డీజీపీపై ఐఏఎస్‌ అధికారి ఫిర్యాదు | Top Cop Basant Files Complaint Against DGP | Sakshi

జమ్ము కశ్మీర్‌ : ఐపీఎస్‌ వర్సెస్‌ ఐపీఎస్‌

Published Fri, Jun 26 2020 10:32 AM | Last Updated on Fri, Jun 26 2020 10:33 AM

Top Cop Basant Files Complaint Against DGP - Sakshi

శ్రీనగర్‌ : జమ్ము కశ్మీర్‌లో పోలీస్‌ అధికారుల సంవాదం తాజా వివాదంగా తెరపైకి వచ్చింది. ప్రముఖ ఐపీఎస్‌ అధికారి వసంత్‌ కుమార్‌ రథ్‌ స్వయంగా తన బాస్‌ డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌పై ఫిర్యాదు చేశారు. సింగ్‌ తన జీవితానికి, స్వేచ్ఛకు ముప్పులా పరిణమించారని 2000 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. జమ్ము కశ్మీర్‌లో హోంగార్డ్స్‌ విభాగం ఐజీపీగా వ్యవహరిస్తున్న వసంత్‌ రథ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పలు అంశాలు ప్రస్తావించారు. డీజీపీ దిల్బాగ్‌ సింగ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని తాను కోరడం లేదని అయితే ఆయన కారణంగా నా భద్రత, ప్రతిష్టకు ఏర్పడిన ముప్పును మీ ముందుంచుతున్నానని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సమయంలో తనకు ఏదైనా హాని జరిగితే మీరు ఎవరికి ఫోన్‌ చేయాలో ఈ లేఖ ద్వారా ఓ అవగాహన కలుగుతుందనే ఈ వివరాలు అందచేస్తున్నానని గాంధీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓకు రాసిన లేఖలో ఆయన పేర్కొన్నారు. కాగా తన ఫిర్యాదు కాపీని ఆయన డీజీపీకి కూడా పంపడం గమనార్హం. కాగా ఈ అంశంపై డీజీపీ ఎలాంటి ప్రకటన చేయకపోయినా ఐపీఎస్‌ అధికారి చేసిన ఆరోపణలను వాట్సాప్‌ గ్రూప్‌లో తోసిపుచ్చినట్టు సమాచారం.

చదవండి : కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ : ఇద్దరు ఉగ్రవాదులు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement