జడ్చర్ల : మాయ మాటలతో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని మాజీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరీ ఆరోపించారు. ఆదివా రం స్థానిక ప్రభుత్వ అతిథి గృహంలో మాజీ ఎంపీ మల్లురవితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరువు కాటకాలతో రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, కనీసం తాగునీరు దొరకని దుస్థితిని ఎదుర్కొంటున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా సీఎం కేసీఆర్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదని పే ర్కొన్నారు. నీటిచుక్క కరువైన ప్రస్తుత పరిస్థితులలో మిషన్‌కాకతీయ పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నా రు. ఖరీఫ్ సాగుపై సమగ్ర ప్రణాళికలు రూపొందించలేక, ఎండాకాలంలో పం టల సాగుపై రైతులకు అవగాహన కల్పించలేదని తెలిపారు.
తమ నిధులనుంచి కమ్యూనిటీ భవనాలకు రూ.5లక్షలు కేటాయిస్తే ఒకే గది నిర్మిం చే పరిస్థితి ఉండగా అవే రూ. 5లక్షలతో డబుల్ బెడ్‌రూమ్ ఇల్లు నిర్మిం చడం ఎలా సాధ్యమో వివరించాలని డిమాండ్ చేశారు. వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాలలో ఏపీలోకి వెళ్లిన ఏడు గ్రామాలపై చర్చిస్తామన్నారు. అదేవిధంగా టీఆర్‌ఎస్ ప్రభు త్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తామని, 2019లో అధికారంలోకి రావడం ఖాయమన్నారు. సమావేశంలో నాయకులు దిలీప్, శ్రీరాంసాగర్, విజయ్‌కుమార్, చరణ్, మల్లు ప్రతిభ, నిత్యానందం, మినాజ్, హబీబ్, తదితరులు పాల్గొన్నారు.