సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యులు సంస్మరణ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఆదిశంకరాచార్యులు సందర్శించిన 14 దేవాలయాల్లో సీఎం జగన్ ఆదేశాల మేరకు సంస్మరణ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శుక్రవారం నిర్వహించిన ఉత్సవాల్లో దేవాదయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ.. 'జగద్గురు ఆదిశంకరాచార్యులు భగవత్ స్వరూపులు. కేదార్‌నాథ్‌లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను ప్రధాని మోదీ నిర్వహించడం సంతోషంగా ఉంది.
ఆయన సందర్శించిన పవిత్రస్థలాల్లో సంస్మరణ ఉత్సవాలు నిర్వహించాం. ఆదిశంకరాచార్యులు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో శ్రీచక్రం ప్రతిష్టించారు. అందుకే దుర్గమ్మ ఆలయంలో కూడా సంస్మరణోత్సవాన్ని నిర్వహించాము. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 14 ఆలయాల్లో ఆదిశంకరాచార్యుల సంస్మరణోత్సవాలను నిర్వహించాము. కేదార్‌నాథ్‌లో ప్రధాని నిర్వహించిన కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు ఏర్పాట్లు చేశాము. ఆదిశంకరాచార్యుల విశిష్టతను అందరికీ తెలియజేసేలా కార్యక్రమాన్ని చేపట్టిన ప్రధాని మోదీకి ప్రత్యేక ధన్యవాదాలు' అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment