కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ | Congress party criticised by the seemandhra people, says J C Diwakar Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ

Published Sat, Sep 21 2013 3:28 PM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ - Sakshi

కాంగ్రెస్ పార్టీని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు: జేసీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ అధిష్టానం వైఖరి సీమాంధ్ర ప్రాంత వాసులను రెచ్చగొట్టేలా ఉందని మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి శనివారం హైదరాబాద్లో అభిప్రాయపడ్డారు. హైదరాబాద్లోని ఐటీ రంగానికి 2 లక్షల కోట్లు కేటాయించడం ప్రజలకు ఆగ్రహాం కలిగిస్తుందన్నారు. రాయల తెలంగాణ డిమాండ్ను అధిష్టానం పట్టించుకోవడం లేదన్నారు.

 

అధిష్టానం అనుసరిస్తున్న వైఖరి వల్ల తమలాంటి సీనియర్లు పార్టీ నుంచే కాదు... రాజకీయాల నుంచే తప్పుకోవాలనిపిస్తోందని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతంలో రాజకీయ శూన్యత ఏర్పడింది, కొత్తపార్టీ పుట్టుకొచ్చే అవకాశాలున్నాయన్నారు. స్వలాభం కోసమే రాష్ట్రాన్ని విభజిస్తోందని ప్రజలు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తిపోస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి పేర్కొన్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement