సాక్షి, విజయవాడ: తమ ప్రభుత్వం జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం పశ్చిమ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో పర్యటించిన మంత్రి కోటీ నలభైలక్షల రూపాయతో చేపట్టనున్న సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో మూడు నియోజకవర్గాలలో రూ. 500 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చూట్టామని తెలిపారు. నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దేందుకు నిధులను ఉదారంగా కేటాయించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీ అయిదేళ్ల పాలనలో విజయవాడ నిర్లక్ష్యానికి గురైందని ఆయన మండిపడ్డారు.
క్యాపిటల్ పేరుతో విజవాడకు వచ్చిన నగదును సైతం గత పాలకులు మళ్లించారని మంత్రి వెల్లంపల్లి పేర్కొన్నారు. అమరావతి అమరావతి.. అంటూ విజయవాడ అభివృద్ధిని ఆపేశారని, నగరాన్ని మహానగరంగా తీర్చిదిద్దకపోగా కేంద్రం ప్రకటించిన స్మార్ట్ నగరాల జాబితాలో సైతం చోటు కల్పించడంలో వైఫల్యం చెందారని విమర్శించారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన 7 నెలలోనే నగరంలోని ప్రజల మౌళిక వపతులపై దృష్టి సారించామన్నారు. విజయవాడను అన్ని విధాలా అభివృద్ధి పథంలో ఉండేలా కృషి చేస్తున్నామని, నగరంలోని మూడు నియోజకవర్గాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment