
సాక్షి,విజయవాడ : విజయవాడ నగరపాలక సంస్థ ఎక్స్ అఫీషియో సభ్యులుగా దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రమాణం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నగరపాలక సంస్థకు రావాల్సిన నిధుల గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నా రోడ్లపై పూడికలు అలాగే వదిలేయడంతో డ్రైనేజీ అస్తవ్యస్తంగా తయారైందని ఆరోపించారు. వెంటనే వీఎంసీ అధికారులు డ్రైనేజీ సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు. వచ్చే ఉగాది వరకు ఇళ్ల నిర్మాణం చేపట్టి అర్హులైన వారికి పట్టాలు అందిస్తామని మంత్రి శ్రీనివాస్ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment