అనకాపల్లి ముందు... మల్కాజ్గిరి ఆఖరున | Anakapalli result first, Malkajgiri election result come last | Sakshi
Sakshi News home page

అనకాపల్లి ముందు... మల్కాజ్గిరి ఆఖరున

Published Fri, May 16 2014 6:59 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

Anakapalli result first, Malkajgiri election result come last

హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. పార్లమెంట్ స్థానాల్లో అనకాపల్లి నియోజకవర్గం ఫలితం ముందుగా వచ్చే అవకాశముంది. అనకాపల్లి లోక్‌సభ స్థానం కౌంటింగ్ 18 రౌండ్లలోనే పూర్తి కానుంది. అనకాపల్లి ఎంపీ స్థానానికి 8 మంది పోటీలో ఉన్నారు.

ఓటర్ల పరంగా దేశంలో అతిపెద్ద నియోజకవర్గంగా గుర్తింపు పొందిన మల్కాజ్గిరి ఎంపీ స్థానం ఫలితం ఆఖరున వెలువడనుంది. ఈ నియోజకవర్గంలో 45 రౌండ్ల పాటు కౌంటింగ్ జరగనుంది. ఇక్కడ దాదాపు 30 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement