సాక్షి, విజయవాడ : ప్రభుత్వ పరిపాలన ప్రక్రియలో మార్పులు సహజమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిస్పక్షపాతంగా పనిచేయాల్సింది పోయి ఒక పార్టీకి ప్రతినిధిలా వ్యవహరించారని తెలిపారు. కాగా డిపాజిట్లు కూడా రాని కన్నా లక్ష్మీ నారాయణ గవర్నర్ ఆమోదించిన ఆర్డినెన్స్‌పై విమర్శలు చేయడం శోచనీయంగా ఉందన్నారు. ఆర్డినెన్స్‌లో చట్టబద్దత ఉంది కాబట్టే గవర్నర్ దానిని ఆమోదించారని తెలిపారు. చంద్రబాబు డైరెక్షన్ లోనే తోక పార్టీలు పని చేస్తున్నాయని.. ఎలక్షన్ కమీషన్ నిస్పక్షపాతంగా పనిచేయాలనే సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. కరోనాతో సతమవుతున్న వేళ పేదలకు రేషన్, పెన్షన్,ఆర్థిక సాయం అందాలన్న లక్ష్యంతో సీఎం పనిచేస్తున్నారు. ఆర్థిక సాయం వెయ్యి కాదు ఐదు వేల ఇవ్వాలన్న చంద్రబాబు కోడ్ లేని సమయంలో ఎన్నికల కోడ్ కిందకు వస్తుందని నానా యాగీ చేస్తున్నారని ద్వజమెత్తారు. పేదలు పస్తులు ఉండాలన్నదే చంద్రబాబు లక్ష్యమని వెల్లంపల్లి తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా నీచరాజకీయాలు మానుకోవాలని హిత బోధ చేశారు.
ఎమ్మెల్యే జోగి రమేష్ మాట్లాడుతూ... ప్రతి పక్ష పార్టీలు బురద జల్లాలని చూస్తున్నాయన్నారు. రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న వ్యక్తి పార్టీలకు, సామాజిక వర్గానికి కొమ్ము కాసే విధంగా పనిచేయకూడదన్నారు. ఎలక్షన్ కమిషనర్ పదవీకాలం మూడు సంవత్సరాలు తగ్గిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తాము స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగ విలువలు కాపాడాలన్నారు. ఎలక్షన్ కోడ్ లేనప్పుడు పేద ప్రజలకు ప్రభుత్వం ఆర్ధిక చేయూత నిస్తే దానిని రాజకీయం చేయాలని చూస్తున్నారని జోగి రమేశ్ పేర్కొన్నారు.
ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. తక్కువ వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించేలా, డబ్బు మద్యం ప్రలోబాలులేని ఎన్నికలు జరిగాలనే ప్రభుత్వం నూతన చట్టం తీసుకువచ్చారన్నారు. కోడ్ అమలులో ఉంటే కరోనా బాధితులు పరిస్థి ఏంటన్నారు. సుప్రీం కోర్టు ప్రభుత్వాన్ని సంప్రదించే నిర్ణయాలు తీసుకోవాలని ఎలక్షన్ కమీషన్‌కు సూచించిందన్నారు. పేదల ఆర్థికసాయం అంశపై రమేశ్ కుమార్ రాజకీయం చేయాలని చూశారన్నారు. ఎన్నికల కమీషనర్ పదవీకాలం తగ్గింపు ప్రజా అభిప్రాయం ప్రకారమే జరిగిందని, కమీషనర్‌గా హైకోర్టు మాజీ న్యాయమూర్తిని నియమించి సీఎం జగన్ నూతన వరవడికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment