Integral Part
-
పీవోకే మనదే: పార్లమెంట్లో అమిత్ షా ప్రకటన
జమ్ము కశ్మీర్: పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. పీవోకే భారత్‌లో అంతర్భాగమేనని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో పీవోకేకు ప్రత్యేక స్థానాలు కూడా కేటాయించారు. పీవోకేకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించినట్లు స్పష్టం చేశారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "A few people also tried to underestimate it...someone said that only the name is being changed. I would like to… pic.twitter.com/7W5KkHbxlP — ANI (@ANI) December 6, 2023 జమ్ము కశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు-2023, జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు-2023పై పార్లమెంట్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగించారు. అన్యాయం జరిగిన వారికి న్యాయం చేకూర్చడానికి మాత్రమే ఈ బిల్లులను తీసుకువచ్చినట్లు స్పష్టం చేశారు. అణగారిని వారిని పైకి తీసుకురావడమే రాజ్యాంగ మూల సూత్రమని పేర్కొన్నారు. దేశంలో 1980 దశకంలో ఉగ్రవాదం తీవ్రంగా పెరిగిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో ఓ భాగాన్ని ఆక్రమించుకుని అక్కడి ప్రజలను నిరాశ్రయుల్ని చేశారని మండిపడ్డారు. కశ్మీరీ పండిట్లు తమ సొంత దేశంలో శరణార్ధులుగా బతికాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం 46,631 కుటుంబాలు, 1,57,968 మంది తమ సొంత స్థలాలను వదిలి వచ్చారని తెలిపారు. ప్రస్తుత బిల్లులతో వారందరికి హక్కులు కల్పించబడతాయని చెప్పారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "There was an era of terrorism after the 1980s and it was horrifying. Those who lived on the land considering it… pic.twitter.com/j1O6JIcOIq — ANI (@ANI) December 6, 2023 "కశ్మీర్‌పై పాకిస్థాన్ 1947లో దాడి చేసింది. ఆ సమయంలో దాదాపు 31,789 కుటుంబాలు నిర్వాసితులయ్యాయి. 1965, 1971 యుద్ధాల సమయంలో 10,065 కుటుంబాలు వలసబాట పట్టాయి. 1947, 1969, 1971 యుద్ధాల్లో మొత్తం 41,844 కుటుంబాలు శరణార్థులుగా తరలివచ్చాయి. ఈ బిల్లు ఆ ప్రజలకు హక్కులు కల్పించడానికి వచ్చిందే" అని అమిత్ షా అన్నారు. #WATCH | Union Home Minister Amit Shah speaks on The Jammu and Kashmir Reservation (Amendment) Bill, 2023 & The Jammu and Kashmir Reorganisation Bill, 2023 He says, "Pakistan attacked Kashmir in 1947 in which around 31,789 families were displaced...10,065 families were… pic.twitter.com/WerMOQreco — ANI (@ANI) December 6, 2023 -
చైనాకు గట్టి కౌంటర్ ఇచ్చిన అమెరికా..భారత్‌కే మద్దతు అని ప్రకటన
వాషింగ్టన్: అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులోని 11 ప్రదేశాలకు పేర్లు పెట్టి.. ఈ భూభాగం టిబెట్ దక్షిణప్రాంతం అంటూ చైనా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై భారత్ ఇప్పటికే తీవ్రంగా స్పదించింది. అయితే తాజాగా అగ్రరాజ్యం అమెరికా కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. చైనా చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అగ్రరాజ్యం తేల్చి చెప్పింది. చైనా తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమేనని తాము గుర్తిస్తున్నట్లు శ్వేతసౌధం ప్రకటనలో తెలిపింది. ఏం జరిగిందంటే..? అరుణాచల్ ప్రదేశ్.. టిబెట్‌లో అంతర్భాగమంటూ వాదిస్తున్న చైనా మరో దుశ్చర్యకు పాల్పడి సరిహద్దుల్లోని పదకొండు ప్రదేశాలకు పేర్లు పెట్టి.. జాంగ్నాన్ పేరుతో టిబెట్ దక్షిణ ప్రాంతంలో భాగమంటూ ఒక ప్రకటన విడుదల చేసింది. దీనికి ప్రతిస్పందనగా భారత్ ఘాటుగానే బదులిచ్చింది. ఈ పేర్లన్నింటిని తిరస్కరిస్తున్నట్లు ప్రకటిచింది. అరుణాచల్ ప్రదేశ్.. ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమే తేల్చిచెప్పింది. 'అరుణాచల్ ప్రదేశ్ భారత్ అంతర్భాగం. అది విడదీయరాని భాగం. ఏవో పేర్లు కనిపెట్టి.. కనికట్టు చేసే ప్రయత్నాలు ఫలించబోవు. అవి వాస్తవాలను మార్చలేవు' అని ప్రకటనలో పేర్కొంది. చదవండి: ఇంత జరిగినా అదే పాట! తీరు మార్చుకోని ట్రంప్.. బైడెన్ పాలనపై ఆరోపణలు -
లద్దాఖ్, కశ్మీర్ భారత్‌లో అంతర్భాగం
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్, లద్దాఖ్ అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ భారత్‌లో అంతర్భాగమేనని ఇండియా స్పష్టం చేసింది. ఈ భారత అంతర్గత విషయంపై మాట్లాడే అర్హత చైనాకు లేదని తేల్చిచెప్పింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్‌ను, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని గుర్తించబోమంటూ చైనా చేసిన ప్రకటనపై గురువారం భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఇతరులు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కోరుకునే దేశాలకు.. ఇతర దేశాల అంతర్గత విషయాల్లో తాము జోక్యం చేసుకోకూడదని తెలిసి ఉండాలని వ్యాఖ్యానించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ నుంచి విడదీయలేని అంతర్భాగమని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ తెలిపారు. ఈ విషయాలను గతంలోనూ పలుమార్లు, అత్యున్నత వేదికలపై సహా భారత్ స్పష్టం చేసిందన్నారు. తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల సడలింపు కోసం ప్రారంభించిన చర్చల గురించి వివరిస్తూ.. బలగాల ఉపసంహరణ ఇరు దేశాలకు సంక్లిష్టమైన ప్రక్రియ అని, బలగాలను గత రెగ్యులర్ పోస్ట్‌లకు పంపించాల్సి ఉంటుందని, అందుకు కొంత సమయం పడుతుందని శ్రీవాస్తవ వ్యాఖ్యానించారు. చర్చిద్దామని అడగలేదు చర్చలు జరుపుదామంటూ పాకిస్తాన్‌కు భారత్ ఎలాంటి సందేశం పంపలేదని శ్రీవాస్తవ స్పష్టం చేశారు. భారత్ నుంచి అలాంటి సందేశమేదీ వెళ్లలేదన్నారు. ‘ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మరల్చేందుకు భారత్‌పై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం పాక్ ఎప్పుడూ చేసే పనే’ అని వ్యాఖ్యానించారు. చర్చలు కొనసాగుతున్నాయి సరిహద్దుల్లో ఉద్రిక్తతల సడలింపు కోసం భారత్, చైనాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ తెలిపారు. రెండు దేశాల మధ్య చర్చల్లో ఏం జరుగుతోందనేది రహస్యమని వ్యాఖ్యానించారు. వాస్తవాధీన రేఖ వెంట ఈ స్థాయిలో బలగాల మోహరింపు గతంలో జరగలేదన్నారు. బ్లూమ్‌బర్గ్ ఇండియా ఎకనమిక్ ఫోరమ్ కార్యక్రమంలో చైనా సరిహద్దుల్లో పరిస్థితిని స్పష్టంగా వివరించమని అడగగా.. జైశంకర్ జవాబిచ్చారు. ‘బహిరంగంగా చెప్పలేని కొన్ని విషయాలుంటాయి. ముందే తీర్పులివ్వాలని నేను కోరుకోవడం లేదు’ అని పేర్కొన్నారు. 1993 నుంచి పలు ద్వైపాక్షిక ఒప్పందాలతో భారత్, చైనాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయన్నారు. -
భద్రాచలాన్ని విభజిస్తే తడాఖా చూపిస్తా: రేణుకా చౌదరి
భద్రచలం తెలంగాణాలోనే ఉండాలని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి స్పష్టం చేశారు. అలాకాదని తెలంగాణ ప్రాంతం నుంచి భద్రాచలాన్నివిడతీస్తే నా తడాఖా చూపిస్తానని హెచ్చరించారు. బుధవారం రేణుకాచౌదరి న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను కూడా తెలుసుకోవాలని ఆమె అభిప్రాయపడ్డారు. సీఎం కిరణ్ తెలంగాణ వ్యతిరేకి కాదని ఆమె పేర్కొన్నారు. 'మా అమ్మ అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఆమెను దగ్గరండి చూసుకోవాలి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బాధ్యతలు నిర్వహించలేనని' కాంగ్రెస్ అధిష్టానానికి తెలియజేశానని రేణుకాచౌదరి వెల్లడించారు. అందువల్లే తను ఆ బాధ్యతల నుంచి కాంగ్రెస్ అధిష్టానం తప్పించిందని ఆమె చెప్పారు.