నీచ రాజకీయాలు అవసరమా.. ‘కన్నా’?  | Velampalli Srinivasa Rao and Malladi Vishnu Fires On Kanna Lakshminarayana | Sakshi
Sakshi News home page

నీచ రాజకీయాలు అవసరమా.. ‘కన్నా’? 

Published Thu, May 28 2020 5:07 AM | Last Updated on Thu, May 28 2020 5:07 AM

Velampalli Srinivasa Rao and Malladi Vishnu Fires On Kanna Lakshminarayana - Sakshi

మాట్లాడుతున్న వెలంపల్లి, మల్లాది

సాక్షి, అమరావతి: టీటీడీ భూముల అమ్మకం విషయంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేసిన తప్పును కూడా ఈ ప్రభుత్వం చేసిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్య ప్రచారానికి పూనుకోవడం దారుణమని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, బ్రాహ్మణ కార్పొరేషన్‌ చైర్మన్‌ మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. చంద్రబాబు దగ్గర డబ్బులకు అమ్ముడుపోయి బీజేపీ అధిష్టానాన్ని తప్పుదోవ పట్టిస్తున్నందుకు ఆయన సిగ్గుపడాలని మండిపడ్డారు. ఇంత నీచ రాజకీయాలు చేయాలా? అని ప్రశ్నించారు. బుధవారం విజయవాడలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. 

► చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 2016లో టీటీడీ బోర్డులో ఒక సబ్‌ కమిటీ వేసి, స్వామి వారి 50 ఆస్తులను అమ్మాలని నిర్ణయించడం వాస్తవం కాదా? 
► అప్పటి టీటీడీ బోర్డులో బీజేపీ నేత భానుప్రకాష్‌రెడ్డి సభ్యుడుగా ఉన్న విషయం నిజం కాదా? కన్నా లక్ష్మీనారాయణ సూటిగా సమాధానం చెప్పాలి. 
► గత తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన ఆర్డర్‌ను రద్దు చేస్తూ ప్రస్తుత సీఎం పేషీ నుంచి ఆదేశాలు ఇస్తే అది కూడా రాజకీయం అంటూ మాట్లాడడం దుర్మార్గం. 
► ప్రభుత్వాన్ని తప్పుపట్టే ముందు తమ పార్టీ నేత భాను ప్రకాష్‌రెడ్డికి కన్నా షోకాజ్‌ నోటీసులివ్వాలి. 
► చంద్రబాబు 40 ఆలయాలు పడగొట్టినప్పుడు, గోదావరి పుష్కరాలలో 29 మంది చనిపోయినప్పుడు కన్నా లక్ష్మీనారాయణ ఎందుకు మాట్లాడలేదు? 
► విజయవాడలో గుళ్లను కూల్చినప్పుడు అప్పట్లో బంద్‌కు పిలుపునిస్తే, అప్పటి రాష్ట్ర బీజేపీ నేతలు గానీ, కన్నా లక్ష్మీనారాయణ కానీ కనీసం మద్దతు ఇవ్వకపోగా, బంద్‌కు బీజేపీకి సంబంధం లేని ప్రకటించారు.  
► చంద్రబాబు పూజలు కూడా బూట్లు వేసుకుని చేస్తారు. శంఖుస్థాపనలు చేసే సమయంలో కూడా చేతిలో పటం, కాళ్లకు బూట్లు ఉంటాయి. 
► దేవాలయాల పట్ల వైఎస్‌ జగన్‌ ఎంతో భక్తి శ్రద్ధలతో వ్యవహరిస్తారు. దేవాలయాలకు వెళ్లనప్పుడు నిబద్ధతతో పూజలు చేస్తారు. దేవాలయాలను పునర్‌ నిర్మించేది, పరిరక్షించేది జగన్‌ ప్రభుత్వమే. 
► బీజేపీ, టీడీపీ, జనసేన నేతలు దమ్ము, ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కోవాలి. అంతేగానీ మతాలను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడం మంచి 
పరిణామం కాదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement