సాక్షి, తాడేపల్లి: ఇంద్రకీలాద్రిపై ఎంతో వైభవంగా నిర్వహించే దసరా నవరాత్రుల ఉత్సవాలకు రావాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆహ్వానం అందింది. ఈ మేరకు దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే మల్లాది విష్ణులు సీఎంను ఆహ్వానించారు. ఈ సందర్భంగా బుధవారం తాడేపల్లిలోని సీఎం జగన్ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ నెల 29 నుంచి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభంకానున్న విషయం తెలిసిందే. ఇటీవల వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆహ్వాన పత్రిక ఆవిష్కరిచిన సంగతి విధితమే.
సీఎం జగన్‌కు దసరా నవరాత్రుల ఆహ్వానం
Published Wed, Sep 25 2019 12:06 PM | Last Updated on Wed, Sep 25 2019 3:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment