Dilbagh Singh
-
ఈడీ దాడులు.. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో 5 కోట్ల నగదు, అక్రమ ఆయుధాల సీజ్
చండీగఢ్: కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ హర్యానాలోని ప్రతిపక్ష నేతల ఇళ్లపై మెరుపు దాడులు చేపట్టింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా కాంగ్రెస్ ఎమ్మెల్యే సురేందర్ పన్వార్, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్ఎల్డీ) మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, మరికొందరి ఇళ్లల్లో సోదాలు నిర్వహించింది. యమునా నగర్, సోనిపట్, మొహాలీ, ఫరీదాబాద్, చండీగఢ్, కర్నాల్ వంటి 20 ప్రదేశాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. తొలుత మైనింగ్ వ్యాపారవేత్త అయిన మాజీ ఎమ్మెల్యే దిల్బాగ్ సింగ్, అతని సన్నిహితుల నివాసాల్లో గురువారం ఈడీ తనిఖీలు చేపట్టింది. 15, 20 మంది ఈడీ అధికారులు ఆరు వాహనాల్లో మాజీ ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం కూడా సోదాలు కొనసాగాయి. కుటుంబంలోని అందరి సెల్ఫోన్లను ఈడీ అధికారులు సీజ్ చేశారు. దాదాపు 100 బాటిళ్ల మద్యం, రూ. 5 కోట్ల నగదు, భారీగా అక్రమ విదేశీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మద్యం, నగదుతో పాటు 4 నుంచి 5 కిలోల బరువున్న మూడు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. కాగా సింగ్ యమునానగర్ మాజీ శాసన సభ్యుడు. అదే విధంగా ఎమ్మెల్యే పన్వార్ ఇంట్లోనూ దాడులు కొనసాగాయి ఆయన సోనిపట్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) నిషేధం విధించిన మైనింగ్‌పై యమునానగర్, చుట్టుపక్కల జిల్లాల్లో అక్రమంగా బండరాళ్లు, కంకర, ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ హర్యానా పోలీసులు అనేక కేసులు నమోదు చేశారు. అనంతరం దీనిపై 2013లో ఈడీ మనీలాండరింగ్ కేసు దాఖలు చేసింది. ఈ కేసులో ఇద్దరు ఎమ్మెల్యేలను నిందితులుగా పేర్కొంది. వీరు మైనింగ్ కోసం బిల్లులు, స్లిప్పులను రూపొందించడానికి నకిలీ 'ఈ-రవాణ' పథకాన్ని నడుపుతున్నట్లు ఈడీ ఆరోపించింది. -
డీజీపీపై ఐఏఎస్ అధికారి ఫిర్యాదు
శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లో పోలీస్ అధికారుల సంవాదం తాజా వివాదంగా తెరపైకి వచ్చింది. ప్రముఖ ఐపీఎస్ అధికారి వసంత్ కుమార్ రథ్ స్వయంగా తన బాస్ డీజీపీ దిల్బాగ్ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. సింగ్ తన జీవితానికి, స్వేచ్ఛకు ముప్పులా పరిణమించారని 2000 బ్యాచ్ ఐపీఎస్ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్లో హోంగార్డ్స్ విభాగం ఐజీపీగా వ్యవహరిస్తున్న వసంత్ రథ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు అంశాలు ప్రస్తావించారు. డీజీపీ దిల్బాగ్ సింగ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని తాను కోరడం లేదని అయితే ఆయన కారణంగా నా భద్రత, ప్రతిష్టకు ఏర్పడిన ముప్పును మీ ముందుంచుతున్నానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ సమయంలో తనకు ఏదైనా హాని జరిగితే మీరు ఎవరికి ఫోన్ చేయాలో ఈ లేఖ ద్వారా ఓ అవగాహన కలుగుతుందనే ఈ వివరాలు అందచేస్తున్నానని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. కాగా తన ఫిర్యాదు కాపీని ఆయన డీజీపీకి కూడా పంపడం గమనార్హం. కాగా ఈ అంశంపై డీజీపీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఐపీఎస్ అధికారి చేసిన ఆరోపణలను వాట్సాప్ గ్రూప్‌లో తోసిపుచ్చినట్టు సమాచారం. చదవండి : కశ్మీర్లో ఎన్కౌంటర్ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి -
కశ్మీర్లోకి ‘కరోనా’ ఉగ్రవాదులు
జమ్మూ: భారత్‌తో ముఖాముఖి తలపడలేని పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కోవిడ్–19 బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తోంది. ‘ఇప్పటి వరకు కశ్మీర్లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తోంది. వీరి ద్వారా ఇక్కడి ప్రజలకు వైరస్ సోకుతోంది. దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’అని కశ్మీర్ డీఐజీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జమ్మూలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు. -
‘కరోనా పేషెంట్లను కశ్మీర్లోకి పంపేందుకు పాక్ యత్నం’
శ్రీనగర్ : కరోనా వైరస్‌తో భారత్‌ను దెబ్బతీసేందుకు దాయాది పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్బాగ్ సింగ్ అన్నారు. కరోనా సోకినవారిని జమ్మూకశ్మీర్‌లోకి పంపి అక్కడ కరోనా వ్యాప్తిని పెంచేందుకు పాక్ ప్రయత్నిస్తుందని ఆయన తెలిపారు. శ్రీనగర్‌కు 20 కి.మీ దూరంలో గందేర్బాల్ జిల్లాలోని కోవిడ్-19 క్వారంటైన్ కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా పేషెంట్లను భారత్‌కు పంపేందుకు పాక్ ప్రయత్నిస్తుందనేది వాస్తవం అని అన్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్ కశ్మీర్లోకి తీవ్రవాదులను పంపేదని.. కానీ ఇప్పుడు కరోనా పేషెంట్లను పంపుతుందని విమర్శించారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం అని.. దీనిపై తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. వారం రోజుల కిందట కూడా ఓ ఆర్మీ ఉన్నతాధికారి కూడా ఇదే విషయాన్ని వెల్లడించారు. తొలుత పీవోకేలోకి కరోనా పేషెంట్లను పంపించి.. అక్కడి నుంచి భారత్‌లోకి వారు చొరబడేలా పాక్ ప్రయత్నాలు చేస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందిందని ఆయన చెప్పారు. కాగా, కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. వీరిని భారత బలగాలు సమర్ధవంతగా అడ్డుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు ఉగ్రవాదులు మరణించగా, ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు. చదవండి : కరోనా చాలా కాలం ఉంటుంది : డబ్ల్యూహెచ్ఓ వార్నింగ్ గుజరాత్ ముఖ్యమంత్రితో ఫోన్లో మాట్లాడిన సీఎం జగన్