రాంరెడ్డి, రేణుక వర్గీయులకు ఎస్పీ హెచ్చరిక
ఇల్లెందు: గ్రూపు రాజకీయాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చర్యలు తప్పవని మంత్రి రాంరెడ్డి వెంకట రెడ్డి, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి వర్గీయులను ఎస్పీ ఎ.వి.రంగనాథ్ హెచ్చరించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఫారెస్టు గ్రౌండ్‌లో ఏర్పా టు చేసిన సభలో రేణుకను ఉద్దేశించి రాంరెడ్డి వర్గీయులు మడత వెంకట్‌గౌడ్, కొక్కు నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆమె వర్గీయులు గోచికొండ సత్యనారాయణ, సురేష్‌లాహోటీ ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో ఎస్పీ ఆదివారం ఇల్లెందుకు వచ్చారు.
ఇరు వర్గాలకు చెందిన నాయకులను డీఎస్పీ కార్యాలయానికి పిలిపించి వేర్వేరుగా విచారణ చేశారు. ఉత్సవాల్లో రాంరెడ్డి వర్గీయులు చేసిన వ్యాఖ్యల గురించి ఆరా తీశారు. తమపై ప్రజలు దాడికి పాల్పడే విధంగా రాంరెడ్డి వర్గీయులు రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారంటూ సురేష్‌లాహోటి, గోచికొండ సత్యనారయణ, పద్మావతి తదితరులు ఎస్పీకి వివరించారు. రేణుక వర్గీయుల వైఖరి గురించి మడత వెంకట్‌గౌడ్ కూడా ఎస్పీ క్షుణ్ణంగా వివరించారు.
ఇరువర్గాల వాదోపవాదనలను విన్న ఎస్పీ శాంతి భద్రతలను పరిరక్షించాలని కోరారు. అనంతరం ఎస్పీ విలేకరులతో మాట్లాడారు. ఇరువర్గాల మధ్య ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పలు సూచనలు చేసినట్లు చెప్పా రు. ప్రజల స్వేచ్ఛకు ఎలాంటి భంగం కలిగించినా సహిం చేది లేదన్నారు. అల్లర్లను సష్టిస్తే ఎంతటి వారిపైనైనా చర్యలు తీసుకుంటామన్నారు.