![పొల్లాచ్చి టు హైదరాబాద్ - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/51482602089_625x300.jpg.webp?itok=yAJh1k14)
పొల్లాచ్చి టు హైదరాబాద్
అందంలో ఆకాశం లాంటి అమ్మాయికి.. ఆనందంతో అల్లరి చేసే యువకుడు జత కలిస్తే... ‘గబ్బర్ సింగ్’లో పవన్‌కల్యాణ్, శ్రుతీహాసన్‌ల జంటలా ఉంటుంది. అందులో ఇద్దరి కెమిస్ట్రీకి మంచి పేరొచ్చింది. ‘గబ్బర్ సింగ్’తో హిట్ జోడీ అనిపించుకున్న ఈ ఇద్దరూ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాటమరాయుడు’. కిశోర్ పార్థసాని దర్శకత్వంలో శరత్ మరార్ నిర్మిస్తున్నారు. పొల్లాచ్చి షెడ్యూల్ ముగించుకుని ఇటీవల ఈ చిత్రబృందం హైదరాబాద్ చేరుకుంది. ‘‘పొల్లాచ్చిలో పవన్, శ్రుతిలపై చిత్రీకరించిన సన్నివేశాలు, పాట అద్భుతంగా వచ్చాయి.
చిత్రీకరణ చివరి ఘట్టానికి వచ్చింది’’ అన్నారు శరత్ మరార్. ‘‘వచ్చే ఫిబ్రవరి కల్లా చిత్రీకరణ పూర్తి చేసి, ఉగాది కానుకగా మార్చిలో చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాం’’ అన్నారు కిశోర్ పార్థసాని. ఈ చిత్రానికి కెమేరా: ప్రసాద్ మూరెళ్ల, సంగీతం: అనూప్ రూబెన్స్.