయి. ఏటా హైదరాబాద్‌లోనే ఒబేసిటీ ట్రీట్మెంట్కు బాధితులు రూ.243 నుంచి రూ.275 కోట్ల దాకా వెచ్చిస్తున్నట్టు వెల్లడైంది. లావైపోతున్నారు.. ఒబేసిటీ సమస్య ఏటేటా పెరిగిపోతున్నట్టు 2015–16లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ చేపట్టిన ‘నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే’లో తేలింది. తెలంగాణలో 32 శాతం మంది మహిళలు, 29 శాతం మంది పురుషులు ఒబేసిటీతో బాధపడుతున్నట్టు ఈ అధ్యయనంలో స్పష్టమైంది. 2005–06లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేసిన అధ్యయనంలో 17.7 శాతం మంది మహిళలు, 17.6 శాతం మంది పురుషులు అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నట్టు తేలింది. మా మరదలే అయినా చిన్నప్పట్నుంచి నాతో పాటు కలిసి పెరిగిన మా మేనమామ కూతురిని పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఎంఎస్ పూర్తిచేసి బెంగళూరులో పనిచేస్తున్నా. అయితే పెళ్లికి మరదలు ఒప్పుకోవడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే.. లావుగా ఉన్నానని చెప్పింది. దీంతో ఓ హోమియోపతి ఒబేసిటీ సెంటర్‌కు వెళ్లి రూ.1.6 లక్షల ప్యాకేజీతో 4 నెలల కోర్సుకు ట్రీట్మెంట్ తీసుకుంటున్నా. – రవిశంకర్, నిజామాబాద్ ఇంటర్ నుంచి బరువు పెరిగా నేను వరంగల్‌లో ఇంటర్ చదువుతున్న సమయంలో బరువు పెరిగాను. ఇంజనీరింగ్, తర్వాత స్పెషలైజేషన్ కోర్సు పూర్తయ్యే సరికి 90 కేజీలకు చేరా. ప్రస్తుతం ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో చేరా. పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. బరువు తగ్గేందుకు వారం క్రితమే మాదాపూర్‌లోని ఓ ఒబేసిటీ క్లినిక్‌ను సంప్రదించా. మూడు నెలల ట్రీట్మెంట్ కోర్సుకు రూ.1.2 లక్షలు తీసుకున్నారు. – శృతి, మాదాపూర్ -
అమరావతి భవనాలకు అడుగుకు దిమ్మతిరిగే రేటు
-
రాజధాని నిర్మాణంలో అడుగుకు దిమ్మతిరిగే రేటు
సాక్షి, అమరావతి: మీరు ఓ ఇల్లు కట్టుకుంటున్నారనుకోండి.. నిర్మాణవ్యయం ఎంత ఉంటుంది? చదరపు అడుగుకి రూ.1,500 నుంచి రూ. 2,000 లోపు ఉండవచ్చు. ఎంత విలాసవంతమైన నిర్మాణానికైనా చదరపు అడుగుకి రూ.3వేలకు మించదని నిపుణులంటున్నారు. కానీ చంద్రబాబునాయుడు ప్రభుత్వం మాత్రం కాంట్రాక్టర్లకు అమరావతిలో భూమి ఉచితంగా ఇచ్చి మౌలికవసతులు కల్పించి నిర్మాణం కోసం భారీగా డబ్బు వెదజల్లబోతోంది. తాజాగా సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుగుకు రూ. 7,179 వెచ్చించబోతోంది. కనీవిని ఎరుగని రీతిలో రెట్టింపునకు మించి ఎందుకు ఖర్చుచేయబోతోంది? ఇందులో ఇమిడి ఉన్న రహస్యమేమిటి? ఎంతోకాలంగా నిర్మాణ రంగంలో ఉన్న నిపుణులను సైతం అమరావతి భవనాల నిర్మాణ అంచనాలు విస్మయం గొలుపుతున్నాయి. అనుకూల కాంట్రాక్టర్లకు అదనంగా దోచిపెట్టడానికే ఈ స్థాయిలో భారీ అంచనాలు రూపొందించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడున్నరేళ్లపాటు డిజైన్లనే ఖరారు చేయని రాష్ట్రప్రభుత్వం ఇపుడు హడావిడిగా భారీ అంచనాలు రూపొందించడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారీ స్థాయిలో అంచనాలు.. రాజధాని అమరావతిలో తాత్కాలిక నిర్మాణాలను కూడా ఎక్కడా లేని స్థాయిలో భారీ వ్యయాలతో చేపడుతున్న ప్రభుత్వం తాజాగా అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు భవనాలకు మరింత దిమ్మతిరిగే అంచనాలు రూపొందించింది. సచివాలయ నిర్మాణానికే రూ.2,728 కోట్లు, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు రూ.2,229 కోట్లు అవసరమవుతాయని రాష్ట్రప్రభుత్వం అంచనా వేసింది. అంటే ఈ మూడు భవనాలకే దాదాపు ఐదు వేల కోట్లు ఖర్చవుతాయని లెక్కగట్టారన్నమాట. వీటికి సంబంధించి సీఆర్డీఏ త్వరలో టెండర్లు పిలవనుంది. రెండేళ్ల క్రితం పరిపాలనా నగర నిర్మాణానికి ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కేవలం మూడు భవనాలకే ఐదు వేల కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనావేయడం గమనార్హం. (ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నమూనా చిత్రం) చదరపు అడుగుకు రూ. 7,179 మూడు భవనాల నిర్మాణానికి గాను రాష్ట్రప్రభుత్వం వేసిన అంచనాల ప్రకారం సచివాలయ నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.7,179, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. సాధారణ భవనాల నిర్మాణానికి చదరపు అడుక్కి రూ.1,500 ఖర్చవుతుండగా విలాసవంతంగా నిర్మించినా మూడు వేలు మించదని నిర్మాణ రంగ నిపుణులు చెబుతున్నారు. అలాంటిది ఈ మూడు భవనాలకు చదరపు అడుగుకు ఏకంగా ఆరు నుంచి ఏడు వేల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేస్తూ త్వరలో టెండర్లు పిలవడానికి రాష్ట్రప్రభుత్వం సన్నాహాలు చేస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తాత్కాలిక భవనాలకూ ఇదే తీరు.. వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ భవనాలకు ప్రభుత్వం ఇలాగే భారీగా ఖర్చు పెట్టింది. చదరపు అడుగుకు రూ.3,150 చొప్పున టెండర్లను ఖరారు చేసినా చివరికి దాన్ని ఆరు వేల రూపాయల వరకూ తీసుకెళ్లింది. అందుకే రూ.180 కోట్ల నుంచి మొదలైన ఈ నిర్మాణాల వ్యయం ప్రభుత్వం లెక్కల ప్రకారమే రూ.660 కోట్లయింది. మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర ఖర్చులతో కలిపి ఈ తాత్కాలిక భవనాలకు సుమారు వెయ్యి కోట్లు అయినట్లు అనధికారిక సమాచారం. ఈ నేపథ్యంలో ప్రాథమిక అంచనాలే రూ.ఐదు వేల కోట్లుగా ఉన్న ఈ ఐకానిక్ భవన నిర్మాణాల ఖర్చు చివరికి వచ్చేసరికి అంతకంతకు రెట్టింపు కావచ్చనే∙అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మౌలికవసతులు, గ్రీనరీకి రెట్టింపు ఖర్చు.. సచివాలయాన్ని నాలుగు టవర్లుగా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 33 శాఖలకు చెందిన విభాగాధిపతులు ఉండేలా 38 లక్షల చదరపు అడుగుల్లో సచివాలయం నిర్మించేందుకు రూ.2,728 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసింది. ఈ లెక్కన చదరపు అడుగుకు రూ.7,179 ఖర్చవుతుంది. ఇటీవలే నార్మన్ ఫోస్టర్ ఇచ్చిన టవర్ డిజైన్‌తో 11 లక్షల చదరపు అడుగుల్లో అసెంబ్లీ భవనం, స్థూపం డిజైన్‌తో 25 లక్షల చదరపు అడుగుల్లో హైకోర్టు భవనం నిర్మాణానికి రూ.2,229 కోట్లవుతుందని అంచనా వేసింది. చదరపు అడుక్కి రూ.6,192 ఖర్చవుతుంది. నిర్మానుష్య ప్రాంతంలో చేపట్టే ఈ భవనాల ప్రాంగణంలో మౌలిక వసతులు, గ్రీనరీ, ఇతర హంగుల ఖర్చులు వీటికి అదనం. తాత్కాలిక సచివాలయం మాదిరిగా ఈ అంచనాలు భవనాల నిర్మాణం వరకే తీసుకుంటే ఇంటీరియర్, విద్యుత్ వ్యవస్థ, డ్రెయినేజీ తదితర వాటికి రెట్టింపు ఖర్చవుతుందని చెబుతున్నారు. ఉన్నతాధికారులు, ఉద్యోగులకు నివాసం కోసం నిర్మించే అపార్టుమెంట్లకు చదరపు అడుగుకు రూ.2,510 ఖర్చు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మంత్రుల బంగ్లాలకు మాత్రం చదరపు అడుగుకు రూ.7,916 ఖర్చవుతుందని అంచనా వేయడం విశేషం. ( ఆంధ్రప్రదేశ్ సచివాలయం నమూనా చిత్రం ) ఇంతకీ డిజైన్లు ఖరారయ్యాయా? ‘‘నార్మన్ ఫోస్టర్ సంస్థ రెండు డిజైన్లు ఇచ్చిందంటారు.. రాజమౌళి డిజైన్ తిరస్కరించారంటారు. ఓ డిజైన్‌ను ప్రజల అభిప్రాయం కోసం సోషల్ మీడియాలో విడుదల చేశామంటారు.. టవర్ డిజైన్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందంటారు.. ఆ డిజైన్ అంత ఆకర్షణీయంగా లేదని, పెద్ద చిత్రాలు చూపించాలని మంత్రులు కోరితే స్ట్రక్చరల్ డిజైన్లు రావడానికి ఆరునుంచి ఎనిమిదివారాలు పడుతుందని మంత్రి నారాయణ చెబుతారు.. ఇడ్లీపాత్ర ఆకారంలో నిర్మాణమేమిటని నెటిజన్ల నుంచి విమర్శలు రావడంతో ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారంటారు..’’ ఇంతకీ అమరావతిలో నిర్మించబోయే అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు డిజైన్లు ఖరారయ్యాయా.. ఖరారైతే అవి ఏమిటి? రాష్ట్రప్రభుత్వం ఇంతవరకు ఏదీ స్పష్టంగా చెప్పకపోవడంపై సోషల్‌మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు కనిపిస్తున్నాయి. చాలా ఎక్కువ.. ఏదో మతలబు ఉంది.. చదరపు అడుగుకు రూ. 6– 7 వేలు చాలా ఎక్కువ. హైదరాబాద్, విజయవాడ, విశాఖ నగరాల్లో చదరపు అడుగుకు నాలుగు వేలతో విశాలమైన భవనాలు నిర్మించవచ్చు. దీంట్లో భూమి ధర కూడ కలుపుకొని ఉంటుంది. కానీ, రాజధానిలో భూమి కూడ ప్రభుత్వానిదే. ఇంకా అనేక సౌకర్యాలు కూడా నిర్మాణ సంస్థలకు ప్రభుత్వం కల్పిస్తోంది. అయినా అంత భారీ రేటు ఇవ్వాలని నిర్ణయించారంటే ఏదో మతలబు ఉందని అర్ధమవుతుంది. – పాండు రంగారావు, బిల్డర్ వాస్తవానికి ఖర్చు తగ్గాలి.. రాష్ట్ర ప్రభుత్వం కావాలని నిర్మాణ సంస్థలకు రేటు పెంచి ప్రాజెక్టులను అప్పగిస్తున్నట్లు అనుమానాలు వస్తున్నాయి. అంతర్జాతీయ నిర్మాణాల పేరుతో పెద్ద పెద్ద కంపెనీలకు ఈ పనులు అప్పగిస్తున్నారు. ఆ కంపెనీలు మ్యాన్ పవర్‌ను తగ్గించి, సాంకేతికతను ఉపయోగించుకొని పనులు చేస్తున్నాయి. సాంకేతికత పెరిగినప్పుడు ఖర్చు తగ్గాలి కానీ అమరావతిలో విచిత్రంగా పెంచుతున్నారు. ఇది ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయడమే. – ఎం.వి. దాస్, ఇంజనీరింగ్ నిపుణులు -
భారీగా నోట్లను మార్చుతూ బుక్కయ్యారు
-
బిచ్చగాడి వద్ద రూ.48 లక్షలు!
మొన్న పశ్చిమ బెంగాల్ వలసజీవికి రూ. కోటి లభించడం, నిన్న అనంతపురం జిల్లాకు చెందిన యాచకుడికి రూ.65 లక్షల లాటరీ తగలటం, ఇటీవలే దుబాయ్ లో ఓ అడుక్కునే వ్యక్తి దగ్గర భారీగా నగదు దొరకటం.. ఇవన్నీ చూస్తే 'దరిద్రుడు ఏ రేవుకి వెళ్ళిన ముళ్ల చేపే దొరుతుంది'.. అనే పాత సామెతను రివైస్ చేసుకోవాల్సిన అవసరం వచ్చినట్లు అనిపించడంలేదూ! ఇతర దేశాల సంగతి పక్కనపెడితే చట్టాలు కఠినంగా అమలయ్యే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో బెగ్గింగ్ నేరమని, ప్రధాన వీధులు, ప్రర్థనా స్థలాల్లో ఎవరైనా అడుక్కున్నట్లు కనిపిస్తే పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకుంటారని తెలిసిందే. అయితే నిఘా కళ్లుగప్పి ఇంకా ఎంతోమంది యాచకత్వాన్ని కొనసాగిస్తునే ఉన్నారట యూఏఈ ప్రధాన నగరం దుబాయ్ లో. అలాంటి వాళ్లను పట్టుకునేందుకు పోలీస్ శాఖతో కలిసి దుబాయ్ మున్సిపల్ శాఖ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నది. అలా ఇప్పటివరకు మొత్తం 59 మంది యాచకులు పట్టుబడ్డారు. వాళ్ల వివరాలు, వస్తువులను పరిశీలించిన అధికారులు ఒక యాచకుడిదగ్గరున్న సొమ్మును చూసి వాపోయారు. 'మేం పట్టుకున్న యాచకుల్లో ఒకరి దగ్గర 270,000 దినార్లు(మన కరెన్సీలో దాదాపు రూ.48 లక్షలు) లభించాయి. ఇది చాలా పెద్ద మొత్తం. స్వల్పకాలిక వీసా, వర్కింగ్ లేదా బిజినెస్ వీసాల మీద దుబాయ్ కి వచ్చే కొందరు ఇక్కడ యాచకవృత్తిలోకి దిగుతున్నారు. దుబాయ్ లో అడుక్కునేవాళ్ల సంపాదన రోజుకు రమారమి 9,000 దినార్లు ఉంటుంది. అంటే బెగ్గర్లు గంటన్నరలో 1500 దినార్లు కూడబెడతారనమాట' అంటూ దుబాయ్ లో యాచకుల సంపాదన వివరాలను వెల్లడించారు మున్సిపల్ అధికారి ఫైజల్ అల్ బదియావి. గతేడాది రంజాన్ పండుగ నాడు మసీదుల ముందు అడుక్కుంటున్న 197 మంది యాచకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వచ్చే రంజాన్ పండుగలోగా నగరంలో యాచకులు లేకుండా చేయాలన్నది తమ లక్ష్యమని ఫైజల్ చెబుతున్నారు. బెగ్గర్లతో దేశ ప్రతిష్ట దిగజారుతుందని, ఉగ్రవాద కార్యకలాపాలకు కూడా సాకుగా మారిందని అందుకే ఆ వృత్తిని యూఏఈ నిషేధించిందంటున్నారు ఫైజల్. -
స్పెషల్ ఫ్లైయిట్‌లో సీఎం చంద్రబాబు
-
భూపాల్ పల్లిలో 20లక్షలతో పట్టుబడ్డ టీఆర్ఎస్ కార్యకర్త!
వరంగల్: ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతుండటంతో వరంగల్ జిల్లాలో డబ్బుల పంపిణీ ఊపందుకుంది. ఓటర్లను మభ్యపెట్టేందుకు అన్ని పార్టీలు మద్యం, డబ్బు పంపిణీకి దిగారు. అయితే ఎన్నికల్లో మద్యం, డబ్బు ప్రభావాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల అధికారులు తనిఖీలు చేస్తున్నారు. తనిఖీల్లో భాగంగా వరంగల్ జిల్లా భూపాల్ పల్లి నియోజకవర్గంలో ఓ టీఆర్ఎస్ కార్యకర్త నుంచి 20 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. భూపాలపల్లి నియోజకవర్గంలో బండ్లపల్లి వద్ద ఓటర్లకు డబ్బు పంచుతున్న ఓ టీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీఆర్ఎస్ కార్యకర్తపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ఆర్టీఓ అధికారుల తనిఖీలో డబ్బే డబ్బు !