చండీగఢ్: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేపట్టింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ) మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్, మరికొందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. యమునా నగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్ వంటి 20 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు.
తొలుత మైనింగ్ వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే దిల్‌బాగ్ సింగ్, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది. 15, 20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. కుటుంబంలోని అందరి సెల్‌ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు.
దాదాపు 100 బాటిళ్ల మద్యం, రూ. 5 కోట్ల నగదు, భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, నగదుతో పాటు 4 నుంచి 5 కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సింగ్ యమునానగర్ మాజీ శాసన సభ్యుడు. అదే విధంగా ఎమ్మెల్యే పన్వార్ ఇంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించిన మైనింగ్‌పై యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. అనంతరం దీనిపై 2013లో ఈడీ మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలను నిందితులుగా పేర్కొంది. వీరు మైనింగ్ కోసం బిల్లులు, స్లిప్పులను రూపొందించడానికి నకిలీ 'ఈ-రవాణ' పథకాన్ని నడుపుతున్నట్లు ఈడీ ఆరోపించింది.
Comments
Please login to add a commentAdd a comment