సాక్షి, విజయవాడ : ఉగాది నాడు ఇళ్లు లేని 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు ఉండేలా చర్యలు చేపడుతున్నామని, విజయవాడ నగరంలో 50 వేల మంది ఇళ్లు లేనివారిని గుర్తించామని చెప్పారు. బుధవారం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం 26వ డివిజన్‌లో 91 లక్షలతో చేపట్టనున్న సీసీరోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వెల్లంపలి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. సామాన్యుడి సొంతింటి కల నెరవేర్చాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధ్యేయమన్నారు. ( అప్పుడు ‘కన్నా’ ఏమైపోయారు: వెల్లంపల్లి )
వైఎస్ జగన్ సీఎంగా అధికారం చేపట్టిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధుల కేటాయింపుకు పెద్ద పీఠ వేశారని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలో రోడ్డు, డ్రైనేజీ, తాగునీటి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. వందలాది కోట్లతో నియోజకవర్గ అభివృద్ధి పనులు శరావేగంగా సాగుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరి చేసి విజయవాడను సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment