మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు! | 267 candidates in fray for 17 LS seats from Telangana region | Sakshi
Sakshi News home page

మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!

Published Sun, Apr 13 2014 11:08 PM | Last Updated on Mon, Oct 8 2018 8:52 PM

మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు! - Sakshi

మల్కాజిగిరి, అంబర్ పేటలో భారీ సంఖ్యలో అభ్యర్థులు!

తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రాంతంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత 17 లోకసభ నియోజకవర్గాల్లో 267 మంది బరిలో ఉన్నారని ఎన్నికల కమిషన్ అధికారులు వెల్లడించారు. అలాగే 119 నియోజకవర్గాల్లో 1682 అభ్యర్థులు పోటీలో ఉన్నారని రాష్ట్ర ఎన్నికల అధికారి ఓ ప్రకటనలో తెలిపారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ లో అత్యధికంగా 30 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 
 
ఇక నాగర్ కర్నూల్(ఎస్సీ) లోకసభలో అత్యల్పంగా ఆరుగురు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉన్నారు. అయితే అసెంబ్లీ నియోజకవర్గం అంబర్ పేటలో అత్యధికంగా 32 మంది అభ్యర్థులు, ఆందోల్ నియోజకర్గంలో 5 గురు మాత్రమే పోటి పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రాంతంలో 119 అసెంబ్లీ, 17 లోకసభ సీట్లకు ఏప్రిల్ 30 తేదిన ఎన్నికలు జరుగనున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement