తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం | peoples are looking for ys jagan ruling | Sakshi
Sakshi News home page

తెలంగాణలో వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం

Published Tue, Apr 15 2014 3:02 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM

peoples are looking for ys jagan ruling

జడ్చర్ల, న్యూస్‌లైన్: తెలంగాణ ప్రాంతంలో సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టడం ఖాయమ ని మహబూబ్‌నగర్ లోక్‌సభ వైఎస్సార్ సీపీ అభ్యర్థి రహమాన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన జడ్చర్లలో మీడియాతో మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే తెలంగాణ ప్రాం తం అభివృద్ధి చెందిందని తెలిపారు. ఇంటింటికి వైఎ స్సార్ ప్రవేశపెట్టిన పలు అభివృద్ధి సంక్షేమ పథకాలు అందాయని చెప్పారు.
 
మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అందించారని గుర్తు చేశారు. మహానేత సేవలను ప్రజలు మరిచిపోలేదని, తెలంగాణ ప్రాం తంలో తమ పార్టీకి ఓట్లు వేసి ఆదరణ చూపుతారని పేర్కొన్నారు. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ స్థానా ల్లో వైఎస్సార్ సీపీ గెలుపు ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, తదితర జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జ డ్చర్ల అసెంబ్లీ అభ్యర్థి పాండునాయక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement