
దిల్‌బాగ్ సింగ్
జమ్మూ: భారత్‌తో ముఖాముఖి తలపడలేని పాకిస్తాన్ మరో కుట్రకు తెరలేపింది. కోవిడ్–19 బారిన పడిన ఉగ్రవాదులను దొంగచాటుగా దేశంలోకి పంపిస్తోంది. ‘ఇప్పటి వరకు కశ్మీర్‌లో పాక్ ఉగ్రవాదాన్ని పెంచిపోషించింది. ఇప్పుడు కరోనా వైరస్ బారిన పడిన వారిని దేశంలోకి పంపిస్తోంది. వీరి ద్వారా ఇక్కడి ప్రజలకు వైరస్ సోకుతోంది. దీనిపై పక్కాగా చర్యలు తీసుకోవాల్సి ఉంది’అని కశ్మీర్ డీఐజీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. కోవిడ్–19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జమ్మూలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదుల్లో చాలామంది కరోనా బారిన పడినట్లు తమకు సమాచారం ఉందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment