
రేసులో ఎవరున్నారు?
ముహూర్తం బాగుందని పవన్‌కల్యాణ్ హీరోగా ఆర్.టి.నేసన్ దర్శకత్వంలో ఎ.ఎం. రత్నం నిర్మించనున్న సినిమా పూజ చేశారు. కానీ, సినిమా పూర్తి స్థాయిలో సెట్స్‌పైకి వెళ్లడానికి ఇంకా చాలా టైముంది. ‘కాటమరాయుడు’ పూర్తి కావాలి. ఆ తర్వాత లైనులో ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా పూర్తి చేయాలి. అప్పుడు ఆర్.టి. నేసన్ సినిమా సెట్స్‌పైకి వెళ్లేది. ఈలోపు పవన్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు? అనే డిస్కషన్ స్టార్ట్ అయింది. పూజ జరగడమే తరువాయి... పవన్‌కు జోడీగా నయనతారను ఎంపిక చేసే ప్రయత్నాల్లో నిర్మాత ఎ.ఎం.రత్నం ఉన్నారని ప్రచారం మొదలైంది.
లేటెస్ట్‌గా రకుల్ పేరు వినిపిస్తోంది. అసలు రేసులో ఎవరున్నారు? అని ఆరా తీస్తే... ప్రతి సినిమాకీ హీరోయిన్ పాత్రకు రెండు మూడు ఆప్షన్స్ అనుకోవడం, వాళ్లను సంప్రదించడం కామన్. దర్శకుడు ఆర్.టి. నేసన్, నిర్మాత ఎ.ఎం. రత్నంలు ఇప్పటివరకూ పవన్‌కి జోడీగా నటించని హీరోయిన్ అయితే బాగుంటుందని చూస్తున్నారు. అందులో భాగంగానే వీళ్లిదరి పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే... ముందు త్రివిక్రమ్ సినిమాలో హీరోయిన్ల ఎంపిక ఇంకా ఓ కొలిక్కి రాలేదు. అందులో హీరోయిన్ల ఎవరనేది ఫైనలైజ్ అయిన తర్వాత పవన్ సరసన నటించే భామ నయన్, రకుల్, లేక మరెవరు అన్న క్లారిటీ వస్తుంది.